కర్నూలు : కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు సోమవారం ఉదయం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 38మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు సమీప ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన కొంతమంది తీర్థయాత్రల కోసం జనతా ట్రావెల్స్కు చెందిన ఓ బస్సును బుక్ చేసుకున్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి శబరిమలై వెళుతున్నారు.
ఈ సందర్భంగా మహానందికి వెళుతుండగా అడ్డు వచ్చిన చిన్నరాయిని డ్రైవర్ తప్పించబోయాడు. అయితే బస్సు అదుపు తప్పటంతో బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 44మంది ఉన్నారు. కేవలం ఆరుగురు మాత్రమే ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఉన్నారు. గాయపడిన వారిలో ఇద్దర్ని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
జనతా ట్రావెల్స్ బస్సు బోల్తా, 38మందికి గాయాలు
Published Mon, Oct 6 2014 9:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:15 PM
Advertisement
Advertisement