మిడ్‌మానేరుతో సాగులోకి బీడుభూములు..
-
2017 కల్లా మధ్యమానేరు పనులు పూర్తి
-
ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా మరో కోనసీమ
-
మధ్యమానేరు ప్రాజెక్టు పనులు పరిశీలించిన మంత్రి ఈటల
ఇల్లంతకుంట/ బోయినపల్లి : మధ్యమానేరు ప్రాజెక్టుతో జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీరందుతుందని, ఏళ్ల తరబడిగా సాగుకు నోచుకోని బీడుభూములన్నీ సాగులోకి వస్తాయని రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, బోయినల్లిపల్లి మండలం మాన్వాడ వద్ద నిర్మిస్తున్న మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు. నాటì కాంగ్రెస్ సర్కార్ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసిందే తప్ప ఒక్క ప్రాజెక్టును పూర్తి చే యలేదన్నారు. కాంగ్రెస్ పాపాల కారణంగానే ప్రాజెక్టులు అర్ధంతంగా ఆగిపోయాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసి బీడుభూములకు సాగునీరివ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. హుస్నాబాద్ ప్రాంతంలో గండిపల్లి, గౌరవెల్లి రిజర్వాయర్లు నిర్మించి సాగునీరందించేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. మేడిగడ్డ, మధ్యమానేరు ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా మరో కోనసీమగా మారబోతుందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో ఎస్సారెస్పీ వరదకాల్వ ద్వారా మధ్యమానేరులో 3టీఎంసీల నీరు నిల్వ చేస్తామని చెప్పారు. 2017 జూన్ నాటికి మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ వరద నీటిని వరదకాలువల ద్వారా మధ్యమానేరు ప్రాజెక్ట్ మీదుగా ఎల్‌ఎండీలో నింపేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, ఈఈ అశోక్‌కుమార్, డీఈలు రాజు, శ్రీనివాస్ ఉన్నారు.