సాక్షి, హైదరాబాద్: నగరంలోని పేట్ బషీర్‌బాద్ పీఎస్ పరిధిలోని జయరాం నగర్ చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి పేలుడు చోటుచేసుకుంది. ఓ వ్యక్తి చేతిలో ఉన్న బ్యాగులో ఒక్కసారిగా పేలుడు జరిగింది. కాగా పేలుడు శబ్ధంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని బ్యాగ్‌తో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు ప్రాణనష్టం లేకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా పేలుడుకు బ్యాగులో ఉన్న కెమికల్ డబ్బానే కారణం అని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment