దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని కలెక్టరేట్ల వద్ద బాధితులు సోమవారం నుంచి దీక్షలు ప్రారంభించారు.
అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒడిశా, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ కంపెనీపై సీఐడీచే విచారణ చేపట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.