
సురేశ్ కొండేటి, ధృవతార
80లలో బెజవాడలో సంచలనాలకు కేరాఫ్ అయిన దేవినేని, వంగవీటి రంగాల కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’ (బెజవాడ సింహం). శివనాగు దర్శకత్వంలో రాము రాథోడ్ నిర్మిస్తున్నారు. దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న, రంగా పాత్రలో ‘సంతోషం’ ఎడిటర్ సురేశ్ కొండేటి నటిస్తున్నారు. ఈ చిత్రంలో రంగా సతీమణి రత్నకుమారిగా తమిళ నటి ధృవతార కనిపించనున్నారు. రంగాతో కలిసి ఉన్న ఆమె లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రబృందం. ‘‘ఇప్పటికే విడుదలైన వంగవీటి లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. ధృవతార హావభావాలు చక్కగా పలికిస్తోంది. మరో రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.