కమీషన్ విషయంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ నాయకుడికి కత్తిపోట్లు అయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగింది. పాణ్యం తండా కాలనీలో రూ.10 లక్షల ఐటీడీఏ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో కమీషన్ ఇవ్వాలని స్థానిక టీడీపీ ఉపాధ్యక్షుడు పుల్లారెడ్డి పట్టుబట్టడంతో ఇరువురి మధ్య వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది