
మేడ్చల్, కీసర : గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు రికార్డుల ప్రక్షాళన, రికార్డుల సవరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రెవెన్యూ అధికారులు మండలంలోని నాగారం, భోగారం గ్రామాల్లో పర్యటించారు. తహసీల్దార్ వెంకట ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చేనెల 15 నుంచి డిసెంబర్ 31 వరకు రెవెన్యూ గ్రామం యూనిట్‌గా భూసర్వేలు, భూరికార్డుల ప్రక్షాళన చేపట్టనున్నట్లు తెలిపారు. తమ రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పట్టాదారులకు వన్‌బి నఖల్‌ను అందిస్తామని, తమ భూరికార్డులు సరిగ్గా ఉన్నాయా? లేదా అన్న అంశాలను వన్‌బి రికార్డులో చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఏవైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే పక్కా ఆధారాలు తమకు చూపిస్తే రికార్డుల్లో మార్పులు చేస్తామన్నారు. సర్పంచ్‌లు కౌకుట్ల చంద్రారెడ్డి, మానస, ఉపసర్పంచ్‌లు చెప్యాల వెంకట్రామిరెడ్డి, బిజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నానునాయక్, గణేష్, రాజలింగం, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.