జాతీయ స్థాయికి సీపీఎస్ ఉద్యమం
Published Wed, Aug 10 2016 11:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర సహాధ్యక్షుడు పురుషోత్తంనాయుడు
శ్రీకాకుళం: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ఎన్‌జీఓ సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్‌జీఓ కార్యాలయంలో బుధవారం ఎస్‌టీయూ జిల్లాశాఖ నిర్వహించిన ‘లక్ష వినతిపత్రాలు’ కార్యక్రమాన్ని తొలిసంతకం చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష వినతి పత్రాల ద్వారా ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళతామని తెలిపారు. ఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమానికి నాంది పలికాయని, ఈ సమస్య పరిష్కారానికి అసంఘటిత రంగంలో ఉన్న ప్రతి ఉద్యోగి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎస్‌టీయూ దశల వారీ పోరాటంలో ఇది ఆరంభం మాత్రమే అని, ప్రత్యక్ష కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఇటీవల తిరుపతిలో జరిగి దక్షిణ భారత ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్యుల సమావేశంలో సీపీఎస్ రద్దును yì మాండ్‌గా ఏకవాక్య తీర్మానం చేసిందని, అఖితభారత పాఠశాల ఉపాధ్యాయ సమాఖ్య అనుబంధంగా దేవవ్యాపితంగా పనిచేస్తున్న సంఘాలన్నీ ఆయా రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ఎత్తుకొనే విధంగా ఎస్‌టీయూ కృషి చేస్తుందని, ప్రధానికి, సీఎంకు సెప్టెంబర్‌లో వినతిపత్రాలు సమర్పించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు మజ్జి మురళీబాబు, పేడాడ ప్రభాకరరావు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎన్‌జీఓ నాయకులు శర్మ, ఏపీ సీపీఎస్‌ఈఏ నాయకులు తమ్మినేని రామక్రిష్ణ, బాలక్రిష్ణ, వీవీవీఆర్ రాజు, వై. కరుణప్ప తదితరులు పాల్గొన్నారు.
Advertisement