నెలాఖరుకు పోలవరం స్పిల్‌వే నిర్మాణ పనులు
నెలాఖరుకు పోలవరం స్పిల్‌వే నిర్మాణ పనులు
Published Sun, Dec 18 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 11:03 PM
ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
పోలవరం: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణానికి కాంక్రీట్ వేసే పనులను ఈనెలాఖరుకు ప్రారంభిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.ఆదివారం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అజయకుమార్, జియాలజిస్ట్ జి.జె.ఎస్.ప్రసాద్, పోలవరం అథారిటీ సలహాదారులు ఆర్.కె.గుప్తా, డి.పి.బార్గవ్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి స్పిల్‌వే ప్రాంతంలో పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంక్రీట్ పనులు ప్రారంభిచేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. స్పిల్‌వే గేట్లను పోలవరం నిర్మాణ ప్రాంతంలో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెటీరియల్‌ను తరలిస్తున్నామన్నారు. గేట్ల తయారీకి అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపామన్నారు. సోమవారం వర్చువల్ తనిఖీలో భాగంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పోలవరం çపనులపై సమీక్షిస్తారని తెలిపారు. వాస్తవానికి ఈనెల 19న ముఖ్యమంత్రి స్పిల్‌వే కాంక్రీట్ çపనులను ప్రారంభించాల్సి ఉంది. పనులు పూర్తికాకపోవడంతో దీనిని ఈనెలాఖరునాటికి వాయిదా వేశారు. పనుల పరిశీలనలో ప్రాజెక్టు ఎస్‌ఈ వి.ఎస్.రమేష్‌బాబు, గేట్ల మెకానికల్ డైరెక్టర్ కె.కన్నమనాయుడు, ఈఈలు ఎన్,పుల్లారావు, ఎన్.చంద్రరావు ఉన్నారు.
షేర్‌జోన్ రాయి బలోపేతం
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేకు కాంక్రీట్ వేసే ప్రాంతంలో షేర్‌జోన్ అనే రాయి ఉందని, ఇది బలహీనంగా ఉందని ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. 2.5 మీటర్ల పరిధిలో ఈ రాయి ఉందని, దీనిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. లూజ్ సాయిల్‌ను తొలగించి, ప్రత్యేక కాంక్రీట్ వేశాక ముందుకు వెళ్తామన్నారు. కాంక్రీట్ పనులకు జియాలజికల్ సర్వే ఆప్ ఇండియా అనుమతి రావాల్సి ఉందన్నారు.
Advertisement