DEVINENI
-
చంద్రబాబు,లోకేష్ నమ్మించి మోసం చేశారు టీడీపీ మహిళా నేత దేవినేని స్మిత ఆవేదన
-
బ్లాక్ మెయిల్ చేసేవారికే TDP టికెట్లా..?
-
‘బ్లాక్మెయిల్ చేసేవారికే TDP టికెట్లా?’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విపక్ష కూటమిలో టికెట్ల పంచాయితీ కొలిక్కి రావడం లేదు. పొత్తులో భాగంగా ఓ పార్టీకి టికెట్ వెళ్లడంతో మిగిలిన పార్టీల్లోని ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో బహిరంగంగా ఆందోళనకు, విమర్శలకు దిగుతున్నారు. తాజాగా పెనమలూరు టీడీపీలో ముసలం రాజుకుంది. బొడే ప్రసాద్‌కు పెనమలూరు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు(వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడే ప్రసాద్‌కు టికెట్ కేటాయించడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ.. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు,లోకేష్ తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని స్మిత ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో తమ తండ్రి ఓటమికి పార్టీనే కారణమని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే తన తండ్రికి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. తండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారన్నారు. మామగారు చనిపోయిన బాధలో ఉన్నా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అయినా 2014, 2019 లోనూ టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. చదవండి: చంద్రన్న దెబ్బ! చౌదరిగారికి పరాభవం ఈసారి టికెట్ ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారని.. చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేసినట్లు తెలిపారు. బోడే ప్రసాద్‌కే ఏవిధంగా సీటిస్తారని ప్రశ్నించారు. గ్రౌండ్ వర్క్ చేసుకునేది తామైతే.. టిక్కెట్లు లాబీయిస్టులకిస్తారా అని మండిపడ్డారు. ఈసారి తమకు టికెట్ ఇవ్వాలని రెండేళ్లుగా అడుగుతున్నామని.. మా నాన్నను గెలిపించుకుంటామని బాబుని కోరినట్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్ అనేక మార్లు టిక్కెట్ కోసం అడిగామన్నారు. ‘టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారో కనీసం పిలిచి కూడా చంద్రబాబు మాకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాం. లోకేష్‌కు వాట్సాప్‌లలో మెసేజ్‌లు పెట్టాం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మా మెసెజ్‌లకు సమాధానం ఇవ్వం లేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ మేం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశాం. టికెట్ లేదంటే బోడే ఏడ్చాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. మేం బోడేలా చేయలేదు కదా. మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా? బోడే ప్రసాద్ లాగా బ్లాక్ మెయిల్ చేసే వారికే చంద్రబాబు టికెట్లు ఇస్తారా? నా వెనుక ఎవరూ లేరనేగా ఆడిపిల్లనైన నన్ను ఏడిపిస్తున్నారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది. మేం చేసిన తప్పేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలి. విలువలేని పార్టీకోసం మేం ఎందుకు పనిచేయాలి?. చంద్రబాబు సతీమణిలాగే మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం’ అని దేవినేని స్మీత తెలిపారు. -
చంద్రబాబుకు దేవినేని అవినాష్ కౌంటర్
-
ఎవర్నీ తక్కువ చేసి చూపించలేదు
నందమూరి తారకరత్న హీరోగా నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్ లైన్. వంగవీటి రాధా పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, కేఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘తెరవెనుక కష్టాలున్న ప్రాజెక్ట్స్‌లో క్వాలిటీగా చేసిన సినిమాల్నీ హిట్ అయ్యాయి. అలాంటి కోవలో వస్తున్న ‘దేవినేని’ కూడా విజయం సాధించాలి. ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్‌తో సినిమా చేయడం చాలా కష్టం. ఈ సినిమాతో ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చి, నిర్మాతలకు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. శివనాగేశ్వర రావు మాట్లాడుతూ–‘‘నేను తీసిన ఈ ‘దేవినేని’ బయోపిక్ కాదు. దేవినేని, వంగవీటి గార్ల మీద అభిమానంతోనే ఈ సినిమా తీశా. ఈ రెండు కుటుంబాల్లో ఎవర్నీ తక్కువగా చూపించలేదు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా కేసులు వేశారు. చిన్న నిర్మాతలైనా ఈ సినిమాను ఎంతో కష్టపడి నిర్మించారు. దయచేసి ఈ గొడవలను ఆపి, పాజిటివ్‌గా ఆలోచించి సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం రియలిస్టిక్‌గా ఉంటుంది’’ అన్నారు నిర్మాత రాము. ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. చదవండి: శృతి ప్రియుడికి థాంక్స్ చెప్పిన కమల్! ఫొటోగ్రాఫర్‌కు బాలీవుడ్ హీరో హెచ్చరిక! -
దేవినేని: నిజాలు చూపించాం
నందమూరి తారకరత్న టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్‌లైన్. శివనాగు దర్శకత్వంలో జిఎస్ఆర్, రాము రాథోడ్ సంయుక్తంగా నిర్మించారు. రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ‘మా’ అసోసియేషన్ కార్యదర్శి జీవితా రాజశేఖర్ విడుదల చేయగా, ఫస్ట్ లుక్‌ను నిర్మాత దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తారకరత్న అద్భుతమైన నటుడు. ఈ చిత్రంతో అతనికి పెద్ద బ్రేక్ రావాలని కోరుకుంటున్నామన్నారు. దర్శకుడు శివనాగు మాట్లాడుతూ.. ‘గతంలో బెజవాడను బేస్ చేసుకుని కొన్ని సినిమాలు వచ్చినా వాటికి పోలిక లేకుండా ఈ చిత్రాన్ని తీశాం. ఇంతవరకూ ఎవరూ చూపించని నిజాలను ఇందులో చూపించాం. వంగవీటి రంగాని ఎవరు చంపారు అనేది ఈ చిత్రంలో చూపించాం’ అన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి రంగ పాత్రలో నటించిన సురేశ్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో నటించిన నిర్మాత టి. ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. pic.twitter.com/hLIXtGw72G — Nandamuri TarakaRathna (@NTarakarathna) January 10, 2021 -
త్వరలో ‘దేవినేని’ మోషన్ పోస్టర్ విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'దేవినేని'.. 'బెజవాడ సింహం' ఉపశీర్షిక. జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌లు ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైనందున డీటీఎస్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.... ఈ చిత్రంలో నటించిన నటీనటులు అంతా చాలా బాగా నటించారన్నారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ ఆకట్టుకున్నారన్నారు. ఇక దేవినేని నెహ్రూ పాత్రలో నందమూరి తారకరత్న పరకాయ ప్రవేశం చేసినట్లు నటించాడని పేర్కొన్నాడు. (చదవండి: అందుకే నటించేందుకు ఒప్పుకున్నా) సురేష్ కొండేటి-వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడని, అలాగే సురేంద్ర పాత్రలో ఏంఎన్ఆర్ చౌదరి నటిస్తున్నారని చెప్పారు. దేవినేని మురళిగా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగిలిన పలు పాత్రల్లో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నట్లు దర్శకుడు తెలిపాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైందని, నేడు డిటీఎస్ కార్యక్రమం జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఈ చిత్రంలో మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ఎస్ వ్యాస్ గారి పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారని తెలిపారు. అయితే దేవినేని సినిమా బెజవాడలో ఇద్దరు మహనాయకుల నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఆ నాయకుల మధ్య స్నేహం, వైరంలో పాటు కుటుంబ నేపథ్యంలో సాగే సెంటిమెంట్‌ను కూడా దర్శకుడు జోడించాడు. ఇక బెజవాడలోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. అలాగే 1983లో విజయవాడకు మొదటి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌గా వెళ్లిన కేఎస్ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకు సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: నర్రా శివ నాగు, నిర్మాతలు: జి.ఎస్.ఆర్, రాము రాథోడ్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: కోటి, కో.డైరెక్టర్: శివుడు వ్యవహరిస్తున్నారు. -
అందుకే నటించేందుకు ఒప్పుకున్నా
కోటి.. పరిచయం అక్కర్లేని సంగీత దర్శకుడు. ఇప్పటి వరకూ తన చేతులతో స్వరాలు సమకూర్చిన ఆయన తొలిసారి లాఠీ పట్టి పోలీస్ పవర్ ఏంటో చూపిస్తానంటున్నారు. దేవినేని నెహ్రూగా తారకరత్న నటిస్తున్న ‘దేవినేని’ సినిమాలో కోటి పవర్ ఫుల్ ఎస్పీ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. వంగవీటి రాధ పాత్రలో బెనర్జీ, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్ నటిస్తున్నారు. 1983 విజయవాడ తొలి పవర్ఫుల్ ఎస్పీ కెఎస్ వ్యాస్‌గారి పాత్రను కోటి పోషిస్తున్నారు. ఆయన పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. కోటి మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లో ఇది సెకండ్ ఫేజ్. సంగీత దర్శకుడిగా 20 సంవత్సరాలు రాణించాను. శివనాగు వచ్చి ఎస్పీ పాత్ర చేయాలి అనగానే, ‘మా నాన్నగారు నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలి’ అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983తో రాజ్ కోటిగా నా కెరీర్ స్టార్ట్ అయింది. కెఎస్ వ్యాస్‌గారి పాత్ర చేయడం అరుదైన సంఘటన. నా పాత్రని అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. నర్రా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరి పేట హైవేలో భారీగా చిత్రకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. . ‘‘1977లో దేవినేని నెహ్రూ స్టూడెంట్ లైఫ్ నుంచి మా సినిమా ప్రారంభం అవుతుంది. ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల షూటింగ్ జరుపుతున్నాం’’ అన్నారు రాము రాథోడ్. -
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సంగీత దర్శకుడు కోటి
ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. అందులో భాగంగా దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’. ఈ సినిమాలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్ లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బెజవాడలో ఇద్దరు నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘దేవినేని’లో బెజవాడ లోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ఎస్ వ్యాస్ గారి పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా.. దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రంలో చేసిన అందరు నటీనటులు చాలా బాగా నటించారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, నందమూరి తారక రత్న నిజమైన దేవినేని నెహ్రూలో పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడు. అలాగే సురేంద్ర పాత్రలో ఏం ఎన్ ఆర్ చౌదరి నటిస్తున్నారు. దేవినేని మురళి గా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగతా పాత్రలో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరీపేట హైవే లో భారీగా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ... ‘నా కెరీర్లో ఇది సెకండ్ పేజ్. సంగీత దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు రాణించాను. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మీ ముందుకు రాబోతున్నాను. శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నాకు చిన్నప్పుడు మా నాన్న గారు నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలి అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983తో రాజ్ కోటిగా నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ టైములో కె ఎస్ వ్యాస్ గారు విజయవాడ కి ఫస్ట్ పవర్ఫుల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ నేను చేయడం అనేది రేర్ ఇన్సిడెంట్. శివనాగు గారు వండర్ ఫుల్ డైరెక్టర్ . ఈ క్యారెక్టర్ని మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. -
రత్నకుమారి వచ్చేశారు
80లలో బెజవాడలో సంచలనాలకు కేరాఫ్ అయిన దేవినేని, వంగవీటి రంగాల కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం). శివనాగు దర్శకత్వంలో రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న, రంగా పాత్రలో ‘సంతోషం’ ఎడిటర్ సురేశ్ కొండేటి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రంగా సతీమణి రత్నకుమారిగా తమిళ నటి ధృవతార కనిపించనున్నారు. రంగాతో కలిసి ఉన్న ఆమె లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ‘‘ఇప్పటికే విడుదలైన వంగవీటి లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ధృవతార హావభావాలు చక్కగా పలికిస్తోంది. మరో రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
30 ఏళ్ల తర్వాత నటిస్తున్నా
నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అన్నది ఉపశీర్షిక. దేవినేని నెహ్రూ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తారకరత్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సీనియర్ నటి జమున కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి.కళ్యాణ్ క్లాప్ ఇచ్చారు. సీనియర్ పాత్రికేయులు వినాయకరావు ఫస్ట్ షాట్‌కి దర్శకత్వం వహించారు. జమున మాట్లాడుతూ– ‘‘నేను సినిమారంగం నుంచి తప్పుకుని 30 ఏళ్లు అయింది. రిటైర్ అయిన నన్ను మళ్లీ కెమెరా ముందు నిలబెట్టి సినిమా రంగులు వేసి నటించేలా చేశారు శివనాగు. ఇది కాకుండా అన్నపూర్ణమ్మగారి సినిమాలో నేను ఒక రాణి పాత్ర చేస్తున్నాను’’ అన్నారు. శివనాగు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయాలనుకునే ముందు విజయవాడ మొత్తం తిరిగి వివరాలు తెలుసుకున్నాను. 1977లోని కథ ఇది. మే 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేసి, దసరాకి సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులైన వ్యక్తి, పెదనాన్నలాంటివారు నెహ్రూగారు. ఆయన పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు తారకరత్న. ‘‘దేవినేని చిత్రాన్ని నిర్మిస్తుండటం నా అదృష్టం’’ అన్నారు రాము రాథోడ్. -
డిస్ట్రిబ్యూటరీ పనులు తక్షణం చేపట్టాలి
అనంతపురం అర్బన్ : హంద్రీ-నీవా ద్వారా నిర్ధేశిత 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ పనులు వెంటనే చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, ఇతర నాయకులు విన్నవించారు. మంగళవారం జిల్లాకు విచ్చేసిన మంత్రిని స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు. హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తి ప్రభుత్వం మూడు నెలలు గడువు విధించిందని, పనులు ఇలా సాగితే ఆరునెలలైనా పూర్తి కావన్నారు. పనులు జాప్యంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల తరహాలో పనులు చేపట్టి వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో సీపీఐ నాయకులు సి.జాఫర్, శ్రీరాములు, కేశవరెడ్డి, తదితరులు ఉన్నారు. -
నెలాఖరుకు పోలవరం స్పిల్‌వే నిర్మాణ పనులు
ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణానికి కాంక్రీట్ వేసే పనులను ఈనెలాఖరుకు ప్రారంభిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.ఆదివారం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అజయకుమార్, జియాలజిస్ట్ జి.జె.ఎస్.ప్రసాద్, పోలవరం అథారిటీ సలహాదారులు ఆర్.కె.గుప్తా, డి.పి.బార్గవ్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి స్పిల్‌వే ప్రాంతంలో పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంక్రీట్ పనులు ప్రారంభిచేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. స్పిల్‌వే గేట్లను పోలవరం నిర్మాణ ప్రాంతంలో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెటీరియల్‌ను తరలిస్తున్నామన్నారు. గేట్ల తయారీకి అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపామన్నారు. సోమవారం వర్చువల్ తనిఖీలో భాగంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పోలవరం çపనులపై సమీక్షిస్తారని తెలిపారు. వాస్తవానికి ఈనెల 19న ముఖ్యమంత్రి స్పిల్‌వే కాంక్రీట్ çపనులను ప్రారంభించాల్సి ఉంది. పనులు పూర్తికాకపోవడంతో దీనిని ఈనెలాఖరునాటికి వాయిదా వేశారు. పనుల పరిశీలనలో ప్రాజెక్టు ఎస్ఈ వి.ఎస్.రమేష్‌బాబు, గేట్ల మెకానికల్ డైరెక్టర్ కె.కన్నమనాయుడు, ఈఈలు ఎన్,పుల్లారావు, ఎన్.చంద్రరావు ఉన్నారు. షేర్జోన్ రాయి బలోపేతం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేకు కాంక్రీట్ వేసే ప్రాంతంలో షేర్జోన్ అనే రాయి ఉందని, ఇది బలహీనంగా ఉందని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. 2.5 మీటర్ల పరిధిలో ఈ రాయి ఉందని, దీనిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. లూజ్ సాయిల్‌ను తొలగించి, ప్రత్యేక కాంక్రీట్ వేశాక ముందుకు వెళ్తామన్నారు. కాంక్రీట్ పనులకు జియాలజికల్ సర్వే ఆప్ ఇండియా అనుమతి రావాల్సి ఉందన్నారు. -
నెలాఖరుకు పోలవరం స్పిల్‌వే నిర్మాణ పనులు
ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణానికి కాంక్రీట్ వేసే పనులను ఈనెలాఖరుకు ప్రారంభిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.ఆదివారం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అజయకుమార్, జియాలజిస్ట్ జి.జె.ఎస్.ప్రసాద్, పోలవరం అథారిటీ సలహాదారులు ఆర్.కె.గుప్తా, డి.పి.బార్గవ్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి స్పిల్‌వే ప్రాంతంలో పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంక్రీట్ పనులు ప్రారంభిచేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. స్పిల్‌వే గేట్లను పోలవరం నిర్మాణ ప్రాంతంలో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెటీరియల్‌ను తరలిస్తున్నామన్నారు. గేట్ల తయారీకి అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపామన్నారు. సోమవారం వర్చువల్ తనిఖీలో భాగంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పోలవరం çపనులపై సమీక్షిస్తారని తెలిపారు. వాస్తవానికి ఈనెల 19న ముఖ్యమంత్రి స్పిల్‌వే కాంక్రీట్ çపనులను ప్రారంభించాల్సి ఉంది. పనులు పూర్తికాకపోవడంతో దీనిని ఈనెలాఖరునాటికి వాయిదా వేశారు. పనుల పరిశీలనలో ప్రాజెక్టు ఎస్ఈ వి.ఎస్.రమేష్‌బాబు, గేట్ల మెకానికల్ డైరెక్టర్ కె.కన్నమనాయుడు, ఈఈలు ఎన్,పుల్లారావు, ఎన్.చంద్రరావు ఉన్నారు. షేర్జోన్ రాయి బలోపేతం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేకు కాంక్రీట్ వేసే ప్రాంతంలో షేర్జోన్ అనే రాయి ఉందని, ఇది బలహీనంగా ఉందని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. 2.5 మీటర్ల పరిధిలో ఈ రాయి ఉందని, దీనిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. లూజ్ సాయిల్‌ను తొలగించి, ప్రత్యేక కాంక్రీట్ వేశాక ముందుకు వెళ్తామన్నారు. కాంక్రీట్ పనులకు జియాలజికల్ సర్వే ఆప్ ఇండియా అనుమతి రావాల్సి ఉందన్నారు. -
ఇసుక తవ్వకాల నిలిపివేత
‘సాక్షి’ కథనంతో కదిలిన అధికారులు చోడవరం ఇసుక క్వారీ వద్ద హైడ్రామా బోడె ప్రసాద్, నెహ్రూ వర్గాల మధ్య ముదిరిన వివాదం పెనమలూరు : మండలంలోని చోడవరం ఇసుక క్వారీలో తవ్వకాలను అధికారులు ఎట్టకేలకు నిలిపివేశారు. ఇసుక క్వారీలో శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా చోడవరం ఇసుక క్వారీలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అనుచరులు పొక్లెయిన్లతో ఇసుక దందాకు పాల్పడుతున్నారని సాక్షిలో ‘ఇసుక దందా మళ్లీ మొదలైంది’ కథనం రావటంతో అధికారులు ఎట్టకేలకు స్పందించారు. క్వారీలో ఉన్న ఇద్దరు నేతల అనుచరులకు గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ప్రకారం నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదని మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రమణ్యేశ్వరరావు ఆదేశించారు.lఇరువురు నేతల మధ్య ఆధిపత్యపోరు కారణంగా ఇసుక క్వారీ వద్ద నదిలో పొక్లయిన్ తొలగించే విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. చివరకు అధికారుల జోక్యంతో ఇసుక తవ్వకాలు నిలిపివేయించారు. ఏమి జరిగిందంటే... చోడవరం ఇసుక క్వారీపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ మంత్రి దేవినేని నెహ్రూకు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇద్దరు నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు భారీ యంత్రాలతో చేపట్టారు. వీరి పోరుతో శాంతిభద్రతల సమస్యతోపాటు, కరకట్టపై భారీగా ఇసుక లారీలు నిలుపుదల చేయటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఇక్కడి పరిస్థితిపై సాక్షిలో కథనం రావటంతో అధికారులు స్పందించారు. గ్రీన్ ట్రిబ్యూనల్ తీర్పు ప్రకారం ఇసుక తవ్వకాలు యంత్రాలతో చేయరాదని మైన్స్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఎమ్మెల్యే అనుచరులు తవ్వుతున్న క్వారీలో తవ్వకాలను వీఆర్వో లావణ్య ఆపించారు. ఆతరువాత నెహ్రూ అనుచరుల వద్దకు వచ్చి తవ్వకాలు ఆపాలన్నారు. దీనికి వారు అభ్యంతరం తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఉన్నా ఇంతకాలం ఎమ్మెల్యే ఇసుక ఎందుకు తవ్వించాడని ప్రశ్నించారు. ఆయన పొక్లెయిన్ నది నుంచి బయటకు రప్పిస్తే, తమ పొక్లెయిన తీస్తామన్నారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వీఆర్వో చివరికి లారీలను నదిలోకి అనుమతించకుండా ఆపటంతో ఇరువురు తవ్వకాలు ఆపారు. -
మంత్రి దేవినేనిని ఘెరావ్ చేసిన గ్రామస్తులు
అవనిగడ్డ(కృష్ణా): కృష్ణా జిల్లా కోడూరు మండలంలో పర్యటించిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గ్రామస్తుల నిరసనను ఎదుర్కొన్నారు. పాలకాయతిప్ప గ్రామంలో పర్యటించేందుకు శనివారం సాయంత్రం మంత్రి రాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో 13 మీటర్ల రోడ్డు కోసం ఆక్రమణలను తొలగించిన అధికారులు.. కోడూరు సెంటర్లో 7 మీటర్ల రోడ్డు వెడల్పు కోసం ఆక్రమణలను వదిలేశారని తెలిపారు. ఈ విషయమై ఉప సభాపతి బుద్ధప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని మంత్రిని వారు కోరారు. మంత్రి హామీ మేరకు వారు ఆందోళన విరమించటంతో పర్యటన కొనసాగింది. -
సీమ ప్రాజెక్టులకు అన్యాయం
చంద్రబాబు, దేవినేనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట ధ్వజం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు సమావేశంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం సాగునీటి ప్రాజెక్టులను మాట మాత్రంగానైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించకపోవడాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆ ప్రాంత ప్రాజెక్టులు నాశనమైనా ఫర్వాలేదనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. బోర్డు సమావేశానికి తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రణాళికతో వెళితే ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం ఎలాంటి వ్యూహం లేకుండా వెళ్లారని విమర్శించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన జరిగిన వెంటనే అపెక్స్ కౌన్సిల్ కావాలని పట్టు పట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఇపుడు ఆ విషయంలో సాగునీటి మంత్రి తూతూ మంత్రంగా మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణకు అవసరానికన్నా ఎక్కువ నీరు వస్తున్నా ఇంకా ఎక్కువగా సాధించాలని హరీశ్ వెళ్లారని, మన మంత్రి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని గడికోట ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ చుక్కనీరిచ్చారా? తెలుగు ప్రజలకు వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెప్పించడంలోనూ కుడి, ఎడమ కాలువలు తవ్వించడంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే ఇపుడు పట్టిసీమ పేరుతో వృథాగా రూ 1,800 కోట్ల వ్యయంతో నాలుగు మోటార్లు బిగించి నదుల అనుసంధానం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పట్టిసీమతో ఒక్క చుక్కనీటినైనా రాయలసీమకు ఇచ్చారా? అని ప్రశ్నించారు. పట్టిసీమ వల్ల తెలంగాణ తన వాటా కింద 40 టీఎంసీలు, పోలవరానికి సంబంధించి మరో 45 టీఎంసీల నీటిని వాటాగా తీసుకునే పరిస్థితికి ఏపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. -
గవర్నర్‌ని కలసిన మంత్రి దేవినేని ఉమ
-
వచ్చే ఎన్నికలకు వంశీని పక్కన పెట్టిన టిడిపి