nationwide
-
నిరసన దీక్షను విరమించండి: సీఎం మమతా
కోల్‌కతా: ఆర్జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన ట్రెయినీ వైద్యురాలికి న్యాయం చేయాలంటూ ఆమరణ దీక్ష చేపట్టిన వైద్యులతో సీఎం మమతా బెనర్జీ శనివారం ఫోన్లో మాట్లాడారు. డిమాండ్లలో చాలా వరకు పరిష్కరించినందున దీక్ష విరమించాలని వారిని కోరారు. అదే సమయంలో, డాక్టర్లు డిమాండ్ చేస్తున్న విధంగా ఆరోగ్య శాఖ కార్యదర్శిని మాత్రం తొలగించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురిని తొలగించామంటూ ఆమె..ఫలానా అధికారిని తొలగించాలని మీరెలా అడుగుతారు? మమ్మల్ని మీరెలా ఆదేశిస్తారు? అని ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే, దీనివల్ల ప్రజా సేవలకు అంతరాయం కలగరాదని, వెంటనే దీక్ష విరమించాలని కోరారు. డిమాండ్లపై చర్చించేందుకు సోమవా రం తనను సెక్రటేరియట్‌కు వచ్చి కలుసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం కోల్‌కతాలోని ఎస్ప్లనేడ్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. జూనియర్ వైద్యులు రెండు వారాలుగా నిరశన సాగిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో దీక్షలో పాల్గొన్న ఆరుగురు వైద్యులు ఆస్పత్రుల్లో చేరారు. వైద్యుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని రాష్ట్ర వైద్యుల సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మంగళవారం దేశవ్యాప్త నిరసన చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
వైద్యురాలి హత్యోదంతంలో... దీదీ సర్కారు 10 తప్పులు
యావద్దేశాన్నీ కదిలించిన యువ వైద్యురాలి పాశవిక హత్యోదంతంలో మమతా సర్కారు తీరు మొదటినుంచీ తీవ్ర విమర్శలపాలైంది. దాంతో దోషులను కాపాడేందుకు ప్రభుత్వమే ప్రయతి్నస్తోందన్న అనుమానాలు నానాటికీ బలపడుతున్నాయి. ఈ ఘటన పట్ల రగిలిపోయిన వైద్యులు, వైద్య సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్లపైకెక్కారు. ఇది దేశవ్యాప్త ఆందోళనలకు దారితీయడంతో సుప్రీంకోర్టే ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఆద్యంతం తప్పులతడకేనంటూ అత్యున్నత న్యాయస్థానం కూడా తాజాగా తీవ్రంగా తలంటింది. ఇంతటి దారుణాన్ని ఆత్మహత్యగా చిత్రించజూసిన వైద్య కళాశాల ప్రిన్సిపల్ పట్ల పక్షపాతం, శాంతియుతంగా నిరసన చేస్తున్న వైద్య సిబ్బందిపై ఉక్కుపాదం, సోషల్ మీడియా విమర్శకుల నోళ్లు మూయించడానికి నోటీసులు, నేరం జరిగిన సెమినార్ హాల్లో ఆదరబాదరాగా మరమ్మతులు, ఆస్పత్రిపై మూక దాడిని అడ్డుకోలేక చేతులెత్తేయడం... ఇలా మమతా సర్కారు, కోల్‌కతా పోలీసులు వేసిన తప్పటడుగులు అన్నీ ఇన్నీ కావు...ఆస్పత్రి వర్గాల నిర్వాకం... 1. వైద్యురాలి అర్ధనగ్న మృతదేహం కళ్లముందు కన్పిస్తున్నా, ఒంటి నిండా గాయాలున్నా ఆసుపత్రి వర్గాలు ఆత్మహత్యగా చిత్రించేందుకు విశ్వప్రయత్నం చేశాయి. కానీ జరిగిన దారుణాన్ని పోస్ట్‌మార్టం నివేదిక బట్టబయలు చేసింది. ఒంటిపై 16, అంతర్గతంగా 9 గాయాలున్నాయని, ఒకరికి మించి రేప్ చేశారని, రెండు కాళ్లూ దారుణంగా విరిచేశారని, గొంతు నులిమి పాశవికంగా హత్య చేశారని పేర్కొంది.2. కూతురిని పొగొట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను 3 గంటలకు పైగా ఆసుపత్రి బయటే నిలబెట్టారు. మృతదేహం దగ్గరికి కూడా పోనీయలేదు. పైగా ఆగమేఘాల మీద అంత్యక్రియలు పూర్తి చేయించేలా ఒత్తిడి తెచ్చారు. కోల్‌కతా పోలీసులు సరైన కోణంలో విచారణ జరపలేదని, దర్యాప్తు కొనసాగుతుండగానే హడావుడిగా అంత్యక్రియలు పూర్తి చేయించారని విపక్షాలతో పాటు డాక్టర్లు, బాధితురాలి తండ్రి ఆరోపించారు. పోలీసుల తీరు వెనక...? 3. వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు తొలుత చెప్పారు. తర్వాత రేప్, హత్య అని తెలిపారు. ఇంత సున్నితమైన అంశంలో ఇలా వ్యవహరించడం యాదృచి్ఛకం కాదంటూ అనుమానాలు వ్యక్తమయ్యాయి. హతురాలి డైరీతో సహా పలు ఆధారాలను పోలీసులే ధ్వంసం చేశారనే ఆరోపణలున్నాయి. ఆమె తనను వేధించిన వారి గురించి డైరీలో కచి్చతంగా పేర్కొని ఉంటారంటున్నారు. ఈ ఉదంతం కోల్‌కతా పోలీసుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేసింది. దీనికి తోడు బాధితురాలి కుటుంబానికి మమత సర్కారు రూ.10 లక్షల పరిహారం ప్రకటించడం అగి్నకి మరింత ఆజ్యం పోసింది. న్యాయమడిగితే పరిహారం పేరిట ఈ పరిహాసమేమిటంటూ అంతా దుయ్యబట్టారు. వీటిపై కూడా ప్రభుత్వం నుంచి నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలే విన్పించాయి.సాక్ష్యాల చెరిపివేత?4. ఓవైపు హత్యాచారాన్ని నిరసిస్తూ ఆసుపత్రి బయట ఆందోళనలు, భారీ ప్రదర్శనలు జరుగుతుండగానే ఘోరానికి వేదికైన ఆస్పత్రి సెమినార్ హాల్లో ఆదరబాదరా మరమ్మతులు చేపట్టారు. పక్కనున్న బాత్రూం గోడను కూల్చేశారు. ఇదంతా ఆధారాలను చెరిపేసేందుకేననే సందేహాలు సహజంగానే తలెత్తాయి. మరమ్మతులు తప్పనిసరే అనుకున్నా ఇంతటి కీలక కేసు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొంతకాలం ఆగలేరా అన్న వైద్య సమాజం ప్రశ్నలకు బదులే లేదు.5. ఆగస్టు 14న అర్ధరాత్రి సంఘీభావ ప్రదర్శనలు జరగుతుండగా.. అల్లరిమూకలు ఆర్జి కార్ ఆసుపత్రిలో విధ్వంసానికి దిగాయి. 40 నిమిషాలు వీరంగం సృష్టించాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఆధారాలను ధ్వంసం చేసేందుకు టీఎంసీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీతో సహా పలువురు ఆరోపించారు.ప్రిన్సిపల్‌పై వల్లమాలిన ప్రేమ 6. ఆర్జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు మమత సర్కారు దన్నుగా నిలిచిన తీరు తీవ్ర దుమారం రేపింది. హత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే గాక హతురాలి గురించి నెగెటివ్ వ్యాఖ్యలు చేయడంతో వైద్య లోకం మండిపడింది. వారి నిరసనల నేపథ్యంలో పదవికే రాజీనామా చేయాల్సి వచి్చంది. కానీ ఆ తర్వాత మమత సర్కారు వ్యవహరించిన తీరు ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్టగా నిలిచిపోయింది. ఘోష్ రాజీనామాను ఆమోదించకపోగా, కొద్ది గంట్లోనే ఆయనను ప్రతిష్టాత్మక కోల్‌కతా నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా బదిలీ చేసింది. లెక్కలేనితనంతో వ్యవహరించినందుకు కనీసం క్రమశిక్షణ చర్యలైనా తీసుకోకపోగా ఈ రివార్డు ఏమిటంటూ వైద్యులంతా దుమ్మెత్తిపోశారు. ‘గో బ్యాక్’ అంటూ కోల్‌కతా మెడికల్ కాలేజీ వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. చివరికి ఘోష్ తీరును కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి సెలవుపై పంపింది.నిరసనకారులపై ఉక్కుపాదం 7. హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలపై మమత సర్కారు తొలినుంచీ మొండివైఖరే ప్రదర్శించింది. వైద్యురాలి హత్య వెనుక మతలబుందని ఆర్జి కార్ ఆసుపత్రి తోటి వైద్యులు వెంటనే నిరసనకు దిగారు. సమ్మెకు దిగడం ద్వారా ప్రజలకు వారు అసౌకర్యం కలిగిస్తున్నారంటూ ప్రభుత్వం నిందించింది. వైద్యురాలికే భద్రత లేని వైనంపై ఆత్మవిమర్శ చేసుకోవడంతో పాటు సురక్షిత పనిప్రదేశాలపై వైద్యుల దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి సున్నితత్వమే లేకుండా వ్యవహరించింది. తక్షణం సమ్మె విరమించి విధులకు హాజరవాలంటూ డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి తెచి్చంది. 8. భద్రతా కారణాల సాకుతో మోహన్‌బగాన్, ఈస్ట్‌బెంగాల్ జట్ల మధ్య జరగాల్సిన డెర్బీ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కోల్‌కతా పోలీసులు రద్దు చేశారు. మ్యాచ్‌కు భారీగా వచ్చే అభిమానులు డాక్టర్‌కు సంఘీభావంగా, మమత రాజీనామా డిమాండ్‌తో కదం తొక్కవచ్చనే భయంతోనే మ్యాచ్‌ను రద్దు చేశారని విమర్శకులు, అభిమానులు మండిపడ్డారు. దీన్ని జనాగ్రహాన్ని అణచివేసే చర్యగానే చూశారు. 9. జనాగ్రహం, వైద్యుల నిరసనల సెగతో ఉక్కిరిబిక్కిరైన కోల్‌కతా పోలీసులు తప్పిదాలను దిద్దుకోవాల్సింది పోయి ఎదురుదాడికి దిగి మరింత అప్రతిష్ట పాలయ్యారు. మమత రాజీనామా చేయాలన్న డిమాండ్లపై పోలీసు ఉన్నతాధికారులు ఎదురుదాడికి దిగి అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల్లా వ్యవహరించారు. మీడియా అబద్ధాలను వ్యాప్తి చేస్తోందని, ఈ ఉదంతాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని కోల్‌కతా పోలీస్ కమిషనర్ ఆరోపించారు. ఇక రాష్ట్ర మంత్రి ఉదయన్ గుహ మరో అడుగు ముందుకేసి మమత వైపు చూపుతున్న వేళ్లను విరిచేయాలంటూ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, డాక్టర్లు, విద్యార్ధులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు 280 మందికి నోటీసులిచ్చారు.ముఖ్యమంత్రే నిరసనలకు దిగి... 10. సీఎంగా పరిస్థితిని చక్కదిద్దేందుకు కావాల్సిన అన్ని అధికారాలూ చేతిలో ఉన్న మమత స్వయంగా రోడ్డెక్కి అభాసుపాలయ్యారు. దోషులకు మరణశిక్ష పడాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించారు. నిజానికి సీబీఐకి కేసు బదిలీ కాకముందు కోల్‌కతా పోలీసుల ఉద్దేశపూర్వక అలక్ష్యమే కేసును పూర్తిగా నీరుగార్చిందనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర హోం శాఖ మమత చేతిలోనే ఉండటం కొసమెరుపు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తీవ్రతరం... కనిపిస్తే కాల్చివేత!
ఢాకా/సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. రిజర్వేషన్లపై వారం క్రితం మొదలైన దేశవ్యాప్త హింసాకాండ నానాటికీ పెరిగిపోతోంది. భద్రతా సిబ్బందికి, విద్యార్థులకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య శనివారంతో 115 దాటింది! రాజధాని ఢాకాతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కర్ఫ్యూ విధించినా, సైనికులు, పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. అయినా లాభం లేకపోగా పరిస్థితి విషమించడమే గాక పూర్తిగా అదుపు తప్పుతోంది. దాంతో తాజాగా కనిపిస్తే దేశవ్యాప్తంగా కాలి్చవేత (షూట్ ఎట్ సైట్) ఉత్తర్వులు జారీ అయ్యాయి! 978 మంది భారతీయులు వెనక్కు బంగ్లాదేశ్ నుంచి 978 మంది భారతీయ విద్యార్థులను కేంద్రం సురక్షితంగా వెనక్కు తీసుకొచి్చంది. 778 మంది నౌకల్లో, 200 మంది విమానాల్లో వచ్చారు. బంగ్లాదేశ్‌లో పనలు వర్సిటీల్లో ఇంకా 4 వేలకు పైగా భారతీయ విద్యార్థులున్నారు. వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఢాకాలోని భారత హైకమిషన్ కృషి చేస్తోంది.ఇదీ సమస్య... 1971 బంగ్లాదేశ్ వార్ వెటరన్ల కుటుంబీకులకు ప్రభుత్వోద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 2018లో షేక్ హసీనా వీటిని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని ఢాకా హైకోర్టు తాజాగా తప్పుబట్టింది. ఆ రిజర్వేషన్లను పునరుద్ధరించాలంటూ జూన్ 5న ఆదేశాలిచి్చంది. దీనిపై విద్యార్థులు, ఉద్యోగార్థులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా వీటిని వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు, ఆందోళనలకు దిగారు. కోటా పునరుద్ధరణ వద్దే వద్దంటూ రోడ్డెక్కారు. దాంతో కోర్టు ఉత్తర్వులను హసీనా ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా పక్కన పెట్టింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆదివారం తుది విచారణకు అంగీకరించింది. -
100 పెట్రోల్ బంకుల ఏర్పాటులో ఐపీఎం
గువాహటి: ఇంధన రిటైల్ స్టార్టప్ సంస్థ ఇండో పెట్రోలియం మార్కెటింగ్ (ఐపీఎం) తొలి దశలో 100 పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయనుంది. అస్సాంతో మొదలుపెట్టి వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా వీటిని నెలకొల్పనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు జ్ఞాన్ ప్రకాశ్ శర్మ తెలిపారు. వచ్చే రెండేళ్లలో మారుమూల ప్రాంతాల్లో అయిదు రిటైల్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభిస్తామని, మొదటిది జోర్హాట్ జిల్లాలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఔట్లెట్ల ఏర్పాటుకు అనువైన స్థల సమీకరణలో తోడ్పాటు అందించాల్సిందిగా జిల్లాల యంత్రాంగాలకు అస్సాం ప్రభుత్వం ఇప్పటికే సూచించినట్లు శర్మ వివరించారు. ప్రభుత్వ రంగ రిఫైనర్ల నుంచి కొనుగోలు చేయడం లేదా దిగుమతి చేసుకోవడం ద్వారా ఇంధనాలను సమకూర్చుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ రంగ నుమాలిగఢ్ రిఫైనరీస్‌తో ఇంధన సరఫరా ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. వచ్చే 2–3 ఏళ్లలో అస్సాం, నార్త్ పశి్చమ బెంగాల్లో 25 ఔట్లెట్స్ నెలకొల్పే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ఒక్కో బంకులో దాదాపు 20 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగలదన్నారు. తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్‌తో పాటు వీలున్న ప్రాంతాల్లో సీఎన్జీ, బయోఇంధనాలను కూడా విక్రయిస్తామని తెలిపారు. అన్ని బంకుల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ పాయింట్లు ఉంటాయని శర్మ చెప్పారు. -
దేశవ్యాప్తంగా పెరుగుతున్న హోం థియేటర్ ట్రెండ్
భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టిప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. – సాక్షి, హైదరాబాద్ మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచి్చన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచి్చన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో...: దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే..: మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యం కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
ఎంపీల సస్పెన్షన్‌పై నేడు దేశవ్యాప్త నిరసన
ఢిల్లీ: పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో ఎంపీల సస్పెన్షన్‌పై ఇండియా కూటమి నేతలు నేడు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించనున్నారు. దేశంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఇండియా కూటమి నేతలు శుక్రవారం అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు సస్పెన్షన్ అయిన ఎంపీల్లో ఒకరైన శశిథరూర్ తెలిపారు. INDIA bloc leaders brace for nationwide protest against bulk suspension of opposition MPs Read @ANI Story | https://t.co/pwYFcPbTwJ#INDIAbloc #SuspendedOppositionMPs #JantarMantar pic.twitter.com/WfuR9d9XFS — ANI Digital (@ani_digital) December 22, 2023 పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ నుంచి 100 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాజ్యసభ నుంచి 46 మందిపై ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వేటు వేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై విపక్షాలు ఉభయ సభల్లో గందరగోళం సృష్టించారు. సభ నియమాలను అతిక్రమించినందుకు విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. #WATCH | Leaders of the INDIA bloc come together to protest against the suspension of 146 opposition MPs at Jantar Mantar in Delhi pic.twitter.com/63rHfQ46FA — ANI (@ANI) December 22, 2023 డిసెంబర్ 13న పార్లమెంట్‌లోకి నలుగురు ఆగంతకులు ప్రవేేశించారు. ఇద్దరు లోక్‌సభ లోపల గ్యాస్ క్యానిస్టర్లను ప్రయోగించారు. మరో ఇద్దరు పార్లమెంట్ ఆవరణలో గ్యాస్ బాంబులను ప్రయోగించారు. దీంతో పార్లమెంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడాలని విపక్ష నేతలు పట్టుబట్టారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి ఘటన.. నిందితులకు మానసిక పరీక్షలు -
వచ్చే ఏడాది 300 వర్సిటీల్లో ఆనర్స్ డిగ్రీ
సాక్షి, అమరావతి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 300కు పైగా విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) ప్రోగ్రామ్ అందుబాటులోకి రానుంది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యార్థులకు పరిశోధన స్పెషలైజేషన్ డిగ్రీని అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నాలుగేళ్ల డిగ్రీని ప్రవేశపెట్టింది. ఆనర్స్ డిగ్రీ అందించేందుకు 150 విశ్వవిద్యాలయాలు ముందుకు రాగా, ఇప్పటికే 105 వర్సిటీలు కోర్సు ప్రారంభించాయి. 19 కేంద్రీయ, 24 రాష్ట్ర స్థాయి, 44 డీమ్డ్, 18 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. నాలుగేళ్ల కోర్సు ఐచ్ఛికమే నాలుగేళ్ల డిగ్రీ పాఠ్యాంశాలు, క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రూపొందించారు. నాలుగేళ్ల డిగ్రీ విద్యార్థుల ఐచ్ఛికమే. మూడేళ్ల సాంప్రదాయ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆసక్తి ఉన్న వారు నాలుగో ఏడాది ఆనర్స్ డిగ్రీని అభ్యసించవచ్చు. విద్యార్థులు 120 క్రెడిట్లు పూర్తి చేసిన తర్వాత మూడేళ్ల యూజీ డిగ్రీని, 160 క్రెడిట్లు పూర్తి చేస్తే ఆనర్స్ డిగ్రీని అందిస్తారు. పరిశోధన స్పెషలైజేషన్ అభ్యసించే వారు నాలుగేళ్ల యూజీ కోర్సులో పరిశోధన ప్రాజెక్టు చేపట్టాలి. దీంతో వారికి రీసెర్చ్ స్పెషలైజేషన్‌తో పాటు ఆనర్స్ డిగ్రీ లభిస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది. విదేశాల్లో చదువుకునేందుకు భారతీయ విద్యార్థుల్లో డిమాండ్ పెరుగుతోంది. గతేడాది నవంబర్ వరకు 6 లక్షల మందికిపైగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాలో ఎక్కువ మంది భారతీయలు చదువుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. -
పంటనష్టంలో తెలంగాణది మూడోస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించింది. వరదలు, పిడుగుపాట్లు వంటి కారణాలతో 2,044 మంది మరణించినట్లు తెలిపింది. వరదలతో అత్యధికంగా హరియాణాలో 5,40,975 ఎకరాల్లో పంటనష్టం జరగ్గా, హిమాచల్‌ప్రదేశ్‌లో 1,89,400 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదించింది. అత్యధికంగా పంటనష్టం జరిగిన రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, మొత్తం 1,51,970 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. తెలంగాణలో 18 మంది మరణించారని, ఇతరత్రా కారణాలతో మరొకరు మృతి చెందారని నివేదికలో వెల్లడించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రెండు విపత్తు నిర్వహణ బృందాలను రాష్ట్రంలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. ఏపీలో 22,537 ఎకరాల్లో పంట నష్టం ఏపీలోని ఐదు జిల్లాల పరిధిలో భారీవర్షాలు, వరదల ప్రభావం ఉందని, వాటి కారణంగా మొత్తంగా 39 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ విభాగం నివేదించింది. మొత్తం 22,537 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తెలిపింది. విపత్తు నిర్వహణ కోసం రెండు బృందాలను ఏపీలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. -
ఢిల్లీ పంద్రాగస్టు వేడుకలకు రాష్ట్రం నుంచి ప్రత్యేక అతిథులు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ఎర్రకోటలో ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర వేడుకలకు దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన 1,800 మందిని ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వనించింది. కరీంనగర్‌లోని రైతుప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం ప్రైవేట్ లిమిటెడ్ లబ్ధిదారులు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌లోని భూసంపాడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌తోపాటు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఏడాది 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చైతన్యవంతమైన గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, నర్సులు, రైతులు, మత్స్యకారులు, న్యూఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన శ్రామికులు, ఖాదీ రంగ కార్మికులు, జాతీయ అవార్డు పొందిన పాఠశాల ఉపాధ్యాయులు, సరిహద్దు రోడ్ల సంస్థ కార్మికులు, అమృత్ సరోవర్, హర్ ఘర్ జల్ యోజన ప్రాజెక్ట్‌ల కోసం సహాయం చేసినవారు, పనిచేసినవారు ఈ ప్రత్యేక ఆహ్వనితుల జాబితాలో ఉన్నారు. ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వనించడంపై కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘం చైర్మన్ సంద మహేందర్, ఆదిలాబాద్ జిల్లా గుండాలకు చెందిన భూసంపద రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ చైర్మన్ జూన గణపతిరావు, సెంట్రల్ ఫిషర్మెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడు జనార్దన్ గంగపుత్ర సంతోషం వ్యక్తం చేశారు. -
ఆగస్టులో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకలు
సాక్షి, అమరావతి : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా ఆగస్టు 9–15 తేదీల మధ్య ‘మేరీ మిట్టి మేరా దేశ్’ నినాదంతో దేశవ్యాప్తంగా 2.50 లక్షల గ్రామ పంచాయతీలు, 7,500 బ్లాకులు, 90 వేల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. అదే నెల 29, 30 తేదీల్లో ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ముగింపు వేడుకల గ్రాండ్ ఫినాలే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. వీటి నిర్వహణ, ఏర్పాట్లపై శనివారం ఆయన రాష్ట్రాల సీఎస్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలకులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీ తరఫున జవహర్‌రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కీలక అంశాలపై కార్యక్రమాలు.. ఆయా గ్రామాలు, పట్టణాల నుంచి దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులు, రక్షణ దళాల విశ్రాంత సిబ్బంది, కేంద్ర ఆర్మ్డ్ రిజర్వు పోలీసు, రాష్ట్ర పోలీసు దళాలకు చెందిన వారికి సంఘీభావాన్ని తెలియజేయాలి. వివిధ తాగునీటి వనరుల వద్ద శిలాఫలకాలను ఏర్పాటుచేయాలి. జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపన చేయాలి. ప్రతి పంచాయతీలో వసుధ వందన్ కింద కనీసం 75 మొక్కలను నాటాలి. అలాగే, వీరన్ కా వందన్ కింద స్వాతంత్య్ర సమరయోధులు, అమర వీర సైనిక కుటుంబాలకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలి. -
జాతీయ బరిలో బీఆర్ఎస్.. ‘ఫామ్‌హౌస్’ ఫైల్స్‌పై దేశవ్యాప్తంగా ప్రచారం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో కార్యకలాపాల విస్తరణకు వీలుగా పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’గా మార్చుకున్న టీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం అందుకు ఆమోద ముద్ర వేయడమే తరువాయి బరిలో దిగాలని భావిస్తోంది. 2024 సాధారణ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలనుకుంటున్న సీఎం కేసీఆర్ ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి విదితమే. అయితే పేరు మార్పునకు సంబంధించి ఈసీ ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. దీనిపై దాదాపు నెలరోజుల క్రితమే సమాచారం ఇచ్చినా ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సమాచారం రాలేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ‘భారత్ రాష్ట్ర సమితి’పేరుతో సారూప్యత కలిగిన మరికొన్ని పార్టీలు కూడా ఉండటంతో టీఆర్ఎస్ పేరు మార్పు ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమోదం తర్వాతే ఆవిర్భావ సభపై స్పష్టత ఈసీ ఆమోదం లభించిన వెంటనే పార్టీ దేశవ్యాప్త విస్తరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. బీఆర్ఎస్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఆవిర్భావ సభను భారీగా నిర్వహించాలని దసరా రోజు తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 9న ఈ సభ నిర్వహించాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినా..పార్టీ పేరు మార్పుకు ఈసీ ఆమోదం లభించిన తర్వాతే సభ నిర్వహణపై స్పష్టత వచ్చే అవకాశ ముందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే డిసెంబర్లో ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరి చలితీవ్రత పెరిగే అవకాశాలుండటం.. ఆవిర్భావ సభ నిర్వహణపై ప్రభావం చూపే అవకాశముందని చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రభావం చూపే ప్రాంతాలపై ఫోకస్ ‘భారత్ రాష్ట్ర సమితి’కి గుర్తింపు లభించినా 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగానే పార్టీ కార్యాచరణ ఉంటుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఇటీవల ఒక సందర్భంలో చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని అన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభావం చూపేందుకు అవకాశమున్న పొరుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, రాయచూరు, బళ్లారి, నాందేడ్, చంద్రాపూర్, నాగపూర్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాలతో పాటు తెలంగాణకు చెందిన చేనేత కార్మికులు అధికంగా ఉండే షోలాపూర్, భివండితో పాటు గుజరాత్‌లోని సూరత్ తదితర ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేయడంలోని సాధ్యాసాధ్యాలను కేసీఆర్ అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. అన్ని భాషల్లోకి ఫామ్‌హౌస్ ఫైల్స్ ‘ఎమ్మెల్యేలకు ఎర’కు సంబంధించిన ఆడియో, వీడియో ఫైల్స్‌ను అన్ని భాషల్లోకి తర్జుమా చేసి విస్తృతంగా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలిసింది. ఆడియో, వీడియో టేపుల్లోని సంభాషణలను అన్ని భాషల్లో సబ్ టైటిల్స్ తయారు చేసి వివిధ ప్రసార, ప్రచార, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. చదవండి: ఫీ'జులుం'పై ఫైన్.. ఒక్కో సీటుపై రూ.2 లక్షల జరిమానా -
హాలీవుడ్ స్ట్రాటజీతో 'మేజర్'.. సాధారణ రేట్లకే సినిమా
Adivi Sesh Plans Major Movie Nationwide Preview Before Release: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను పది రోజుల ముందుగానే విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్లలో రిలీజ్ కానుంది. ఈ ప్రివ్యూలను హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో ప్రదర్శిస్తారు. ఇందుకోసం బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రివ్యూస్ చూడాలనుకునేవారు బుక్ మై షో లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ తరహా ప్రివ్యూలను హాలీవుడ్లో విడుదల చేస్తారు. సినిమా రిలీజ్‌కు ముందు పలు ప్రధాన నగరాల్లో పది లేదా నెల రోజుల గ్యాప్‌తో ప్రదర్శిస్తారు. తమ సినిమాలకు మరింత పాపులారిటీ తెచ్చుకునేందుకే ఈ తరహా స్ట్రాటజీని వాడతారు. ఇప్పుడు ఇదే టెక్నిక్‌ను తన సినిమా కోసం అడవి శేష్ అనుసరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకే ఈ ప్రివ్యూస్ వేస్తున్నట్లు సమాచారం. అయితే ఇలా రిలీజ్‌కు ముందే ప్రివ్యూస్ వేయడం దేశంలోనే ఇదే తొలిసారి. చదవండి: నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే: మహేశ్ బాబు అలాగే ఈ సినిమా టికెట్ రేట్లపై అడవి శేష్ ఇటీవల స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా 'ఆస్క్ శేష్' సెషన్లో ఈ విషయం గురించి ప్రస్తావన వచ్చింది. 'టికెట్ రేట్లను తగ్గించండి. రిపీటెడ్‌గా సినిమా చూసేందుకు వీలుంటుంది. ఫలింతగా ఇండస్ట్రీని కాపాడొచ్చు.' అని ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు శేష్ బదులిచ్చాడు. తమ సినిమా టికెట్లు సాధారణ రేట్లతో అందుబాటులో ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. 'ఇది సాధారణ ప్రేక్షకులు చూడాల్సిన అసాధారణ సినిమా' అని పేర్కొన్నాడు. దీంతో 'ఎఫ్ 3' మూవీ తర్వాత సాధారణ రేట్లకే టికెట్ రేట్లను కేటాయించిన సినిమాగా 'మేజర్' నిలిచింది. చదవండి: ‘మేజర్’ ట్రైలర్‌ను చూసిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ -
కరోనా : ఇజ్రాయెల్‌లో రెండోసారి లాక్డౌన్
జెరూసలేం:దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మూడువారాల లాక్డౌన్ విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. రెండవసారి వైరస్ సంక్రమణను అడ్డుకునేందుకు ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచంలోనే ఇలాంటి చర్య తీసుకున్న మొదటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఇజ్రాయెల్ నిలిచింది. మూడు వారాల పాటు కఠినమైన లాక్డౌన్ కు కేబినెట్ అంగీకరించిందని, దీనిని పొడిగించే అవకాశం కూడా ఉందని దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం ప్రకటించారు. రోజుకు 4వేలకు పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయనీ దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మహమ్మారి కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థపై రెండవ లాక్డౌన్ ద్వారా 6.5 బిలియన్ల షెకెల్లు (1.88 బిలియన్ డాలర్లు) మేర నష్టం ఏర్పడనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా. దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుతుండడంతో సెప్టెంబర్ 18నుంచి రెండు వారాల లాక్డౌన్ కొనసాగనుంది. లాక్డౌన్ కాలంలో సూపర్ మార్కెట్లు, ఫార్మసీలు వంటి అత్యసర సేవలు మినహా ఉదయం 6 గంటలకు వరకు పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా దేశంలోని అన్ని పాఠశాలలు, కిండర్ గార్టెన్లు రెండు రోజుల ముందుగానే సెప్టెంబర్ 16న మూసివేస్తారు. అయితే యూదుల నూతన సంవత్సరం ముఖ్యమైన సెలవుల ప్రారంభానికి కొన్ని గంటల ముందు ప్రధానంగా ప్రాయశ్చిత్త దినం, సుక్కోట్ ముందు వెలువడిన ఈ నిర్ణయంపై తీవ్ర నిరసర వ్యక్తమవుతోంది. తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గృహశాఖా మంత్రి యాకోవ్ లిట్జ్మాన్ రాజీనామా చేశారు, ఇది ఇజ్రాయెల్ యూదులకు అగౌరవమని ఆయన అన్నారు. మార్చిలో కఠినమైన లాక్డౌన్ అమలుద్వారా కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టినందుకు ఇజ్రాయెల్ సర్కార్ మొదట్లో ప్రశంసలు అందుకుంది. కానీ ఆ తరువాత కేసులు బాగా పెరగడంతో మహమ్మారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు చెలరేగాయి. నెతన్యాహు రాజీనామా చేయాలని వందలాది మంది ప్రదర్శనకారులు ర్యాలీలు చేశారు. ఇజ్రాయెల్‌లో ఇప్పటివరకు 153,759 కరోనా కేసులు నమోదు కాగా 1,108 మంది వ్యాధి బారిన పడి మరణించారు. -
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ వై–ఫై కాలింగ్ సేవలు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ భారతీ ఎయిర్టెల్.. దేశవ్యాప్తంగా వై–ఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు శుక్రవారం ప్రకటించింది. నూతన సేవల ఆధారంగా ఇతర వై–ఫై నెట్‌వర్క్‌లను కూడా వినియోగించుకుని కాల్స్ చేయవచ్చని, దీంతో పాటు ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చని వివరించింది. ఇందుకు కస్టమర్ల నుంచి ఎటువంటి అదనపు చార్జీలను వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. పైలట్ ప్రొజెక్ట్ కింద ఇప్పటికే అందుబాటులో ఉన్న సంస్థ సేవలకు విశేష స్పందన లభించిందని, వై–ఫై కస్టమర్ల సంఖ్య 10 లక్షలను అధిగమించిందని ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇటీవలే రిలయన్స్ జియో సైతం ఈ తరహా సేవ లను అందుబాటులోకి తెచ్చింది. -
ఇక దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. ఈ జాబితా రూపకల్పనలో మతపరమైన వివక్షలు ఉండవన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ సయ్యద్ నసీర్అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా అమిత్ మాట్లాడారు. ‘అస్సాం తరహాలో జాతీయ పౌర రిజిస్టర్‌ను దేశవ్యాప్తంగా తీసుకువస్తాం. ఏ మతం వారూ భయపడాల్సిన పని లేదు. ఎన్ఆర్సీ గొడుగు కిందకి అందరినీ తీసుకురావడమే దీని ఉద్దేశం. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ సాగుతుంది’ అని అన్నారు. ‘ఏ మతానికి చెందిన వారైనా భారతీయ పౌరులందరికీ ఈ జాబితాలో స్థానం లభిస్తుంది. ఈ అంశంలో ఎలాంటి వివక్షలకు తావు లేదు’ అని అమిత్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ రిజిస్టర్‌ను రూపొందిస్తే అస్సాంను అందులో కలుపుతామన్నారు. ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ బిల్లు వేర్వేరు జాతీయ పౌర రిజిస్టర్‌కు, పౌరసత్వ సవరణ బిల్లుకు మధ్య తేడా ఉందన్నారు. హిందువులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టయన్లు, సిక్కులు, పార్సీలు ఎవరైనా కానివ్వండి ఆశ్రయం కోరి వచ్చిన వారిని భారత్ అక్కున చేర్చుకుంటుందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌లలో మతపరమైన అరాచకాలను భరించలేక భారత్‌కు శరణార్థులుగా వచ్చినవారికి జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు కింద పౌరసత్వం ఇస్తామని స్పష్టం చేశారు. జాతీయ పౌరసత్వ బిల్లుని లోక్‌సభ ఆమోదించిందని, సెలెక్ట్ కమిటీ ఆమోదించాక సభ రద్దయిందని, త్వరలో ఈ బిల్లు మళ్లీ సభ ముందుకు వస్తుందని వివరించారు. పౌరసత్వ సవరణ బిల్లుకి, జాతీయ పౌర రిజిస్టర్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. బెంగాల్లో అనుమతించం: మమత దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్‌ను తయారు చేస్తామన్న కేంద్రం ప్రకటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ మండిపడ్డారు. ‘ నేను అధికారంలో ఉన్నంత వరకు ఎన్ఆర్సీకి అనుమతించను’ అని సగార్దిఘిలో ఒక బహిరంగ సభలో చెప్పారు.‘మీ పౌరసత్వాన్ని ఎవరూ లాక్కోలేరు. మిమ్మల్ని శరణార్థులుగా మార్చలేరు’ అని బెంగాలీలకు హామీ ఇచ్చారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు: అమిత్ షా జమ్ము కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు యధావిధిగా పనిచేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. అస్సాం ఎన్ఆర్సీ ప్రక్రియపై ఆందోళన వాషింగ్టన్: అస్సాంలో రూపొందించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రక్రియపై అమెరికాకు చెందిన కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియతో భారత్‌లో ఏళ్ల తరబడి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న 19 లక్షల మంది పౌరసత్వాన్ని కోల్పోనున్నారని పేర్కొంది. సరైన నియంత్రణ , పారదర్శకత లేకుండా ఎన్ఆర్సీ ప్రక్రియను చేపట్టడం వల్ల అసలు సిసలు భారతీయులకే దేశంలో చోటు లేకుండా ప్రమాదం ముంచుకొస్తోందని తన నివేదికలో పేర్కొంది. అస్సాంలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొని, వారిని రాష్ట్రం నుంచి పంపించేయడానికే ఎన్ఆర్సీ ప్రక్రియను నిర్వహించారని యూఎస్సీఐఆర్ఎఫ్ కమిషనర్ అనురిమ భార్గవ ఆరోపించారు. -
దేశవ్యాప్తంగా బక్రీద్ వేడుకలు
-
ఆలిండియా బ్యాంకర్ల సమ్మె సైరన్
చెన్నై: బ్యాంకు సంఘాలు మరోసారి సమ్మెకు దిగనున్నారు. బ్యాంకింగ్ రంగం, ఇతర అంశాలపై ఇటీవలి సంస్కరణలను నిరసిస్తూ ఆగస్టు 22 న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నామని బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. ముఖ్యంగా ప్రయివేటైజేషన్, ప్రభుత్వ రంగబ్యాంకుల విలీనం తదితర చర్యలకు వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్లు సమ్మె సైరన్ మోగించాయి. ఈనెల 22వ తేదీన ఆలిండియా బ్యాంకర్ల సమ్మె తలపెట్టినట్లు ద యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బీయు), ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు ప్రకటించాయి. ఆగస్టు 22 న మొత్తం బ్యాంకింగ్ రంగంపై సమ్మె జరుగుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబీఇఎ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు చెప్పారు. వేతనాలు పెంపుతోపాటు బ్యాంకింగ్ రంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ సమ్మెకు దిగనున్నామని చెప్పారు. దీనిపై రెండు రోజుల క్రితమే నోటీసులు అందజేశా మన్నారు. బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లతో కూడిన యుఎఫ్‌బీయు ఈ సమ్మెలో పాల్గొంటోందని అలాగే వేతనం సమీక్షలాంటి , ఇతర సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను కూడాకోరినట్టు వెంకటాచలం తెలిపారు. -
ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగచ్చు..!
-
ఏ క్షణమైనా ఉగ్రదాడులు..!
దేశవ్యాప్తంగా అత్యంత అప్రమత్తత ♦ సరిహద్దు పరిస్థితిపై రాజ్‌నాథ్ ఆధ్వర్యంలోసమీక్ష ♦ కీలక ప్రాంతాలు, వైమానిక స్థావరాల వద్ద హైఅలర్ట్ ♦ భద్రతా దళాలు, ప్రజలే ఉగ్రవాదుల లక్ష్యం: నిఘా వర్గాలు ♦ రాష్ట్రాల్ని హెచ్చరించిన కేంద్ర హోం శాఖ ♦ సర్జికల్ దాడుల్లో మన సైనికులు మరణించలేదన్న ఆర్మీ పాకిస్తాన్ సహకారంతో ఉగ్రవాదులు ఏ క్షణమైనా భారత్‌పై దాడి చేయవచ్చు... ఎక్కడైనా విరుచుకుపడవచ్చు...! కేంద్ర హోం శాఖకు నిఘా వర్గాల తాజా హెచ్చరిక ఇది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత అప్రమత్తత ప్రకటించారు. ఉగ్రవాదుల మెరుపు దాడుల్ని తిప్పికొట్టేలా భద్రతను పటిష్టం చేశారు. జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు... భద్రతా దళాల్ని, ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయొచ్చని, వారు ఇప్పటికే కశ్మీర్లో మకాం వేశారంటూ నిఘా సంస్థలు విశ్వసనీయ సమాచారాన్ని అందించాయి. దీంతో సరిహద్దు వెంట ఉన్న భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉన్నత స్థాయి భద్రతాధికారులను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు. న్యూఢిల్లీ: పాకిస్తాన్ సహకారంతో ఉగ్రవాదులు ఏ క్షణమైనా భారత్‌పై దాడి చేయవచ్చు... ఎక్కడైనా విరుచుపడవచ్చు...! కేంద్ర హోం శాఖకు నిఘా వర్గాల తాజా హెచ్చరిక ఇది. దీంతో దేశవ్యాప్తంగా అత్యంత అప్రమత్తత ప్రకటించారు.ఉగ్రవాదుల మెరుపు దాడుల్ని తిప్పికొట్టేలా భద్రతను పటిష్టం చేశారు. జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు... భద్రతా దళాల్ని, ప్రజల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయొచ్చని, ఇప్పటికే కశ్మీర్లో మకాం వేశారంటూ నిఘా సంస్థలు విశ్వసనీయ సమాచారాన్ని అందించాయి. దీంతో సరిహద్దు వెంట ఉన్న భద్రతా దళాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఉన్నత స్థాయి భద్రతాధికారులను కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు. భారత్- పాక్ సరిహద్దుల్లో పరిస్థితితో పాటు దేశవ్యాప్తంగా భద్రతను ఉన్నతాధికారులతో శుక్రవారం ప్రత్యేక భేటీలో ఆయన సమీక్షించారు. సరిహద్దుల్లో పరిస్థితిపై అధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు. బీఎస్ఎఫ్ పోస్టులపై పాక్ వైపు నుంచి ఎలాంటి దాడులైనా తిప్పికొట్టేందుకు తీసుకున్న చర్యలు, సరిహద్దుల్లో ప్రజల భద్రతకు తీసుకుంటున్న జాగ్రత్తల్ని వారు వివరించారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి ఇతర భద్రతా, నిఘా అధికారులు పాల్గొన్నారు. నిఘా పెంచాలంటూ ఐబీకి ఆదేశాలు బీఎస్ఎఫ్.. ఇప్పటికే భారత్-పాక్ సరిహద్దుల్లో అన్ని యూనిట్లను అత్యంత అప్రమత్తంగా ఉంచింది. జమ్మూ, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్‌ల్లో నిఘాను పెంచాలని ఐబీకి హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్‌లో ఉన్న సిబ్బందినీ వినియోగించుకోవాలని సూచించింది. సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల కదలికల్ని ఎప్పటికప్పుడు నియంత్రిస్తున్న బీఎస్ఎఫ్... వారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా సాయం చేస్తోంది. పంజాబ్‌లో భారీ భద్రత పంజాబ్‌లోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని వైమానిక స్థావరాల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంట గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు భాక్రా డ్యాం వద్ద పహారా పెంచారు. అన్ని ఆనకట్టల వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు 1000 గ్రామాల ప్రజలు పంజాబ్ రాష్ట్రం పాక్‌తో 553 కి.మి. సరిహద్దు కలిగి ఉంది. మొత్తం ఆరు జిల్లాలు అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్నాయి. సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలోని 1000 గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారి కోసం జిల్లా అధికార యంత్రాంగం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసింది. స్కూళ్లు, కల్యాణ మండపాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. గురుదాస్‌పూర్, ఫిరోజ్‌పూర్ జిల్లాల పరిధిలోని గ్రామాల్లో పలు శిబిరాల్ని ఏర్పాటు చేశారు. పోలీసులు, వైద్య సిబ్బంది సెలవుల్ని రద్దు చేశారు. గురువారం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కేబినెట్ భేటీ నిర్వహించి సరిహద్దు జిల్లాలకు అత్యవసర ఖర్చుల కోసం తక్షణం రూ. కోటి చొప్పున విడుదల చేయాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి: హోం శాఖ రాష్ట్రాల్లోని సున్నిత, వ్యూహాత్మక ప్రాంతాలు, మార్కెట్లు, మత సంబంధ ప్రదేశాలు, ఇతర ముఖ్య ప్రాంతాల్లో అదనపు బలగాల్ని నియమించాలని కేంద్ర హోం శాఖ సూచించింది. రాబోయే పండుగల దృష్ట్యా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలంది. మెట్రో నగరాల్లో నిఘా పటిష్టం చేయాలని కోరింది. పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్న జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరింది. పీఓకే లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ భద్రత వర్గాలు ఉగ్రవాద గ్రూపుల్ని ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అయితే గురువారం నాటి దాడితో ఎల్ఓసీ వెంట ఉన్న ఉగ్రవాద శిబిరాల్ని పీఓకేలో గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. భారత సైనికులెవరూ మరణించలేదు: ఆర్మీ భారత్ సర్జికల్ దాడుల సందర్భంగా భారతీయ సైనికులు మరణించారన్న వార్తల్ని ఆర్మీ తోసిపుచ్చింది. ప్రత్యేక బృందానికి చెందిన ఒక సభ్యుడు స్వల్పంగా గాయపడ్డాడని, శత్రువులు, ఉగ్రవాదుల దాడి వల్ల అతను గాయపడలేదని ఆర్మీ పేర్కొంది. ఈ ఆపరేషన్ అత్యంత పకడ్బందీగా నిరంతర పర్యవేక్షణతో జరిగిందని, ఏడు ఉగ్ర స్థావరాలపై ఒకేసారి దాడులు నిర్వహించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వివిధ పోస్టుల్లో కాపలా కాస్తోన్న పాక్ భద్రతా దళాల దృష్టిని మళ్లించేందుకు ఎల్ఓసీ వెంట భారత వైపు ఉన్న పలు సెక్టార్లపై హెలికాప్టర్లతో గస్తీ నిర్వహించారని పేర్కొన్నాయి. మనవడ్ని తలచుకుంటూ.. ఆగిన గుండె సాక్షి, ముంబై: తన మనవణ్ని పాక్ సైన్యం పట్టుకుందన్న వార్తతో జవాన్ చందు బాబూలాల్ చవాన్(22) నానమ్మ గుండెపోటుతో మరణించారు. చందు స్వస్థలం మహారాష్ట్రలోని ధుళే జిల్లా బోర్విహిర్లో తీవ్ర విషాదం అలముకుంది. చందు తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో నానమ్మ లీలాబాయి పాటిల్ అన్నీ తానై పెంచింది. అతని సోదరుడూ గుజరాత్‌లోని ‘9-మరాఠ రెజిమెంట్’ లో పనిచేస్తున్నాడు. ఇటీవల కశ్మీర్ అల్లర్లు నేపథ్యంలో సరిహద్దులో గాలిస్తూ చందు నియంత్రణ రేఖ దాటి పీవోకేలోకి వెళ్లాడు. దీంతో అతన్ని పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. విషయం గురువారం అర్థరాత్రి లీలాబాయికి తెలియగానే గుండెపోటుతో కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం కన్ను మూసింది. విషయం తెలుసుకునే గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. వీలైనంత తర్వగా విడిపిస్తాం.. రాజ్‌నాథ్: చందును సురక్షితంగా విడిపించేందుకు భారత్ ప్రభుత్వం యుద్దప్రాతిపదికన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అతను తొందరగా విడుదలయ్యేందుకు పాకిస్తాన్‌ను సంప్రదిస్తామని చెప్పారు. భారత సైనికుడు బందీగా ఉన్నాడన్న విషయాన్ని ఇప్పటికే డీజీఎంఓ పాకిస్తాన్‌ను తెలిపారు. భారత్ దాడులు ఆత్మరక్షణకే: అఫ్గాన్ న్యూఢిల్లీ/బీజింగ్: పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన దాడులను అఫ్గానిస్తాన్ సమర్థించింది. ‘ఆత్మరక్షణ కోసమే వీటిని నిర్వహించారని భారత్‌లోని అఫ్గాన్ రాయబారి అబ్దాలీ అన్నారు. ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అని పాక్‌ను హెచ్చరించారు. మరోవైపు.. ఉగ్రవాదంపై భారత వైఖరిని దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయె హే కూడా సమర్థించారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్.. పార్క్‌తో భేటీలో దాడుల గురించి వివరించారు. కళ్లెం వేయండి: రష్యా పాక్‌లోని ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఆ దేశం గట్టి చర్యలు తీసుకోవాలని రష్యా కోరింది. భారత్-పాక్ సరిహద్దు పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు ఉద్రిక్తత నివారించి, చర్చలతో వివాదాలు పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేసింది. సంయమనం పాటించాలి: చైనా భారత్, పాక్‌లు సంయమనం పాటించాలని చైనా విజ్ఞప్తి చేసింది. ‘పొరుగున ఉన్న మిత్రదేశంగా తాజా ఘర్షణపై ఆందోళన పడుతున్నాం. ఇరు పక్షాలు చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలి’ అని చైనా విదేశాంగ ప్రతినిధి జెంగ్ షూంగ్ శుక్రవారం అన్నారు. -
దేశ వ్యాప్తంగా కబాలీ సంబరాలు
-
నెత్తు'రోడ్డు'తోంది
* గతేడాది 5 లక్షల రోడ్డు ప్రమాదాలు * 1.46 లక్షల మంది మృతి * కొత్త చట్టంలో కఠిన నిబంధనలు: గడ్కారీ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో రోజూ 400 మంది మృతిచెందుతున్నారని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి గడ్కారీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల్లో ముంబై (23,468), మరణాల్లో ఢిల్లీ (1,622) తొలిస్థానాల్లో ఉన్నాయన్నారు. రోడ్డుప్రమాదాల నివేదిక -2015ను మంత్రి గురువారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా గంటకు 57 రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా... 17 మంది మరణిస్తున్నారు. మృతుల్లో 54 శాతం మంది 15-34 మధ్య వయసువారే. 2015లో మొత్తం 5 లక్షల ప్రమాదాలు సంభవించగా... 1.46 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 13 రాష్ట్రాల్లోనే 87.2 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఏపీ, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వేగ పరిమితి దాటితే డ్రైవర్లను పట్టుకునేందుకు జాతీయ రహదారులపై కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించి వాహనాలకు అదనపు వస్తువుల్ని బిగిస్తే రూ.5వేల వరకూ జరిమానా విధించేలా కొత్త జాతీయ భద్రతా బిల్లును తెస్తామన్నారు. ఆ వస్తువుల డీలర్లు, తయారీదారులపై రూ. లక్ష వరకూ జరిమానా విధిస్తామన్నారు. -
దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కలెక్టరేట్ల వద్ద బాధితులు సోమవారం నుంచి దీక్షలు ప్రారంభించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒడిశా, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ కంపెనీపై సీఐడీచే విచారణ చేపట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. -
హైదరాబాద్‌లో ఐసిస్ అలికిడి
-
దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్‌వేడుకలు
-
రోజుకు వందమంది భార్యా బాధితులు!
ఇండియాలో రేప్ కేసులకు ప్రధాన కేంద్రంగా మారిపోయిన ఢిల్లీలో ఇప్పుడు మరో కొత్త కోణం వెలుగు చూసింది. మహిళల వేధింపులకు గురవుతున్న పురుషుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని ఈ కొత్త లెక్కలు చెప్తున్నాయి. బాధల్లో ఉన్న పురుషుల సమస్యలను తెలుసుకునేందుకు సుమారు సంవత్సరం క్రితం ఏర్పాటు చేసిన ఓ హెల్ప్ లైన్ నెంబర్ కు ఇబ్బడి ముబ్బడిగా ఫిర్యాదులు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా 40 ఎన్జీవో సంస్థల ద్వారా సుమారు 37 వేల ఫిర్యాదులు అందినట్లు ఆ సంస్థ చెబుతోంది. ఫిర్యాదుల్లో కొన్ని బోగస్ అయినా... రోజుకు సుమారుగా వంద కాల్స్ వస్తున్నాయని హెల్ప్ లైన్ లెక్కల్లో తేలింది. సేవ్ ఇండియన్ ఫ్యామిలీ పేరున ఓ సంస్థ నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో చాలామంది బాధితులు తమకు చట్టబద్ధమైన పరిష్కారాలు దొరకడం లేదని చెప్పడం విశేషం. లైంగిక వేధింపులకు గురైన మగవారికి ఇండియన్ యాంటీ రేప్ చట్టం ఎటువంటి పరిష్కారం సూచించడం లేదని కౌన్సిలర్లు చెప్తున్నారు. రోజుకు దేశవ్యాప్తంగా ఫాల్స్ రేప్, ఫాల్స్ డౌరీ కేసుల్లో తమకు వస్తున్న సుమారు 110 కాల్స్ లో 65 నుంచి 70 శాతం బాధితులు కొత్తవారే అయి ఉంటున్నారని ఎస్.ఐ.ఎఫ్ కౌన్సిలర్ రిత్విక్ బిసారియా చెప్తున్నారు. తమకు వచ్చే డేటాను పరిశీలిస్తే ఎక్కువ శాతం కాల్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ నుంచి వస్తున్నాయని, వాటిలో 55 నుంచి 60 శాతం హెల్ప్ లైన్ కు వస్తున్నాయని కౌన్సిలర్లు అంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ నుంచీ వచ్చే కేసుల్లో ఎక్కువ శాతం తప్పుడు వరకట్న వేధింపుల కేసులు ఉంటున్నాయని మరో కౌన్సిలర్ అమిత్ లఖాని అంటున్నారు. అంతేకాక ఎస్.ఐ.ఎఫ్ కు వచ్చే పురుషుల కాల్స్ లో ఎక్కువ శాతం పని ప్రదేశాల్లో లైంగిక దాడులకు సంబంధించినవి కూడా అయి ఉంటున్నాయని కౌన్సిలర్లు అంటున్నారు. ''ఒక వ్యక్తి నుంచీ మాకు కాల్ వచ్చింది. అతడి భార్య.. అతడు పని చేస్తున్న సంస్థకు ఫోన్ చేసి... అతడిపై వేధింపుల కేస్ ఫైల్ చేసినట్లు చెప్పిందట. దాంతో సంస్థవారు అతడ్ని ఎటువంటి వివరాలు అడక్కుండానే రిజైన్ చేయమన్నారు'' అంటూ ఎస్.ఐ.ఎఫ్ కౌన్సిలర్ లఖాని తెలిపారు. ఢిల్లీలో న్యాయవాదిగా ఉన్న కులదీప్ బొబ్బర్ కూడా... సెక్షన్ 49-ఏ ను దుర్వినియోగం చేస్తున్న భార్యా బాధితుల కోసం ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. సుమారు పది సంవత్సరాలుగా కనీసం నెలకు 50 నుంచి 60 కాల్స్ బాధితులనుంచి వస్తుంటాయని ఆయన చెప్పారు. ''ఇంటినుంచీ గెంటివేయబడ్డ ఓ వ్యక్తి నుంచీ నాకు కాల్ వచ్చింది. ఇంటిని తన పేరున మార్చుకున్న భార్య అతడిని ఇంటినుంచీ గెంటి వేసిందట. కనీసం తన పిల్లలను కూడా చూసేందుకు ఆమె...భర్తను రానివ్వడం లేదట. అంతేకాదు అతడిపై 25 వేధింపుల కేసులు కూడా బుక్ చేసిందట'' అంటూ న్యాయవాది కులదీప్ బొబ్బర్ ఓ బాధితుడి కేసును ఉదహరించారు. ఇటువంటి కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయని.. ఇప్పటికైనా పురుషులపై వేధింపుల విషయంలోనూ కళ్ళు తెరవాలని ఆయన సూచిస్తున్నారు. అలాగే ఢిల్లీకి చెందిన మరో బాధిత మహిళల హెల్స్ లైన్ కు కూడా భార్యా బాధితులు కొందరు ఫోన్లు చేస్తున్నారని చెప్తోంది. సాధారణంగా అటువంటి కాల్స్ ...ఫాల్స్ డౌరీ కేసులై ఉంటున్నాయని వాటిని మరో హెల్స్ లైన్ కు పంపిస్తున్నామని వారు చెప్తున్నారు. జర్నలిస్ట్, ఫిలిమ్ మేకర్ అయిన దీపికా భరద్వాజ్... సెక్షన్ 49-ఏ ను దుర్వినియోగం చేస్తున్న వారిపై ఓ డాక్యుమెంటరీ కూడా తీస్తున్నారట. ఎటు చూసినా మానవ సంబంధాలు కరువైపోతున్న నేటి తరుణంలో బాధిత మహిళలకు న్యాయంపై ఎన్నో చట్టాలు ఉన్నాయని,... జీవిత భాగస్వాములైన మహిళలు, సహోద్యోగినుల వల్ల వేధింపులకు గురౌతున్న మగవారికి మాత్రం కనీస న్యాయం జరగడం లేదంటున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలంటూ బాధితులు ఎంతోమంది కాల్స్ చేస్తుంటారని, మహిళలవల్ల వేధింపులకు గురై.. న్యాయం దొరకక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నవారి శాతం నానాటికి పెరుగుతోందని ఆమె చెప్తున్నారు. అందుకే బాధిత పురుషులకు హెల్ప్ లైన్లు ఎంతో అవసరమని దీపిక తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
నేటి నుంచి దేశవ్యాప్తంగా లారీల సమ్మె
-
స్తంభించిన భారత్
దేశవ్యాప్తంగా సమ్మె కట్టిన కార్మికులు.. ఆగిన జనజీవనం కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా 10 కేంద్ర కార్మిక సంఘాల పిలుపు * 15 కోట్ల మంది కార్మికుల సమ్మె.. స్తంభించిన రవాణా.. పోస్టల్, బీఎస్ఎన్ఎల్ సేవలపై ప్రభావం * సగానికి తగ్గిన బొగ్గు ఉత్పత్తి.. సార్వత్రిక సమ్మెకు అనూహ్య స్పందన: కార్మిక సంఘాల హర్షం * దేశంలో సమ్మె ప్రభావం స్వల్పమే: కేంద్ర ప్రభుత్వం ప్రకటన న్యూఢిల్లీ: కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన దేశవ్యాప్త సమ్మె.. వివిధ ప్రాంతాల్లో ప్రజా జీవనంపై ప్రభావం చూపింది. బొగ్గు ఉత్పత్తి, బ్యాంకు లావాదేవీలు, రవాణా సేవలు దాదాపుగా స్తంభించిపోయాయి. సమ్మె సందర్భంగా పశ్చిమబెంగాల్లో ముర్షీదాబాద్ జిల్లా సహా పలు చోట్ల అధికార తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, వామపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తటంతో దాదాపు వేయి మందిని అరెస్ట్ చేశారు. కార్మిక చట్టాల్లో మార్పులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణలను వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన ఈ సమ్మె పిలుపుతో పదిహేను కోట్ల మందికి పైగా సంఘటిత రంగ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు. కేంద్రంలో అధికార బీజేపీ అనుబంధ కార్మిక సంస్థలయిన బీఎంఎస్, ఎన్ఎఫ్ఐటీయూలు సమ్మెకు దూరంగా ఉన్నాయి. సమ్మె ప్రభావం పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఒడిశా తదితర ప్రాంతాల్లో అధికంగా కనిపించగా.. ఢిల్లీ, పంజాబ్, హరియాణా, తమిళనాడు, గోవా, గుజరాత్, బిహార్, జార్ఖండ్‌లలో పాక్షికంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, రాజస్థాన్‌లలో సాధారణ ప్రజాజీవనంపై సమ్మె ప్రభావం చూపించింది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో మాత్రం.. బ్యాంకుల కార్యకలాపాల్లో మినహా పెద్దగా ప్రభావం లేదు. అయితే ముంబై పోర్టు ట్రస్టులో కార్యకలాపాలూ పూర్తిగా స్తంభించాయి. ప్రభుత్వ నిర్వహణలోని కోల్ ఇండియా సంస్థ రోజు వారీ 17 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా.. బుధవారం సమ్మె కారణంగా అది సగానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా గల 4 లక్షల మంది బొగ్గు కార్మికుల్లో అధికభాగం సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణలోని సింగరేణి కాలరీస్‌లో సమ్మె సంపూర్ణమైంది. ఎన్ఎండీసీ పైనా సమ్మె ప్రభావం చూపింది. దాదాపు 4,200 మంది కార్మికులు సమ్మె చేయటంతో ఇనుప ఖనిజం ఉత్పత్తి 75,000 టన్నులు పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి, ఇతర సేవలు అధికశాతం సాధారణంగానే కొనసాగాయి. ప్రజల భ్రమలు తొలగిపోయాయి: ట్రేడ్ యూనియన్లు సమ్మె పిలుపుకు అనూహ్య స్పందన లభించిందని.. లక్షలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని పది ట్రేడ్ యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. హరియాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లతో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు నిలిచిపోయాయని.. రక్షణ ఉత్పత్తి రంగంలోనూ 5 లక్షల మంది సమ్మెలో పాల్గొన్నారని పేర్కొన్నాయి. పోస్టల్ సేవలు, బీఎస్ఎన్ఎల్ టెలికాం కార్యకలాపాలపైనా సమ్మె ప్రభావం చూపిందని తెలిపాయి. ‘‘ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల పట్ల, ఆహార ధరలను నియంత్రించటంలో వైఫల్యం పట్ల, ఆర్థిక మందగమనాన్ని నిరోధించటంలో వైఫల్యం పట్ల ప్రజలు ఎంతగా భ్రమలు కోల్పోయి ఉన్నారో ఈ సమ్మె చూపుతోంది. కొన్ని ప్రాంతాల్లో బీఎంఎస్ వాళ్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు’’ అని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి గురుదాస్‌దాస్‌గుప్తా పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లో సమ్మెను విఫలం చేయటానికి మమతా బెనర్జీ ప్రభుతవ అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని వామపక్షాలు మండిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మెకు పిలుపునివ్వగా.. కేంద్రంలోని అధికార బీజేపీకి తనను విలువైన మిత్రపక్షంగా చూపుకునేందుకు సీఎం మమత ఈ సమ్మెను వ్యతిరేకించారని విమర్శించాయి. ఆశ్రీత పెట్టుబడుదారుల కోసమే మోదీ సర్కారు: కాంగ్రెస్ సమ్మెకు ప్రతిపక్ష కాంగ్రెస్ సంఘీభావం తెలిపింది. కార్మికుల ఆందోళన పట్ల ప్రభుత్వం సానుభూతిగా లేదని విమర్శించింది. ‘‘దేశంలోని లక్షలాది మంది కార్మికులను పణంగా పెట్టి ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రయోజనం కలిగించాలనుకున్న బ్రిటిష్ వాళ్ల తరహాలోనే.. ప్రభుత్వానికి మిత్రులుగా ఉన్న ఐదారుగురు ఆశ్రీత వ్యాపారులకు ప్రయోజనం కలిగించాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్సింఘ్వీ విలేకరులతో వ్యాఖ్యానించారు. సమ్మె ప్రభావం స్వల్పమే: కేంద్రం కార్మిక సంఘాల సమ్మె ప్రభావం దేశంలోని చాలా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కార్మిక సంఘాలు చేస్తున్న 12 డిమాండ్లలో 9 డిమాండ్ల విషయంలో వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు సిద్ధమంటూ సంకేతాలిచ్చింది. మొత్తం 12 కేంద్ర కార్మిక సంఘాల్లో రెండు సంఘాలు సమ్మెలో పాల్గొనలేదని, మూడు సంఘాలు తటస్థంగా ఉన్నాయని.. కేవలం ఏడు సంఘాలు మాత్రమే సమ్మెకు వెళ్లాయని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనినిబట్టి.. కార్మికులు తమ డిమాండ్లను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగినన్ని బొగ్గు నిల్వలు ఉన్నందున.. సమ్మె ప్రభావం పెద్దగా ఉండబోదని బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియూష్గోయల్ పేర్కొన్నారు. మొత్తంగా సమ్మె వల్ల కీలకమైన ప్రభావం ఏమీ లేదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ వ్యాఖ్యానించారు. కార్మికులు, దేశ ప్రయోజనాల రీత్యా ఆందోళనను విరమించాలని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారుదత్తాత్రేయ మంగళవారం కార్మిక సంఘాలకు విజ్ఞప్తిచేశారు. ఆయన, కార్మికశాఖ కార్యదర్శి శంకర్ అగర్వాల్‌తో కలిసి టర్కీలో జీ-20 సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం బయల్దేరి వెళ్లారు. బెంగాల్లో ఘర్షణలు.. వేయి మంది అరెస్ట్ కోల్‌కతా: కార్మికుల సార్వత్రిక సమ్మె నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ - వామపక్షాల కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ప్రధానంగా ముర్షీదాబాద్ జిల్లాలోని బెర్హాంపూర్, దోమ్కాల్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల నుంచి చిన్నపాటి ఘర్షణల వార్తలు వచ్చాయి. ముర్షీదాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాళ్లు విసురుకోవటం, స్వల్ప తీవ్రత గల బాంబులు విసురుకోవటం వంటి ఘటనలూ జరిగినట్లు పోలీసులు తెలిపారు. తమ పార్టీ ప్రదర్శనపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేయటంతో పార్టీ మాజీ ఎంపీ మొయినుల్హసన్తో పాటు 15 మంది గాయపడ్డారని సీపీఎం పేర్కొంది. అయితే.. తృణమూల్ జిల్లా అధ్యక్షుడు మనన్నన్ హొసైన్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. సీపీఎం కార్యకర్తలే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని.. ఇందులో తన కారు కూడా ధ్వంసమైందని ప్రత్యారోపణ చేశారు. ఘర్షణలకు సంబంధించి మొత్తంగా కోల్‌కతా నగరంలో 50 మందిని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 974 మందిని అరెస్ట్ చేసినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ముర్షీదాబాద్ ఘటనలో.. ఎర్రజెండాలు పట్టుకున్న వాళ్లు తృణమూల్ కార్యకర్తలను కొడుతున్నట్లు కనిపించిందని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తృణమూల్ కార్యకర్తలు హింసకు దిగాల్సిన అవసరమేముందని ఆమె వ్యాఖ్యానించారు. అయితే.. సార్వత్రిక సమ్మెను విఫలం చేయటానికి తృణమూల్ సర్కారు పశుబలం ఉపయోగిస్తోందని రాష్ట్ర లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్‌బోస్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు తనను మిత్రపక్షంగా చూపుకునేందుకు మమత ఈ సమ్మెను వ్యతిరేకిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్మిక సంఘాల డిమాండ్లివీ.. * ధరల పెరుగుదలను నియంత్రించేందుకు అత్యవసర చర్యలు చేపట్టడం. * నిరుద్యోగితను నియంత్రించడం * కార్మిక చట్టాలను నిక్కచ్చిగా అమలు చేయడం * వీటిని ఏకపక్షంగా సవరించకుండా ఉండడం * కార్మికులందరికీ సార్వత్రిక సామాజిక భద్రత * నెలకు రూ. 15 వేలు కనీస వేతనం ఇవ్వడం * పెన్షన్ల పెంపుదల * పీఎస్‌యూల్లో పెట్టుబడుల వాపసును నిలిపివేయడం * కాంట్రాక్టు వ్యవస్థకు స్వస్తి పలకడం * భవిష్యనిధి, బోనస్‌లపై పరిమితి తొలగించడం * కార్మిక సంఘాలు 45 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవటం తప్పనిసరి చేయడం * రైల్వేలు, రక్షణ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నిలిపివేయడం కార్మిక సంఘాలు తమ 12 డిమాండ్ల పత్రంపై గత నెలలో మంత్రివర్గ కమిటీతో జరిపిన చర్చలు విఫలమవటంతో బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
నేడు దేశవ్యాప్త సమ్మె
10 కార్మిక సంఘాల పిలుపు మౌలిక సేవలపై ప్రభావం న్యూఢిల్లీ: కార్మిక చట్టాల్లో మార్పులను వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో నిత్యావసరాలతో పాటు రవాణా, బ్యాంకింగ్ తదితరాలపై ప్రభావం పడనుంది. 10 సంఘాలు సమ్మెలో పాల్గొంటుండగా, బీజేపీ అనుబంధసంస్థ బీఎంఎస్(భారతీయ మజ్దూర్ సంఘ్), నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సమ్మెలో పాల్గొనొద్దని నిర్ణయించాయి. బ్యాంకులు, బీమా కంపెనీలు తదితర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 10 సంఘాలకు ఉమ్మడిగా 15 కోట్ల మంది సభ్యులున్నారని, రవాణా, విద్యుత్, గ్యాస్, తదితరాల సరఫరాలో అంతరాయం కలగనుందని సంఘాల నేతలు తెలిపారు. అయితే, విద్యుత్, గ్యాస్ వంటి ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు సమ్మెలో లేనందున వీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని బీఎంఎస్ పేర్కొంది. 12 డిమాండ్లు..: కార్మిక చట్టాల్లో చేసిన సవరణలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవద్దనే తదితర 12 డిమాండ్లతో కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. డిమాండ్లపై ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఎలాంటి పరిష్కారం దొరకకపోవడంతో ఈనెల 2న సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు నిర్ణయించడం తెలిసిందే. కార్మిక సంఘాల తరఫున ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కార్యదర్శి డీఎల్ సచ్దేవ్ మాట్లాడుతూ.. 'ప్రభుత్వ గుర్తింపు పొందిన 10 సంఘాలు బుధవారం సమ్మె చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో బీఎంఎస్ శాఖలు కూడా సమ్మెలో పాల్గొంటాయి' అని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు మరికొంత సమయం ఇచ్చేందుకే సమ్మె నుంచి వైదొలగినట్లు బీఎంసీ, నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ తెలిపాయి. రోడ్డు రవాణా, భద్రత బిల్లును వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల రవాణా సంస్థలతోపాటు బొగ్గు కార్మికులూ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. వీరితోపాటు రిక్షా కార్మికులు, కూలీలు తదితర అసంఘటిత కార్మికులు సమ్మెలో పాలుపంచుకుంటారని ఏఐటీయూసీ నేత గురుదాస్ దాస్‌గుప్తా చెప్పారు. కాగా, దేశ ప్రజల, కార్మికుల ప్రయోజనాల కోసం సమ్మెను విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. సమ్మె నుంచి బీఎంఎస్, నేషనల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్యూనియన్స్ వైదొలగాయని, మరో 2-4 సంఘాలు తటస్థంగా ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. మౌలిక అవసరాలపై సమ్మె ప్రభావం చూపబోదన్నారు. -
కూతురుని పొగిడేస్తున్న రజనీకాంత్