petbasheerabad
-
పేట్బషీరాబాద్లో రూ.కోట్ల విలువైన భూమికి రెక్కలు
జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. ఇక్కడ గజం స్థలం విలువ లక్ష రూపాయల పైమాటే. ఇంకేముంది రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టడం.. నోటరీలు అడ్డుపెట్టుకుని విద్యుత్ మీటర్లు తెచ్చుకోవడం..రెవెన్యూ అధికారులు కూల్చివేతకు వస్తే ‘చేతులు తడిపి’ వెళ్లగొట్టడం షరా మామూలుగా మారింది. ఈ కోవలోనే సుమారు రూ.200 కోట్ల విలువ చేసే 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయ్యింది. కబ్జా వాస్తవమేనని నిర్ధారణకు వచ్చినప్పటికీ కోర్టు కేసులు ఉన్నాయంటూ వాటిని రెవెన్యూ యంత్రాంగం తొలగించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2 ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2లలో 57.38 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ గజం ఏకంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతుంది. ఈ స్థలంపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కబ్జాదారులకు కలిసి వచ్చింది. రాత్రికి రాత్రి బేస్మెంట్లు, గదులు, షెడ్ల నిర్మాణం చేస్తూ కబ్జాకు తెర లేపారు. ఈ క్రమంలో సుమారు 8.06 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించగా తేలింది. అయితే వాటిని తొలగించాల్సిన అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి కబ్జాదారులు కోర్టుకు వెళ్లే విధంగా సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అక్కడ నిర్మాణం చేపట్టిన వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని కూల్చివేతల జోలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. దేవుడు వరమిచ్చినా... 2008 మార్చి 25వ తేదీన జీఓ నంబర్ 424 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేట్‌బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2లలో మొత్తం 38 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఎన్నో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలం విషయంలో 2022 ఆగస్టు 25వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం.. సదరు స్థలాన్ని జర్నలిస్టులకు అప్పగించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మండల రెవెన్యూ అధికారులు అది తమ పరిధి కాదు అన్నట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలపై జర్నలిస్టు ప్రతినిధులు మండల రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు రూపంలో అందజేశారు. కాగా మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లారే తప్ప అక్రమ నిర్మాణాలను చూసి కూల్చివేయకుండా వదిలివేయడం గమనార్హం. ఐదెకరాల స్థలంపై ఆధిపత్యం... ప్రభుత్వ స్థలంపై ఓ వ్యక్తి మాజీ నక్సలైట్‌ని అంటూ కబ్జాకు దిగాడు. అప్పట్లో 60 గజాల్లో ఓ గది నిర్మించుకుని ఉంటూ వచ్చిన అతగాడు ఏకంగా 5 ఎకరాల స్థలం నాదే అంటూ.. ఇప్పుడు అధికారులకే సవాలు విసురుతున్నాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలం ప్రభుత్వానిది. గతంలో పలు పర్యాయాలు చుట్టూ కంచె వేస్తే రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇలా పలు పర్యాయాలు తొలగించినా.. తిరిగి అదే స్థలంలో కంచె ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తోంది. అంతేకాకుండా ఇక్కడ విద్యుత్ మీటర్లు చెట్లకు ఉంటాయి. ముందస్తుగా పథకం ప్రకారం పదులకొద్దీ మీటర్లను తీసుకుని గదులు నిర్మించే లోపు రెవెన్యూ అధికారులు గుర్తిస్తారని తీసుకున్న మీటర్లు చెట్లకు వేలాడుతుండటం విశేషం. ఈ విషయమై ఆర్ఐ రేణుకను సాక్షి వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. (క్లిక్: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది!) -
Hyderabad: ఇల్లు శుభ్రం చేస్తుండగా బాల్కీనీలో నుంచి కింద పడిన మహిళ
సాక్షి, హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి గృహిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కొంపల్లి బొబ్బిలి ఎంపైర్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న రీనితా రెడ్డి(33) బుధవారం అదే ఆపార్ట్మెంట్ 5వ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆరోగ్య కారణాల రీత్యా గత కొన్ని రోజులుగా మానసికంగా కృంగిపోయిన రీనిత ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పేట్ బషీరాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: ఉప్పల్: ల్యాబ్ సెంటర్లో డ్రగ్స్ తయారీ!.. ఇద్దరు అరెస్ట్ గచ్చిబౌలి: భవనంపై నుంచి పడి ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ తెలిపిన మేరకు.. నీలంపేట గ్రామం, చీడికాడ మండలం, వైజాగ్‌కు చెందిన బోను సత్యవతి(42) నానక్‌రాంగూడలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో నివాసం ఉంటోంది. సాయి సిగ్నేచర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 305లో పది రోజుల క్రితమే ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అద్దెకు తీసుకున్నారు. వారి వద్ద సత్యవతి హౌస్‌మేడ్‌గా పని చేస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఫ్లాట్ నెంబర్ 305లో శుభ్రం చేస్తుండగా బాల్కానీలోని వాష్ ఏరియా నుంచి కింద పడింది. దీంతో ఆమె తల, శరీరంపై అనేక గాయాలున్నాయని పోలీసులు తెలిపారు. వెంటనే కాంటినెంటల్ హస్పిటల్‌కు తరలించగా అప్పటికే సత్యవతి మృతి చెందినట్లు అక్కడి డాక్టర్లు దృవీకరించారు. ఆత్మహత్యకు పాల్పడిందా, ప్రమాద వశాత్తు జారి పడిందా అనే విషయం విచారణలో తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. భర్త బోను ఈశ్వర్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భిణి మృతి
సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి మృతి చెందిందని బాధితులు ఆస్పత్రి యాజమాన్యంపై పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, మౌనిక (31) భార్యాభర్తలు. కాగా శ్రీకాంత్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఆల్వాల్‌లోని సాయిబాబానగర్‌లో నివాసముంటున్నాడు. మౌనిక గర్భవతి కావడంతో ప్రసవం కోసం ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్‌సీఏల్ నార్త్‌లో ఉన్న అంకుర ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఉదయం నుంచి మౌనిక ఆరోగ్యంగానే ఉందని చెప్పిన వైద్యులు సాయంత్రం ఆపరేషన్ థియేటర్లో ఫిట్స్ రావడంతో గుండెపోటుతో మృతి చెందిందని తెలిపారు. దీంతో ఆందోళన చెందిన మౌనిక కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంపై పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: జాగ్రత్త సుమా!.. అధికారులకు కేటీఆర్ హెచ్చరిక.. -
పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో లారీ బీభత్సం
-
మేడ్చల్‌లో ఘోరం.. ఇంటి ముందు నిద్రిస్తున్న కార్మికులపైకి దూసుకెళ్లిన లారీ
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లాలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మంగళవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో ఐరన్ లోడుతో వచ్చిన ఓ లారీ... వెనక్కి చూసుకోకుండా నిర్మాణంలో ఉన్న ఇంటి ముందు నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వలస కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారిని చందన్‌రామ్, చందన్ కుమార్ సహరిగా గుర్తించారు. బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోదావరి హోమ్స్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్!
సాక్షి,హైదరాబాద్: నగరంలో తొలిసారి ఓ చైన్ స్నాచర్ ఒంటరిగా వరసపెట్టి పంజా విసిరాడు. బుధవారం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆరు నేరాలు చేశాడు. ఐదు చోట్ల గొలుసు లు అతడికి చిక్కగా.. మరో ప్రాంతంలో ప్రయత్నం ఫలించలేదు. పేట్‌బషీరాబాద్, మారేడ్‌పల్లి, తుకారాంగేట్, మేడిపల్లి ఠాణాల పరిధిలో ఐదున్నర గంటల వ్యవధిలోనే ఈ ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జర్కిన్ వేసుకున్న యువకుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి.. యాక్టివా వాహనంపై సంచరిస్తూ ఈ నేరాలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఆధారాలతో ముందుకెళ్తున్నాయి. నిందితుడు వినియోగించిన యాక్టివా వాహనం మంగళవారం మధ్యాహ్నం ఆసిఫ్‌నగర్ పరిధిలోని జిర్రా రోడ్డులో చోరీకి గురైనట్లు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తుకారాం గేట్ పీఎస్ పరిధిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుడు సుదీర్ఘ కాలం తర్వాత.. మహా నగరం ఒకప్పుడు వరుస స్నాచింగులతో బెంబేలెత్తిపోయేది. స్నాచర్ల బారినపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. 2014 తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా వరుస ఉదంతాలు లేకపోయినా.. అడపాదడపా స్నాచర్లు పంజా విసురుతూనే ఉన్నారు. 2018 డిసెంబర్లో ఆఖరుసారిగా వరుస స్నాచింగ్స్ చోటుచేసుకున్నాయి. ఆ నెల చివరి వారంలో ఉత్తరప్రదేశ్‌లోని బవారియా నుంచి వచ్చిన గ్యాంగ్ కేవలం రెండు రోజుల వ్యవధిలో రాచకొండ పరిధిలోని 9 ప్రాంతాల్లో పంజా విసిరింది. ఈ గ్యాంగ్‌ను వారం రోజుల్లోనే హైదరాబాద్ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత గడిచిన రెండేళ్లల్లో ఈ తరహాలో వరుస ఉదంతాలు చోటుచేసుకోలేదు. అదను చూసుకుని పంజా.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గడిచిన కొన్నాళ్లుగా హడావుడి నెలకొంది. కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో న్యూ ఇయర్ వేడుకలు, ఆ తర్వాత వచ్చిన సంక్రాంతి పండగ నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తంగా వ్యవహరించింది. సాధ్యమైనంత వరకు నేరాలు జరగకుండా వ్యూహాత్మకంగా గస్తీ నిర్వహించింది. గడిచిన కొన్ని రోజుల్లో మూడు కమిషనరేట్లలోని పోలీసుల్లో అనేక మంది కరోనా బారినపడ్డారు. దాదాపు 800 మందికి పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌కు వెళ్లారు. దీని ప్రభావం పోలీసింగ్‌తో పాటు ఠాణాల నిర్వహణ, గస్తీపై పడింది. ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న చైన్ స్నాచర్ అదను చూసుకుని, గస్తీ లేని ప్రాంతాల్లో సంచరిస్తూ వరుసగా మూడు కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరాడు. తుకారాం గేట్ పీఎస్ పరిధిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుడు 22.3 కి.మీ.. 18.5 తులాలు.. సైబరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో ఇతగాడు తన ‘పని’ ప్రారంభించాడు. అక్కడ నుంచి రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్‌నగర్ కాలనీల్లో ‘సంచరిస్తూ’.. హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రవేశించి మారేడుపల్లి ఠాణా పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీలో పంజా విసిరాడు. అట్నుంటి తుకారాంగేట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సమోసా గార్డెన్స్ వద్ద చివరి స్నాచింగ్ చేశాడు. చివరగా రాచకొండ కమిషనరేట్‌లోని మేడిపల్లి పరిధిలో ఉన్న బోడుప్పల్ లక్ష్మినగర్ కాలనీలో పంజా విసిరాడు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదటి ఉదంతం జరిగితే ఆ ప్రాంతానికి 22.3 కి.మీ దూరంలో సాయంత్రం 4.30 గంటలకు చివరి ఉదంతం చోటుచేసుకుంది. నాలుగు చోట్ల ‘సఫలీకృతుడైన’ స్నాచర్.. మొత్తం 18.5 తులాల బంగారం చేజిక్కించుకున్నాడు. స్నాచర్ కోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీలకు చెందిన ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ముందుకు వెళ్తున్నాయి. ‘ముగ్గురూ’ పోటాపోటీగా... మూడు కమిషనరేట్ల పరిధిలో హల్చల్ చేసిన చైన్ స్నాచర్ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబరాబాద్, రాచకొండలకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ పోటాపోటీగా గాలిస్తున్నాయి. తుకారాంగేట్ తర్వాత అడ్డగుట్ట నుంచి సదరు స్నాచర్ రాచకొండ పరిధిలోకి ప్రవేశించి మేడిపల్లిలో పంజా విసిరాడు. ఈ నేపథ్యంలోనే ఆ అధికారులు గాలింపు చేపట్టారు. బుధవారం రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లోని దాదాపు 150 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించారు. నగర పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘సైబరాబాద్, రాచకొండ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నాం. స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నామంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదు. ఒకటిరెండు రోజుల్లో కచ్చితంగా పట్టుకుంటాం’ అని అన్నారు. ► భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన ఉమారాణి తన ఇంటి ఎదుట నిల్చుని ఉండగా.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచుకుపోయేందుకు ప్రయత్నించాడు. ఆమె వారిస్తూ గట్టిగా అరవడంతో సఫలీకృతుడు కాలేదు. ►రాఘవేంద్ర కాలనీకి చెందిన అనురాధ కూరగాయలు ఖరీదు చేసేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన స్నాచర్ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కుపోయాడు. ► శ్రీరామ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వరలక్ష్మి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని బాలానగర్ వైపు పారిపోయాడు. ►మారేడుపల్లి పరిధిలోని సంజీవయ్య నగర్‌కు చెందిన విజయ (55) కుమార్తె ఏఓసీ సెంటర్ సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయ అక్కడ నుంచి సమీపంలోనే ఉన్న తమ బస్తీకి కాలినడకన బయలుదేరింది. ఇంద్రపురి రైల్వే కాలనీ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన స్నాచర్ ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ► తుకారాంగేట్ పరిధిలోని నందనార్ నగర్ సమోసా గార్డెన్స్ వద్ద అద్దె ఇంటికోసం వెతుకుతున్న సాయినగర్‌కు చెందిన రాంబాయి (65) మెడలోంచి రెండు తులాల చైను లాక్కెళ్లాడు. అక్కడ నుంచి అడ్డగుట్ట చౌరస్తా మీదుగా ఉండాయించాడు. ► మేడిపల్లి ఠాణా పరిధిలోని బోడుప్పల్ లక్ష్మినగర్ కాలనీకి చెందిన కట్ట అంజమ్మ (50) వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. దొంగతనం జరిగిందిలా.. ► ఉదయం 11గం.. భాగ్యలక్ష్మి కాలనీ ఉమారాణి స్నాచింగ్‌కు యత్నం ►ఉదయం 11:10 గం.. రాఘవేంద్ర కాలనీ అనురాధ, 2 తులాలు ►ఉదయం 11:20 గం.. శ్రీరాంనగర్ కాలనీ వరలక్ష్మి, 4 తులాలు ►మధ్యాహ్నం 12:30 గం.. ఇంద్రపురి రైల్వే కాలనీ విజయ, 5 తులాలు ►మధ్యాహ్నం 12:55 గం.. సమోసా గార్డెన్స్ రాంబాయి, 2.5 తులాలు ►సాయంత్రం 4:30గం.. లక్ష్మీనగర్ కాలనీ అంజమ్మ, 5 తులాలు -
హైదరాబాద్‌లో పేలుడు.. అదుపులో అనుమానితుడు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పేట్ బషీర్బాద్ పీఎస్ పరిధిలోని జయరాం నగర్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి పేలుడు చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగులో ఒక్కసారిగా పేలుడు జరిగింది. కాగా పేలుడు శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని బ్యాగ్‌తో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు ప్రాణనష్టం లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా పేలుడుకు బ్యాగులో ఉన్న కెమికల్ డబ్బానే కారణం అని పోలీసులు భావిస్తున్నారు. -
28 తులాల బంగారం చోరీ
హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో సౌత్ ఎన్.సి.ఎల్ కాలనీలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కాలనీలో శరత్‌బాబు అనే వ్యాపారవేత్త ఈనెల 12వ తేదీన కుటుంబసభ్యులతో విజయవాడకు వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పసగులగొట్టి ఉన్నాయి. తాళాలు పగులగొట్టిన దొంగలు ఇంట్లోని సుమారు 28 తులాల బంగారం, రూ.లక్ష నగదు తీసుకెళ్లినట్లు గమనించారు. దీంతో వెంటనే ఆయన పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పురోహితుడిని చితకబాదిన కాలనీవాసులు
-
యువకుడి అసభ్య ప్రవర్తన : అరెస్ట్
హైదరాబాద్: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలివీ.. స్థానిక భాగ్యలక్ష్మికాలనీకి చెందిన సుకుమార్ దాస్ కిరాణ దుకాణం నిర్వహిస్తుంటాడు. ఇదే కాలనీకి చెందిన ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి అయిన రాకేశ్‌కుమార్(26) అతడికి రూ.6,000 బకాయి పడ్డాడు. ఈ మొత్తం ఇవ్వాలని సుకుమార్‌దాస్ శుక్రవారం సాయంత్రం అతడిని అడిగాడు. తన ఇంటికి వస్తే డబ్బు అందజేస్తానని రాకేశ్ బదులిచ్చాడు. దీంతో సుకుమార్ దాస్ తన కుమార్తె(10)ను అతడి ఇంటికి పంపాడు. రాకేశ్‌కుమార్ ఆమెను ఇంట్లోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులకు విషయం తెలిపింది. ఈ మేరకు వారు శనివారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. -
జూదం శిబిరంపై పోలీసుల దాడి
హైదరాబాద్: పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జూదం శిబిరంపై శనివారం పోలీసులు మెరుపు దాడి చేశారు. సుభాష్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో దాడి జరిపారు. ఈ దాడిలో పది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి 9 సెల్ఫోన్లు, రూ.33,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
రాకెట్ కంటే స్పీడుగా...
ఒకరికిమించిన ఆలోచనలు మరొకరివి... అందరి ఆలోచల్ని కలిపితే... ఇంకేముంది దిమ్మతిరిగే ప్రదర్శనలే...! చిన్నారులే కదా అంటే కుదరదు... రంగం ఏదైనా తక్కువ కాదు అనిపించుకుంటున్నారు. పేట్ బషీరాబాద్ సెయింట్ ఆన్స్ స్కూల్లో మంగళవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. విద్యార్థులు దాదాపు 300 అంశాలపై నమూనాల ప్రదర్శన నిర్వహిచారు. నమూనాల గురించి వివరిస్తూ ఓరా అనిపించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సత్తాచాటారు. - కుత్బుల్లాపూర్, ఎస్ఆర్ డిజి స్కూల్లో... తార్నాకలోని ఎస్ఆర్ డిజి హైస్కూల్లో స్వచ్ఛ భారత్ థీమ్ పేరుతో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ఎంతగానో ఆలోచింపజేసింది. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇరిగేషన్, సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ నమూనా, సానిటేషన్‌లో అవలంభించాల్సిన నూతన పద్ధతులు, వేస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్, ఫింగర్ ప్రింట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తదితర విషయాలపై విద్యార్థులు నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. వృక్షాలను నరకొద్దని చెప్పే పప్పెట్ షో ఆకట్టుకుంది. లాలాగూడ పోలీసు స్టేషన్ ఇన్చార్జి సీఐ వంశీకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గీర్వాణీ, ఎస్సై క్రాంతికుమార్, ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ రీసెర్చ్ స్కాలర్ దునుకు వేలాద్రి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. - తార్నాక ఆటోమేటిక్ రైల్వే గేట్ రామంతాపూర్ జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల క్యాంపస్‌లో విద్యార్థులు మంగళవారం ప్రదర్శించిన ఆటోమేటిక్ రైల్వేగేటు నమూనా విశేషంగా ఆకట్టుకుంది. లెక్చరర్ బి.రాజా మాట్లాడుతూ పరిశోధనలు నిరంతరం కొనసాగిస్తే వాటితో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేటలో జరిగిన దుర్ఘటనతో చలించి విద్యార్థులు ఆటోమేటిక్ రైల్వేగేటు తయారు చేశారన్నారు. కేవలం రూ.5వేలతో మూడు నెలల్లో విద్యార్థులు జశ్వంత్శ్రీ, బీమ్రాజు, రమ్య, అరవింద్, శ్రవణ్‌కుమార్, శ్రీనాధ్, శిరీషా, రాజు తయారు చేశారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పి.శ్యాంసుందర్‌రెడ్డి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ హెచ్ఓడీ కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -రామంతాపూర్ -
కార్డు మార్చాడు.. క్యాష్ కొట్టేశాడు!
చదువుకున్న వారిని చూస్తే గతంలో ఎంతో గౌరవంగా చూసేవారు. ఇప్పుడు చదువు'కొన్న' వారిని చూస్తే భయపడే పరిస్థితి దాపురించింది. సమకాలిన సమాజంలో జరుగుతున్న నేరాల్లో ఉన్నత చదువులు చదివిన వారు ఎక్కువగా ఉండడమే ఈ దుస్థితికి కారణం. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెనల్ కోర్సులు చదువుతున్న వారు నేరాల బాట పడుతుండడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. విలాసాలు, దురాలవాట్లకు బానిసలుగా మారుతున్న విద్యార్థులు ఎక్కువగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇందుకు ఉదాహరణలివిగో... ఏటీఎం దగ్గర సాయం అడిగిన పాపానికి ఓ ప్రభుత్వోగి రూ. లక్షలు కోల్పోయాడు. ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థి చేతిలో మోసపోయిన అతడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఆఫీసులో డ్రైవర్ గా పనిచేస్తున్న సంగారెడ్డి మఖ్దుంనగర్ కు చెందిన బురానొద్దీన్.. మే నెలలో సంగారెడ్డి ఎస్బీహెచ్ ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు వెళ్లాడు. కార్డు సరిగా పనిచేయకపోవడంతో పక్కనే ఉన్న లక్న కృపారావు(21)ను సాయమడిగాడు. డబ్బు తీసిచ్చిన తర్వాత అతడి కార్డుకు బదులు తన ఏటీఎం కార్డు బురానొద్దీన్ కు ఇచ్చాడు. బురానొద్దీన్ కార్డుతో అతడి ఎకౌంట్ లోని లక్షలాది రూపాయలు డ్రా చేశాడు. తన ఖాతాలో రూ. 8 లక్షలకు కేవలం రూ.1.18 లక్షలు మాత్రమే మిగలడంతో కంగుతిన్న బురానొద్దీన్ పోలీసులను ఆశ్రయించాడు. శేరిలింగంపల్లిలో కృపారావును అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా కోటప్పకొండకు చెందిన కృపారావు పటాన్‌చెరులోని ఓ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అవసరానికి ఆదుకున్న వ్యక్తి బ్యాంకు ఎకౌంట్ వివరాలు రహస్యంగా వాడుకుని రూ.1.15 లక్షల ఆన్లైన్ షాషింగ్ చేసిన బేతపూడి క్రేసీ ఏంజెలినా అనే ఎంటెక్ విద్యార్థిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీడ్ ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తున్న నాగరాణి మహాజన్ తనతో కలిసి ఫ్లాట్ లో నివసించిన ఏంజెలినాకు అవసరం కోసం గతేడాది నవంబర్ లో తన బ్యాంకు ఎకౌంట్ వివరాలిచ్చింది. వీటిని రహస్యంగా వాడుకుని ఏంజెలినా ఆన్లైన్ షాపింగ్ చేసింది. మోసాన్ని గుర్తించిన మహాజన్ పోలీసులను ఆశ్రయించడంతో ఏంజెలినాను అదుపులోకి తీసుకున్నారు.