మంత్రి దేవినేనిని ఘెరావ్ చేసిన గ్రామస్తులు | villagers protest During the minister devineni visit | Sakshi
Sakshi News home page

మంత్రి దేవినేనిని ఘెరావ్ చేసిన గ్రామస్తులు

Published Sat, Jul 23 2016 7:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

మంత్రి దేవినేనిని ఘెరావ్ చేసిన గ్రామస్తులు

మంత్రి దేవినేనిని ఘెరావ్ చేసిన గ్రామస్తులు

అవనిగడ్డ(కృష్ణా): కృష్ణా జిల్లా కోడూరు మండలంలో పర్యటించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గ్రామస్తుల నిరసనను ఎదుర్కొన్నారు. పాలకాయతిప్ప గ్రామంలో పర్యటించేందుకు శనివారం సాయంత్రం మంత్రి రాగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

తమ ప్రాంతంలో 13 మీటర్ల రోడ్డు కోసం ఆక్రమణలను తొలగించిన అధికారులు.. కోడూరు సెంటర్‌లో 7 మీటర్ల రోడ్డు వెడల్పు కోసం ఆక్రమణలను వదిలేశారని తెలిపారు. ఈ విషయమై ఉప సభాపతి బుద్ధప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మంత్రిని వారు కోరారు. మంత్రి హామీ మేరకు వారు ఆందోళన విరమించటంతో పర్యటన కొనసాగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement