సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
నెల్లూరు(పొగతోట):
ప్రభుత్వ శాఖల్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్)రద్దు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొలతాటి గిరిష్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద రిలేనిరాహారదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ వి«ధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 1వ తేదీన రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించే సీపీఎస్ శంఖారావానికి వేలాదిగా ఉద్యోగులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కృష్ణారావు, సుబ్రమణి, ప్రవీణ్‌కుమార్, వెంకటరమణయ్య, ప్రసా«ద్, ధనరాజ్, రవికుమార్, కల్పనదేవి, రఫి ాల్గొన్నారు.