నెల్లూరు జిల్లాలో 'పోరుబాట'
నెల్లూరు: ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి ... అధికారాన్ని చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగట్టేందుకు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పోరుబాట నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ఈ ధర్నా కార్యక్రమాలలో డ్వాక్రా మహిళలు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాటి వివరాలు..
నాయుడు పేట: ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
మనుబోలు : ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత కాకాని గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఆత్మకూరు: ఎమ్మార్వో కార్యాలయం ఎదుట జెడ్పీ ఛైర్మన్ రాఘవేందరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
బుచ్చిరెడ్డిపాలెం: మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నాలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్: మండల కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
గూడూరు: ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా