
డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
వేములవాడఅర్బన్ : సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం కొనసాగించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల నాయకులు డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఏకీకృత సేవా నిబంధనలను అమలు పరచడానికి కోర్టు ద్వారా క్లీయర్ చేసి, పదోన్నతులు, బదీలీలు చేపట్టాలన్నారు. అర్హత గల ఎస్‌ఎలకు జెఎల్స్, డైట్ లెక్చర్స్‌గా పదోన్నతులు కల్పించాలన్నారు. మండల అధ్యక్షుడు రవి, శ్రీనివాస్, శ్రీధర్‌చారీ, గోపాల్‌కిషన్, కనుకయ్య, సుజాత, జీవన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
కోనరావుపేట : విద్యారంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్)నాయకులు బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు. అధ్యక్షుడు కనుకయ్య మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో ఉపాధ్యాయులు నష్టపోతున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సేవా నిబంధనలు అమలు చేయాలన్నారు. శ్రీకాంత్‌రావు, ప్రసాద్, హరిప్రసాద్, నరేశ్, రమేశ్, శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment