CPS policy
-
‘‘సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు’’ ఇదే మా నినాదం.. పోరాటం
సాక్షి, హైదరాబాద్: ‘కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేయాలి... పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలి. ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ జరగాలి. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లాలి’అంటూ తెలంగాణ స్టేట్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్సీపీఎస్ఈయూ) గొంతెత్తింది. 2004 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం టీఎస్సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 సంఘాల ఉద్యోగులు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలు సైతం ఈ సభకు హాజరై సీపీఎస్ రద్దుకు గొంతు కలిపారు. 2 లక్షల కుటుంబాల చిరకాల వాంఛ ఇది ఈ సందర్భంగా టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడారు. ‘ఐదేళ్ల క్రితం సీపీఎస్ రద్దు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమా? రాష్ట్ర ప్రభుత్వమా? అని అడిగిన సందర్భాలున్నాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సరైన సమాధానం దొరికింది. సీపీఎస్ పథకాన్ని రద్దు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. అదేవిధంగా ఈ పథకం కింద జమ అయిన నిధులను వెనక్కు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని దాదాపు 2 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబాల చిరకాల వాంఛ సీపీఎస్ రద్దు– ఓపీఎస్ అమలు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల హామీ మాదిరి కాకుండా ఎన్నికలకు ముందే సీపీఎస్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. వెనువెంటనే ఓపీఎస్‌ను అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడే వారే. ప్రభుత్వం ఆదేశాలను తూచ తప్పకుండా అనుసరించి అమలు చేసేవారు కావడంతో ప్రభుత్వం ఏమాత్రం సంకోచించకుండా సీపీఎస్‌ను రద్దు చేయాలి’అని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల ప్రధాన సమస్యలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి పోవడం లేదని, ఆయనకు సుదీర్ఘంగా వివరిస్తే తప్పకుండా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకోసమే రాష్ట్ర రాజధానిలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. జిల్లాలను చుట్టి.. రాజధానికి చేరి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అమలు చేస్తున్న సీపీఎస్ రద్దుపై విస్తృత అవగాహన కలి్పంచేందుకు టీఎస్సీపీఎస్ఈయూ జూలై 16 నుంచి 31వ తేదీ వరకు పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రను తలపెట్టింది. రాష్ట్రంలోని 33 జిల్లాల మీదుగా సాగిన ఈ యాత్ర ద్వారా ఉద్యోగులు, ఉపాధ్యాయులను చైతన్య పరిచి పాత పెన్షన్ ఆవశ్యకత, సీపీఎస్ రద్దుపై విపులంగా వివరించి అభిప్రాయ సేకరణ జరిపింది. పక్షం రోజుల పాటు సాగిన ఈ యాత్రలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని మద్దతు పలికారు. ఈ క్రమంలో ఈనెల 12న హైదరాబాద్‌లో సీపీఎస్ ఉద్యోగులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు స్థితప్రజ్ఞ ఇదివరకే ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తలపెట్టిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరయ్యారు. పోటెత్తిన వివిధ రాష్ట్రాల నేతలు కార్యక్రమంలో నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్స్ స్కీం జాతీయ అధ్యక్షులు విజయకుమార్ బంధు, పంజాబ్ సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుఖజిత్ సింగ్, కర్ణాటక సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతారామ్, ప్రధాన కార్యదర్శి రంగనాథ్, ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ నాయకుడు పల్లెల రామాంజనేయులు, మహారాష్ట్ర నుంచి విటేష్ ఖండేల్కర్, ఝార్ఖండ్ నుంచి విక్రమ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాకేష్ సింగ్, తమిళనాడు నుంచి ఆరోగ్యదాస్, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బయ్య, సురేష్, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్‌రెడ్డి, కటకం రమేశ్, ఎస్జీటీయూ రాష్ట్ర అధ్య క్షుడు మహిపాల్ రెడ్డి, టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ నాయక్, వెటర్నరీ ఫోరం అధ్యక్షుడు అభిషేక్ రెడ్డి, బ్లైండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు. ఇరువురు సీఎంలతో చర్చ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా ఇరువురు సీఎంలతో పాత పెన్షన్ పునరుద్ధరణపై చర్చిస్తాం. అదేవిధంగా జార్ఖండ్‌లో అమలు చేస్తున్న పాత పెన్షన్ స్టాండింగ్ ఆపరేటింగ్ గైడ్‌లైన్స్ వివరిస్తాం. –విక్రమ్ సింగ్, జార్ఖండ్ సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు మేమూ ఎదురుచూస్తున్నాం తెలంగాణలో సీపీఎస్ రద్దుకోసం మహారాష్ట్రలో సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. పాత పెన్షన్ కోసం పార్టీ పరమైన నిర్ణయాన్ని తీసుకుంటే మరింత స్పష్టత వస్తుంది. –విటేష్ ఖండేల్కర్, మహారాష్ట్ర సీపీఎస్ యూనియన్ అధ్యక్షుడు కేసీఆర్ దేశ్‌కీ నేతా అయ్యేందుకు ఇదే చాన్స్ తెలంగాణలోని రెండు లక్షల ఉద్యోగుల సీపీఎస్‌ను రద్దు చేస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా అనుకరిస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ్‌కి నేతా అయ్యేందుకు ఇదే మంచి అవకాశం. – విజయ్‌కుమార్ బంధు, సీపీఎస్ జాతీయ అధ్యక్షుడు -
మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ఉద్యోగులకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్ (గ్యారంటీడ్ పెన్షన్ స్కీం)ను ప్రతిపాదిస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌తో కలిసి సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చించారు. అనంతరం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో హామీ ఇచ్చాం. కానీ, ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినా ఉద్యోగులకు న్యాయం చేయాలనే సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మాది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం. అందుకే సీపీఎస్ స్థానంలో అంతకంటే మెరుగైన జీపీఎస్‌ను ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగ సంఘాలు జీపీఎస్ వద్దు.. అవసరమైతే ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం)లో కొన్ని అంశాలను సవరించమంటున్నారు. ప్రభుత్వం జీపీఎస్‌లో మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తానంటోంది. త్వరలోనే రెండింటి మధ్య ఎక్కడోచోట సమస్య పరిష్కారమవుతుంది. అప్పుడు దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఈ విషయంలో ఉద్యోగుల సంక్షేమాన్ని కోరే ప్రభుత్వంగా ఎన్నిసార్లైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం’.. అని బొత్స అన్నారు. జీపీఎస్‌లో అదనపు బెనిఫిట్స్ ప్రతిపాదించారు.. మంత్రుల కమిటీ ద్వారా పాత పెన్షన్ విధానంపై తీపికబురు వస్తుందనుకుంటే నిరాశే ఎదురైందని రాష్ట్ర సీపీఎస్ ఉద్యమ వ్యవస్థాపకుడు పి. రామాంజనేయులు యాదవ్ అన్నారు. అయితే, కొత్తగా జీపీఎస్‌లో హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ కల్పిస్తామనడం సానుకూలంగా ఉందన్నారు. ఇక జీపీఎస్‌పై అయితే భవిష్యత్తులో చర్చలకు వచ్చేదిలేదని.. పాత పెన్షన్‌పై అయితేనే చర్చలకు వస్తామని ఆయన స్పష్టంచేశారు. ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్ మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ఓపీఎస్‌ను అమలుచేయమంటే జీపీఎస్‌పై చర్చిస్తున్నారన్నారు. దీంతో సెప్టెంబర్ 1న సీఎం ఇంటి ముట్టడిని చేపడతామన్నారు. ఎవరో పిలుపునిస్తే.. మేమా బాధ్యులమా? ఇక సీపీఎస్ ఉద్యోగుల బ్లాక్ డే సందర్భంగా విజయవాడలో శాంతియుతంగా సభ పెట్టుకుంటామంటే.. ఎవరో సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిస్తే.. తమ సంఘ నాయకులను బైండోవర్ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు అన్నారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఛలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. -
జీపీఎస్‌తోనే ఉద్యోగులకు మెరుగైన పెన్షన్
సాక్షి, అమరావతి: సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల న్యాయబద్ధమైన ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా.. వారి ఆర్థిక అభ్యున్నతికి స్థిరమైన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తద్వారా ఓవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటూ మరోవైపు సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం మరింత మెరుగైన పెన్షన్ పొందేలా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)ను ప్రతిపాదించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో భారీగా ఉంది. సీపీఎస్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని వర్తింపచేస్తే.. రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి వేతనాలు, పెన్షన్లకు వ్యయమవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని రాష్ట్ర ప్రజలతోపాటు ఆర్థిక వ్యవస్థ భరించలేవని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్ ఉద్యోగుల ఆర్థిక అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం జీపీఎస్‌ను ప్రతిపాదించింది. జీపీఎస్‌తోనే అధిక పెన్షన్ ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం మూల వేతనం (బేసిక్)లో 20 శాతం పెన్షన్ వస్తోంది. సీపీఎస్ వల్ల ఎంత పెన్షన్ వస్తుందనేది పూర్తిగా వడ్డీ రేట్లమీద ఆధారపడి ఉంటుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తే వచ్చే పెన్షన్ మొత్తం కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఒకప్పుడు బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేస్తే 8 శాతం వరకు వడ్డీ ఇచ్చేవారు. ఈ 8 శాతం వడ్డీ ప్రస్తుతం 4 శాతానికి తగ్గిపోయింది. ఇదే ధోరణి కొనసాగితే ఇంకా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్‌లో అయితే మూల వేతనంలో 33% పెన్షన్ రానుంది. దీనివల్ల పెన్షన్ 65 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఉదాహరణకు ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్‌కు పదవీ విరమణ అనంతరం పెన్షన్ రూ.15,647 వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత జీపీఎస్‌లో అయితే సెకండరీ గ్రేడ్ టీచర్‌కు పదవీ విరమణ అనంతరం రూ.25,856 పెన్షన్ రానుంది. అదే ఆఫీసర్ సబార్డినేట్ ఉద్యోగికి ప్రస్తుత సీపీఎస్‌లో పదవీ విరమణ అనంతరం రూ.9,579 పెన్షన్ వస్తుండగా, అదే ఉద్యోగికి ప్రతిపాదిత జీపీఎస్‌లో రూ.15,829 పెన్షన్ రానుంది. రాష్ట్ర జనాభా, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఆచరణ సాధ్యం కాకే.. సీపీఎస్‌తో ఉద్యోగులతోపాటు వివిధ ఉద్యోగ సంఘాలు కోరుతున్న మేరకు పాత పెన్షన్ పథకాన్ని వర్తింప చేయడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆచరణ సాధ్యం కాదని ఆర్థిక శాఖ గణాంకాలతో సహా వివరించింది. ఇప్పటికే ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రాష్ట్ర సొంత ఆదాయంలో చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాత పెన్షన్ పథకాన్ని సీపీఎస్ ఉద్యోగులకు వర్తింపచేయడం అసాధ్యమని వెల్లడించింది. ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం సీపీఎస్ ఉద్యోగుల 20 శాతం కంట్రిబ్యూషన్ కొనసాగిస్తూ పాత పెన్షన్ పథకం వర్తింపచేస్తే 2100 నాటికి ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.21,88,047 కోట్లు అవుతుందని వివరించింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 119 శాతంగా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం ఏకంగా 395 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం 20 శాతం కంట్రిబ్యూషన్ లేకుండా సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపచేస్తే 2100 నాటికి వేతనాలు, పెన్షన్ల వ్యయం రూ.22,81,207 కోట్లు అవుతుందని తెలిపింది. ఇది రాష్ట్ర సొంత ఆదాయంలో 124 శాతమని వెల్లడించింది. కాగా, రాష్ట్ర రాబడిలో తప్పనిసరి వ్యయం 446 శాతం మేర పెరుగుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. జీపీఎస్ వల్ల మేలు ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కరోనా, రాష్ట్ర ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులుగా మనం ప్రభుత్వం గురించి కూడా కొంత ఆలోచించాలి. ప్రతిదానిపై వ్యతిరేకంగా ఆలోచించడం సరికాదు. ప్రభుత్వానికి ఉద్యోగులపై కక్ష ఉండదు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకు మేలు జరుగుతుంది. మన గురించి ఆలోచించే ప్రభుత్వానికి సహకరించడం మంచిది. – కళ్లేపల్లి మధుసూదనరాజు, అధ్యక్షుడు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం జీపీఎస్‌ను ఆహ్వానిస్తున్నాం.. మెజారిటీ రాష్ట్రాల్లో సీపీఎస్ అమలవుతోంది. అయితే తన పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం సీఎం వైఎస్ జగన్ జీపీఎస్‌ను ప్రతిపాదించారు. పాత పెన్షన్ విధానంలో బేసిక్‌పై 50 శాతం పెన్షన్ ఇచ్చేవారు. జీపీఎస్ కింద ఇప్పుడు 33.5 శాతం పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన చాలా బాగుంది. ఉద్యోగులు రిటైర్ అయ్యాక మంచిగా ఉండాలని తాను ఆలోచిస్తున్నట్లు పీఆర్సీ ప్రకటించే సమయంలోనే సీఎం ఉద్యోగ సంఘాలతో చెప్పారు. సీపీఎస్ విషయంలో బాధపడుతున్న ఉద్యోగులకు 33.5 శాతం పెన్షన్ గ్యారంటీ ఆహ్వానించదగ్గ విషయం. – కె.జాలిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ -
సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం పార్లమెంట్ వీధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. ఉద్యోగుల నిరసనలో టీఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజేందర్, పలువురు ఉద్యోగులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసించారు. సీపీఎస్ విధానంతో 33 సంవత్సరాల పాటు పని చేసి రిటైర్ అయితే ఏ భరోసా లేకుండా పోతున్నదని టి ఎన్జీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సీపీఎస్ విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నూతన పెన్షన్ విధానంతో అనేక మంది ఉద్యోగులు నష్టపోతున్నారని..గతంలో ఉన్న ఓపిఎస్ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టాలని కోరారు. సీపీఎస్ విధానాల అమలులో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కత్తెర వేశారని అన్నారు.ఉద్యోగ వ్యతిరేక విధానాలను విరమించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తున్నా కేంద్రం దురహంకారంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విధానంతో నష్టం జరుగుతున్నదని అన్నారు. తెలంగాణ ఉద్యోగుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఎస్ రద్దు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించుకొని పిఆర్సీలు సాధిస్తున్నామని అన్నారు. ఉద్యోగుల ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ ఉందని పన్నుల రూపంలో 3 నెలల జీతాన్నికేంద్రమే తీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై తెలంగాణ ఎంపీలు కేంద్రానికి లేఖలు కూడా రాసారని చెప్పారు.ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ప్రయివేటికరిస్తే ఉద్యోగుల మీద తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ జనవరిలో దేశవ్యాప్త సమ్మె చేపట్టే యోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. -
సీపీఎస్ రద్దు చేయకుంటే పోరుబాటే
ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికి ఆర్థిక భద్రత, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా, ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు, ప్రత్యేక ప్రయోజనాలు, సామాజిక భద్రతగా పింఛన్లు వస్తాయనుకున్నారు. కానీ ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఉద్యోగుల భవిష్యత్‌కు భరోసా లేకుండా పోయింది. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులను ఆందోళనలు, పోరాటాల బాట పట్టేలా చేసింది. కాకినాడ సిటీ: జిల్లా సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కాకినాడ మెక్లారిన్ హైస్కూల్ నుంచి భారీ ఊరేగింపుగా ఆనందభారతి గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగులు వేలాదిగా తరలి వచ్చి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని దుయ్యబట్టారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం కొనసాగించాలని నినదించారు. కమిటీలు వేసి ఉద్యోగులను బుజ్జగించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. పింఛన్ రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కు ఎక్కడిదంటూ ప్రశ్నించారు. శానససభలో పింఛన్ తీసేస్తున్నట్లు తీర్మానం చేసి కొత్త పింఛన్ విధానం అమలు చేస్తున్నట్లు చట్టాలు చేశారా అంటూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిలదీశారు. రానున్న శాసనసభ సమావేశాల్లో ప్రత్యేక తీర్మానం ద్వారా సీపీఎస్ విధానం రద్దు చేస్తున్నట్లు ప్రకటించకపోతే అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. సీపీఎస్ ఉద్యోగులు నిర్వహించిన సమరభేరి బహిరంగ సభకు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.రవికుమార్ అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు ఐ.వెంకటేశ్వరరావు, బూరిగ ఆశీర్వాదం, గొడుగు ప్రతాప్, డి.వెంకటరావు, ప్రదీప్‌కుమార్, ఎస్కేవీ భాషా, హృదయరాజు, మాజీ ఎమ్మెల్సీ నల్లమిల్లి శేషారెడ్డి, అంబాజీపేట ఎంపీడీఓ తూతిక విశ్వనాథ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. సీపీఎస్ ప్రకటన ఇలా... సీపీఎస్ విధానంపై 2003, డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2004, జనవరి ఒకటి నుంచి సీపీఎస్‌ను అమలులోకి తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004, సెప్టెంబర్ ఒకటి నుంచి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ పొందుతున్న సంస్థల్లో ఉద్యోగులు, అటానమస్ కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులందరికీ 2004, నవంబర్ 22 నుంచి అమలు చేస్తోంది. దీనిని పెన్షన్ నిధి నియంత్రణ, అభివృద్ధి, ప్రాధికార సంస్థ (పీఎఫ్ఆర్డీఏ), నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థల సమన్వయంతో దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. సీపీఎస్ అంశం రాష్ట్ర పరిధిలోనిదే... సీపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమమే మొదలు పెట్టామని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమైనందున దీనిని రద్దు చేయలేమని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నాయని, ఇది సరికాదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును కొన్ని రాష్ట్రాలు ఆమోదించిన తర్వాతే కేంద్రం అమల్లోకి తెచ్చిందన్నారు. ప్రస్తుతం త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కూడా పాత పింఛన్ విధానమే అమల్లో ఉందన్నారు. సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరినప్పుడు ఇది కేవలం రాష్ట్రాల పరిధిలోని అంశం మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసినట్లు పలువురు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖల ఉద్యోగులు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామన్నారు. కేజ్రీవాల్ మాస్క్‌లతో... ఆందోళనకారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫోటోలు, ఫ్లెక్స్‌లు, మాస్క్‌లు ధరించి పాల్గొనడం విశేషం. ఉద్యోగులకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నరాల శివ, మహిళా విభాగం కన్వీనర్ టి.రూపారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీపీఎస్ రద్దుకు జగన్ సుముఖం : మార్గాని భరత్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజవర్గ కో ఆర్డినేటర్ మార్గాని భరత్ పేర్కొన్నారు. కాకినాడలో ఏపీ సీపీఎస్ జిల్లా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో íసీపీఎస్ రద్దుపై నిర్వహించిన ర్యాలీ, సమరభేరి బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా పర్యటన సమయంలో తాము అధికారంలోకి వస్తే సీపీఎస్‌ను రద్దు చేయడంతో పాటు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని, సకాలంలో కరువు భత్యం చెల్లిస్తామని జగన్ ప్రకటించారని భరత్ గుర్తు చేశారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జగన్‌ను కలసి సీపీఎస్ విధానంపై చర్చించారని, స్పష్టమైన హామీని కూడా జగన్ ఉద్యోగులకు ఇచ్చారన్నారు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని, సీపీఎస్ విధానం రద్దు అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీకి ఓటు వేసి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని మార్గాని భరత్ కోరారు. కేంద్రం జోక్యం అవసరం లేదు ఇతర రాష్ట్రాలలో పాత పింఛన్ విధానం అమలు చేస్తున్నారు. మన ప్రభుత్వం మాత్రం కేంద్ర పరిధిలోనిదంటూ దాటవేస్తోంది. సీపీఎస్‌ను రద్దు చేసేందుకు కేంద్రం జోక్యం అవసరం లేదు. – భానుశ్రీ, కాకినాడ -
సీపీఎస్ రద్దు చేయాలని వినతి
శ్రీకాకుళం: సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని జిల్లా సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో 1.82 లక్షల మంది ఉద్యోగులు సీపీఎస్ విధానంలో ఉన్నారని, దీనివల్ల ఇప్పటికే వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌పై అధ్యయనానికి కమిటీ వేసిందని, ఇదంతా కాలయాపన కోసమేనన్నారు. దీనిపై జగన్ స్పందిస్తూ ఇప్పటికే సీపీఎస్ రద్దుకు సంబంధించి హామీ ఇచ్చానని గుర్తు చేశారు. -
‘డబుల్’ లబ్ధిదారులకు రూ.50 వేల అద్దె
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హులై.. రిజిస్టర్ చేసుకున్న కుటుంబాలకు ఇంటి వెలుగు కార్యక్రమం కింద రూ.50 వేల అద్దె చెల్లిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. ‘హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో లక్ష ఇళ్లు, గ్రామీణంలో మరో లక్షా అరవై వేల ఇళ్లు కట్టిస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారు. వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రిజిష్టర్ చేసుకున్న కుటుంబాలకు అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో రెంట్ రీయింబర్స్మెంట్ కింద రూ.50 వేలు ఒకే విడతలో గ్రాంటుగా ఇస్తాం. రిజిష్టర్ చేసుకున్న కుటుంబాలకు ఏడాదిలోనే ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని హామీ ఇస్తున్నాం’అని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. వచ్చే ప్రజా ఫ్రంట్ ప్రభుత్వంలో 15 రోజుల్లోనే ఉద్యోగులకు ఐఆర్ విడుదల చేస్తామన్నారు. ఇక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం విధానాన్ని నెల రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. 28న రాహుల్, బాబు సంయుక్త ప్రచారం... ఇక ఈ నెల 28న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో సం యుక్త ప్రచారం చేస్తారని ఉత్తమ్ వెల్లడించారు. 28 న ఖమ్మం, తాండూర్ బహిరంగ సభలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా రోడ్‌షోల్లో వీరిద్దరూ పాల్గొంటారన్నారు. 29న సైతం మరిన్ని బహిరంగ సభల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఫాంహౌజ్‌కు.. కేటీఆర్ అమెరికాకు.. ఎన్నికల ఫలితాల అనంతరం డిసెంబర్ 12 నుంచి కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితమవుతారని, కేటీఆర్ తెలంగాణకు గుడ్‌బై చెప్పి అమెరికాకు వెళ్లిపోతారని ఉత్తమ్ పేర్కొన్నారు. ఓడిపోతే ఫాంహౌజ్‌లో విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించినందుకు కేసీఆర్‌కు తాను అభినందనలు తెలియజేస్తున్నానని కౌంటర్ వేశారు. దగాకోరు, మోసకారి అయిన కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేది ప్రజాకూటమేనని పునరుద్ఘాటించారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ తీరు పట్ల విసిగెత్తి ఉన్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి విముక్తి పొందడానికి ఇదే సరైన సమయమని, అలాంటి వారందరికీ తాము ఆహ్వానం పలుకుతున్నామని చెప్పారు. ఒకట్రెండు రోజు ల్లో ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఉత్తమ్ వెల్లడిం చారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబం, ప్రజల కు మధ్యే జరుగుతున్నాయని పేర్కొన్నారు. -
సీపీఎస్ ఉద్యోగులపై ప్రభుత్వ మొండి వైఖరి
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : సీపీఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి అన్నారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో సీపీఎస్ రద్దు కోరుతూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు దీక్షలో పార్థసారథి పాల్గొని ఉద్యోగులకు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ఎందుకు సీపీఎస్ రద్దు చేయమని కోరుతున్నారో కనీసం ప్రభుత్వం ఆలోచన చేయడం లేదన్నారు. బాబు ప్రభుత్వం అహంకార ధోరణితో పని చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఏ క్షణాన పుట్టారోగానీ అందరినీ నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్న అనుమానం కలుగుతోందని తెలిపారు. సీపీఎస్ కారణంగా ఉద్యోగులు అనుభవిస్తున్న మనో వేదనను చంద్రబాబు ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్య పెన్షన్లను సీపీఎస్ విధానంలోకి తీసుకువచ్చి మీ పేర బాండ్లు, షేర్లు ఉన్నాయంటూ సామాన్యులను ఒప్పిస్తాడేమోనన్న సందేహం వ్యక్తపరిచారు. ఉద్యోగులకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే సీపీఎస్ రద్దు చేస్తుందని ప్రకటించారు. ఈ దేశంలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీయేనని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్రలో జగన్ ఈ మేరకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ ద్వారా 1.80 లక్షల మంది ఉద్యోగులకు జగన్ భరోసా కల్పించారన్నారు. ఏపీసీపీఎస్ఈఏ అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసేవారికే ఉద్యోగులు అండగా ఉంటారన్నారు. సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన జగన్‌కు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. దీక్షలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ భరోసా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు చేసే అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీపీఎస్‌లో ఉంటారా? పాత పెన్షన్ విధానంలో ఉంటారా? అని కేంద్ర ప్రభుత్వం అడిగిన నేపథ్యంలో సీపీఎస్‌లో కొనసాగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పందం చేసుకుందని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అం శమే కాదని చెప్పేందుకు సిద్ధం అవుతోంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు చర్యలు చేపట్టింది. సీపీఎస్ రద్దు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని టీఆర్ఎస్ చెబుతున్నది అబద్ధమని, తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించేలా చర్యలు చేపడ తామని చెబుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచేలా ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు నిరుద్యోగులను ఆకర్షించేందుకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని చెబుతోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా అభిప్రాయాలను తీసుకొని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఆదివారం బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ బీజేపీ చెబుతున్న ప్రజా మేనిఫెస్టోలో అభిప్రాయాలను తీసుకొని తమ మేనిఫెస్టోలో పొందుపరచనున్న వివిధ అంశాలను వెల్లడించారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని, పీఆర్సీ ప్రకటించకుండా, మధ్యంతర భృతి ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తోందని, తాము ఉద్యోగుల పక్షమని చెప్పేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాపులకు అనుమతి ఇవ్వ కుండా, పాక్షిక మధ్య నిషేధం అమలు చేసేలా మేనిఫెస్టోలో విధానాన్ని పొందుపరిచే అవకాశాన్ని పరిశీలిస్తోంది. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేసే అంశాన్ని పొందుపరచాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎంఎస్పీని అన్ని వర్గాల రైతులకు అందించేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రైతు పంటపొలాల్లో ఉచిత బోర్లు వేసేలా, పంటలపై కేంద్రం ఇచ్చే ఎంఎస్పీకి అదనంగా బోనస్ ఇచ్చేలా, రైతులు బ్యాంకుల్లో తీసుకునే అప్పుల వడ్డీలను తామే చెల్లించే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కార్పొరేషన్ ఏర్పా టు చేసి, కార్పస్ ఫండ్ ఏర్పా టుకు కసరత్తు చేస్తోంది. అన్ని వర్గాలకు రూ.20 లక్షలతో విదేశీ విద్య.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడినవారి విదేశీ విద్యకు రూ. 20 లక్షలు ఇచ్చే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆయుష్మాన్‌భవ పథకాన్ని అమలు చేస్తామని మేని ఫెస్టోలో పొందుపరుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టడంతోపాటు ప్రైవేటు రంగంలో ఫీజుల నియంత్రణ, కార్పొ రేట్ విద్యా వ్యవస్థ నియంత్రణకు విధానాలు రూపొందించే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరచా లని నిర్ణయించింది. గౌడ కులçస్తులకు తాటి వనాలు పెంచుకునేందుకు వరాలు ఇచ్చే జీవోలు ఉన్నాయని, వాటిని పక్కాగా అమలు చేయడం, నీర ఉత్పత్తిని పెంచి మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పించే విధానాన్ని పొందుపరుచాలన్న ఆలోచనకు వచ్చింది. ఈబీసీలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం.. ఈబీసీలకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందించే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తోంది. బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలన్న ఆలోచన చేస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు సిద్ధమవుతోంది. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) విధానాన్ని రద్దు చేయాలని సీపీఎస్ జిల్లా కార్యదర్శి కె.లక్ష్మీ శ్రీనాథ్ కోరారు. ఆదివారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కౌతవరం వచ్చిన వై.ఎస్.జగన్మోహనరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విధానం వలన రాష్ట్రంలో 1.86లక్షల మంది ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. విద్యుత్ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఆ సంఘ నేత శ్రీనివాస్ నాయకత్వాన జగన్‌కు సీపీఎఫ్‌ను రద్దు చేయాలని రాత పూర్వకంగా కోరారు. పంచాయతీరాజ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ సీఐటీయూ రాష్ట్ర సభ్యుడు మద్దాల జగన్ వినతిని అందించారు. -
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
వేములవాడఅర్బన్ : సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం కొనసాగించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల నాయకులు డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఏకీకృత సేవా నిబంధనలను అమలు పరచడానికి కోర్టు ద్వారా క్లీయర్ చేసి, పదోన్నతులు, బదీలీలు చేపట్టాలన్నారు. అర్హత గల ఎస్ఎలకు జెఎల్స్, డైట్ లెక్చర్స్గా పదోన్నతులు కల్పించాలన్నారు. మండల అధ్యక్షుడు రవి, శ్రీనివాస్, శ్రీధర్‌చారీ, గోపాల్‌కిషన్, కనుకయ్య, సుజాత, జీవన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. సర్వీస్ రూల్స్ అమలు చేయాలి కోనరావుపేట : విద్యారంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్)నాయకులు బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు. అధ్యక్షుడు కనుకయ్య మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో ఉపాధ్యాయులు నష్టపోతున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సేవా నిబంధనలు అమలు చేయాలన్నారు. శ్రీకాంత్‌రావు, ప్రసాద్, హరిప్రసాద్, నరేశ్, రమేశ్, శ్రీనివాస్ ఉన్నారు. -
సీపీఎస్ రద్దుతో రెండులక్షల కుటుంబాల్లో ఆనందం..
కడప సిటీ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రకటించడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వైఎస్ జగన్ పాదయాత్ర రెండోరోజు మంగళవారం వేంపల్లెలో కొనసాగుతున్న సమయంలో వేంపల్లె జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద పలు సంఘాల ఉపాధ్యాయులు ఆయన్ను కలిశారు. సీపీఎస్ విధానం రద్దయితే రాష్ట్రంలో రెండు లక్షల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ వైఎస్సార్‌టీఎఫ్ తరుఫున జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పీఆర్సీ బకాయిలు, డీఏలు ఏకీకృత సర్వీసు నిబంధనలు వంటి సమస్యలపై వారు వైఎస్ జగన్‌తో మాట్లాడారు. ఈ సమస్యల పరిష్కరించాలని కోరారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌టీఎఫ్ సజ్జల వెంకటరమణారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అమర్నాథరెడ్డి, రెడ్డప్పరెడ్డి, అబ్బాస్, పిట్ట రమణ, కృష్ణారెడ్డి, ప్రకాష్, ఎస్టీయూ, యూటీఎఫ్ నేతలు నరసింహరెడ్డి, రఘునాథరెడ్డి, సంగమేశ్వరెడ్డి, చెరుకూరి శ్రీనివాసులు, రంగారెడ్డి, రాజశేఖర్, శివారెడ్డి, మనోహర్‌రెడ్డి, ధర్మారెడ్డి, మునిరెడ్డి, అలీ, ఓబుల్‌రెడ్డి, సుబ్రమణ్యం ఉన్నారు. -
అసెంబ్లీలో అవాస్తవాలు దురదృష్టకరం
ఇల్లంతకుంట: సీపీఎస్ విధానం రద్దుకై అసెంబ్లీలో విపక్ష ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలు సీపీఎస్ ఉద్యోగులను విస్మయపరిచాయని రాజన్న సిరిసిల్ల సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు యాదవ రవి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాత పెన్షన్ విధానంలో కంటే కొత్త పెన్షన్ విధానంలోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. పదేళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయిన దైవాధీనం అనే ఉపాధ్యాయుడికి రూ.14 వందల పెన్షన్ వస్తుందన్నారు. ఆర్థిక మంత్రి అవగాహన లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. -
జోన్ వ్యవస్థను కొనసాగించాలి
∙టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి మహబూబాబాద్ : తెలంగాణలో జోన్ వ్యవస్థను కొనసాగించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంఘం మానుకోట మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం ఆ సం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.గోవర్ధన్ అధ్యక్షత సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా జోన్ల సంఖ్య పెంచి వాటిని కొనసాగిస్తేనే న్యాయం జరుగుతోందన్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా వెనుకబడిన ప్రాంతాల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులలో హైద్రాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల అభ్యర్థులతో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల అభ్యర్థులు ఎలా పోటీని ఎదుర్కోగలుగుతారని ప్రశ్నిం చారు. టీవీవీ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల మధ్య నిరుద్యోగుల మధ్య అసమానతలు ఉన్నఆలోచనతోనే రాజ్యాంగం జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను నిరాకరిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్, రాష్ట్ర కౌన్సిలర్ జి.సైదులు, నాయకులు మహబూబ్అలీ, ఉపేందర్, శ్రీశైలం, నర్సింహరాజు, మల్లయ్య, ఉప్పలయ్య, శ్రీనివాస్, నాగేశ్వర్రావు, పి.రామయ్య, వెంకన్న, వసం త, కవిత, వనజ, శ్రీకళ, సువర్ణ, నిక్కత్ఉన్నీ సా, విద్యాసాగర్, వెంకట్రాంనర్సయ్య, అంజ య్య, భావుసింగ్, వెంకన్న పాల్గొన్నారు. -
ర్యాలీగా తరలివెళ్లిన ఉద్యోగులు
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ పెన్షన్ విధానం రద్దు చేయడంతో పాటు పాత విధానాన్నే అమలుచేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబర్ 2న అఖిల భారత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మె సన్నాహక సదస్సు గురువారం నగరంలో జరిగింది. హన్మకొండ అలంకార్ జంక్షన్‌లోని టీఎన్జీవోస్ భవన్లో ఈ సదస్సు ఏర్పాటుచేయగా అఖిల భారత ఉద్యోగుల సంఘం చైర్మన్ ముత్తుసుందరంతో పాటు టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, హమీద్, కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు జి..దేవీప్రసాద్‌రావు వరప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టరేట్ ఉద్యోగులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో ప్రణయ్, సంతోష్, రహీం, డీటీ రాజు, తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయికి సీపీఎస్ ఉద్యమం
ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సహాధ్యక్షుడు పురుషోత్తంనాయుడు శ్రీకాకుళం: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ఎన్జీఓ సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో బుధవారం ఎస్టీయూ జిల్లాశాఖ నిర్వహించిన ‘లక్ష వినతిపత్రాలు’ కార్యక్రమాన్ని తొలిసంతకం చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష వినతి పత్రాల ద్వారా ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతామని తెలిపారు. ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి నాంది పలికాయని, ఈ సమస్య పరిష్కారానికి అసంఘటిత రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎస్టీయూ దశల వారీ పోరాటంలో ఇది ఆరంభం మాత్రమే అని, ప్రత్యక్ష కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఇటీవల తిరుపతిలో జరిగి దక్షిణ భారత ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్యుల సమావేశంలో సీపీఎస్ రద్దును yì మాండ్గా ఏకవాక్య తీర్మానం చేసిందని, అఖితభారత పాఠశాల ఉపాధ్యాయ సమాఖ్య అనుబంధంగా దేవవ్యాపితంగా పనిచేస్తున్న సంఘాలన్నీ ఆయా రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ఎత్తుకొనే విధంగా ఎస్టీయూ కృషి చేస్తుందని, ప్రధానికి, సీఎంకు సెప్టెంబర్‌లో వినతిపత్రాలు సమర్పించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మజ్జి మురళీబాబు, పేడాడ ప్రభాకరరావు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎన్జీఓ నాయకులు శర్మ, ఏపీ సీపీఎస్ఈఏ నాయకులు తమ్మినేని రామక్రిష్ణ, బాలక్రిష్ణ, వీవీవీఆర్ రాజు, వై. కరుణప్ప తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
నెల్లూరు(పొగతోట): ప్రభుత్వ శాఖల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్)రద్దు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొలతాటి గిరిష్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ వి«ధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 1వ తేదీన రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించే సీపీఎస్ శంఖారావానికి వేలాదిగా ఉద్యోగులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కృష్ణారావు, సుబ్రమణి, ప్రవీణ్‌కుమార్, వెంకటరమణయ్య, ప్రసా«ద్, ధనరాజ్, రవికుమార్, కల్పనదేవి, రఫి ాల్గొన్నారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
ఎన్పీకుంట: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ఆర్థికశాఖావుంత్రి అరుణ్‌జైట్లీకి వినతిపత్రం ఇచ్చినట్లు ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజినేయులు, గౌరవ సలహాదారుడు శ్రీనివాసులురెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ పార్లమెంట్ భవన్లో జైట్లీని కలిసి ఈ మేరకు విన్నవించావున్నారు. అంతకు మునుపు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కలిసి ఉమ్మడి సర్సీసు రూల్స్‌పై ఆర్డినెన్స్ ఇవ్వాలని కోరామన్నారు. జైట్లీ సానుకూలంగా స్పందించారన్నారు. -
ఇదెక్కడి పింఛన్ విధానం!
రాయవరం : వేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏది కోరుకుంటారని చదువుకున్న వారిని అడిగితే..ప్రభుత్వ ఉద్యోగమే కావాలని ప్రతి ఒక్కరూ ఠక్కున సమాధానమిస్తారు. మంచి జీతం, పదవీ విరమణ తర్వాత పింఛన్ పొందే సౌకర్యంతో భద్రత ఉంటుందనే ప్రభుత్వ ఉద్యోగానికి చాలా మంది మొగ్గు చూపుతారు. ప్రభుత్వ ఉద్యోగులైనా అందరికీ సమానమైన పింఛన్ విధానం అమలు కావడం లేదు. ఇది ఒక రకంగా ఉద్యోగుల మధ్య అంతరానికి దారితీస్తోందని చెప్పవచ్చు. ప్రభుత్వాలపైనా వ్యతిరేకతను పెంచుతుంది. కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానంతో పింఛన్ వస్తుందన్న నమ్మకాన్ని ఉద్యోగులు కోల్పోతున్నారు. దీనిపై సీపీఎస్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన బాట పడుతున్నారు. వీరికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బాసటగా నిలుస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ అంశమే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రధాన అజెండాగా మారనుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే .. 2004 జనవరి ఒకటి నుంచి కేంద్రం, అదే ఏడాది సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. పథకాన్ని పీఎఫ్ఆర్డీ(పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డవలప్మెంట్ అథారిటీ), ఎన్ఎస్డీఎల్(నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్) సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల మూల వేతనం, కరువుభత్యంలో పింఛన్ కోసం మినహాయించిన పది శాతం మొత్తానికి సమానంగా ప్రభుత్వం అంతే మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ఫండింగ్ ఏజెన్సీ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టి లాభాల ఆధారంగా పింఛన్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నష్టాలొస్తే పింఛన్ ఎలా ఇస్తారన్న దానిపై అస్పష్టత నెలకొంది. జిల్లాలో 2004 తర్వాత సీపీఎస్ విధానంలో 14,457 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. సుమారు ఏడు వేల మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళనతో 12 ఏళ్ల తర్వాత సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ ఏర్పాటుతో ఒక గొడుగు కిందకు వచ్చారు. వీరంతా లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడుతున్నారు. వీరికి బాసటగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఉద్యోగులకు నష్టమిలా .. పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత ఉండదు. ఉద్యోగులు గ్రాడ్యుటీ సౌకర్యాన్ని కోల్పోతారు. పింఛన్లో కొంత భాగాన్ని కముటేషన్ చే సుకునే అవకాశం ఉండదు. ఉద్యోగులు సర్వీసులో మరణిస్తే కారుణ్య నియామకంతో పాటు కుటుంబానికి పింఛను వచ్చే సదుపాయం పాత విధానంలో ఉండగా, కొత్తగా లేదు. వృద్ధాప్యంలో అభద్రత పార్లమెంట్లో పీఎఫ్ఆర్డీ బిల్లును ఇటీవలే ఆమోదించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం ఉండదు. దీని వల్ల సామాజిక భద్రత లేకుండా పోతోంది. 30 ఏళ్లు సర్వీసు ఉన్నా పింఛను లేక పోతే వృద్ధాప్యంలో కష్టాలు తప్పవు. - కె.మునిప్రసాద్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా నేత, కరప పాత విధానంలో పింఛన్ ఇవ్వాలి.. పింఛన్ విధానాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. కొత్త పింఛన్ విధానంలోకి వచ్చిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా మళ్లీ పాత విధానంలోకి వెళ్లేందుకు యోచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి. - దొంతంశెట్టి సతీష్, టీచర్, మాచవరం, రాయవరం మండలం