ఢిల్లీ: పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో ఎంపీల సస్పెన్షన్‌పై ఇండియా కూటమి నేతలు నేడు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించనున్నారు. దేశంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇండియా కూటమి నేతలు శుక్రవారం అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు సస్పెన్షన్ అయిన ఎంపీల్లో ఒకరైన శశిథరూర్ తెలిపారు.
INDIA bloc leaders brace for nationwide protest against bulk suspension of opposition MPs
— ANI Digital (@ani_digital) December 22, 2023
Read @ANI Story | https://t.co/pwYFcPbTwJ#INDIAbloc #SuspendedOppositionMPs #JantarMantar pic.twitter.com/WfuR9d9XFS
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ నుంచి 100 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాజ్యసభ నుంచి 46 మందిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వేటు వేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు ఉభయ సభల్లో గందరగోళం సృష్టించారు. సభ నియమాలను అతిక్రమించినందుకు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
#WATCH | Leaders of the INDIA bloc come together to protest against the suspension of 146 opposition MPs at Jantar Mantar in Delhi pic.twitter.com/63rHfQ46FA
— ANI (@ANI) December 22, 2023
డిసెంబర్ 13న పార్లమెంట్‌లోకి నలుగురు ఆగంతకులు ప్రవేేశించారు. ఇద్దరు లోక్‌సభ లోపల గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో గ్యాస్ బాంబులను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్‌లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని విపక్ష నేతలు పట్టుబట్టారు.
ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన.. నిందితులకు మానసిక పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment