
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ జిల్లా : కడపలో నిర్వహించిన ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ దాడుల్లో భారీగా బంగారం, నగదును పట్టుకున్నారు. కమర్షియల్ ట్యాక్స్ డిఫ్యూటీ కమీషనర్ లూర్తయ్య నాయుడు ఇంట్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగగా.. కడపతో సహా బెంగళూరు, హైదరాబాద్, విజయవాడలో కూడా తనిఖీలు చేపట్టారు. 750 గ్రాముల బంగారు, కేజీ వెండి, రూ.4.5లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దాడుల్లో రెండు కోట్ల అక్రమాస్తులను గుర్తించగా.. ఏసీబీ అధికారులు లూర్తయ్య నాయుడును అరెస్ట్ చేశారు.