పోలవరం ప్రాజెక్ ్ట స్పిలేవే పిల్లర్లపై గడ్డర్లను ఏర్పాటు చేస్తున్న దృశ్యం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. స్పిల్ వేకు 192 గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియను రికార్డు సమయం లో ప్రభుత్వం పూర్తి చేసింది. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు. ప్రపంచంలో సాగు నీటి ప్రాజెక్టుల స్పిల్ వేల్లో ఇంత బరువైన గడ్డర్లను వినియోగించ డం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా 1,128 మీటర్ల పొడవుతో స్పిల్ వేను నిర్మిస్తున్నారు. స్పిల్ వేకు 49 పిల్లర్లను (పియర్స్) 52 మీటర్ల ఎత్తున ఇటీవల ప్రభుత్వం రికార్డు సమయంలోనే పూర్తి చేసింది.
తాజాగా వాటిపై గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ
పూర్తయ్యింది. గడ్డర్ల మధ్య షట్టరింగ్ స్లాబ్ వేసి స్పిల్ వే బ్రిడ్జిని నిరి్మంచాలి. స్పిల్ వే బ్రిడ్జిపై ఏర్పాటుచేసే హైడ్రాలిక్ హాయిస్ట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా గేట్లను ఎత్తడం, దించడం చేస్తారు.
ఒక్కో గడ్డర్‌కు 10 టన్నుల స్టీల్
స్పిల్ వేకు 49 పిల్లర్ల మధ్య 192 గడ్డర్లు ఉంటాయి. ఒక గడ్డర్ తయారీకి పది టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. గత సర్కార్ హయాంలో ఒక్క గడ్డర్‌ను కూడా తయారు చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పిల్ వే పిల్లర్లను 52 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసి, వాటి మధ్య గడ్డర్లు, షట్టరింగ్‌తో స్పిల్ వే బ్రిడ్జి నిర్మించే పనులను ప్రణాళికా బద్దంగా చేపట్టింది. గతేడాది ఫిబ్రవరి 17న గడ్డర్ల తయారీని ప్రారంభించింది. 192 గడ్డర్ల తయారీకి 1,920 టన్నుల స్టీల్, 4,800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించింది. పిల్లర్లపై గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ గతేడాది జూలై 6న ప్రారంభించింది.
కరోనా, వరద ఉధృతి అడ్డంకిగా మారినా లెక్క చేయకుండా పనులు కొనసాగించి శనివారం రాత్రి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. కేవలం ఏడు నెలల్లోనే గడ్డర్ల ప్రక్రియ పూర్తి అయ్యిందన్నమాట. మరోవైపు 1,105 మీటర్ల పొడవున ఇప్పటికే స్పిల్ వే బ్రిడ్జిని ప్రభుత్వం పూర్తి చేసింది. మిగిలిన 23 మీటర్ల స్పిల్ వే బ్రిడ్జి పనులను ఈనెల 25 నాటికి పూర్తి చేస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి. మే నాటికి స్పిల్ వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేసి.. జూన్‌లో గోదావరికి వచ్చే వరదను స్పిల్ వే మీ దుగా మళ్లించి, 2022 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు.
గడ్డర్ అంటే..
గడ్డర్ అంటే కాంక్రీట్ దిమ్మె. దీనిని రెండు పిల్లర్ల మీద అటువైపు రెండు, ఇటువైపు రెండు ఏర్పాటు చేస్తారు. గడ్డర్ల మధ్య ఇనుప చువ్వల షట్టరింగ్‌తో కాంక్రీట్ స్లాబ్ వేస్తారు. ఈ విధంగా 49 పిల్లర్ల మధ్య వేస్తే స్పిల్‌వే బ్రిడ్జి రెడీ అవుతుంది.
గడ్డర్ పొడవు-23 మీటర్లు
ఎత్తు-2 మీటర్లు
బరువు-62 టన్నులు
చదవండి: 2022 నాటికి పోలవరం పూర్తి: ఏబీ పాండ్యా
నడిరోడ్డుపై విజయవాడ టీడీపీ నేతల రచ్చ
Comments
Please login to add a commentAdd a comment