'రాజధాని విషయంలో ఏకపక్ష నిర్ణయం తగదు'
పాణ్యం: కొత్త రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఎంపిక విషయంలో కేంద్ర కమిటీసభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలో కేఎంసీ ఆధ్వర్యంలోని జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండానే కేంద్ర కమిటీ సభ్యులు ఇష్టానుసారం స్థలాన్వేషణ చేయడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రాభివృద్ధికి వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. నిలిచిపోయిన జాతీయ రహదారి పనులను మరో రెండు నెలల్లో పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.