పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది
హైదరాబాద్: పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో సౌత్ ఎన్.సి.ఎల్ కాలనీలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కాలనీలో శరత్‌బాబు అనే వ్యాపారవేత్త ఈనెల 12వ తేదీన కుటుంబసభ్యులతో విజయవాడకు వెళ్లారు. ఆదివారం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు పసగులగొట్టి ఉన్నాయి.
తాళాలు పగులగొట్టిన దొంగలు ఇంట్లోని సుమారు 28 తులాల బంగారం, రూ.లక్ష నగదు తీసుకెళ్లినట్లు గమనించారు. దీంతో వెంటనే ఆయన పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.