spillway
-
నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత
సాక్షి, నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో సోమవారం అధికారులు ఆరు గేట్లు ఓపెన్ చేశారు. అంతకుముందు ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్ వేశారు. ఆరు గేట్లను ఐదు ఫీట్ల ఎత్తువరకు ఇరిగేషన్ అధికారులు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి 5-10 వేల క్యూసెక్కుల నీటీని విడుదల అవుతోంది.Nagarjuna Sagar Project under the Krishna River, 6 flood Gates opened and Released Water. today in Nalgonda District, Telangana State pic.twitter.com/XhtZnMCrhL— K. N. Hari (@KNHari9) August 5, 2024 శ్రీశైలం నుంచి సారగ్లోకి వరద పోటెత్తుతోంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ఇప్పటికే 580 అడగుల వరకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 3,22,817 క్యూసెక్కుల నీరు చేరుతుండగా. కుడి, ఎడమ కాలువల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 37,873 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటినిల్వ 576.1 అడుగుల్లో 271.9 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312.05 టీఎంసీలు కాగా మరో 41 టీఎంసీలు చేరితే సాగర్ పూర్తిగా నిండిపోతుంది. నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న భారీ వరద6 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదలఇన్ ఫ్లో: 323748 క్యూసెక్కులుఅవుట్ ఫ్లో: 83331 క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులుప్రస్తుత నీటి మట్టం: 582.60 అడుగులుపూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 290.5140 టీఎంసీలుకొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి -
గైడ్ బండ్ సమస్య చిన్నదే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు గైడ్ బండ్లో కొద్దిమేర జారడం చిన్న సమస్యేనని సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలోని నిపుణుల కమిటీ తేల్చింది. గైడ్ బండ్ ప్రాజెక్టులో కీలకమైన నిర్మాణం కాదని, స్పిల్ వే మీదుగా వరద సులువుగా వెళ్లేలా చేయడానికి నిర్మించింది మాత్రమేనని స్పష్టంచేసింది. గోదావరికి సాధారణంగా ఆగస్టులో భారీ వరదలు వస్తాయని, ఆలోగా గైడ్‌బండ్‌కు తాత్కాలిక ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. తాత్కాలిక దిద్దుబాటు చర్యల ప్రతిపాదనను నాలుగు రోజుల్లోగా పంపితే.. దానిలో మార్పులుంటే చేసి సీడబ్ల్యూసీకి పంపి తక్షణమే ఆమోదించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సీడబ్ల్యూసీ ఆమోదించిన ప్రతిపాదన మేరకు జూలైలోగా గైడ్ బండ్ తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లలో లీకేజీలు పరిమితికి లోబడే ఉన్నాయని, వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ కమిటీ గురువారం పోలవరం ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించి.. రాష్ట్ర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. శుక్రవారం రాజమహేంద్రవరంలో నిపుణుల కమిటీతో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ మరోసారి సమావేశమై.. గైడ్ బండ్‌ను పటిష్టం చేయడానికి తాత్కాలిక, శాశ్వత చర్యలపై చర్చించింది. సీడబ్ల్యూసీకి వారంలో నివేదిక గైడ్ బండ్లో కొంత భాగం కాస్త జారడానికి కారణాలపై రాష్ట్ర అధికారులతో నిపుణుల కమిటీ మేధోమథనం జరిపింది. నిపుణుల కమిటీలోని నలుగురు సభ్యులూ.. నాలుగు రకాల అభిప్రాయలు వెల్లడించటంతో ఏకాభిప్రాయం కుదరలేదు. దాంతో ఢిల్లీలో మరోసారి సమావేశమై గైడ్ బండ్ జారడానికి కారణాలపై వారంలోగా సీడబ్ల్యూసీకి నివేదిక ఇస్తామని పాండ్య తెలిపారు. తాత్కాలిక మరమ్మతుల ప్రతిపాదన ఇదీ గైడ్ బండ్ ఎత్తు 51.32 మీటర్లు. పొడవు సుమారు 134 మీటర్లు. ఇందులో కొన్ని చోట్ల 3 మీటర్లు, కొన్ని చోట్ల ఆరు మీటర్ల మేర కాస్త జారింది. జారిన ప్రదేశాల్లో ఇప్పటికే పెద్ద రాళ్లు వేసి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. వాటిపైన మళ్లీ పెద్ద పెద్ద రాళ్లు వేసి వాటి మధ్య సిమెంటు మిశ్రమం (స్లర్రీ) పోయాలని నిపుణుల కమిటీ సూచించింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో గాబియన్లు వేయాలని పేర్కొంది. దీనివల్ల వరద ఉద్ధృతిని గైడ్ బండ్ సమర్థవంతంగా అడ్డుకుంటుందని తెలిపింది. సీడబ్ల్యూపీఆర్ఎస్తో మరోసారి అధ్యయనం సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా స్పిల్ వేకు ఎగువన ఏర్పడే సుడిగుండాలను నియంత్రించి, వరదను సులువుగా దిగువకు వెళ్లేలా చేయడానికి 2:1 నిష్పత్తిలో గైడ్ బండ్ నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. ఆ డిజైన్ ప్రకారమే గైడ్ బండ్ నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొంతమేర జారడంతో సీడబ్ల్యూపీఆర్ఎస్తో మరోసారి అధ్యయనం చేయించాలని నిపుణుల కమిటీ సూచించింది. గైడ్ బండ్‌ను 3:1 నిష్పత్తిలో నిర్మిస్తే స్పిల్ వే వద్ద వరద ప్రవాహం ఎలా ఉంటుందో అధ్యయనం చేయించాలని పేర్కొంది. గైడ్ బండ్ నిర్మాణ ప్రాంతంలో వరద సమయంలో, వరద తగ్గాక మట్టిని సేకరించి, నాణ్యతపై సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్లో అధ్యయనం చేయించాలని పేర్కొంది. వాటి ఆధారంగా గైడ్ బండ్‌ను పూర్తి స్థాయిలో పటిష్టం చేసే డిజైన్‌ను రూపొందిస్తామని వెల్లడించింది. -
Polavaram Project: సీఎం జగన్ భగీరథ యత్నం.. వడివడిగా జీవనాడి
పోలవరం ప్రాజెక్టు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం నాటి సీఎం చంద్రబాబు చేసిన తప్పిదాలతో ఎదురవుతున్న సవాళ్లను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భగీరథ యత్నం చేస్తున్నారు. పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.2,948.04 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. కేంద్రం నిధులు ఇవ్వకున్నప్పటికీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర ఖజానా నుంచే నిధులు కేటాయిస్తూ ప్రణాళికా బద్ధంగా ప్రాజెక్టు పనులను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా పూర్తి చేస్తోంది. రైతులకు ఫలాలను అందించే దిశగా అడుగులు వేస్తోంది. దిగువ కాఫర్ డ్యామ్ దాదాపు పూర్తి గోదావరి వరదల ఉధృతికి ఇసుక తిన్నెలు కోతకు గురవడం వల్ల దిగువ కాఫర్ డ్యామ్ 0 నుంచి 680 మీటర్ల వరకు ఏర్పడిన అగాధాన్ని డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల మేరకు మేఘా సంస్థ జియో మెంబ్రేన్ బ్యాగ్‌లలో ఇసుక నింపి.. జెట్ గ్రౌటింగ్, వైబ్రో కాంపాక్షన్ చేస్తూ పూడ్చింది. ఆ తర్వాత 20 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేసింది. కానీ.. జూలై 10న గోదావరికి వచ్చిన భారీ వరద ముంచెత్తడంతో దిగువ కాఫర్ డ్యామ్ పనులకు ఆటంకం కలిగింది. వరదలు తగ్గడంతో నవంబర్‌లో పనులను ప్రారంభించి.. 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్ డ్యామ్‌ను దాదాపుగా పూర్తి చేసింది. కేవలం రివిట్మెంట్ పనులు మాత్రమే మిగిలాయి. రివిట్‌మెంట్‌తో సహా దిగువ కాఫర్ డ్యామ్ పనులను నెలాఖరుకు పూర్తి చేస్తామని పోలవరం ఎస్ఈ నరసింహమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. దిగువ కాఫర్ డ్యామ్ పూర్తవడంతో గోదావరికి ఎంత పెద్ద వరద వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టవచ్చని చెప్పారు. పోలవరం స్పిల్ వే శరవేగంగా అగాధాల పూడ్చివేత గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడానికి 2,840 మీటర్ల పొడవున 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయాల్సిన ఎగువ కాఫర్ డ్యామ్‌ను టీడీపీ సర్కార్ పూర్తి చేయలేక చేతులెత్తేసింది. కుడి, ఎడమ వైపున 680 మీటర్ల ఖాళీ ప్రదేశాన్ని వదిలేసింది. దాంతో 2019లో 2,454 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి.. ఎగువ కాఫర్ డ్యామ్ అడ్డంకిగా మారడం వల్ల ఖాళీగా వదిలిన 680 మీటర్లకు కుంచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చింది. దాంతో వరద ఉధృతి మరింత పెరిగి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై.. నాలుగు ప్రదేశాల్లో –12 నుంచి –22 మీటర్ల లోతుతో అగాధాలు ఏర్పడ్డాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో 1,750 మీటర్ల పొడవునా పునాది డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు అధికారులు అగాధాల పూడ్చివేతకు గతేడాది 11 రకాల పరీక్షలు చేశారు. వాటి ఫలితాలను డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ విశ్లేషించి, జారీ చేసిన మార్గదర్శకాల మేరకు.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఉన్న నీటిని మోటార్లతో తోడేస్తున్నారు. పురుషోత్తపట్నం వద్ద గోదావరిలోని ఇసుకను వందలాది టిప్పర్లతో తెచ్చి, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలు ఏర్పడిన చోట పోసి, రోలింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత వైబ్రో కాంపాక్షన్ (వైబ్రో కాంపాక్టర్ యంత్రంతో బోరు వేసి.. అధిక ఒత్తిడితో మెలి తిప్పడం) చేస్తూ ఆ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చే పనులను ముమ్మరం చేశారు. ఎన్‌హెచ్‌పీసీ నివేదికే కీలకం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చేందుకు జనవరి 26 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు 16 రోజులపాటు హై రెజల్యూషన్ జియోఫిజికల్ రెసిస్టివిటీ ఇమేజింగ్, సెస్మిక్ టోమోగ్రఫీ పరీక్షలను ఎన్‌హెచ్‌పీసీ (నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్) బృందం నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలను విశ్లేషించి.. నెలాఖరులోగా డయాఫ్రమ్ వాల్ భవిత్యాన్ని తేల్చుతూ నివేదిక ఇవ్వనుంది. డయాఫ్రమ్ వాల్ పటిష్టంగా ఉన్నట్లు తేలితే.. ఆ వెంటనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులను చేపట్టి, వరదల్లోనూ నిర్విఘ్నంగా కొనసాగించి, పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఒకవేళ డయాఫ్రమ్ వాల్ సామర్థ్యంపై ఎన్‌హెచ్‌పీసీ నివేదిక అనుమానం వ్యక్తం చేస్తే.. సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ మార్గదర్శకాల మేరకు ముందడుగు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డెల్టాకు నీటిని సరఫరా చేస్తూ మిగతా పనులు ► గోదావరి ప్రవాహాన్ని అప్రోచ్ ఛానల్ మీదుగా స్పిల్ వే వైపు మళ్లించడానికి.. స్పిల్ వేకు ఎగువన ఎడమ వైపున ఉన్న కొండకు సమాంతరంగా సుమారు 1.3 కి.మీల పొడవు, 52 మీటర్ల ఎత్తుతో గైడ్ వాల్ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇదే రీతిలో ఎగువ కాఫర్ డ్యామ్‌కు ఎగువన కుడి వైపున ఉన్న కొండకు సమాంతరంగా గైడ్ బండ్ నిర్మిస్తోంది. ► గోదావరి డెల్టాలో రబీ పంటలకు పోలవరం స్పిల్ వే రివర్ స్లూయిజ్‌ల ద్వారా నీటిని విడుదల చేస్తూ.. అప్రోచ్ ఛానల్లో మిగిలిపోయిన 36.54 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, స్పిల్ ఛానల్లో 1.20 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 1.96 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ► పోలవరం ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేసే అనుసంధానాలలో హెడ్ రెగ్యులేటర్, ఈ–శాడిల్ డ్యామ్, ఎఫ్–శాడిల్ డ్యామ్ ఇప్పటికే పూర్తయ్యాయి. జంట సొరంగాల్లో 8.63 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులను జూన్‌లోగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు. ► పోలవరం ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువకు నీటిని విడుదల చేసే అనుసంధానాలలో సొరంగం పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయి. హెడ్ రెగ్యులేటర్, కేఎల్ బండ్, నావిగేషన్ కెనాల్, నావిగేషనల్ లాక్ పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించారు. స్పిల్ వే పనితీరు అత్యద్భుతం గోదావరి ప్రవాహాన్ని మళ్లించే స్పిల్ వేను టీడీపీ సర్కార్ పునాది స్థాయిలోనే వదిలేస్తే.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ కేంద్రం నిధులు రీయింబర్స్ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నప్పటికీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ.. రాష్ట ఖజానా నుంచే నిధులను వ్యయం చేసి 2021 జూన్ 11 నాటికే 48 గేట్లతో సహా సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. స్పిల్ వే మీదుగా అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ ద్వారా 6.1 కి.మీల పొడవునా గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. 2021లో 3,690.38 టీఎంసీలు, 2022లో 6,150.04 టీఎంసీలు వెరసి 9,840.42 టీఎంసీలను పోలవరం స్పిల్ వే మీదుగా సమర్థవంతంగా దిగువకు విడుదల చేశారు. ఈ గణాంకాలను పరిశీలించిన సీడబ్ల్యూసీ అధికారులు.. ప్రపంచంలో అతి పెద్దదైన పోలవరం స్పిల్ వే పనితీరు అత్యద్భుతమని ప్రశంసించారు. చంద్రబాబు పాపం.. ప్రపంచ వింత ► పశ్చిమగోదావరి జిల్లా రామన్నగూడెం వద్ద గోదావరి నదిలో ఉన్న భూ భౌగోళిక పరిస్థితుల వల్ల నది గర్భంలో ప్రధాన డ్యామ్ అంటే ఈసీఆర్ఎఫ్ డ్యామ్‌ను, నది తీరానికి ఆవల కుడి వైపున వరద ప్రవాహాన్ని మళ్లించే స్పిల్ వేను నిర్మించేలా పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. ఈ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 194.6 టీఎంసీలు. ► నది ప్రవాహాన్ని మళ్లించేలా ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్లను పూర్తి చేసి, 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించి.. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. ఆ తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టి పూర్తి చేయాలి. ► విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించే వరకూ అంటే 2016 డిసెంబర్ 30 వరకు తట్టెడు మట్టి కూడా టీడీపీ సర్కార్ ఎత్తలేదు. ఆ తర్వాత అధికంగా కమీషన్లు వచ్చే పనులనే సబ్ కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టారు. వరదను మళ్లించేలా స్పిల్ వే, కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయకుండానే.. డయాఫ్రమ్ వాల్‌ను 2018 జూన్ నాటికే పూర్తి చేశారు. ► స్పిల్ వేను పునాది స్థాయిలో.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేయలేక టీడీపీ సర్కార్ వదిలేసింది. దాంతో 2019లో గోదావరి వరద కాఫర్ డ్యామ్ ద్వారా అధిక ఉధృతితో ప్రవహించం వల్ల ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో, దిగువ కాఫర్ డ్యామ్‌లో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ► డయాఫ్రమ్ వాల్ సామర్థ్యాన్ని తేల్చే పరీక్షలు చేయడానికి ఇటీవల పోలవరానికి వచ్చిన ఎన్‌హెచ్‌పీసీ బృందం.. చంద్రబాబు పాపాన్ని ప్రపంచ వింతగా అభివర్ణించిందని అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల పోలవరం పనుల్లో జాప్యం చోటుచేసుకుంటోందని తేల్చి చెప్పాయి. ఈ పాటికే పూర్తయ్యేది.. గతంలో ప్రణాళికా రాహిత్యంతో చేపట్టిన పనుల వల్ల గోదావరి వరదల ఉధృతికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై నాలుగు ప్రదేశాల్లో భారీ అగాధాలు ఏర్పడ్డాయి. వాటిని సరిదిద్దేందుకు 2020 నుంచి డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ, దేశంలోని ఢిల్లీ, చెన్నై, తిరుపతి తదితర ఐఐటీల ప్రొఫెసర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. డయాఫ్రమ్ వాల్ సామర్థ్యం తేల్చడానికి ఎన్‌హెచ్‌పీసీ ఇటీవలే పరీక్షలు చేసింది. ఎన్‌హెచ్‌పీసీ నివేదికే కీలకం. గోదావరి వరదల ఉధృతి ప్రభావం లేకపోయిఉంటే.. ఈపాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. – సుధాకర్ బాబు, సీఈ, పోలవరం ప్రాజెక్టు ఎంత పెద్ద వరద వచ్చినా భయం లేదిక పోలవరం ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ఖజానా నుంచే ఇస్తున్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే.. కరోనా కష్టకాలంలోనూ రికార్డు సమయంలో స్పిల్ వే ను పూర్తి చేశాం. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు దెబ్బతిన్న పనులను చేపడుతున్నాం. గతేడాది జూలైలో ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచాం. ఇప్పటికే దిగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేశాం. గోదావరికి ఎంత పెద్ద వరద వచ్చినా ఇక భయం లేదు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగాధాలను పూడ్చుతున్నాం. ఎన్‌హెచ్‌పీసీ నివేదిక మేరకు.. గోదావరి వరదల్లోనూ ఈసీఆర్ఎఫ్ పనులు చేపట్టి పూర్తి చేస్తాం. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ, జల వనరుల శాఖ -
శరవేగంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
-
పోలవరంలో మరో కీలక ఘట్టం పూర్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. స్పిల్ వేకు 192 గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియను రికార్డు సమయం లో ప్రభుత్వం పూర్తి చేసింది. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు. ప్రపంచంలో సాగు నీటి ప్రాజెక్టుల స్పిల్ వేల్లో ఇంత బరువైన గడ్డర్లను వినియోగించ డం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా 1,128 మీటర్ల పొడవుతో స్పిల్ వేను నిర్మిస్తున్నారు. స్పిల్ వేకు 49 పిల్లర్లను (పియర్స్) 52 మీటర్ల ఎత్తున ఇటీవల ప్రభుత్వం రికార్డు సమయంలోనే పూర్తి చేసింది. తాజాగా వాటిపై గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యింది. గడ్డర్ల మధ్య షట్టరింగ్ స్లాబ్ వేసి స్పిల్ వే బ్రిడ్జిని నిరి్మంచాలి. స్పిల్ వే బ్రిడ్జిపై ఏర్పాటుచేసే హైడ్రాలిక్ హాయిస్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా గేట్లను ఎత్తడం, దించడం చేస్తారు. ఒక్కో గడ్డర్‌కు 10 టన్నుల స్టీల్ స్పిల్ వేకు 49 పిల్లర్ల మధ్య 192 గడ్డర్లు ఉంటాయి. ఒక గడ్డర్ తయారీకి పది టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. గత సర్కార్ హయాంలో ఒక్క గడ్డర్‌ను కూడా తయారు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పిల్ వే పిల్లర్లను 52 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసి, వాటి మధ్య గడ్డర్లు, షట్టరింగ్‌తో స్పిల్ వే బ్రిడ్జి నిర్మించే పనులను ప్రణాళికా బద్దంగా చేపట్టింది. గతేడాది ఫిబ్రవరి 17న గడ్డర్ల తయారీని ప్రారంభించింది. 192 గడ్డర్ల తయారీకి 1,920 టన్నుల స్టీల్, 4,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించింది. పిల్లర్లపై గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ గతేడాది జూలై 6న ప్రారంభించింది. కరోనా, వరద ఉధృతి అడ్డంకిగా మారినా లెక్క చేయకుండా పనులు కొనసాగించి శనివారం రాత్రి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. కేవలం ఏడు నెలల్లోనే గడ్డర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందన్నమాట. మరోవైపు 1,105 మీటర్ల పొడవున ఇప్పటికే స్పిల్ వే బ్రిడ్జిని ప్రభుత్వం పూర్తి చేసింది. మిగిలిన 23 మీటర్ల స్పిల్ వే బ్రిడ్జి పనులను ఈనెల 25 నాటికి పూర్తి చేస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. మే నాటికి స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసి.. జూన్‌లో గోదావరికి వచ్చే వరదను స్పిల్ వే మీ దుగా మళ్లించి, 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. గడ్డర్ అంటే.. గడ్డర్ అంటే కాంక్రీట్ దిమ్మె. దీనిని రెండు పిల్లర్ల మీద అటువైపు రెండు, ఇటువైపు రెండు ఏర్పాటు చేస్తారు. గడ్డర్ల మధ్య ఇనుప చువ్వల షట్టరింగ్‌తో కాంక్రీట్ స్లాబ్ వేస్తారు. ఈ విధంగా 49 పిల్లర్ల మధ్య వేస్తే స్పిల్‌వే బ్రిడ్జి రెడీ అవుతుంది. గడ్డర్ పొడవు-23 మీటర్లు ఎత్తు-2 మీటర్లు బరువు-62 టన్నులు చదవండి: 2022 నాటికి పోలవరం పూర్తి: ఏబీ పాండ్యా నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ -
పోలవరం ప్రాజెక్ట్‌లో స్పిల్‌వే గడ్డర్ల ఏర్పాటు పూర్తి
-
పోలవరం ప్రాజెక్ట్‌లో చారిత్రక ఘట్టం..
సాక్షి, పశ్చిమగోదావరి: రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టులో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. స్పిల్‌వే గడ్డర్ల ఏర్పాటు పూర్తయ్యింది. 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై మేఘా ఇంజినీరింగ్ సంస్థ అమర్చింది. షట్టరింగ్, స్లాబ్ నిర్మాణంపై నిపుణులు దృష్టి పెట్టారు. గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. గోదావరికి భారీ వరద వచ్చినా పనులు ఆగకుండా స్పిల్‌వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా ఇంజినీరింగ్ ప్రణాళికలు రూపొందించారు. కాగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్లు అన్నింటినీ డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) కొలిక్కి తెచ్చింది. పూణేలో సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)లో 3–డీ పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన పోలవరం నమూనా ప్రాజెక్టు ద్వారా అధిక ఒత్తిడితో నీటిని పంపుతూ ప్రయోగాలు నిర్వహించినప్పుడు ఆ వరద చూపిన ప్రభావాలను పరిశీలించిన డీడీఆర్పీ సభ్యులు.. వాటిని శుక్రవారం క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులతో అన్వయించారు. చదవండి: పోలవరం పెండింగ్ డిజైన్లు కొలిక్కి 2022 నాటికి పోలవరం పూర్తి: ఏబీ పాండ్యా -
పోలవరం పనులపై సంతృప్తి
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న డిజైన్లను ఖరారు చేయడమే లక్ష్యంగా.. డీడీఆర్పీ (డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్) శుక్రవారం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పూణేలోని సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్) ఆవరణలో 3–డీ పద్ధతిలో నిర్మించిన పోలవరం నమూనా ప్రాజెక్టులో రకరకాల ఒత్తిడులతో నీటిని పంపడం ద్వారా నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైన ఫలితాలను క్షేత్రస్థాయిలో వర్తింపజేస్తూ డిజైన్లపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేసుకునే యత్నం చేశారు. అలాగే, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు.. పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్, సభ్య కార్యదర్శి రంగారెడ్డి, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో శనివారం రాజమహేంద్రవరంలో జరగనున్న సమీక్ష సమావేశంలో డిజైన్లపై చర్చించనున్నారు. మరోవైపు.. వీటి రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో కేంద్రం ఏర్పాటుచేసిన డీడీఆర్పీ నిపుణుల కమిటీ గురువారం రాజమహేంద్రవరానికి చేరుకుంది. స్పిల్‌వే గ్యాలరీని పరిశీలిస్తున్న డీడీఆర్పీ బృందం సభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పీపీఏ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్‌లతో కలిసి ఈ కమిటీ పోలవరం ప్రాజెక్టు పనులను శుక్రవారం పరిశీలించింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్, స్పిల్ వే గ్యాలరీ, స్పిల్ వేకు అమర్చిన గేట్లు, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, రెండు కాఫర్ డ్యామ్‌ల మధ్య చేపట్టిన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులను పరిశీలించి వాటి నాణ్యతపై సంతృప్తి వ్యక్తంచేసింది. గోదావరి నది వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించడానికి తవ్వాల్సిన అప్రోచ్ ఛానల్ ప్రదేశాన్ని కూడా కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా వెల్లడైన అంశాలను పూణేలో సీడబ్ల్యూపీఆర్ఎస్లో నిర్వహించిన ప్రయోగాల్లో తేలిన విషయాలతో పోల్చి.. డిజైన్లలో చేయాల్సిన మార్పులు చేర్పులపై చర్చించింది. ఆదివారం కూడా పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. అధికారులతో మరోమారు సమావేశమై డిజైన్లపై తుది నిర్ణయం తీసుకోనుంది. -
పోలవరంలో కీలక ఘట్టం పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం పనులను ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. రికార్డు సమయంలో ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే పిల్లర్ల (పియర్స్) నిర్మాణాన్ని 52 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఐదు నెలల్లో స్పిల్ వే బ్రిడ్జిని దాదాపుగా పూర్తి చేసింది. 48 గేట్లకుగానూ 28 గేట్లను స్పిల్ వేకు అమర్చింది. మిగతా 20 గేట్ల బిగింపు పనులను వేగవంతం చేసింది. గేట్లను ఎత్తడానికి దించడానికి వీలుగా హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు బిగించేందుకు ప్లాట్‌ఫామ్‌లను సిద్ధం చేసింది. స్పిల్ వేకు సమాంతరంగా స్పిల్ చానల్ పనులను వేగవంతం చేసింది. మేనాటికి స్పిల్‌వే, స్పిల్ చానల్‌ను పూర్తి చేసి, జూన్‌లో వచ్చే గోదావరి వరదను స్పిల్ వే మీదుగా మళ్లించి, 2022 ఖరీఫ్ లోగా ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా గ్రావిటీపై నీరు సరఫరా చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికను రచించారు. ఆ ప్రణాళిక మేరకు పనులు జరుగుతున్నాయా? లేదా? అనే అంశాన్ని నిత్యం సమీక్షిస్తూ అధికారులు, కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాక ముందు.. పోలవరం స్పిల్ వే పిల్లర్లను సగటున 23 మీటర్ల ఎత్తు వరకూ కూడా పూర్తి చేయలేదు. స్పిల్ వేకు గేట్లను 25.72 అడుగుల ఎత్తులో బిగిస్తారు. అంటే టీడీపీ సర్కార్ హయాంలో స్పిల్ వే పనులు పునాది స్థాయిని కూడా దాటలేదని స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్‌లో హెడ్ వర్క్స్ పనులను మేఘా సంస్థ దక్కించుకుంది. 2019 నవంబర్ 21న పనులు ప్రారంభించి వేగంగా చేస్తోంది. ప్రాజెక్టులోకి పులస చేపల రాకపోకలకు వీలుగా స్పిల్‌వే రెండో బ్లాక్‌లో ఫిష్ లాడర్ గేట్లను నిర్మించాల్సి ఉండటం, ఈ గేట్ల డిజైన్లకు సంబంధించి అనుమతులు ఆలస్యం కావడంతో రెండో పిల్లర్ నిర్మాణం ఆలస్యమైంది. కానీ ఇటీవలే అనుమతులు రావడంతో అన్ని పిల్లర్లను 52 మీటర్ల ఎత్తున నిర్మించారు. టీడీపీ సర్కార్ 60 నెలల్లో 23 మీటర్ల ఎత్తున పనులు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 14 నెలల్లో 29 మీటర్ల ఎత్తున 49 పిల్లర్లను పూర్తి చేసిందని స్పష్టమవుతోంది. ఐదు నెలల్లో స్పిల్ వే బ్రిడ్జి స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ 1,128 మీటర్ల పొడవుతో నిర్మించాలి. స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్లను కాంట్రాక్టు సంస్థ 2020 జూలైలో ఏర్పాటు చేయడం ప్రారంభించింది. స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ కాంక్రీట్ పనులు అదే ఏడాది సెప్టెంబర్ 9న మొదలు పెట్టింది. స్పిల్ వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డర్లు 192 కాగా 188 గడ్డర్లను ఇప్పటికే ఏర్పాటు చేయగా, 4 గడ్డర్లు మాత్రమే పెట్టాల్సి ఉంది. స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ పనులు 1,095 మీటర్ల మేర పూర్తి కాగా, మిగతా 33 మీటర్ల పనులు వారం రోజుల్లో పూర్తి కానున్నాయి. కేవలం ఐదు నెలల్లో స్పిల్ వే బ్రిడ్జిని దాదాపుగా పూర్తి చేయడం చూస్తేనే పోలవరం పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో అర్ధం అవుతుంది. గేట్ల పనులూ ముమ్మరం పోలవరం స్పిల్ వేకు 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో 48 గేట్లను అమర్చాలి. ఇందుకు 49 పిల్లర్లపై ట్రూనియన్ బీమ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇప్పటికే 28 గేట్లు బిగించారు. మిగిలిన 20 గేట్ల పనులూ వేగంగా సాగుతున్నాయి. వరద వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయాలంటే గేట్లను ఎత్తడానికి, దించడానికి వీలుగా ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చాలి. ఇప్పటికే జర్మనీ నుంచి 70 హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను దిగుమతి చేసుకున్నారు. మిగతా 26 సిలిండర్లను దిగుమతి చేసుకుంటున్నారు. గేట్లకు సిలిండర్లు, పవర్ ప్యాక్‌లు అమర్చడానికి వీలుగా ప్లాట్‌ఫామ్‌లను సైతం సిద్ధం చేస్తున్నారు. గోదావరి వరదల్లోనూ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (ఈసీఆర్ఎఫ్) పనులను నిర్విఘ్నంగా కొనసాగించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలించిన ఈఎన్సీ పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులను ఈఎన్సీ నారాయణరెడ్డి పరిశీలించారు. గురువారం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న ఆయన ఇంజనీరింగ్ అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఈ కె.నరసింహమూర్తి స్పిల్‌వే బ్రిడ్జి నిర్మాణం పనులు, గేట్లు అమరిక, ఎగువ కాఫర్ డ్యామ్ తదితర పనుల వివరాలను తెలియజేశారు. పవర్ ప్రాజెక్టు, కొండ తవ్వకం పనులను కూడా ఈఎన్సీ పరిశీలించారు. (చదవండి: పరుగులు పెడుతున్న ‘పోలవరం’ పనులు) బాబూ.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.. -
పరుగులు పెడుతున్న ‘పోలవరం’ పనులు
పోలవరం రూరల్: అధునాతన సాంకేతికతతో పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే గేట్ల అమరిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. త్వరలో గేట్లకు సిలిండర్లు, పవర్ ప్యాక్‌లను అమర్చుతారు. స్పిల్ వే పిల్లర్స్‌కు 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 25 గేట్ల బిగింపు పనులు పూర్తయ్యాయి. ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్ సిలిండర్లు ఏర్పాటు చేస్తారు. వీటిని జర్మనీలో తయారు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి 70 హైడ్రాలిక్ సిలిండర్లను తరలించారు. మరో 26 జర్మనీ నుంచి రావాల్సి ఉంది. స్పిల్ వే బ్రిడ్జి మొత్తం 1,128 మీటర్లు నిర్మించాల్సి ఉండగా.. 1,000 మీటర్ల బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తయ్యాయి. చదవండి: విద్వేషాలకే వింత రాజకీయం స్పిల్ వే పిల్లర్స్‌పై 192 గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 180 ఏర్పాటు చేశారు. స్పిల్ వే పిల్లర్స్ 55 మీటర్ల ఎత్తు నిర్మించాల్సి ఉండగా.. 54.5 మీటర్ల ఎత్తుకు చేరాయి. స్పిల్ వే, స్పిల్ వే బ్రిడ్జి, స్పిల్ చానల్ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అలాగే కాఫర్ డ్యామ్‌ను ఎత్తు చేసే పనులు, పవర్ హౌస్ నిర్మాణం, గ్యాప్–1, గ్యాప్–2, గ్యాప్–3 పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా ఇంజినీరింగ్ ప్రణాళికలు రూపొందించారు. చదవండి: సెన్సూర్ అధికారం ఎస్ఈసీది కాదు -
పోలవరం నిర్మాణంలో కీలక ఘట్టం
పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు వైఎస్ జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ దిశగానే ప్రాజెక్టు పనులను పరుగులుపెట్టిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టును సందర్శించి ఇరిగేషన్ అధికారులు, పోలవరం నిర్మిస్తున్న మెఘా ఇంజనీరింగ్ నిపుణులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పోలవరంలో మరో కీలక అంకానికి నేడు శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్లో కాంక్రీట్ పనులను ఇరిగేషన్ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ నిపుణులు ఈ రోజు ఉదయం మొదలుపెట్టారు. 2020 జూలైలో వచ్చిన వరదల కారణంగా స్పిల్ ఛానల్ మట్టి పనులు, కాంక్రీట్ పనులు నిలిచిపోయాయి. గతేడాది నవంబర్ 20 నుండి వరద నీటి తొడకం పనులు ప్రారంభించారు. ఇందుకు వరద నీటిని తోడేందుకు దాదాపు 70 భారీ పంపులను ఏర్పాటు చేశారు. నీరు తొలగించిన చోట మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మొదలు పెట్టనున్నారు. ఇప్పటివరకు 2.5 టీఎంసీల నీటిని గోదావరిలో తోడిపోసినట్లు మేఘా ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. నీటి తవ్వకం దాదాపు పూర్తికావడంతో మట్టితవ్వకం, అంతర్గత రహదారుల నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ఇప్పటివరకు 1,10,033 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. స్పిల్ ఛానల్లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగిలిన మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను ఈ ఏడాది జూన్‌లోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. -
‘గ్యాలరీ వాక్’ పేరుతో మరో డ్రామా!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో అక్రమాలు వెలుగుచూసినప్పుడల్లా వాటిని కప్పిపుచ్చి ప్రజల దృష్టిని మరల్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు కొత్త నాటకాలకు తెరతీయడం పరిపాటి! తాజాగా మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.112.47 కోట్లను కాజేసినట్లు అంగీకరించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవడం.. స్పిల్‌వే పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని కేంద్ర నిపుణుల కమిటీ ఇటీవల స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలో వాటిని కప్పిపుచ్చుకోవడానికి పోలవరం హెడ్ వర్క్స్ (జలాశయం)లో స్పిల్ వే గ్యాలరీ పనులు కొలిక్కిరాగానే, ప్రాజెక్టు పూర్తయినట్లుగా ప్రజలను భ్రమిపంజేయాలనే లక్ష్యంతో బుధవారం ‘గ్యాలరీ వాక్’ పేరుతో చంద్రబాబు మరో డ్రామాకు తెరతీశారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్యాలరీ వాక్‌లో పాల్గొంటున్న చంద్రబాబు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా అందరినీ ఆహ్వానిస్తూ భారీఎత్తున పత్రికలు ముద్రించి పంపిణీ చేయడంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. గ్యాలరీ అంటే.. వరద నీటిని దిగువకు విడుదల చేయడానికి వీలుగా నిర్మించే స్పిల్‌వే భద్రత కోసం స్పిల్‌వేకు దిగువన గ్యాలరీ నిర్మిస్తారు. జలాశయంలో నిల్వ ఉండే నీటి ఊర్ద్వపీడనం (ఒత్తిడి)ను స్పిల్‌వేపై పడకుండా చూడటం దీని ముఖ్య ఉద్దేశ్యం. జలాశయంలో నీటి నిల్వవల్ల స్పిల్‌వే కాంక్రీట్ నిర్మాణానికి చెమ్మ తగలడంవల్ల లీకయ్యే నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడేయడం.. జలాశయంలో నీటి నిల్వ, దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని కొలిచేందుకు యంత్రాలను అమర్చడం, స్పిల్‌వేలో ఏవైనా చీలికలు (గ్యాప్) ఏర్పడితే గ్రౌటింగ్ (అధిక ఒత్తిడితో సిమెంటు కాంక్రీట్ మిశ్రమాన్ని పంపడం) చేసి, వాటిని పూడ్చడం ద్వారా స్పిల్‌వే భద్రతను కాపాడటానికి గ్యాలరీ ఉపయోగపడుతుంది. పోలవరం సిŠప్ల్వేకు దిగువన రెండు మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల ఎత్తుతో గ్యాలరీని నిర్మిస్తున్నారు. దీనిని చేరుకోవడానికి వీలుగా 2, 26, 51 బ్లాక్‌ల వద్ద లిఫ్ట్‌లు ఏర్పాటుచేస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిన్న జలాశయం నుంచి భారీ జలాశయం వరకూ అన్ని ప్రాజెక్టుల స్పిల్ వేలకు గ్యాలరీలను ఏర్పాటుచేయడం సర్వసాధారణం. గతంలో ఎప్పుడూ కూడా గ్యాలరీలు పూర్తయినప్పుడు గ్యాలరీ వాక్‌లతో అప్పటి పాలకులు హంగామా చేసిన దాఖలాల్లేవు. కానీ.. పోలవరం విషయంలో గ్యాలరీ నిర్మాణం కొలిక్కి రావడంతోనే ప్రాజెక్టు పూర్తయినట్లుగా సీఎం చంద్రబాబు చిత్రీకరించే యత్నం చేయడంపై అధికార వర్గాలు విస్తుపోతున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు రక్తికట్టించిన ఘట్టాలు.. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ.1981.54 కోట్ల నిధులు విడుదల చేస్తూ చెక్ ఇచ్చిన సందర్భంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయిందనే రీతిలో బిల్డప్ ఇచ్చారు. డిసెంబర్ 30, 2016న పోలవరం హెడ్‌వర్క్స్ స్పిల్‌వేలో కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవానికి శిలాఫలకం ఆవిష్కరణకూ పెద్ద షో నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల బాగోతంపై తీవ్ర విమర్శలు రావడంతో జూన్ 8, 2017న కాఫర్ డ్యామ్ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించారు. ఆ తర్వాత మరోసారి ఎగువ కాఫర్ డ్యామ్ పనులకు మరోసారి సీఎం శంకుస్థాపన చేశారు. 2018 నాటికి ప్రాజెక్టు పూర్తిచేస్తామన్న హామీ నీరుగారిపోయింది. దీనిపై ప్రజల దృష్టి మరల్చడానికి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పునాది (డయా ఫ్రమ్ వాల్)ని జూన్ 11, 2018న జాతికి అంకితం చేసి ప్రాజెక్టు పూర్తయినట్లు కలర్ ఇచ్చారు. -
పొగడ్తలు.. పాదాభివందనాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘అపర భగీరథుడు.. అభినవ కాటన్.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే జనం దృష్టిలో దేవుడు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంత్రులు పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనకు పాదాభివందనం చేయడానికీ పోటీపడ్డారు. మంత్రి రావెల కిషోర్‌బాబు అయితే ఓ కవిత రాయించి గాయనితో పాడించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో స్పిల్ వే కాంక్రీట్ పనులను సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. దీనికి ముందు సుదర్శన, వాస్తు హోమాలు నిర్వహించి.. గోదావరి మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాచింగ్ ప్లాంట్ (కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్)ను ప్రారంభించారు. ఆ తరువాత స్పిల్‌వే వద్ద పూజలు చేసి కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేశారు. తదుపరిఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఏడు ముంపు మండలాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపితేనే ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యమవుతుందని భావిం చి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. ఆ మండలాలను ఏపీలో విలీనం చేయించానని బాబు చెప్పారు. ఈ మండలాలను విలీనం చేయకుంటే తాను ప్రమాణ స్వీకారం చేయబోనని కూడా ప్రధాని వద్ద చెప్పానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని స్పందించి ఏడు మండలాలు విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని, ఇది తన ఘనతేనని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కొత్త భూసేకరణ చట్టం వర్తింపునకు చర్యలు తీసుకున్నామని సీఎం చెప్పారు. ఆ ప్రకారమే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. జనవరి 7, 14వ తేదీల్లో ఇక్కడకు వచ్చి ప్రాజెక్ట్‌కు సంబంధించి డయాఫ్రమ్‌వాల్, గేట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రాజెక్ట్ కోసం సహకరించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నుంచి అందరినీ పేరుపేరునా సభకు పరిచయం చేశారు. పోలవరం స్పిల్‌వే కాంక్రీట్ పనులను పండగలా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అధికారులు జిల్లా నలుమూలల నుంచి భారీగా జనాన్ని సమీకరించారు. 680 బస్సుల్లో పోలవరం ప్రాజెక్ట్ సైట్‌కు ప్రజల్ని తరలించారు. ఇందుకోసం ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించి మరీ బస్సులను తీసుకొచ్చారు. సభకు రాకపోతే ప్రభుత్వం ఇచ్చే పసుపు కుంకుమ సొమ్ము రూ.3 వేలు ఆగిపోతాయని గోపాలపురం మండల టీడీపీ కార్యకర్తలు మహిళలను బెదిరించి బస్సులు ఎక్కించగా, నల్లజర్ల మండలంలో సభకు రాని మహిళలకు రూ.300 చొప్పున జరిమానా విధిస్తామని బెదిరించారు. ఆచంట నుంచి 78 స్కూల్ బస్సుల్లో మహిళల్ని తీసుకొచ్చారు. సభకు రాకపోతే సోపానం ఇంటర్వూ్యల్లో లబ్ధిదారులను పక్కన పెడతారని, కొత్త ఇళ్లు మంజూరు చేయరని, డ్వాక్రా గూపు సభ్యులకు రుణాలు మంజూరు చేయరని అధికారులు ప్రచారం చేసి మహిళలను, వివిధ పథకాల లబ్ధిదారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు. నరసాపురం, సమీప గ్రామాల నుంచి ప్రైవేట్ కళాశాలలకు చెందిన బస్సులలో జనాన్ని తీసుకెళ్లారు. ఈ ప్రాంతం నుంచి మహిళలు తక్కువ సంఖ్యలోనే వెళ్లారు. మనిషికి రూ.300 వరకూ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రసంగాలు మూడు గంటలకు పైగా సాగడంతో జనమంతా మధ్యలోనే సభ నుంచి తిరుగుముఖం పట్టారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రతిజ్ఞ చేయించే సమయానికి సభాస్థలిలో పోలీసులు, మీడియా ప్రతినిధులు మాత్రమే మిగిలారు. పొరుగు జిల్లాల నుంచీ జనం తరలింపు పోలవరం/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజలను తరలించారు. కొవ్వూరు నుంచి పోలవరం వరకు ఏటిగట్టు రోడ్డు సింగిల్ లేన్ కావడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గూటాల సమీపంలో గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. దీంతో కొత్త పట్టిసీమ నుంచి గూటాల వరకు బస్సులను మళ్లించారు. పోలవరం నుంచి తాళ్లపూడి మార్గంలో ఆర్టీసీ బస్సులు నడపకపోగా, ఆటోల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని ఎత్తైన ఘాట్ రోడ్లపైకి బస్సులు వెళ్లేందుకు మలుపుల వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సభకు వచ్చిన జనం భయాందోళనకు లోనయ్యారు. సభ ముగిసిన తరువాత వాహనాలన్నిటినీ ఒకే మార్గంలో మళ్లించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. సభా ప్రాంగణానికి వెళుతున్న మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనను చూసి పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. -
రేపు స్పిల్‌వే కాంక్రీటు పనులు ప్రారంభం
జలవనరుల శాఖ మంత్రి దేవినేని పోలవరం: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే కాంక్రీట్ పనులను సీఎం చంద్రబాబు ఈనెల 30న ప్రారంభిస్తాని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. బుధవారం ఆయన ఇరిగేషన్ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, కలెక్టర్ కె.భాస్కర్‌తో కలిసి కాంక్రీట్ పనులు ప్రారంభించే ప్రదేశాన్ని, సీఎం సభావేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, 2018 నాటికి ప్రాజెక్ట్ పూర్తిచేసి పొలాలకు నీరందిస్తామన్నారు. వచ్చే సంక్రాంతి నుంచి డయా ఫ్రమ్‌వాల్ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంక్రీట్ పనులు ప్రారంభించిన అనంతరం సీఎం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఎస్ఈ వీఎస్ రమేష్‌బాబు, ఈఈ కుమార్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ ఎస్సీఎంటీ రాజు, ట్రాన్స్ట్రాయ్ వైస్ ప్రెసిడెంట్ ఎ.తిరుమలేశు, ఆర్డీవోలు, డీఎస్పీలు పాల్గొన్నారు. చురుగ్గా ఏర్పాట్లు పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే కాంక్రీట్ పనులు ప్రారంభానికి సీఎం రానున్న నేపథ్యంలో కాంక్రీట్ వేసే ప్రాంతంలో, బహిరంగసభ ప్రాంతంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. స్పిల్‌వే ఫౌండేషన్ పక్కనే 70 ఎకరాల్లో సభావేదికను ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 50 వేల మంది రానున్నారనే అంచనాలతో ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు అధిక సంఖ్యలో విధులకు హాజరయ్యారు. -
నెలాఖరుకు పోలవరం స్పిల్‌వే నిర్మాణ పనులు
ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణానికి కాంక్రీట్ వేసే పనులను ఈనెలాఖరుకు ప్రారంభిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.ఆదివారం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అజయకుమార్, జియాలజిస్ట్ జి.జె.ఎస్.ప్రసాద్, పోలవరం అథారిటీ సలహాదారులు ఆర్.కె.గుప్తా, డి.పి.బార్గవ్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి స్పిల్‌వే ప్రాంతంలో పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంక్రీట్ పనులు ప్రారంభిచేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. స్పిల్‌వే గేట్లను పోలవరం నిర్మాణ ప్రాంతంలో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెటీరియల్‌ను తరలిస్తున్నామన్నారు. గేట్ల తయారీకి అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపామన్నారు. సోమవారం వర్చువల్ తనిఖీలో భాగంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పోలవరం çపనులపై సమీక్షిస్తారని తెలిపారు. వాస్తవానికి ఈనెల 19న ముఖ్యమంత్రి స్పిల్‌వే కాంక్రీట్ çపనులను ప్రారంభించాల్సి ఉంది. పనులు పూర్తికాకపోవడంతో దీనిని ఈనెలాఖరునాటికి వాయిదా వేశారు. పనుల పరిశీలనలో ప్రాజెక్టు ఎస్ఈ వి.ఎస్.రమేష్‌బాబు, గేట్ల మెకానికల్ డైరెక్టర్ కె.కన్నమనాయుడు, ఈఈలు ఎన్,పుల్లారావు, ఎన్.చంద్రరావు ఉన్నారు. షేర్జోన్ రాయి బలోపేతం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేకు కాంక్రీట్ వేసే ప్రాంతంలో షేర్జోన్ అనే రాయి ఉందని, ఇది బలహీనంగా ఉందని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. 2.5 మీటర్ల పరిధిలో ఈ రాయి ఉందని, దీనిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. లూజ్ సాయిల్‌ను తొలగించి, ప్రత్యేక కాంక్రీట్ వేశాక ముందుకు వెళ్తామన్నారు. కాంక్రీట్ పనులకు జియాలజికల్ సర్వే ఆప్ ఇండియా అనుమతి రావాల్సి ఉందన్నారు. -
నెలాఖరుకు పోలవరం స్పిల్‌వే నిర్మాణ పనులు
ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణానికి కాంక్రీట్ వేసే పనులను ఈనెలాఖరుకు ప్రారంభిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు.ఆదివారం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అజయకుమార్, జియాలజిస్ట్ జి.జె.ఎస్.ప్రసాద్, పోలవరం అథారిటీ సలహాదారులు ఆర్.కె.గుప్తా, డి.పి.బార్గవ్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావుతో కలిసి మంత్రి స్పిల్‌వే ప్రాంతంలో పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంక్రీట్ పనులు ప్రారంభిచేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు. స్పిల్‌వే గేట్లను పోలవరం నిర్మాణ ప్రాంతంలో తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెటీరియల్‌ను తరలిస్తున్నామన్నారు. గేట్ల తయారీకి అనుమతుల కోసం సీడబ్ల్యూసీకి ప్రతిపాదనలు పంపామన్నారు. సోమవారం వర్చువల్ తనిఖీలో భాగంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పోలవరం çపనులపై సమీక్షిస్తారని తెలిపారు. వాస్తవానికి ఈనెల 19న ముఖ్యమంత్రి స్పిల్‌వే కాంక్రీట్ çపనులను ప్రారంభించాల్సి ఉంది. పనులు పూర్తికాకపోవడంతో దీనిని ఈనెలాఖరునాటికి వాయిదా వేశారు. పనుల పరిశీలనలో ప్రాజెక్టు ఎస్ఈ వి.ఎస్.రమేష్‌బాబు, గేట్ల మెకానికల్ డైరెక్టర్ కె.కన్నమనాయుడు, ఈఈలు ఎన్,పుల్లారావు, ఎన్.చంద్రరావు ఉన్నారు. షేర్జోన్ రాయి బలోపేతం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేకు కాంక్రీట్ వేసే ప్రాంతంలో షేర్జోన్ అనే రాయి ఉందని, ఇది బలహీనంగా ఉందని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు చెప్పారు. 2.5 మీటర్ల పరిధిలో ఈ రాయి ఉందని, దీనిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. లూజ్ సాయిల్‌ను తొలగించి, ప్రత్యేక కాంక్రీట్ వేశాక ముందుకు వెళ్తామన్నారు. కాంక్రీట్ పనులకు జియాలజికల్ సర్వే ఆప్ ఇండియా అనుమతి రావాల్సి ఉందన్నారు. -
స్పిల్‌వే గేట్ల నుంచి వరద నీరు
బోయినపల్లి: మధ్యమానేరు జలాశయం రివర్ స్లూయిస్ (బేస్మెట్ లెవల్ గేట్స్) నుంచి తొలిసారి వరదనీరు ప్రవహిస్తోంది. ప్రవాహం ఎక్కువైతే ఇక్కడి నుంచి వరదనీరు నేరుగా ఎల్ఎండీలోకి చేరే అవకాశం ఉంది. మిడ్‌మానేరు జలాశయం నిర్మాణం జరుగక ముందు మూలవాగు వరదనీరు మానేరు మీదుగా ఎల్ఎండీలోకి చేరేది. ప్రస్తుతం జలాశయం నిర్మాణం పనులు జరుగుతుండగా వేములవాడ మూలవాగు, సిరిసిల్ల వాగుల నుంచి వస్తున్న వరదనీరు మానేరులోకి చేరుతోంది. స్పిల్‌వే బెడ్‌లెవల్‌లో ఏర్పాటు చేసిన నాలుగు గేట్ల నుంచి మూడు గేట్ల ద్వారా వరద నీరు ప్రవహిస్తున్నట్లు మిడ్‌మానేర్ డీఈఈ రాజు తెలిపారు. రిజర్వాయర్ స్పిల్‌వే నుంచి మొదటిసారిగా వరదనీరు ప్రవహిస్తుండడంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. -
మిడ్‌మానేరుతో సాగులోకి బీడుభూములు..
2017 కల్లా మధ్యమానేరు పనులు పూర్తి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా మరో కోనసీమ మధ్యమానేరు ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి ఈటల ఇల్లంతకుంట/ బోయినపల్లి : మధ్యమానేరు ప్రాజెక్టుతో జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని, ఏళ్ల తరబడిగా సాగుకు నోచుకోని బీడుభూములన్నీ సాగులోకి వస్తాయని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, బోయినల్లిపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మిస్తున్న మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు. నాటì కాంగ్రెస్ సర్కార్ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిందే తప్ప ఒక్క ప్రాజెక్టును పూర్తి చే యలేదన్నారు. కాంగ్రెస్ పాపాల కారణంగానే ప్రాజెక్టులు అర్ధంతంగా ఆగిపోయాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి బీడుభూములకు సాగునీరివ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. హుస్నాబాద్ ప్రాంతంలో గండిపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్లు నిర్మించి సాగునీరందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ, మధ్యమానేరు ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా మరో కోనసీమగా మారబోతుందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ఎస్సారెస్పీ వరదకాల్వ ద్వారా మధ్యమానేరులో 3టీఎంసీల నీరు నిల్వ చేస్తామని చెప్పారు. 2017 జూన్ నాటికి మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ వరద నీటిని వరదకాలువల ద్వారా మధ్యమానేరు ప్రాజెక్ట్ మీదుగా ఎల్ఎండీలో నింపేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎస్ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ అశోక్‌కుమార్, డీఈలు రాజు, శ్రీనివాస్ ఉన్నారు. -
నత్తే నయం
పోలవరం, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ నిర్మాణ పనులు నత్తతో పోటీ పడుతున్నాయి. స్పిల్‌వే, ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం, పవర్ హౌస్ పనులను ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ చేపట్టింది. ఏడాది గడచినా నిర్మాణాన్ని వేగవంతం చేయలేదు. స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్ హౌస్ నిర్మాణాల కోసం అడ్డుగా ఉన్న కొండలను బ్లాస్టింగ్ ద్వారా తొలగించడం, అవసరమైన చానళ్లను తవ్వడం వంటి ఎర్త్ వర్క్ పనులు చేస్తున్నారు. నిర్దేశించిన ప్రకారం రోజుకు 1.50 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేయాలి. కానీ.. కేవలం 40 నుంచి 50 వేల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. అధునాతన యంత్రాలను ఉపయోగించాల్సి ఉన్నప్పటికీ కాంట్రాక్టు ఏజెన్సీ వాటిని పని ప్రాంతానికి తీసుకురావడం లేదు. స్పిల్‌వే నిర్మాణ ప్రాంతం వద్ద ఇంకా 5 నుంచి 15 మీటర్ల లోతున తవ్వకాలు సాగించాల్సి ఉంది. పనులు ఇలాగే కొనసాగితే గడువు నాటికి పూర్తికావని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అధునాతన యంత్రాలను తీసుకువచ్చి పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు కాంట్రాక్టు ఏజెన్సీకి నోటీసులు జారీచేసినా ప్రయోజనం కనిపిం చడం లేదు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 2015 జూన్ నాటికి ఎర్త్ వర్క్ పనులను పూర్తిచేసి గోదావరి నీటిని స్పిల్ చానల్ ద్వారా మళ్లించాల్సి ఉంది. 2015 డిసెంబర్ నాటికి నదిలో కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయూలి. అనంతరం నదిలో ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం పనులు చేపట్టి 2018 నాటికి పూర్తి చేయాలి. అక్కడి పరిస్థితిని చూస్తే గోదావరి నీటిని స్పిల్ చానల్‌కు తరలించే సమయానికి కూడా ఎర్త్ వర్క్ పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ పనులను తరచూ కొన్ని రోజులపాటు నిలి చిపోతున్నారుు. ఇదేమని అధికారులు అడుగుతుంటే.. డీజిల్ కొరత కారణంగా పనులకు అంతరాయం కలుగుతోందని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం కాదని అధికారులు పేర్కొంటున్నారు.