సాక్షి, నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారటంతో సోమవారం అధికారులు ఆరు గేట్లు ఓపెన్ చేశారు. అంతకుముందు ప్రజలను అప్రమత్తం చేసేందుకు సైరన్ వేశారు. ఆరు గేట్లను ఐదు ఫీట్ల ఎత్తువరకు ఇరిగేషన్ అధికారులు తెరిచి దిగువకు నీటిని విడుదల చేశారు. ఒక్కో గేటు నుంచి 5-10 వేల క్యూసెక్కుల నీటీని విడుదల అవుతోంది.
Nagarjuna Sagar Project under the Krishna River, 6 flood Gates opened and Released Water. today in Nalgonda District, Telangana State pic.twitter.com/XhtZnMCrhL
— K. N. Hari (@KNHari9) August 5, 2024
శ్రీశైలం నుంచి సారగ్‌లోకి వరద పోటెత్తుతోంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ఇప్పటికే 580 అడగుల వరకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 3,22,817 క్యూసెక్కుల నీరు చేరుతుండగా. కుడి, ఎడమ కాలువల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 37,873 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటినిల్వ 576.1 అడుగుల్లో 271.9 టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 312.05 టీఎంసీలు కాగా మరో 41 టీఎంసీలు చేరితే సాగర్ పూర్తిగా నిండిపోతుంది.
- నాగార్జునసాగర్ కు కొనసాగుతున్న భారీ వరద
- 6 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల
- ఇన్ ఫ్లో: 323748 క్యూసెక్కులు
- అవుట్ ఫ్లో: 83331 క్యూసెక్కులు
- పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు
- ప్రస్తుత నీటి మట్టం: 582.60 అడుగులు
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలు
- ప్రస్తుత నీటి నిల్వ: 290.5140 టీఎంసీలు
- కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
Comments
Please login to add a commentAdd a comment