‘అభిమాని’ కోసం రంగంలోకి మణిశర్మ | Melody Brahma' Mani Sharma Composing Rerecording For Abhimani | Sakshi
Sakshi News home page

‘అభిమాని’ కోసం రంగంలోకి మణిశర్మ

Published Tue, Jan 14 2025 2:06 PM | Last Updated on Tue, Jan 14 2025 3:39 PM

Melody Brahma' Mani Sharma Composing Rerecording For Abhimani

ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "అభిమాని". ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‍లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా రీ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మకర సంక్రాంతి విశెస్ తెలియజేసింది మూవీ టీమ్. ఫిబ్రవరిలో "అభిమాని" సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా మెలొడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ - అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి కంటెంట్ ఇంకా సోషల్ మెసేజ్ కలిగిన అభిమాని( Abhimani) మూవీకి అంతే గొప్పగా నేపథ్య సంగీతం కుదిరింది . ఇందులో ఉన్న అంశం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రధాన పాత్రలో నటించిన సురేష్ కొండేటి బాగా నటించారు. ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ దోమకొండ రాంబాబు అనుకున్న కంటెంట్ ని అదే స్థాయిలో ప్రజెంట్ చేశారు. సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుండి నాకు పరిచయం. ఈ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంటాడు. అభిమాని మూవీని మీరంతా సూపర్ హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్ సురేష్, అండ్ అభిమాని టీమ్. అన్నారు.

అనంతరం డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ..'అభిమాని' మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలొడీ బ్రహ్మ మణిశర్మ గారు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన బ్యాక్ గ్రౌండ్  స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. రీ రికార్డింగ్  కంప్లీట్ అయ్యింది. మూవీలోని విజువల్స్ మణిశర్మ గారి నేపథ్య సంగీతం కలిసి ఐ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. మరీ ముఖ్యంగా సినిమాకి ప్రాణం అయిన చివరి 20 నిమిషాలుకు మణిశర్మ గారు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశారు. మా సినిమాకు సపోర్ట్ చేసిన మణిశర్మ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం’ అన్నార. 

సురేష్ కొండేటి(Suresh Kondeti) మాట్లాడుతూ - లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశ‌ర్మ‌ గారు నేను ప్రధాన పాత్ర పోషించిన అభిమాని సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ఈ సంక్రాంతిని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే ఈసారి మా ఊరికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. మణిశర్మ అనేది పేరు కాదు, ఓ బ్రాండ్. ఆయన సంగీతం వల్లే బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. తెలుగులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మ చేయాలనే రేంజ్‌లో తన సినిమాలతో రఫ్పాడించారు. నేను యంగ్ గా ఉన్నప్పుడు ఆయన పాటలు వింటూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అలాంటిది ఇప్పుడు అంతటి మెలోడీ బ్రహ్మ నా సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందించడం తో సంతోషంగా ఉంది. మణిశర్మ గారితో నా పరిచయం కొన్ని దశాబ్దాల నాటిది. మణిశర్మ గారి మా టీమ్ కు తోడయ్యక అభిమాని సినిమా లెవెల్ పెరిగింది.  రీ రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. ఇప్పటిదాకా నన్ను సినీ జర్నలిస్ట్ గా, ప్రొడ్యూసర్ గా ఆదరించిన ప్రేక్షకులు నటుడిగా కూడా అభిమాని సినిమాతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement