'మా ఎస్సై మాకు కావాలి' | protest against for SI vamsi krishna suspension | Sakshi
Sakshi News home page

'మా ఎస్సై మాకు కావాలి'

Published Sat, Oct 15 2016 11:38 AM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

protest against for SI vamsi krishna suspension

మానకొండూర్: ఎస్సై వంశీకృష్ణను వెంటనే తిరిగి విధుల్లో చేరేలా చూడాలంటూ కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలానికి చెందిన కొందరు ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం వారు కరీంనగర్-వరంగల్ రహదారిపై బైఠాయించారు. వంశీకృష్ణపై సస్పెన్షన్ ఎత్తివేసి, మళ్లీ మానకొండూర్‌లోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది. ఎస్సై వంశీకృష్ణ స్వగ్రామం మండలంలోని చెంజెర్ల. కాగా, ఇటీవల ఓ యువకుడి ఆత్మహత్యకు సంబంధించి ఎస్సై వంశీకృష్ణను సీపీ కమాలాసన్‌రెడ్డి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement