panyam
-
ఓటర్లకు నేరుగా డబ్బులు పంపిణీ చేసిన టీడీపీ నేత మోహన్ రెడ్డి
-
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
-
పూలు, పండ్ల మొక్కలతో పాటు కూరగాయల నారు పెంపకం
-
ఉపాధ్యాయుడి హత్య: భార్యే హంతకురాలు.. వివాహేతర సంబంధంతో..
పాణ్యం (నంద్యాల జిల్లా): మండల కేంద్రమైన పాణ్యంలో గత నెల 14వ తేదీ జరిగిన ఉపాధ్యాయుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత భార్యనే దారుణంగా హత్యకు పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. సోమవారం నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి పాణ్యం సర్కిల్ కార్యాలయంలో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసు వివరాలను వెల్లడించారు. పాణ్యంకు చెందిన షేక్ జవహర్ హుసేన్ బనగానపల్లె మండలం చెరువుపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. ఇతనికి భార్య షేక్ హసీనా, కుమారుడు తమీమ్, కుమార్తె ఆర్పియా ఉన్నారు. కొంత కాలంగా హసీనాకు అదే ప్రాంతానికి చెందిన మహబూబ్‌బాషాతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. అయితే ఈ విషయం తెలిసి జవహార్ హుసేన్ పెద్దల సమక్షంలో మందలించి మహబూబ్‌బాషాను గ్రామం నుంచి ఓర్వకల్లు మండలం హుసేనాపురం పంపించారు. చదవండి: (భార్యను కడతేర్చి బకెట్లో పెట్టి.. ఆపై నాంపల్లికి వెళ్లి..) అయినా హసీనా, మహబూబ్‌బాషలు తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం గమనించిన జవహర్ హుసేన్ భార్యను వేధించాడు. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని ఆమె తమ్ముడు ఇద్రూస్, ప్రియుడు మహబూబ్‌బాషాతో కలసి కుట్ర పన్నింది. గత నెల 13వ తేదీన చంపాలని పథకం రూపొందించారు. ఇందులో భాగంగానే ఇద్దరి పిల్లలను తన తల్లి ఇంటికి పంపించింది. ఆ రోజు జవహర్ ఉసేన్ పాణ్యం మండలం మద్దూరులో ఇస్తెమాకు వెళ్లి రాత్రి 10 గంటలకు ఇంటికి చేరుకుని నిద్రించాడు. అప్పటికే ఇంటిపైన ఉన్న ఇద్రూస్, మహబూబ్‌బాషా అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లి హసీనాతో కలసి జవహర్ హుసేన్ కాళ్లకు తాడు కట్టి గొంతునొక్కి చంపేశారు. వివరాల వెల్లడిస్తున్న నంద్యాల డీఎస్పీ మహేశ్వరెడ్డి ఆ తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా జవహర్ ఉసేన్‌కు ఆస్తమా ఉందని ఊపిరాడక పలకడం లేదని బంధువులకు సమాచారం ఇచ్చి శాంతిరాం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అయితే తన అన్నకు ఆస్తమా ఉన్నా మందులు సక్రమంగా వాడుతుండటంతో చనిపోయే తీవ్రత లేదని, మృతికి ఇతర కారణాలు ఉండవచ్చని జవహర్ హుసేన్ తమ్ముడు కరిముల్లా అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోస్టుమార్టం నివేదిక మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా భార్యనే హత్యకు పాల్పడినట్లు తేల్చారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, హత్యకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడి హత్య కేసును ఛేదించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ సుధాకర్‌రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
నాడు అధ్వానం.. నేడు సరికొత్త రూపం
కర్నూలు(అర్బన్): రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. విరివిగా నిధులను విడుదల చేస్తూ రహదారుల రూపు రేఖలు మారుస్తోంది. దీంతో పల్లెల నుంచి పట్టణాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల ప్రయాణ కష్టాలు తొలగి పల్లె ప్రాంతాలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. గుంతలు పడి, కంకర తేలి నడవడానికి వీలు లేని రోడ్లు సైతం నేడు పూర్తిగా మారిపోయాయి. ఆయా రహదారుల్లో వాహనాల వేగం ఊపందుకుంది. గ్రామీణ ప్రాంతాల రోడ్లను అభివృద్ధి చేసే బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం తీసుకుంది. మండలాల నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్లను అభివృద్ధి చేయడం, జిల్లా రహదారులను మరమ్మతు చేయడం.. తదితర బాధ్యతలు ఆర్అండ్బీ ఇంజినీర్లు చూసుకుంటున్నారు. ఇరు జిల్లాల్లో 100 పనులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.107.61 కోట్ల రుణం ఇవ్వగా 494.500 కిలోమీటర్ల జిల్లా రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. వీటిలో మొత్తం 70 పనులకు గాను 14 పూర్తయ్యాయి. పురోగతిలో 17 పనులు ఉండగా, మిగిలిన వాటిలో 37 ప్రారంభం కావాల్సి ఉంది. రెండు పనులు టెండర్ దశలో ఉన్నాయి. అలాగే రాష్ట్ర రహదారులకు కాలానుగుణంగా మరమ్మతులు, నిర్వహణకు సంబంధించి రూ.78.49 కోట్లతో 209.270 కిలోమీటర్ల మేర 30 పనులను చేపట్టారు. ఇప్పటికే రూ. 23.69 కోట్లతో 68.930 కిలోమీటర్ల మేర 14 పనులను పూర్తి చేశారు. మిగిలిన వాటిలో 8 పనులు పురోగతిలో ఉండగా, మరో 8 పనులను త్వరలో ప్రారంభించనున్నారు. రెండు లేన్ల రోడ్లు.. న్యూడెవలప్‌మెంట్ బ్యాంకు రుణంతో రెండు జిల్లాల్లో రూ.314.31 కోట్ల వ్యయంతో మొత్తం 147.18 కిలోమీటర్ల మేర మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు లేన్ల రోడ్లను నిర్మించనున్నారు. ఈ పనులకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘డబుల్’ ఆనందం కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయునిపేట నుంచి సంజామల మండలం రెడ్డిపల్లె వరకు రోడ్డు అధ్వానంగా ఉండేది. గుంతలు పడి రాకపోకలు సాఫీగా సాగేవి కావు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వాహనదారుల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని మొత్తం 19 కిలోమీటర్ల మేర రూ.19.50 కోట్లతో డబుల్ రోడ్డుగా మార్చింది. సరికొత్త రూపును దిద్దుకున్న ఈ రోడ్డుపై ప్రస్తుతం వాహనాలు రయ్..రయ్ అని దూసుకుపోతున్నాయి. రాకపోకలు సురక్షితం పాణ్యం మండలం కొణిదేడు నుంచి మద్దూరు వరకు సింగిల్ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండేది. వైద్యం నిమిత్తం మద్దూరు ఆసుపత్రికి వెళ్లాలంటే అవస్థలు తప్పేవి కావు. ప్రజల కష్టాలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 కోట్లు ఖర్చు చేసి దీనిని డబుల్ రోడ్డుగా మార్చింది. వారం క్రితమే పనులు పూర్తయ్యాయి. మొత్తం 11 కిలోమీటర్ల రహదారిపై రాకపోకలు మెరుగుపడ్డాయి. ప్రయాణ కష్టాలు తీరాయి. వివిధ గ్రామాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. తొలగిన ‘దారి’ద్య్రం గోనెగండ్ల మండలం పెద్ద మరివీడు నుంచి పెద్ద నేలటూరుకు వెళ్లాలంటే మట్టి రోడ్డే దిక్కయ్యేది. రాళ్లు తేలి నడవడానికి సైతం ఇబ్బందిగా ఉండేది. సుమారు 10 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డుపై ప్రయాణం నరకాన్ని చూపేది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారిని రూ. 2.48 కోట్లతో బీటీ రోడ్డుగా మార్చింది. దీంతో రైతులు సులువుగా ఎమ్మిగనూరుకు పంట ఉత్పత్తులు తరలిస్తున్నారు. గూడూరుకు రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. సాఫీగా ప్రయాణం మండలకేంద్రమైన కౌతాళం నుంచి ఉరుకుంద వరకు 6 కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రోడ్డుపై నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఉరుకుంద ఈరన్న స్వామి దర్శనార్థం వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గతుకుల రోడ్డుపై అవస్థలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం రూ.1.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. పక్షం రోజుల క్రితం పనులు పూర్తవడంతో ఈ రహదారిపై భక్తుల ఇక్కట్లు తొలగిపోయాయి. ఐదు గ్రామాలకు ఎంతో ఉపయోగం కరివేముల నుంచి ఐరన్‌బండ బీ సెంటర్ వరకు రూ.1.20 కోట్లతో 5 కిలోమీటర్ల మేర రోడ్డు వేశారు. దీంతో ఐదు గ్రామాలకు ఎంతో మేలు జరిగింది. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్లం. గుంతలు పడి కంకర తేలడంతో పలు ప్రమాదాలు కూడా జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రోడ్డు బాగుపడింది. – నరసింహయ్య, గుమ్మరాళ్ల, దేవనకొండ మండలం ఇబ్బందులు లేవు గతంలో కడ్డీల వంక నుంచి రామదుర్గం క్రాస్ రోడ్డు వరకు ప్రయాణించాలంటే అనేక ఇబ్బందులు పడేవాళ్లం. గతంలో ఈ రోడ్డును బాగు చేయాలని విన్నవించినా, ఫలితం కనిపించ లేదు. ప్రస్తుత ప్రభుత్వం రూ.70 లక్షలతో 1.50 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును నిర్మించింది. నెల రోజుల క్రితం పనులు పూర్తయ్యాయి. రామదుర్గం గ్రామానికి, పొలాలకు వెళ్లేందుకు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. – రాఘవయ్య, నగరడోణ, చిప్పగిరి మండలం నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి బ్యాంకు రుణంతో చేపట్టిన అన్ని పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. రెండు జిల్లాల్లో ఇప్పటికే రూ.44.32 కోట్లతో 28 పనులు పూర్తయ్యాయి. అలాగే ఫేజ్–1 కింద ఎన్డీబీ రుణంతో చేపట్టనున్న 12 పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఎన్డీబీ ఫేజ్–2 కింద 77.57 కి.మీ మేర రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాం. – శ్రీధర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ -
ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
-
‘డయేరియా’ బాధ్యులపై సస్పెన్షన్ వేటు
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు, ఆదోనిలోని అరుంజ్యోతి నగర్లో తాగునీరు కలుషితమవుతున్నా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి డయేరియా ప్రబలడానికి కారణమైన నలుగురు ఉద్యోగులను జిల్లా కలెక్టర్ వీరపాండియన్ శనివారం సస్పెండ్ చేశారు. మరో నలుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాణ్యం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బి.పవన్‌కుమార్, గోరుకల్లు పంచాయతీ సెక్రటరీ జి.విజయభాస్కర్, ఆదోని మునిసిపాలిటీ వాటర్ సప్లై ఏఈ టి.రాజశేఖరరెడ్డి, వాటర్ సప్లై టర్న్ కాక్ ఎం.ఈరన్నలను సస్పెండ్ చేశారు. అలాగే పాణ్యం ఈవోఆర్డీ కె.భాస్కరరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎన్.ఉమాకాంత్‌రెడ్డి, ఆదోని మునిసిపాలిటీ వాటర్ సప్లై డీఈవో జి.సురేష్, వాటర్ సప్లై ఈఈ ఎ.సత్యనారాయణలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విచారణ కమిటీల నియామకం డయేరియా ప్రబలడానికి కారణాల అన్వేషణ, భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ విచారణ కమిటీలను నియమించారు. ఆదోనిలోని అరుంజ్యోతి నగర్లో విచారణ కోసం ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి నేతృత్వంలో అనంతపురం జిల్లా పబ్లిక్ హెల్త్ ఎస్ఈ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఎస్ఈ సురేంద్రబాబుతో కమిటీ వేశారు. గోరుకల్లులో విచారణ కోసం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి నేతృత్వంలో కర్నూలు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విద్యాసాగర్, డీపీవో కేఎల్ ప్రభాకరరావు సభ్యులుగా కమిటీని నియమించారు. -
నాడు దొంగలుగా ముద్ర.. నేడు రైతులుగా దర్జా
కర్నూలు (అర్బన్): ఇదెలా సాధ్యమయ్యిందంటే.. ఈ చెంచులను చూసి అప్పట్లో నంద్యాలలో డీఎస్పీగా పనిచేస్తున్న కాశీనాథ్ చలించిపోయారు. వీరికి పునరావాసం కల్పించి సన్మార్గంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు ప్రారంభించారు. అందుకు జిల్లా కలెక్టర్ పాణ్యంలో ప్రత్యేకంగా చెంచు కాలనీ ఏర్పాటు చేసి, 43 ఎకరాల భూమిని కేటాయించారు. వీరికి వ్యవసాయం నేర్పేందుకు జిల్లా గిరిజన సంక్షేమాధికారికి బాధ్యతలు అప్పగించారు. సాగుకు అనుకూలంగా రెండు బోర్లు వేయడంతో పాటు గోరుకల్లు రిజర్వాయర్ నీటితో చెంచులకు వ్యవసాయం కలిసివచ్చింది. అప్పట్లో దొంగలుగా ముద్ర పడిన చెంచులు.. నేడు రైతులుగా దర్జాగా జీవనం సాగిస్తున్నారు. నాడు... పిడికెడు మెతుకుల కోసం.. ఎండల్లో ఎండుతూ, వానల్లో తడుస్తూ అడవుల్లోనే మగ్గిపోయారు. చదువు లేదు, ప్రభుత్వ పథకాలంటే తెలియదు. కొందరు అడవుల్లో పక్షులు, చిన్న చిన్న జంతువులను వేటాడితే, మరి కొందరు భూస్వాముల పొలాలకు కాపాలాగాళ్లుగా జీవనం గడిపేవారు. ఒకరిద్దరి తప్పిదం వల్ల కర్నూలు– నంద్యాల రహదారిపై, నంద్యాల చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా, పోలీసులు వీరినే అనుమానించి స్టేషన్‌కు తీసుకువెళ్లి కేసులు నమోదు చేసేవారు. ఇదంతా.. 40 ఏళ్ల కిందటి మాట. నేడు... పాణ్యంలో ప్రత్యేకంగా ఏర్పడిన చెంచు కాలనీలోని మెజారిటీ ఇళ్లలో ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మిషన్, గ్యాస్ స్టవ్‌లు దర్శనమిస్తున్నాయి. దాదాపు 20 మంది యువకులు సొంత ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ కాలనీకి చెందిన వారిలో.. ఇద్దరు అంగన్వాడీలు, నలుగురు వలంటీర్లు, ఒక హోంగార్డు, ఒకరు ప్రభుత్వ కళాశాలలో ల్యాబ్ అసిస్టెంట్, మరొకరు గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో ప్రిన్సిపాల్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు. పొలం కావలికి 10 పళ్ల వడ్లు ఇచ్చేవారు 40 ఏళ్ల కిందట కొండజూటూరు గ్రామ పరిసరాల్లోని అడవుల్లో ఉండేవాళ్లం. అక్కడి రైతుల పొలాలకు రాత్రి, పగలు కావలి కాస్తే ఒక ఎకరాకు 10 పళ్ల (8 కేజీలు) వడ్లు ఇచ్చేవారు. కావలి పనులు చేస్తున్నా.. ఎక్కడ దొంగతనాలు జరిగినా, పోలీసులు మమ్మల్నే తీసుకుపోయేవారు. – దాసరి పెద్ద ఓబులేసు కాశీనాథ్, సుధాకరయ్య కృషి వల్లే.. అడవుల్లో దుర్భరమైన జీవితాలను గడుపుతున్న మా అభివృద్ధికి అప్పటి నంద్యాల డీఎస్పీ కాశీనాథ్, పాణ్యం గ్రామ పెద్ద సుధాకరయ్య ఎంతో కృషి చేశారు. ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేయించి, వ్యవసాయ భూమిని ఇప్పించారు. – మేకల సుబ్బరాయుడు, మాజీ సర్పంచ్ 30 నుంచి 40 బస్తాలు పండిస్తున్నా.. ప్రభుత్వం ఇచ్చిన ఎకరా భూమికి తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకొని.. ఎకరాకు 30 నుంచి 40 బస్తాల ధాన్యాన్ని పండిస్తున్నా. ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. – దాసరి చిన్నన్న చెంచు చిన్నారులకు విద్యను అందించడమే ధ్యేయం నేను డిగ్రీ, బీఎడ్ వరకు చదివా. ప్రస్తుతం గిరిజన సంక్షేమ మినీ గురుకులంలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నా. చెంచు చిన్నారులందరినీ విద్యావంతులను చేయడమే ధ్యేయం. – టి.మాధవి, ప్రిన్సిపాల్, గిరిజన సంక్షేమ మినీ గురుకులం, నెరవాడమెట్ట, పాణ్యం మండలం -
లాక్డౌన్: పాణ్యం పోలీసుల వినూత్న ప్రయత్నం..!
-
‘మీ కాళ్లు మొక్కి చెప్పడానికైనా సిద్ధం’
సాక్షి, కర్నూలు: లాక్డౌన్ నిబంధనలు పాటించనివారిని చితకబాదిన పోలీసులను చూశాం.. వాహనాలను సీజ్ చేసిన రక్షకభటులను చూశాం.. బయటకు రావొద్దని, కరోనా బారిన పడొద్దని బతిమాలిన మనసున్న ఖాకీలను చూశాం.. ఈక్రమంలోనే కర్నూలు జిల్లా పాణ్యం పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. షార్ట్ ఫిల్మ్ ద్వారా యువతకు సందేశం ఇచ్చారు. ‘చిన్న చిన్న కారణాలతో బయటకు వస్తున్నారు. మాటలతో చెప్పాం.. చేతలతో చెప్పాం. ఎంతచెప్పినా మీరు మారరా..! ఎలా చెప్తే మారుతారు. మీ కాళ్లు మొక్కి చెప్పడానికైనా సిద్ధం. దయచేసి బయటకు రావ్దొదు’అని షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ప్రధానంగా యువకులు లాక్డౌన్ ఉల్లంఘించి బయటకు వస్తున్నారని, వారికి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పేందుకే ఈ ప్రయత్నమని పోలీసులు వెల్లడించారు. పాణ్యం పోలీసుల ప్రయత్నానికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. (చదవండి: ఒక్కసారి కూడా దగ్గు రాకపోతే?) (చదవండి: కోవిడ్‌పై డ్రోన్‌తో యుద్ధం) -
సాంబారు పాత్రలో పడి విద్యార్థి మృతి
పాణ్యం: కర్నూలు జిల్లా పాణ్యంలోని విజయానికేతన్ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం సాంబారు పాత్రలో పడి పురుషోత్తంరెడ్డి (6) అనే చిన్నారి మృత్యువాత పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన శ్యామ్‌సుందర్‌రెడ్డి, కల్పన దంపతులకు కుమారుడు పురుషోత్తంరెడ్డితో పాటు కుమార్తె ఉంది. కల్పన రెండేళ్ల క్రితమే మృతి చెందడంతో పురుషోత్తంరెడ్డిని తండ్రి విజయానికేతన్ రెసిడెన్షియల్ స్కూల్లో యూకేజీలో చేర్పించాడు. రోజూ లాగానే బుధవారం మధ్యాహ్నం భోజనానికి క్యూలైన్లో నుంచున్న విద్యార్థులు వెనుక నుంచి నెట్టేయడంతో.. ముందున్న పురుషోత్తంరెడ్డి పెద్ద సాంబారు పాత్రలో పడిపోయాడు. అక్కడే ఉన్న ఆయా పీరమ్మ వెంటనే అతన్ని బయటకు తీయగా..పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే పురుషొత్తంరెడ్డి చర్మంపై బొబ్బలు రావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. విద్యార్థి తండ్రికి సమాచారం అందించిన యాజమాన్యం పాఠశాలకు తాళాలు వేసి కర్నూలు ఆస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ పురుషోత్తంరెడ్డి చనిపోయాడు. పాణ్యం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి సంఘం నిరసన.. పాఠశాలలో సరైన సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి విద్యార్థి మృతికి కారణమైన విజయానికేతన్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు పలువురు బుధవారం రాత్రి పాఠశాల వద్ద నిరసనకు దిగారు. విద్యార్థి మృతి చెందినా పట్టించుకోకుండా..కరస్పాండెంట్, డైరెక్టర్లు సెల్ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నారని ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారు ఆందోళన విరమించారు. -
సాగునీరు అందించేందుకు కృషి
సాక్షి, పాణ్యం: మండలంలోని తమ్మరాజుపల్లె, కందికాయపల్లె, పిన్నాపురం గ్రామాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. తమ్మరాజుపల్లెలో ఏటి పాయ చెక్‌డ్యామ్‌ను నిర్మిస్తామన్నారు. ఆయన మంగళవారం గోరుకల్లు గ్రామంలో మొహర్రం సందర్భంగా పెద్ద సరిగెత్తును పురస్కరించుకుని పెద్ద స్వామికి ప్రత్యేక ఫాతెహాలు చదివించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తమ్మరాజుపల్లె, కందికాయపల్లె, పిన్నాపురం గ్రామాలకు ప్రతి ఏటా నీటిసమస్య ఎదురవుతోందన్నారు. ఈ మూడు గ్రామాలు వర్షాధారంపైనే పంటలు సాగు చేసుకోవాల్సి వస్తోందన్నారు. కళ్ల ముందే నీరు వెళ్తున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. కావున ఈ మూడు గ్రామాలకు సాగునీరు అందించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తమ్మరాజుపల్లెకు ఏళ్ల నాటి కలగా మిగిలిన ఏటిపాయ నిర్మాణం జరిపి పొలాలకు సాగునీరు, గ్రామానికి తాగునీటి కొరత లేకుండా చూస్తామన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. గోరుకల్లు బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతల స్కీమ్ తెచ్చి పిన్నాపురం, తమ్మరాజుపల్లెకు పుష్కలంగా నీరు ఉండేలా కొచ్చేరును నింపుతామన్నారు. కందికాయపల్లె గ్రామానికి కూడా ఈ జలాలు ఉపయోగించుకునేలా రామతీర్థం వద్ద గానీ, మరో చోట గానీ మోటార్ల సహాయంతో నీటిని పంపింగ్ చేయించి.. పైన ఉన్న చెరువును నింపుతామన్నారు. ఓర్వకల్లు కూడా నీటిని సరఫరా చేయించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అలాగే రోడ్ల విస్తీరణలో నష్టపోయిన ప్రతి బాధితుడిని ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, నాయకులు కొట్టాల అమర్నాథ్రెడ్డి, లక్ష్మీమద్దయ్య, ఇమాం, భాస్కర్‌రెడ్డి , నాగిరెడ్డి, గగ్గటూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీటీ..అవినీతిలో మేటి!
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు): పాణ్యం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కోవెలకుంట్లకు చెందిన శ్రీనివాసులు ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నాడు. ఈ విషయం ఏసీబీ అధికారుల దాడుల్లో తేలింది. కోవెలకుంట్లతోపాటు నంద్యాల, పాణ్యం మండలం కొండజూటూరు ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం అందించిన సమాచారం మేరకు.. 2004లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించిన శ్రీనివాసులు.. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, దొర్నిపాడు మండలాల్లో ఆర్ఐగా, డీటీగా, సీఎస్‌డీటీగా, ఆళ్లగడ్డ ఇన్చార్జ్ తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం పాణ్యం మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డీటీ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడని ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో మూడు బృందాలుగా విడిపోయి కోవెలకుంట్లలో ఉన్న సొంత ఇంటితోపాటు నంద్యాల ఎన్జీఓ కాలనీలో అద్దె ఇల్లు, అత్తగారి గ్రామమైన పాణ్యం మండలం కొండజూటూరులో సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న విలువైన డాక్యుమెంట్లు, ఆస్తులు, వివిధ బ్యాంకులకు చెందిన పాసుపుస్తకాలు, ఎల్ఐసీ బాండ్లు, క్రెడిట్, డెబిట్ కార్డులపై తనిఖీలు చేశారు. రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తింపు.. డిప్యూటీ తహసీల్దార్ నివాసం ఉంటున్న నంద్యాలలోని అద్దె ఇంటిలో రూ. 18 లక్షలు విలువ చేసే ఇన్నోవా వాహనం, రూ. 1.60 లక్షల నగదును గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కోవెలకుంట్లలో 2015వ సంవత్సరంలో దాదాపు రూ. కోటితో నిర్మించిన మూడు అంతస్తుల భవనం, మరో రెండు పాత ఇళ్లు, 3 ప్రాంతాల్లో ఇళ్ల ఫ్లాట్లు, ట్రాక్టర్, రెండు బైక్‌లు, రూ. 25 లక్షల విలువ చేసే ఎల్ఐసీ బాండ్లు, రూ. 12 లక్షలు విలువ చేసే ఒకటిన్నర ఎకరా పొలం, 250 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఒక లాకరు ఉన్నట్లు ఏసీబీ అధికారులు సోదాల్లో గుర్తించారు. వీటి విలువ రూ. 1.50 కోట్లు అధికారులు చెబుతుండగా మార్కెట్ విలువ ›ప్రకారం వీటి విలువ రూ.5 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. లాకర్లో నగదు, విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు ఉన్నాయా అన్న కోణంలో ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు శ్రీనివాసులను ఏసీబీ కస్టడీకి తీసుకుని శుక్రవారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ వివరించారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు భార్య హరిత పాణ్యం మండలంలో ఎన్నికల డీటీగా విధులు నిర్వహిస్తున్నారు. సోదాల్లో ఆ శాఖ ఇన్స్పెక్టర్లు గౌతమి, ప్రవీణ్‌కుమార్, ఖాదర్‌బాష, చక్రవర్తి, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ దాడులు
సాక్షి, కర్నూల్ : పాణ్యం డిప్యూటీ తహసీల్దార్ పత్తి శ్రీనివాసులుపై ఏసీబీ దాడులు చేసింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో కోర్టు సెర్చ్ వారెంట్‌తో ఏసీబీ డిఎస్పి నాగభూషణం తన సిబ్బందితో కలసి ఈ దాడులు చేశారు. ఇందులో భాగంగా నంద్యాల, కొండు జూటూరు, కోవెల కుంట్లలో సోదాలు నిర్వహించగా, నంద్యాలలోని అద్దె ఇంట్లో ఒక ఇన్నోవా, రూ. లక్షన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. కోవెల కుంట్లలో భారీగా ఎల్ఐసి బాండ్లు కనుగొన్నారు. పట్టుబడిన సొమ్ము విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం కోటిన్నర రూపాయల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో లాకర్ ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
పుట్టిన రోజు వేడుకలు చేసుకోకుండానే..
పొద్దు పొడిస్తే ఆ విద్యార్థినిది పుట్టిన రోజు. బడి నుంచి ఇంటికొచ్చేటప్పుడు రేపు చాక్లెట్లు పంచుతానని స్నేహితులందరికీ చెప్పి గంతులేసింది. పుస్తకాల సంచి అలా పడేసి, మిద్దెపై ఆరేసిన బొంతలు తెచ్చుకునేందుకు గబగబా మెట్లెక్కింది. మాయదారి కరెంట్ మిద్దెపై మాటు వేసి ఉంది. బొంత పట్టుకోగానే ఎక్కడికి వెళ్తావన్నట్లు తననూ కరెంట్ పట్టేసింది. విడిపించుకునేందుకు యత్నించి ఓడిపోయింది. సాక్షి, పాణ్యం(కర్నూలు) : మండల పరిధిలోని తమ్మరాజుపల్లె గ్రామంలో విద్యుదాఘాతంతో శుక్రవారం ఓ విద్యార్థిని మృతిచెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మద్దమ్మ, అచ్చెన్న పెద్ద కుమార్తె ఉమాదేవి(22) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం పుట్టిన రోజు వేడుకలు చేసుకునేందుకు తల్లిదండ్రులతో కొత్త దుస్తులు, చాక్లెట్లు కొనిపించుకొని సిద్ధం చేసుకుంది. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం బడి నుంచి వచ్చిన విద్యార్థిని పుస్తకాల సంచి ఇంట్లో పెట్టి మిద్దెపైనున్న బొంతలు తీసుకొచ్చేందుకు వెళ్లింది. మెయిన్ లైన్ నుంచి ఇంట్లోకి తీసుకున్న విద్యుత్ తీగకు సపోర్ట్‌గా పెట్టిన ఇనుప రాడ్‌ను తాకింది. దానికి విద్యుత్ ప్రవహించడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్ప కూలింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆటోలో నంద్యాలకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అప్పటిదాక ఆడిపాడిన ఉమాదేవి ఇక లేదనే విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, తోటి స్నేహితులు మృతదేహం వద్ద విలపించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది. పైరుకు నీరు పెట్టేందుకు వెళ్లి కౌలు రైతు మృతి సి.బెళగల్ : మండలంలోని పోలకల్ గ్రామానికి చెందిన కౌలు రైతు బోయ బండమీది నడిపి సోమన్న (43) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రైతు నడిపి సోమన్న తనకున్న రెండు ఎకరాల పొలంతోపాటు, మరో ఎనిమిది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఉల్లి సాగు చేసుకుంటున్నాడు. శుక్రవారం ఉల్లినాటు వేసేందుకు కూలీలతో పొలానికి వెళ్లాడు. పైరుకు నీరు పెట్టేందుకని బావిలో నీటిమట్టం చూస్తూ మోటర్‌ను తాకగానే విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. ఆ వెంటనే విద్యుత్ తీగ రైతుమీద పడటంతో గిలగిలా కొట్టుకుంటూ అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఊరంతా దాచి కేశవరెడ్డి చేతిలో పెడితే...ఇప్పుడేమో?
సాక్షి, నంద్యాల(కర్నూలు) : పాణ్యం మండలం నెరవాడ వద్ద ఉన్న కేశవరెడ్డి స్కూల్ ఎదుట యాళ్లూరు గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. గ్రామానికి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లేదని భీష్మించుకు కూర్చున్నారు. పాణ్యం సీఐ వంశీకృష్ణ జోక్యం చేసుకుని కేశవరెడ్డి కుమారుడు మంగళవారం నాటికి వాయిదా కోరాడని చెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అనంతరం యాళ్లురు రైతుసంఘం మాజీ అధ్యక్షులు బెక్కెం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 2015లో కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డికి రూ.24 లక్షలు అప్పుగా ఇచ్చామని తెలిపారు. అ డబ్బంతా గ్రామనికి చెందిన మాతా అరవిందమ్మ ఆశ్రమం, దేవాలయం, గ్రామ అభివృద్ధికి దాచుకున్నదని తెలిపారు. రూ.24 లక్షలకు రూ.2 వడ్డీ ప్రకారం ఏటా చెల్లిస్తానని చెప్పడంతో గ్రామపెద్దలందరూ కలిసి అప్పుగా ఇవ్వడం జరిగిందన్నారు. తీసుకున్న తర్వాత రెండేళ్లు వడ్డీ చెల్లించి తర్వాత సంవత్సరం నుంచి డబ్బులు చెల్లించడం నిలిపివేశాడన్నారు. గ్రామస్తులు వడ్డీ చెల్లించాలని అడిగితే శ్రీకాకుళంలో వెంచర్ వేశామని, అది అమ్ముడు పోతే మొత్తం నగదు చెల్లిస్తానని నమ్మబలికాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పటి నుంచి వడ్డీ, అసలు చెల్లించకుండా గడువు చెబుతూ కాలం వెల్లదీశాడని చెప్పుకొచ్చారు. కొంత కాలం తర్వాత గ్రామపెద్దలంతా కేశవరెడ్డిని గట్టిగా నిలదీస్తే రూ.6లక్షలు ఇచ్చి మిగతా సొమ్మంత కొంత వ్యవధిలోనే పూర్తిగా చెల్లిస్తానని నమ్మబలికాడన్నారు. తర్వాత కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారని, ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి సొమ్ము ఇవ్వలేదని తెలిపారు. సీఐ ఇచ్చిన హామీ మేరకూ మంగళవారం కేశవరెడ్డి కుమారుడు అప్పు చెల్లించకపోతే బుధవారం స్కూల్ గేట్‌కు తాళాలు వేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు బెక్కెం బాలతిమ్మారెడ్డి, బెక్కెం చిన్నరామకృష్ణారెడ్డి, కైప జగన్నాథరెడ్డి, గంగుల వెంకటచంద్రారెడ్డి, గంగుల తిమ్మారెడ్డి, బెక్కెం మధుసుదన్‌రెడ్డి, బెక్కెం చంద్రశేఖర్‌రెడ్డి , పోగుల వెంకట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ బౌన్స్
సాక్షి, కర్నూలు : ఓట్ల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌ను టీడీపీ రిలీఫ్ ఫండ్‌గా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గొప్ప కోసం ఉత్త చెక్కులు ఇచ్చి బాధితుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం 19వ వార్డుకు చెందిన గంగాధర్ రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. చిరుద్యోగి అయిన గంగాధర్ రెడ్డి భార్య జ్యోతి ఆపరేషన్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 26 వేల చెక్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నికల రెండు రోజుల ముందు(ఏప్రిల్ 9న) టీడీపీ నేతలు ఈ చెక్‌ను గంగాధర్‌కు అందజేశారు. ఈ చెక్‌ను బ్యాంకుకు తీసుకెళ్లగా అకౌంట్లో సరిపడ నిధులు లేకపోవడం వల్ల చెక్‌ను రిజెక్టు చేస్తున్నామని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పింది. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో మోసం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయిన సంగతి తెలిసిందే. -
కేశవరెడ్డి హాస్టల్‌పై నుంచి పడి విద్యార్థిని మృతి
సాక్షి, కర్నూలు: పాణ్యం కేశవరెడ్డి స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న సుష్మా అనే విద్యార్ధిని మంగళవారం తెల్లవారుజామున హాస్టల్ భవనం పై నుంచి పడి మృతి చెందారు. హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి సుష్మా పడిపోవడంతో.. స్కూల్ యాజమాన్యం ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించింది. అయితే ఆస్పత్రికి తరలించేలోపే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న పాణ్యం పోలీసులు స్కూల్ వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థిని హాస్టల్ పై నుంచి దూకి కింద పడ్డారా లేదా అనే దానిపై విచారణ చేపట్టారు. అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందటంపై.. బాధితురాలి బంధువులు, విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థినిని యాజమాన్యమే హత్య చేసి మేడపై నుంచి తోసేసి ఉంటారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తెలితే.. స్కూల్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
నిమజ్జనంలో విషాదం!
పాణ్యం: డప్పుల మోతలు..యువత కేరింతలు..చిన్నారుల చిందులు..గణపతి బప్పా..మోరియా అంటూ నినాదాలు..గణేశ్ నిమజ్జనోత్సవం ఆద్యంతం ఆసక్తిగా సాగి పూర్తవుతున్న సమయంలో అనుకోని విషాదం. వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న తరుణంలో ఈత రాక ఓ విద్యార్థి మృతి. పాణ్యం చెరువులో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం సోమాపురం గ్రామానికి చెందిన రామాంజినేయులు కుమారుడు మహేష్(19)..బనగానపల్లె సమీపంలోని నందివర్గం వద్దనున్న ఓ ప్రయివేట్ కళాశాలలో డీఎడ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతున్నాయి. నాలుగు పరీక్షలు పూర్తికాగా..ఇంకా రెండు రాయాల్సి ఉంది. బనగానపల్లెలోని ఓ కళాశాలలో పరీక్ష రాసి అక్కడి నుంచి స్నేహితులతో కలిసి మహేష్.. పాణ్యం గ్రామంలో నిమజ్జనోత్సవానికి వచ్చాడు. స్నేహితులతో ఆనందంగా గడిపాడు. పాణ్యం చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న తరుణంలో మహేష్ నీటిలో దిగాడు. కొద్ది సేపటికే మునిగిపోయాడు. మునుగుతున్న సమయంలో పక్కనే ఉన్న వారి కాళ్లు పట్టుకున్నట్లు సాక్షులు చెప్పారు. గ్రామస్తులు దాదాపు రెండు గంటల పాటు గాలించారు. గజ ఈతగాళ్ల సాయంతో వినాయక నిమజ్జన ఘాట్ సమీపంలోని బురదలో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు. ట్రాక్టర్ బోల్తా 8 మందికి గాయాలు కోసిగి:పెద్దభూంపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి 8 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం వినాయక విగ్రహాల ర్యాలీ అనంతరం నిమజ్జనం కోసం ఐరన్‌గల్లు మీదుగా తుంగభద్ర నదికి తరలిస్తుండగా గ్రామ శివారులో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ప్రమాదంలో నరసింహులు, హనుమంతు, మల్లికార్జున, రామకృష్ణ, రాఘవేంద్రలతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ద్విచక్ర వాహనాలపై కోసిగికు తీసుకొచ్చి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించారు. ఇన్చార్జ్ తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి, ఎస్ఐ అశోక్ కుమార్‌లు ఆస్పత్రికి చేరుకొని బాలుర పరిస్థితిని తెలుసుకొని వెంటనే 108 వాహనంలో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. సౌకర్యాలు నిల్.. పాణ్యం చెరువు వద్ద ఏర్పాటు చేసిన వినాయక ఘాట్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. చెరువులోకి దిగే సమయంలో మెట్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. విద్యుత్ దీపాలు కూడా అరకొరగా వేశారు. నిమజ్జన సమయంలో గజ ఈతగాళ్లు సైతం ఘాట్ వద్ద లేరు. ఏర్పాట్లు అరకొర ఉండడం, అప్రమత్తంగా లేకపోవడంతో ఓ నిండు ప్రాణం బలైందనే ఆరోపణలు ఉన్నాయి. -
బాబు.. మీరు చెప్పింది ఏంటి? చేసింది ఏంటి ?
సాక్షి, కర్నూలు : జిల్లా ప్రజలను మోసం చేయడానికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన చేపట్టారని వైఎస్సార్సీపీ, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత విమర్శించారు. 2014 ఆగస్టు 15న ఇచ్చినవన్నీ బూటకపు హామీలే అని మండిపడ్డారు. నాడు అరచేతిలో వైకుంఠం చూపించిన ముఖ్యమంత్రి ఏమోహం పెట్టుకొని జిల్లాకు వస్తున్నాడో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. జిల్లాలో శంకుస్థాపన చేసిన సంస్థలు ఎన్ని, వాటిలో పూర్తైనవి ఎన్నో చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ఆమె నిలదీశారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందది దుయ్యబట్టారు. ఇండస్ట్రియల్ హబ్, టెక్స్టైల్ పార్క్, స్మార్ట్ సిటీ, గుండ్రేవుల ప్రాజెక్టు ఇలా జిల్లాకు ఇచ్చిన ప్రతి హామీ అమలులో చంద్రబాబు పూర్తిగా విఫమయ్యారని ఆమె ధ్వజమెత్తారు. పేదల భూములు లాక్కొని నష్టపరిహారం కూడా ఇవ్వలేదంటూ నిప్పులు చెరిగారు. కమీషన్ల కోసమే చంద్రబాబు శంకుస్థాపనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో చంద్రాబాబును నమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, మంత్రులే దారుణాలు చేస్తుంటే.. ప్రజలకు రక్షణ కల్పించేది ఎవరంటూ చరిత ప్రశ్నించారు. దాచేపల్లి ఘటన మరువక ముందే డోన్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడి జరగడం సిగ్గుచేటని అన్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వ వైఫల్యాలకు బాబు క్షమాపణ చెప్పాంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అకృత్యాలకు సీఎం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అరాచక పాలనకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. -
వైఎస్సార్సీపీలోకి కాటసాని రాంభూపాల్‌రెడ్డి..?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్ఆర్ కుటుంబంలో భాగస్వాములవుదామని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్రెడ్డికి ఆయన మద్దతుదారులు ముక్త కంఠంతో సూచించారు. జై కాటసాని..జై వైఎస్ జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బుధవారం నగర శివారులోని వీజేఆర్ కన్వెన్షన్ హాలులో పార్టీ మార్పుపై కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆయన భార్య ఉమామహేశ్వరి, కుమారుడు శివ నరసింహారెడ్డి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం, గడివేముల, ఓర్వకల్, కల్లూరు మండలాల నుంచి వేలాదిమంది తరలివచ్చారు. ముందుగా ప్రభాకరరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలసి పాణ్యం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టి పేదలకు సేవ చేశారని, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలసి నడవాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితేనే తమకు సమ్మతమని ఎక్కువ మంది చెప్పడం విశేషం. అనంతరం కాటసాని సతీమణి ఉమామహేశ్వరి మాట్లాడుతూ..1985 నుంచి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నాయకులు, కార్యకర్తలకు అండగా ఉన్నారని చెప్పారు. పదవిలో ఉన్నా.. లేకున్నా తమ కుటుంబం ప్రజాసేవలో ఉందని, మద్దతుదారులు తమపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలని చెప్పారు. అనంతరం కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్ కోసం కార్యకర్తలు, అనుచరులు చూపుతున్న అభిమానం, ప్రేమానురాగాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మీరంతా ఏ పార్టీ సూచిస్తే ఆ పార్టీలో చేరుతానని కాటసాని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక హోదా పోరాటంతో రాజకీయ సమీకరణాలు మారాయని..దాంతో పార్టీ మారాల్సి వస్తోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్రం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతులకు న్యాయం చేసే పార్టీలో కార్యకర్తలు, అభిమానుల అభిమతం మేరకు చేరుతానని, తన నిర్ణయాన్ని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు ఇప్పుడే ప్రకటించాలని కాటసాని ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మీ సలహాలు, సూచనల మేరకు నడుచుకుంటానని, మరికొంతమంది ఆలోచనలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాణ్యం చంద్రారెడ్డి, ఆనందు, హనుమంతరెడ్డి, వై.సుధా, కృష్ణమూర్తి, రిటైర్డ్ డీఎస్పీ జయచంద్ర, రిటైర్డ్ సీఐ విజయకృష్ణ, గడివేముల చంద్రశేఖరరెడ్డి, రామలక్ష్మమ్మ, గడివేముల ఎంపీటీసీ బాలచందర్, శివ, గోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, బిలకలగూడూరు చంద్రశేఖరరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, వీరయ్యస్వామి పాల్గొన్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, కర్నూలు : పాణ్యం మండలం బలనూరు మెట్ట వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దుల బండిని ఓ లారీ ఢీకొనడంతో అక్కడిక్కడే ముగ్గురు మృతి చెందారు. కొంతమంది స్థానికులు పొలం పనుల కోసం ఎద్దుల బండిపై వెళ్తుడగా ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమకథా చిత్రం
కర్నూలు : అమ్మాయిని చూసి ఫిదా అయ్యాడు. ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే లవ్ చేయాలనుకున్నాడు. వెంటపడ్డాడు.. పరిచయం చేసుకున్నాడు. లవ్ అన్నాడు. ఛీకొట్టినా అమ్మాయితో.. ఫ్రెండ్షిప్ అన్నాడు. మరోసారి గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. యువతి ఓకే చెప్పడంతో ఛాన్స్ దొరికిందని ముగ్గులోకి దించాడు. చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. లొంగదీసుకున్నాడు. పెళ్లి మాట ఎత్తేసరికి.. ప్లేటు ఫిరాయించాడు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం రాంభూపాల్ రెడ్డి తండాకు చెందిన ఓ యువతిని, నంద్యాల మండలం కానాలకు చెందిన చంద్రశేఖర్‌ల ప్రేమ కథా చిత్రం ఇది. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఇరువురు, ఆ తరువాత కడపలో ఓ గది తీసుకుని సహజీనం సాగించారు. చంద్రశేఖర్ కొన్నాళ్లుగా మరో యువతితో చనువుగా ఉండటాన్ని చూసిన ప్రియురాలు, అతడిని నిలదీసింది. దీంతో ప్రియురాలిని వదిలించుకోవానుకున్నాడు. మరో యువతితో పెళ్లికి సిద్దమయ్యాడు. చంద్రశేఖర్ తల్లిదండ్రులు.. తన ప్రియుడికి మరో యువతితో పెళ్లి చేయడానికి సిద్దపడ్డారని తెలుసుకుంది. ప్రియుడ్ని నిలదీసింది. తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే పెళ్లాడుతానని చెప్పడంతో బిత్తరపోయింది. మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. అనంతరం ప్రియుడి ఇంటికి వెళ్లి తమ ప్రేమ విషయాన్ని చంద్రశేఖర్ తల్లిదండ్రులకు చెప్పింది. అదే సమయంలో తమ అబ్బాయికి మరొకరితో, పెళ్లి చేస్తామని వారు చెప్పడంతో అపరకాళిలా మారింది. తల్లిదండ్రుల ముందే చెప్పుతో ప్రియుడికి దేహశుద్ది చేసింది. అడ్డొచ్చిన వారికి చెప్పు దెబ్బ రుచి చూపించింది. మూడేళ్లుగా సహజీవనం సాగించి మోసం చేస్తావా? అంటూ రెచ్చిపోయింది. ప్రియురాలి చెప్పుదెబ్బకు ప్రియుడికి జ్ఞానోదయం కలిగింది. అతడి తల్లిదండ్రులతో ప్రియురాలినే పెళ్లాడతానని చెప్పడంతో చివరకు యువతితో రాజీకొచ్చారు. ఇరువురి పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నారు. స్థానిక సుంకులమ్మ గుడిలో ఇరువురి కుటుంబసభ్యుల సమక్షంలో చంద్రశేఖర్ ఆ యువతి మెడలో తాళికట్టడంతో.. ప్రేమ కథ సుఖాంతమైంది. -
టీడీపీ, బీజేపీ నాయకుల ఘర్షణ
-
టీడీపీ, బీజేపీ నాయకుల ఘర్షణ
పాణ్యం: కమీషన్ విషయంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ నాయకుడికి కత్తిపోట్లు అయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగింది. పాణ్యం తండా కాలనీలో రూ.10 లక్షల ఐటీడీఏ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో కమీషన్ ఇవ్వాలని స్థానిక టీడీపీ ఉపాధ్యక్షుడు పుల్లారెడ్డి పట్టుబట్టడంతో ఇరువురి మధ్య వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కమీషన్ ఇచ్చేందుకు ససేమిరా అన్న బీజేపీకి చెందిన కాంట్రాక్టర్, మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు పుల్లారెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న పుల్లారెడ్డి తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ పాణ్యం బస్టాండులో సుబ్బారాయుడుతో గొడవకు దిగాడు. దీంతో ఆత్మరక్షణ కోసం సుబ్బారాయుడు పుల్లారెడ్డిని కత్తితో పొడిచి పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ పుల్లారెడ్డి రెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు అంటున్నారు.