ర్యాలీగా తరలివెళ్లిన ఉద్యోగులు
Published Fri, Aug 19 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ పెన్షన్ విధానం రద్దు చేయడంతో పాటు పాత విధానాన్నే అమలుచేయాలన్న డిమాండ్‌తో సెప్టెంబర్ 2న అఖిల భారత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మె సన్నాహక సదస్సు గురువారం నగరంలో జరిగింది. హన్మకొండ అలంకార్ జంక్షన్‌లోని టీఎన్జీవోస్ భవన్‌లో ఈ సదస్సు ఏర్పాటుచేయగా అఖిల భారత ఉద్యోగుల సంఘం చైర్మన్ ముత్తుసుందరంతో పాటు టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, హమీద్, కేంద్ర సంఘం గౌరవ అధ్యక్షుడు జి..దేవీప్రసాద్‌రావు వరప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టరేట్ ఉద్యోగులు ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో ప్రణయ్, సంతోష్, రహీం, డీటీ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement