-తులంన్నర బంగారు నగలు, రూ. 45 వేల అపహరణ
శామీర్‌పేట్: ఓ డిప్యూటీ తహసీల్దార్ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు తులంన్నర బంగారంతో పాటు రూ. 45 వేలు అపహరించుకుపోయారు. ఈ సంఘటన జవహర్‌నగర్ ఠాణా పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లాకు చెందిన అంజయ్యు నల్లగొండలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. ఆయన కొంతకాలంగా జవహర్‌నగర్ సారుబాబానగర్‌లో అద్దెకు ఉంటున్నారు.
ఇదిలా ఉండగా, 15 రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి స్వస్థలానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు శుక్రవారం రాత్రి ఆయన ఇంటి తాళం విరగ్గొట్టి లోపలికి చొరబడ్డారు. రూ. 45 వేల నగదు, తులంన్నర బంగారు గొలుసు, ఎల్‌ఈడీ టీవీతోపాటు భూమికి సంబంధించిన పాసు పుస్తకాలు అపహరించుకుపోయారు. అంజయ్య శనివారం ఇంటికి వచ్చేసరికి తాళం విరగ్గొట్టి ఉంది. లోపలికి వెళ్లిన ఆయన చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డిప్యూటీ తహశీల్దార్ ఇంట్లో చోరీ
Published Sat, Jun 25 2016 8:35 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement