
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కర్నూల్ : పాణ్యం డిప్యూటీ తహసీల్దార్ పత్తి శ్రీనివాసులుపై ఏసీబీ దాడులు చేసింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో కోర్టు సెర్చ్ వారెంట్‌తో ఏసీబీ డిఎస్‌పి నాగభూషణం తన సిబ్బందితో కలసి ఈ దాడులు చేశారు. ఇందులో భాగంగా నంద్యాల, కొండు జూటూరు, కోవెల కుంట్లలో సోదాలు నిర్వహించగా, నంద్యాలలోని అద్దె ఇంట్లో ఒక ఇన్నోవా, రూ. లక్షన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. కోవెల కుంట్లలో భారీగా ఎల్‌ఐసి బాండ్లు కనుగొన్నారు. పట్టుబడిన సొమ్ము విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం కోటిన్నర రూపాయల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో లాకర్ ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment