deputy tahasildar
-
స్మిత సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు.. ఆనందకుమార్ రెడ్డి సస్పెండ్..
హైదరాబాద్: ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి మీద వేటు పడింది. అతడ్ని సస్పెండ్ చేస్తూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూ అధికారులు ఈ ఆదేశాలను అందించనున్నారు. నిందితులు ఆనంద్, బాబు మేడ్చల్ జిల్లా పరిధిలోని డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌తో పాటు అతని స్నేహితుడు బాబు రాత్రి వేళ స్మిత సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించి హల్చల్ చేశారు. వీరిని చూసి భయాందోళనకు గురైనట్లు స్మిత సబర్వాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఆనంద్, బాబును పోలీసులు అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ చంచల్‌గూడ జైలుకు తరలించారు. Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life. Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.#Dial100 in emergency — Smita Sabharwal (@SmitaSabharwal) January 22, 2023 చదవండి: భయానక పరిస్థితిని ఎదుర్కొన్నా -
కారు ప్రమాదం.. డిప్యూటీ తహసీల్దార్ మృతి
-
శ్రీకాకుళం: కారు ప్రమాదం.. డిప్యూటీ తహసీల్దార్ మృతి
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దారు సతీష్ మృతి చెందారు. ఎమ్మార్వో వెంకటరావుకి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విశాఖ అపోలో ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి మండలం శంకరం ఏలేరు కాలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో 6 గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. చదవండి: ఈత సంబురం విషాదం నింపింది.. నలుగురు చిన్నారులు మృతి -
‘అంత ఇచ్చుకోలేను సారూ.. ఈ గేదెను తీసుకెళ్లండి’
భోపాల్: సాధరణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే ఏ పని జరగదనేది జనమేరిగిన సత్యం. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కొద్దోగొప్పో మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఉన్నదే ప్రజలకు సేవ చేయడం కోసం అనే విషయాన్ని జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సామాన్యుల ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. దాంతో లంచాలు అడిగే ఆఫీసర్లకు తగిన విధంగా బుద్ధి చెప్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాతికవేలు లంచం డిమాండ్ చేసిన ఓ అధికారికి తగిన గుణపాఠం చెప్పాడో రైతు. వివరాలు.. విదిషా ప్రాంతం సిరోంజ్ జిల్లాకు చెందిన భూపేంద్ర సింగ్‌కు, ఇతర కుటుంబ సభ్యులతో భు వివాదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకోవడం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. సిద్ధార్థ సింగాల్ అక్కడ తహసీల్దార్‌గా పని చేస్తున్నాడు. భూపేంద్ర సమస్య తెలుసుకుని, దాన్ని పరిష్కరించాలంటే రూ. 25 వేలు లంచం ఇవ్వాలన్నాడు. అందుకు భూపేంద్ర పేదవాడిని అంత సొమ్ము ఇవ్వలేనని ప్రాధేయపడ్డాడు. కానీ సిద్ధర్థ మనసు కరగలేదు. ఇలా గత 6 నెలలుగా భూపేంద్ర తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ పని మాత్రం కావడం లేదు. తహసీల్దార్ ప్రవర్తనతో విసిగిపోయిన భూపేంద్ర రెండు రోజుల క్రితం తన గేదెను తీసుకువచ్చి సిద్ధార్థ కారుకు కట్టేశాడు. ఆశ్చర్యపోయిన జనాలు ఎందుకిలా చేశావని ప్రశ్నించగా.. అధికారులు కోరిన లంచం ఇవ్వలేనని.. తన గేదెను తీసుకెళ్లమని చెప్పాడు. విషయం కాస్త బయటకు పొక్కడంతో తహసీల్దార్ సిద్ధార్థ కాళ్ల బేరానికి వచ్చాడు. లంచం వద్దు ఏం వద్దు గేదెను తీసుకెళ్లాల్సిందిగా భూపేంద్రను కోరాడు. కానీ భూపేంద్ర ముఖ్యమంత్రి, జిల్లా అధికారికి ఓ మెమరాండం అందజేసిన తర్వాతే గేదెను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం కాస్తా మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు స్పందిచారు. సిద్ధార్థపై వచ్చిన ఆరోపణలు పరిశీలించి.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
డీటీ..అవినీతిలో మేటి!
సాక్షి, కోవెలకుంట్ల(కర్నూలు): పాణ్యం డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న కోవెలకుంట్లకు చెందిన శ్రీనివాసులు ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నాడు. ఈ విషయం ఏసీబీ అధికారుల దాడుల్లో తేలింది. కోవెలకుంట్లతోపాటు నంద్యాల, పాణ్యం మండలం కొండజూటూరు ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం అందించిన సమాచారం మేరకు.. 2004లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించిన శ్రీనివాసులు.. కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, దొర్నిపాడు మండలాల్లో ఆర్ఐగా, డీటీగా, సీఎస్‌డీటీగా, ఆళ్లగడ్డ ఇన్చార్జ్ తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం పాణ్యం మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. డీటీ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడని ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో మూడు బృందాలుగా విడిపోయి కోవెలకుంట్లలో ఉన్న సొంత ఇంటితోపాటు నంద్యాల ఎన్జీఓ కాలనీలో అద్దె ఇల్లు, అత్తగారి గ్రామమైన పాణ్యం మండలం కొండజూటూరులో సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఉన్న విలువైన డాక్యుమెంట్లు, ఆస్తులు, వివిధ బ్యాంకులకు చెందిన పాసుపుస్తకాలు, ఎల్ఐసీ బాండ్లు, క్రెడిట్, డెబిట్ కార్డులపై తనిఖీలు చేశారు. రూ. 5 కోట్ల ఆస్తులు గుర్తింపు.. డిప్యూటీ తహసీల్దార్ నివాసం ఉంటున్న నంద్యాలలోని అద్దె ఇంటిలో రూ. 18 లక్షలు విలువ చేసే ఇన్నోవా వాహనం, రూ. 1.60 లక్షల నగదును గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కోవెలకుంట్లలో 2015వ సంవత్సరంలో దాదాపు రూ. కోటితో నిర్మించిన మూడు అంతస్తుల భవనం, మరో రెండు పాత ఇళ్లు, 3 ప్రాంతాల్లో ఇళ్ల ఫ్లాట్లు, ట్రాక్టర్, రెండు బైక్‌లు, రూ. 25 లక్షల విలువ చేసే ఎల్ఐసీ బాండ్లు, రూ. 12 లక్షలు విలువ చేసే ఒకటిన్నర ఎకరా పొలం, 250 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో ఒక లాకరు ఉన్నట్లు ఏసీబీ అధికారులు సోదాల్లో గుర్తించారు. వీటి విలువ రూ. 1.50 కోట్లు అధికారులు చెబుతుండగా మార్కెట్ విలువ ›ప్రకారం వీటి విలువ రూ.5 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. లాకర్లో నగదు, విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు ఉన్నాయా అన్న కోణంలో ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు శ్రీనివాసులను ఏసీబీ కస్టడీకి తీసుకుని శుక్రవారం కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ వివరించారు. అలాగే డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు భార్య హరిత పాణ్యం మండలంలో ఎన్నికల డీటీగా విధులు నిర్వహిస్తున్నారు. సోదాల్లో ఆ శాఖ ఇన్స్పెక్టర్లు గౌతమి, ప్రవీణ్‌కుమార్, ఖాదర్‌బాష, చక్రవర్తి, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
డిప్యూటీ తహసీల్దార్‌పై ఏసీబీ దాడులు
సాక్షి, కర్నూల్ : పాణ్యం డిప్యూటీ తహసీల్దార్ పత్తి శ్రీనివాసులుపై ఏసీబీ దాడులు చేసింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో కోర్టు సెర్చ్ వారెంట్‌తో ఏసీబీ డిఎస్పి నాగభూషణం తన సిబ్బందితో కలసి ఈ దాడులు చేశారు. ఇందులో భాగంగా నంద్యాల, కొండు జూటూరు, కోవెల కుంట్లలో సోదాలు నిర్వహించగా, నంద్యాలలోని అద్దె ఇంట్లో ఒక ఇన్నోవా, రూ. లక్షన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు. కోవెల కుంట్లలో భారీగా ఎల్ఐసి బాండ్లు కనుగొన్నారు. పట్టుబడిన సొమ్ము విలువ బహిరంగ మార్కెట్ ప్రకారం కోటిన్నర రూపాయల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో లాకర్ ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
బదిలీ చేస్తేనేం..!
అధికార పార్టీ అండ పుష్కలంగా ఉంటే ఉన్నతాధికారుల ఆదేశాలు ఎందుకు పట్టించుకోవాలనుకున్నాడో ఏమో.. బదిలీ ఉత్తర్వులు అందినా డోంట్‌కేర్ అంటున్నాడు ఓ అధికారి. సరేలే.. విధులన్నా సక్రమంగా నిర్వహిస్తున్నాడా అంటే అదీ లేదు.. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ..ప్రతిపక్ష పార్టీ నాయకులపై కక్ష సాధింపులకు దిగుతున్నాడు. ఇంతకూ ఎవరా అధికారి అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే. అనంతపురం, ధర్మవరం: బత్తలపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ సురేష్‌బాబు పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా అక్కడే పనిచేస్తూ బదిలీపై వచ్చిన తహసీల్దార్లను ఇక్కడ పనిచేయనీయకుండా అధికారపార్టీ నేతల అండతో ఇన్చార్జ్ తహసీల్దార్ బాధ్యతలను చూస్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో భాగంగా పారదర్శకంగా వ్యవహరించాల్సిన సదరు టీటీ అధికారపార్టీ నేతల ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీకి చెందిన ఓట్ల తొలగింపు, చేర్పులకు అంగీకరించకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఎల్ఓలు కొత్త ఓటు ఏది దరఖాస్తు చేసినా... టీడీపీ నాయకులను పిలిపించి, ఈ ఓటు మనకు పడుతుందా..? వాళ్లకు పడుతుందా..? అని విచారించిన తరువాతనే అంగీకారం తెలుపుతున్నట్లు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సదరు అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన ఎన్నికల కమిషన్ సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో ఆయన్ను పుట్టపర్తి నియోజకవర్గానికి బదిలీ చేస్తూ ఈనెల 26న అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అధికారపార్టీ నేతల అండతో ఆయన అక్కడికి వెళ్లకుండా బత్తలపల్లిలోనే డీటీగా విధులు నిర్వరిస్తున్నాడు. ఏకపక్షంగా వ్యవహరించే సదరు అధికారిని వెంటనే బదిలీ చేయాలని లేని పక్షంలో అందోళనలు చేస్తామని, ఉద్యోగులు తమ ఉద్యోగధర్మం పాటించకుండా ఇలా అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాయడం ఏంటని ప్రతిపక్ష పార్టీ నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఉన్నతాధికారులు సదరు ఉద్యోగిపై ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.. -
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
వేములవాడఅర్బన్ : సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం కొనసాగించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల నాయకులు డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఏకీకృత సేవా నిబంధనలను అమలు పరచడానికి కోర్టు ద్వారా క్లీయర్ చేసి, పదోన్నతులు, బదీలీలు చేపట్టాలన్నారు. అర్హత గల ఎస్ఎలకు జెఎల్స్, డైట్ లెక్చర్స్గా పదోన్నతులు కల్పించాలన్నారు. మండల అధ్యక్షుడు రవి, శ్రీనివాస్, శ్రీధర్‌చారీ, గోపాల్‌కిషన్, కనుకయ్య, సుజాత, జీవన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. సర్వీస్ రూల్స్ అమలు చేయాలి కోనరావుపేట : విద్యారంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్)నాయకులు బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు. అధ్యక్షుడు కనుకయ్య మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో ఉపాధ్యాయులు నష్టపోతున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సేవా నిబంధనలు అమలు చేయాలన్నారు. శ్రీకాంత్‌రావు, ప్రసాద్, హరిప్రసాద్, నరేశ్, రమేశ్, శ్రీనివాస్ ఉన్నారు. -
డీటీలకు డెప్యుటేషన్
అనంతపురం అర్బన్ : రెవెన్యూశాఖలో ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్లను డెప్యుటేషన్‌పై నియమిస్తూ కలెక్టర్ ఈనెల 28న ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్పీకుంట సీఎస్‌డీటీగా ఉన్న (ప్రస్తుతం సెలవులో) జి.ప్రమీలని అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో నియమించారు. ఆత్మకూరు సీఎస్‌డీటీ డి.నాగరాజారావును అనంతపురం తహసీల్దారు కార్యాలయం సీఎస్‌డీటీ–1గా నియమించారు. అనంతపురం తహసీల్దార్ కార్యాలయంలో సీఎస్‌డీటీ–1గా ఉన్న వెంకటేశ్‌కుమార్ , పెనుకొండ సీఎస్‌డీటీ–2గా ఉన్న కె.మనోహర్‌కుమార్, పెద్దపప్పూరు సీఎస్‌డీటీగా ఉన్న ఎన్.ఎం.బాషాని అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో డెప్యుటేషన్‌పై నియమించారు. -
8 మంది డీటీలకు పదోన్నతి
కర్నూలు(అగ్రికల్చర్): రెవెన్యూ శాఖలో 8 మంది డిప్యూటీ తహశీల్దార్లకు (డీటీలకు) పదోన్నతులు ఖరారయ్యాయి. ఈ మేరకు విజయవాడలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జరిగిన డీపీసీ ఆమోదం తెలిపింది. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నేతలు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్లకు జోనల్ పరిధిలో పదోన్నతులు కల్పిస్తారు. జిల్లాలో 8 మందిలో 7 మందిని తహసీల్దార్లుగా కర్నూలు జిల్లాకు కేటాయించారు. ఒకరు మాత్రం వైఎస్ఆర్ జిల్లాకు అలాట్ అయినట్లుగా అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన వారిలో కలెక్టరేట్లోని బి.సెక్షన్ సూపరింటెండెంటు వెంకటేశ్వర్లు, వసుంధర (జిఎన్ఎస్ఎస్), లక్ష్మీదేవి(డీఎస్ఓ), యూనస్‌బాషా ( నంద్యాల టిజిపి), తిరపతిసాయి (కర్నూలు ఆర్డీఓ ఆఫీసు), సుబ్రమణ్యం (లీగల్‌సెల్), నాగమునీశ్వరప్రసాద్ (డీటి బనగానపల్లి), శేషారాంసింగ్( వెల్దుర్తి)లు ఉన్నారు. శేషారాంసింగ్ మాత్రం వైఎస్ఆర్ జిల్లాకు అలాట్ అయ్యారు. రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కృషి వల్లే ఏడుగురు జిల్లాకే అలాట్ అయినట్లు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌బాబు, గిరికుమార్రెడ్డిలు తెలిపారు. -
తహసీల్దార్లు వద్దు.. డీటీలే ముద్దు
* ఎఫ్‌ఏసీతో బాధ్యతలు అప్పగిస్తున్న వైనం * కీలకమైన రెవెన్యూలో ఇదీ వరుస సాక్షి ప్రతినిధి, కర్నూలు: ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమమైనా ప్రజల్లోకి వెళ్లాలన్నా... ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా మండలస్థాయిలో పరిష్కరించాలన్నా తహసీల్దార్లే ప్రధానం. రేషన్‌కార్డు మొదలు... కీలకమైన భూ సంబంధ విషయాల వరకూ వీరిదే మండలంలో కీలకపాత్ర. అటువంటి పోస్టుల్లో తహసీల్దార్లను కాదని.... పూర్తిస్తాయి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ)పేరుతో డిప్యూటీ తహశీల్దార్(డీటీ)లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. కేవలం రెండు, మూడు నెలల కిందట డీటీగా పదోన్నతి వచ్చిన వారికి సైతం ఏకంగా తహ సీల్దారు బాధ్యతలు అప్పగించడంపై రెవెన్యూ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. రెవెన్యూలో కీలకమైన సంస్కరణలు జరుగుతున్న ఈ సమయంలో ఇది మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తహసీల్దార్లు లేరా అంటే అదీ కాదు. అర్హులైన వారు ఉన్నప్పటికీ వారికి ఏ పోస్టింగులు ఇవ్వకుండా డీటీలవైపు మొగ్గుచూపుతున్నారు. డీటీలో కింగ్‌లు! జిల్లాలో మొన్నటివరకు ఏకంగా ఏడాది కాలంపాటు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరంలో డిప్యూటీ తహసీల్దారే తహశీల్దారుగా వ్యవహరించారు. మొన్నటి బదిలీల్లో కూడా ఆళ్లగడ్డ తహసీల్దారును రుద్రవరంకు బదిలీ చేశారు. ఈయన కూడా నాలుగు రోజుల క్రితం వరకూ బాధ్యతలు తీసుకోలేదు. ఇక జిల్లాలో మంత్రాలయం, కోసిగి. ఆళ్లగడ్డ, మద్దికెర మండలాల్లో డీటీలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ) పేరుతో డిప్యూటీ తహసీల్దార్లే... తహసీల్దార్లుగా పని కానిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగానే కొన్ని మండలాలను డీటీలకు అప్పగించి పనులు కానిస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. 3 నెలల్లోనే బాధ్యతలా? డిప్యూటీ తహసీల్దారు(డీటీ)గా పదోన్నతి వచ్చి రెండు, మూడు నెలలైనా కాకముందే వారికి ఏకంగా తహసీల్దారు పోస్టును పూర్తిస్థాయి అదనపు బాధ్యతల పేరుతో అప్పగించడంపైనా రెవెన్యూశాఖలోని వారే నోరెళ్లబెడుతున్నారు. కనీసం డీటీగా కూడా సరియైన అవగాహన లేని వ్యక్తికి ఎఫ్ఏసీ ఇచ్చి తహసీల్దారు సీట్లో కూర్చోబెడితే సదరు పోస్టుకు ఏం న్యాయం జరుగుతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాలనలో కీలకమైన రెవెన్యూశాఖలో ఇటువంటి ప్రయోగాలు జిల్లాకు ఎంతకూ మంచివికావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
డిప్యూటీ తహశీల్దార్ ఇంట్లో చోరీ
-తులంన్నర బంగారు నగలు, రూ. 45 వేల అపహరణ శామీర్‌పేట్: ఓ డిప్యూటీ తహసీల్దార్ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు తులంన్నర బంగారంతో పాటు రూ. 45 వేలు అపహరించుకుపోయారు. ఈ సంఘటన జవహర్‌నగర్ ఠాణా పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన అంజయ్యు నల్లగొండలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. ఆయన కొంతకాలంగా జవహర్‌నగర్ సారుబాబానగర్‌లో అద్దెకు ఉంటున్నారు. ఇదిలా ఉండగా, 15 రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి స్వస్థలానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు శుక్రవారం రాత్రి ఆయన ఇంటి తాళం విరగ్గొట్టి లోపలికి చొరబడ్డారు. రూ. 45 వేల నగదు, తులంన్నర బంగారు గొలుసు, ఎల్ఈడీ టీవీతోపాటు భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు అపహరించుకుపోయారు. అంజయ్య శనివారం ఇంటికి వచ్చేసరికి తాళం విరగ్గొట్టి ఉంది. లోపలికి వెళ్లిన ఆయన చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డిప్యూటీ తహశీల్దారు ఆత్మహత్యాయత్నం
చిత్తూరు (అగ్రికల్చర్): చిత్తూరు కలెక్టరేట్లో ఎలక్షన్ విభాగంలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్న సుధాకర్ బుధవారం విధి నిర్వహణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డిప్యూటీ తహశీల్దారు సుధాకర్ ఉదయం 10 గంటలకు విధులకు హాజరయ్యారు. కొంత సమయానికే తాను కూర్చున్న సీటు పైనుంచి సృ్పహ కోల్పోయి కింద పడిపోయారు. తోటి సిబ్బంది వెంటనే ఆయన అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. నిద్రమాత్రలు మింగడంతో ఆయన స్పృహ కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సుధాకర్ కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డీఆర్వో విజయ్‌చందర్‌ను వివరణ అడగ్గా కుటుంబ కలహాల కారణంగా సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. -
ఏసీబీ దాడుల్లో పట్టుబడిన డీటీ
పశ్చిమ గోదావారి (మొగల్తూరు): ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ప్రజలను లంచాల పేరుతో పీడించుకు తింటున్న అధికారిని ఏసీబీ అధికారులు శనివారం అదుపులో తీసుకున్నారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండల తహశీల్దారు కార్యలయంలో జరిగింది. కార్యలయంలో డిప్యూటీ తహశీల్దార్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్వీకే మల్లికార్జున్‌రావు పుట్టిన రోజు నిర్ధరణ పత్రం జారీచేయడానికి లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. మండలంలోని కేటీ పాలానికి చెందిన మురళి కృష్ణ మోహన్ రావు పుట్టిన రోజు నిర్ధరణ పత్రం కోసం గత ఏడాది నవంబరు నెలలో అర్జీ పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు లేకపోవడంతో డీటీని సంప్రదిస్తే ఐదువేలు లేనిదే పని జరగదని అన్నారు. అంత డబ్బు ఇవ్వలేనని నాలుగు వేలకు బేరం కుదుర్చుకున్నాడు. శనివారం మధ్యాహ్నం పథకం ప్రకారం ముందుగా ఏసీబీ అధికారులకు సమాచారం అందించి ఆతర్వాత డీటీకి డబ్బు అందించారు. డీఎస్పీ వి.గోపాలకృష్ణన్ నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించి మల్లికార్జున్‌రావును అదుపులోకి తీసుకుంది. అతని నుంచి అదనపు సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు.