- ∙టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి
జోన్ వ్యవస్థను కొనసాగించాలి
Published Mon, Aug 29 2016 12:14 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
మహబూబాబాద్ : తెలంగాణలో జోన్ వ్యవస్థను కొనసాగించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ సంఘం మానుకోట మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఆదివారం ఆ సం ఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.గోవర్ధన్ అధ్యక్షత సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా జోన్ల సంఖ్య పెంచి వాటిని కొనసాగిస్తేనే న్యాయం జరుగుతోందన్నారు.
జోనల్ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా వెనుకబడిన ప్రాంతాల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులలో హైద్రాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల అభ్యర్థులతో ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల అభ్యర్థులు ఎలా పోటీని ఎదుర్కోగలుగుతారని ప్రశ్నిం చారు. టీవీవీ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల మధ్య నిరుద్యోగుల మధ్య అసమానతలు ఉన్నఆలోచనతోనే రాజ్యాంగం జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మైస శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను నిరాకరిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.అశోక్, రాష్ట్ర కౌన్సిలర్ జి.సైదులు, నాయకులు మహబూబ్‌అలీ, ఉపేందర్, శ్రీశైలం, నర్సింహరాజు, మల్లయ్య, ఉప్పలయ్య, శ్రీనివాస్, నాగేశ్వర్‌రావు, పి.రామయ్య, వెంకన్న, వసం త, కవిత, వనజ, శ్రీకళ, సువర్ణ, నిక్కత్‌ఉన్నీ సా, విద్యాసాగర్, వెంకట్రాంనర్సయ్య, అంజ య్య, భావుసింగ్, వెంకన్న పాల్గొన్నారు.
Advertisement