పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సంగీత దర్శకుడు కోటి | Music Director Koti As Policer Officer Vyas In Devineni Movie | Sakshi
Sakshi News home page

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సంగీత దర్శకుడు కోటి

Published Thu, Sep 12 2019 4:48 PM | Last Updated on Thu, Sep 12 2019 4:49 PM

Music Director Koti As Policer Officer Vyas In Devineni Movie - Sakshi

ప్రస్తుతం సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. అందులో భాగంగా దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’. ఈ సినిమాలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్ లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బెజవాడలో ఇద్దరు నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

‘దేవినేని’లో బెజవాడ లోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో  తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ఎస్ వ్యాస్ గారి పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా.. దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రంలో చేసిన అందరు నటీనటులు చాలా బాగా నటించారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న  కుమార్, నందమూరి తారక రత్న నిజమైన దేవినేని నెహ్రూలో పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడు. అలాగే సురేంద్ర పాత్రలో  ఏం ఎన్ ఆర్ చౌదరి నటిస్తున్నారు. దేవినేని మురళి గా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగతా పాత్రలో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరీపేట హైవే లో భారీగా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ... ‘నా కెరీర్‌లో ఇది సెకండ్ పేజ్. సంగీత దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు రాణించాను. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మీ ముందుకు రాబోతున్నాను. శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నాకు చిన్నప్పుడు మా నాన్న గారు నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలి అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983తో రాజ్ కోటిగా నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ టైములో కె ఎస్ వ్యాస్ గారు విజయవాడ కి ఫస్ట్ పవర్ఫుల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ నేను చేయడం అనేది రేర్ ఇన్సిడెంట్. శివనాగు గారు వండర్ ఫుల్ డైరెక్టర్ . ఈ క్యారెక్టర్‌ని మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement