kurnool city
-
కర్నూలు పర్యటనలో చంద్రబాబు ఆశలేని వ్యాఖ్యలు
-
‘అగ్రిగోల్డ్ ఆస్తులను టీడీపీ నేతలు కొల్లగొడుతున్నారు’
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను చంద్రబాబు పక్కన పెట్టాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. టీడీపీ నాయకులు అగ్రిగోల్డ్ ఆస్తులను చౌకబేరంగా కొల్లగొడుతున్నారని ఆరోపించారు. గురువారం 16వ ఏఐటీయూసీ మహాసభలను కర్నూలులో ఆయన ప్రారంభించారు. ఏఐటీయూసీ నాయకులు కర్నూలు నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. రానున్న 2019 ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు మహాకూటమిగా పోటీ చేస్తాయని తెలిపారు. -
యువతి అదృశ్యం
కర్నూలు : కల్లూరులోని గంగావతి నగర్లో నివాసముంటున్న ఆంజనేయులు కుమార్తె రామాంజనమ్మ (24) అదృశ్యమైంది. పోలీసుల వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం ఫేస్‌క్రీమ్ తెచ్చుకుంటానని బయటకు వెళ్లిన రామాంజనమ్మ తిరిగిరాలేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. సుమారు 5 అడుగుల ఎత్తు, కోల ముఖం, చామన ఛాయ కల్గి ఉంది. ఆచూకీ తెలిసిన వారు 8519894597 నంబర్లో సమాచారం అందించాలని నాలుగో పట్టణ పోలీసులు కోరారు. -
కర్నూలులో దొంగలు పడ్డారు!
కర్నూలు : నగరంలోని పలుచోట్ల బుధవారం దొంగలు పట్టపగలే చోరీకి తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. వెంకటరమణ కాలనీలోని కేఎన్ఆర్ స్కూల్ సమీపంలో ఉన్న ఎం.ఎస్–9 అపార్ట్మెంట్ మూడో అంతస్తులో ఎస్బీఐ(కర్నూలు మెయిన్ బ్రాంచ్) డిప్యూటీ మేనేజర్ సుగుణమ్మ తల్లితో కలసి నివాసముంటున్నారు. కుమార్తె శ్రావణి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఉదయం కుమార్తె బెంగళూరు, తల్లి కడపకు వెళ్లిపోవడంతో ఇంటికి తాళం వేసి విధులకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలను పెకలించి పడక గదిలో ఉన్న రెండు బీరువాలను బద్దలుకొట్టి అందులో ఉన్న 20 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు సుగుణమ్మ ఇంటికి వెళ్లేసరికి తాళాలు తెరిచి ఉండడంతో లోపలకు వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించింది. రెండో పట్టణ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. బాలాజీ నగర్లో.. బాలాజీ నగర్‌లోని నాగసాయి అపార్ట్మెంట్లో రెండిళ్లలో చోరీ జరిగింది. రిటైర్డ్ లెక్చరర్ గోవిందరాజులు పత్తికొండకు వెళ్లాడు. ఎమ్మిగనూరులో లెక్చరర్‌గా పని చేస్తున్న ఆయన భార్య విజయలక్ష్మి ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లింది. గుర్తు తెలియని దుండగలు ఇంట్లోకి ప్రవేశించి 5 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే అపార్ట్మెంట్లో చెన్నారెడ్డి ఇంటిలో చోరీకి విఫల యత్నం చేశారు. కర్నూలు డీఎస్పీ ఖాదర్ బాషా, రెండో పట్టణ సీఐ డేగల ప్రభాకర్, ఎస్ఐ మోహన్కిశోర్రెడ్డి, నాలుగో పట్టణ సీఐ రామయ్య నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఫింగర్‌ప్రింట్స్ నిపుణులను పిలిపించి ఆధారాలను సేకరించారు. తుంగభద్ర అపార్ట్మెంట్లో .. సుంకేసుల రోడ్డులోని గాంధీ టవర్స్‌కు ఎదురుగా తుంగభద్ర అపార్ట్టమెంట్లోని రెండు ఇళ్లలో చోరీ జరిగింది. ఫ్లాట్ నంబర్ 501లో శ్రీనివాసరెడ్డి నివాసముంటాడు. ఈయన రాజ్‌విహార్ సెంటర్లో హోటల్ నడుపుతున్నాడు. బుధవారం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హోటల్‌కు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ. 2 లక్షల నగదు, 10 తులాల బంగారు చోరీ చేశారు. అలాగే అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 503లో వ్యాపారీ వెంకటేశ్వరరెడ్డి నివాసముంటున్నాడు. ఆయన.. ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో మహానందికి వెళ్లాడు. దొంగలు ఇంట్లో దూరి భారీగా చోరీ చేశారు. అయితే ఎంత పోయిందనేది బాధితులు మహానంది నుంచి తిరిగివచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. చోరీ విషయం తెలిసిన వెంటనే టూ టౌన్ సీఐ డేగల ప్రభాకర్ సంఘటన స్థలానికి చేరుకుని నేరం జరిగిన తీరును పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
కర్నూలులో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
కర్నూలు: కర్నూలు నగరంలోనూ చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేసింది. హైదరాబాద్ తరహాలో దోపిడీలకు తెగబడింది. స్థానిక న్యూ కృష్ణా నగర్, ఆదిత్యనగర్, విఠల్ నగర్లలో చోరీలకు పాల్పడింది. మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి ఓ ఇంటికి నిప్పు పెట్టారు. నాలుగో ఇంట్లో చోరీకి వెళ్లడంతో స్థానికులు గుర్తించారు. బనియన్, చెడ్డీలు వేసుకున్న 25 ఏళ్ల యువకులు ఈ ముఠాలో ఉన్నట్టు వారు చెబుతున్నారు. స్థానికులు గుర్తించడంతో దొంగలు పరారయ్యారు. మగ్మములు, మహమ్మద్ ఇళ్లలో చోరీ జరిగింది. అయితే పోయిన సొమ్ము ఎంతనేది తెలియరాలేదు. -
టీడీపీ, బీజేపీ నాయకుల ఘర్షణ
-
టీడీపీ, బీజేపీ నాయకుల ఘర్షణ
పాణ్యం: కమీషన్ విషయంలో టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో టీడీపీ నాయకుడికి కత్తిపోట్లు అయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాణ్యంలో జరిగింది. పాణ్యం తండా కాలనీలో రూ.10 లక్షల ఐటీడీఏ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో కమీషన్ ఇవ్వాలని స్థానిక టీడీపీ ఉపాధ్యక్షుడు పుల్లారెడ్డి పట్టుబట్టడంతో ఇరువురి మధ్య వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కమీషన్ ఇచ్చేందుకు ససేమిరా అన్న బీజేపీకి చెందిన కాంట్రాక్టర్, మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు పుల్లారెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న పుల్లారెడ్డి తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ పాణ్యం బస్టాండులో సుబ్బారాయుడుతో గొడవకు దిగాడు. దీంతో ఆత్మరక్షణ కోసం సుబ్బారాయుడు పుల్లారెడ్డిని కత్తితో పొడిచి పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ పుల్లారెడ్డి రెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదని స్థానికులు అంటున్నారు. -
ఫుట్‌పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్
– పగటిపూట నగరంలోకి భారీ వాహనాల నిషేధం – నగర పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష కర్నూలు : కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఫుట్‌పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు. నగరంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపుల ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకున్న వ్యాపారుల దుకాణాలను మున్సిపల్ అధికారుల సహకారంతో తొలగించేందుకు కార్యాచరణ రూపొందించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఎస్పీ గోపీనాథ్ జట్టి నగర పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో డీఎస్పీలు రమణమూర్తి, వినోద్‌కుమార్, ట్రాఫిక్ సీఐ దివాకర్‌రెడ్డి, ఎస్ఐ తిమ్మారెడ్డి, ఆర్ఎస్ఐ జయప్రకాష్‌లతో సమావేశం నిర్వహించి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధాన జంక్షన్లలో రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ ఏర్పాటు, ఫ్రీ లెఫ్ట్, ఫ్రీ రైట్ (కుడి, ఎడమ మలుపులు) డివైడర్స్‌ను రీ డిజైనింగ్ చేయించాలని నిర్ణయించారు. పగటి పూట నగరంలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా నిషేధం అమలు చేయనున్నారు. బారీకేడ్లు, రోడ్ సిగ్నల్స్, డైరెక్షన్ బోర్డులు, నో పార్కింగ్ బోర్డులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేయించాలని ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. డ్రైవింగ్ లైసెన్ లేకుండా వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు. ఎక్కడ పడితే అక్కడ పార్కింగే చేసే వాహనదారులకు జరిమానా విధించాలని సూచించారు. -
మూడు రోజుల్లో ముప్పు
కర్నూలు నగరవాసులకు బురద నీరే గతి – జీడీపీలో కనిష్ట స్థాయికి నీటి నిల్వలు – ప్రస్తుతం 0.2 టీఎంసీలు మాత్రమే – మరో 3 రోజుల్లో నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం – పొంచి ఉన్న తాగునీటి ఇక్కట్లు కర్నూలు సిటీ/టౌన్: కర్నూలు నగర ప్రజలకు తాగునీటి ముప్పు పొంచి ఉంది. మరో మూడు రోజుల్లో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా నిలిచిపోనుండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. జీడీపీలో నీటి నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇప్పటికే వారం రోజులుగా బురద నీరు సరఫరా అవుతోంది. ఈ నీటిని ఫిల్టర్ చేయలేక అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా ప్రజాప్రతినిధులు మాత్రం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందుచూపు లేకపోవడమే తాజా దుస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. నాయకులకు పనుల్లో వాటాలపై ఉన్న శ్రద్ధ నీటి సమస్య శాశ్వత పరిష్కారంపై లేకపోవడం వల్లే ఏటా తాగునీటి సమస్య జటిలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలలుగా తాగునీటిని అందించిన గాజులదిన్నె ప్రాజెక్టు చరిత్రలోనే అత్యంత దిగువకు నీటి నిల్వలు పడిపోయాయి. ఇప్పటికే నెలన్నర రోజులకు పైగా శివారు కాలనీలకు వారం, పది రోజుల నుంచి నీరందని పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం నగరంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతుండటం గమనార్హం. కనిష్ట స్థాయికి నీటి నిల్వలు హంద్రీనదిపై గోనెగండ్ల మండలం గాజులదిన్నె దగ్గర 4.5 టీఎంసీల సామర్థ్యంతో మధ్యతరహా ప్రాజెక్టు(దామెదరం సంజీవయ్య)ను నిర్మించారు. కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని తాగు, సాగు నీటి నీటిని అందించాలనేది దీని ఉద్దేశం. ఈ ఏడాది సుంకేసుల బ్యారేజీ ఎండిపోవడం వల్ల కర్నూలు నగర వాసులకు తాగు నీటి ఇబ్బందులు రావడంతో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ప్రత్యామ్నాయంగా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో కూడా నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రాజెక్టు చర్రితలోనే మొదటి సారి 0.2 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది. నగరపాలక సంస్థ పరిధిలోని 51 వార్డుల్లో 5.25 లక్షల జనాభా ఉంది. రోజుకు ఒక కుటుంబానికి 155 లీటర్ల చొప్పున నీరు సరఫరా చేయాలి. అయితే ఆ స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో అధికారులు రోజుకు 135 లీటర్ల చొప్పున మాత్రమే సరఫరా చేస్తున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో ఉన్న నీటి నిల్వల ప్రకారం పది రోజులకు సరిపడా నీరు ఉన్నట్లు అంచనా. అధికారులు మాత్రం 25 రోజులకు సరిపోతుందని చెబుతుండటం గమనార్హం. అయితే అధికారులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికీ చేపట్టకపోవడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తం మీద కర్నూలు ప్రజల తాగునీటి కష్టాలు తీరాలంటే వరుణుడు కరుణించాల్సి ఉంది. ఇబ్బంది లేదు.. ఇటీవల కురిసిన వర్షాల వల్ల గాజులదిన్నె ప్రాజెక్టులో 50 ఎంసీఎఫ్‌టీ పరిమాణం పెరిగింది. ఈ నీరు నగరవాసులకు 12 రోజులకు సరిపోతుంది. సమ్మర్స్టోరేజీలో మరో 25 రోజులకు పరిపడా నీరు నిల్వ ఉంది. అందువల్ల తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. – రమణమూర్తి, మున్సిపల్ ఇంజనీర్ -
ప్ర‘జల’ కష్టం పట్టదా?
పాలకులకు ముందుచూపులేకపోవడంతోనే నగరంలో తాగునీటి సమస్య – హంద్రీజలాల వినియోగంలో నిర్లక్ష్యం – కర్నూలు నగరంలో నీటి సమస్యపై 24న కలెక్టరేట్ వద్ద ధర్నా – ధర్నాను జయప్రదం చేయండి - ప్రజలకు, పార్టీశ్రేణులకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి పిలుపు కర్నూలు(ఓల్డ్‌సిటీ): కర్నూలు నగరంలో మంచినీటి ఎద్దడితో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పాలకులు, అధికారులకు పట్టడం లేదని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. దీనికంతటికి వారికి ముందుచూపు లేకపోవడమే కారణమని ఆరోపించారు. పక్కన నదులు పారినా నీటిని ఎందుకు నిల్వ చేసుకోలేకపోయారని ప్రశ్నించారు. నీటి సమస్య పరిష్కారానికి ఈనెల 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం స్థానిక కృష్ణకాంత్ ప్లాజాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. గౌరు వెంకటరెడ్డితో పాటు పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది నీటి ఎద్దడి నెలకొందన్నారు. హంద్రీ జలాలు వాడుకునేందుకు మూడు నెలల క్రితమే అవకాశం ఉన్నా పాలకులు పట్టించుకోలేదని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలు 24న ఉదయం 9.00 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని, అక్కడి నుంచి 10 గంటలకు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరుతామన్నారు. 10.30 నుంచి 11.30 గంటల ప్రాంతంలో ధర్నా ఉంటుందన్నారు. నీటి విడుదలలో వివక్ష- ఎమ్మెల్యే గౌరుచరిత నగరానికి మంచినీటి సమస్య పొంచి ఉన్న విషయాన్ని జనవరి నెల నుంచే అధికారుల దృష్టికి తీసుకెళుతున్నా పట్టనట్లు వ్యవహరించారని పాణ్యం శాసన సభ్యురాలు గౌరు చరితారెడ్డి మండిపడ్డారు. అరోరానగర్‌కు నీరు సరఫరా అయి మాధవీనగర్‌కు రాకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అధికారులు నీటిసరఫరాలో పక్షపాతం వహిస్తున్నారని, అశోక్‌నగర్, ఎన్నార్పేటలో మాత్రం కొరత లేకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. కల్లూరు అర్బన్ పరిధిలోని 14 వార్డుల ప్రజలు నీటిపన్ను కట్టడం లేదా అని ప్రశ్నించారు. అధికారులకు తెలియదా?కొత్తకోట అక్టోబర్ తర్వాత వర్షాలు రాలేదని, నగరానికి నీటి సమస్య ఏర్పడుతుందని అధికారులకు ముందే తెలియదా అని మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి కలిసికట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నీళ్లకంటే మద్యం పుష్కలం చంద్రబాబు పాలనలో మంచినీళ్ల కంటే మద్యం పుష్కలంగా లభిస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వై.రామయ్య ఎద్దేవా చేశారు. కర్నూలు ఎమ్మెల్యే సమ్మర్ స్టోరేజీ, సుంకేసులప్రాజెక్టును పరిశీలించడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం ఆదాయ మార్గాలకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజల కష్టాలకు ఇవ్వదన్నారు. వాటర్ మేనేజ్మెంట్ పాటించడం లేదు.. అధికారులు వాటర్ మేనేజ్మెంట్ పాటించడం లేదని పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ విమర్శించారు. 10 నిమిషాలసేపు వచ్చే నీటి కోసం ప్రజలు రాత్రంతా జాగరణలు చేస్తున్నారని, రోజూ సరఫరా చేస్తున్నట్లు పాలకులు ప్రకటించుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అధికారుల మెడలు వంచుదాం మంచినీటి సమస్యపై భారీ ధర్నా నిర్వహించి అధికారుల మెడలు వంచుదామని పార్టీ నగర అధ్యక్షుడు పి.జి.నరసింహులు యాదవ్ పేర్కొన్నారు. వినతులు ఇస్తే అధికారులు మాట వినడం లేదన్నారు. దోమల నివారణ తరహాలో ఉద్యమిద్దాం.. దోమల నివారణ కోసం చేపట్టిన మహాధర్నా తరహాలోనే పార్టీ శ్రేణులు మంచినీటి ఎద్దడిపై గళం విప్పాలని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్, మైనారిటీసెల్, ఎస్సీసెల్ల రాష్ట్ర కార్యదర్శులు ఎస్.ఎ.రహ్మాన్, సి.హెచ్.మద్దయ్యలు, మైనారిటీసెల్, కిసాన్సెల్ల రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, పిట్టం ప్రతాప్‌రెడ్డిలు, మైనారిటీసెల్ జిల్లా అధ్యక్షుడు ఫిరోజ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నగర నాయకులు ఈశ్వర్, మహేశ్వరరెడ్డి, ఎస్.ఎ.అహ్మద్, బుజ్జి, సఫియాఖాతూన్, మంగమ్మ, విజయలక్ష్మి, వాహిద, పేలాల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే జీఎం ‘రాచరిక’ పర్యటన
– కర్నూలు సిటీ స్టేషన్‌ను తనిఖీ చేసిన వినోద్ కుమార్ యాదవ్ – రాచరిక పాలన తరహాలో గొడుగులు పట్టిన అధికారులు – పోలీసుల అత్యుత్సాం.. ఫొటోగ్రాఫర్ల తోసివేత కర్నూలు (రాజ్‌విహార్): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు వినోద్ కుమార్ యాదవ్ కర్నూలు పర్యటన రాచరిక పాలనను తలపించింది. అధికారులు, పోలీసులు ఆయనకు దాసోహమై తమ భక్తిని చాటుకున్నారు. శుక్రవారం కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసేందుకు ఉదయం ఉదయం 10:05 గంటలకు ప్రత్యేక రైలులో ఇక్కడికి చేరుకున్నారు. వచ్చినప్పటి నుంచి తిరిగి ఆయన వెళ్లే వరకు స్థానిక అధికారులు, ఆర్పీఎఫ్ పోలీసులు ఆద్యంతం హడావిడి చేశారు. ఆయన రైలు దిగిన వెంటనే రోప్ పార్టీ పోలీసులు తాడుతో చుట్టూ వలయం వేశారు. అక్కడి నుంచి ఇంజినీరింగ్ విభాగ ఎగ్జిబిషన్‌ను తిలకించి ఉద్యోగుల కోసం కొత్తగా రూ.15లక్షలతో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు వెళ్తున్న ఆయనకు పెద్ద పెద్ద గొడుగులు పట్టారు. దేశ ప్రధానమంత్రే ఎండలకు రోడ్లపై తిరుగుతుంటే జీఎంకు యువరాజులాగా గొడుగులు పట్టడం పట్ల ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీని ప్రకారం ఎలాంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయకూడదు. అయినప్పటికీ ఆర్ఓ వాటర్ ప్లాంట్‌తోపాటు పవర్ జనరేటర్, సీనియన్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) కార్యాలయాన్ని, టైప్–4 స్టాఫ్ క్వార్టర్స్‌ను, పార్క్‌ను ప్రారంభించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని మేధావులు, ప్రభుత్వ అధికారులు అంటున్నారు. మీడియాకు అవమానం కర్నూలు రైల్వే జీఎం వినోద్ కుమార్ యాదవ్ పర్యటనలో మీడియాకు అవమానం జరిగింది. స్థానిక రైల్వే, జిల్లా సమాచార శాఖ అధికారులు ఆహ్వానం మేరకు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లు, ఫోటో గ్రాఫర్లు జీఎం పర్యటన కార్యక్రమాలను కవరేజీ చేసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే ఆర్పీఎఫ్ పోలీసులు, రోప్ పార్టీ అడుగడుగునా అడ్డుకున్నారు. ఫోటోలు, విజువల్స్ తీసుకునేందుకు యత్నించే ప్రతినిధులు పక్కకు జరుపుకుంటూ వెళ్లారు. చివరకు కార్యక్రమం పూర్తయ్యాక మీడియాతో మాట్లాడుతానని జీఎం చెప్పడంతో స్టేషన్‌లోని వీఐపీ లాంజ్‌లో నిరీక్షించారు. అయితే ముందుగా అక్కడికి వచ్చిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధులతో మాట్లాడాక మీడియాతో మాట్లాడుతానని జీఎం చెప్పడంతో వీఐపీ లాంజ్ నుంచి బయటకు పంపారు. అక్కడ జీఎంను కలిసిన ప్రజా ప్రతినిధుల ఫొటోలు తీసేందుకు యత్నించిన ఫోటో గ్రాఫర్లును ఆర్పీఎఫ్ పోలీసులు పక్కకు తోసేశారు. కిందపడబోయిన వారిని ఇతరులు పట్టుకున్నారు. దీంతో ఆగ్రహించిన పాత్రికేయులు తమను పిలిచి అవమానిస్తారా అంటూ నిలదీశారు. దీనిపై డీఆర్ఎం అరుణా సింగ్ సమాధానం ఇవ్వకపోవడంతో కార్యక్రమాన్ని బహిష్కరించి జీఎంతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ఇదిలా ఉండగా.. కర్నూలు రైల్వే స్టేషన్‌కు రూ.9వేలు, రైల్వే ఆస్పత్రికి రూ.5వేలు నగదు నజరానాను జీఎం ప్రకటించారు. -
నీటి ముళ్లు!
కర్నూలుకు తప్పని మంచినీటి ఇక్కట్లు – నెల రోజులకు మించి నీరులేని దుస్థితి – ఎస్ఎస్ ట్యాంకులో నిలవని నీరు – ముచ్చుమర్రి నుంచి ముందుకు సాగని నీటి తరలింపు – గాజులదిన్నె ఆయకట్టు రైతుల నోట్లో మట్టికొట్టాల్సిందే.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగరానికి మంచినీటి సమస్య పొంచి ఉంది. 30 రోజులకు మించి నీరు అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. ఒకవైపు ఎస్ఎస్ ట్యాంకులో నీరు నిలబడని పరిస్థితి కాగా.. మరోవైపు సుంకేసులలో 20 నుంచి 25 రోజులకు మించి నీటి లభ్యత లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్నూలు నగరానికి తీవ్ర మంచి నీటి ఇక్కట్లు తప్పేలా లేవు. ఇప్పటికే రోజు వారీగా 75వేల మిలియన్ లీటర్ల నీటిని కార్పొరేషన్‌లోని జనాభాకు సరఫరా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం చేస్తోంది 65 మిలియన్ లీటర్లు మాత్రమే. ప్రభుత్వం నుంచి ముందుచూపు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. హంద్రీనీవా ద్వారా పందికోన చెరువును నింపి.. అక్కడి నుంచి గాజులదిన్నెకు నీటిని తరలించి నిల్వ చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ముచ్చుమర్రి ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని తరలించి కూడా సమస్య ఉత్పన్నం కాకుండా చూసే అవకాశం ఉండేది. అయితే, ఈ రెండింటిలో ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో ఎండాకాలంలో మంచినీళ్ల కోసం కర్నూలు ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గాజులదిన్నె ఆయకట్టు రైతుల నోట్లో మట్టి కొట్టి కర్నూలుకు నీటిని తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎండిపోయిన సుంకేసుల వాస్తవానికి కర్నూలు కార్పొరేషన్‌కు మంచినీటి అవసరాలు తీర్చేది సుంకేసుల మాత్రమే. అయితే, ప్రస్తుతం సుంకేసుల ఎడారిని తలపిస్తోంది. రిజర్వాయర్‌లో కేవలం 0.28 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీరు కర్నూలు కార్పొరేషన్‌లోని ప్రజల నీటి అవసరాలను 20 నుంచి 25 రోజులు మాత్రమే తీర్చగలవు. మరోవైపు పురాతన కట్టడమైన ఎస్ఎస్ ట్యాంకులో సగం నీరు కూడా నిలబడటం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న నీరు వారం నుంచి పది రోజుల వరకు మాత్రమే సరిపోతుందని అధికారుల అంచనా. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు నెలకు మించి వచ్చే పరిస్థితి లేదని అర్థమవుతోంది. ఈ లెక్కన ఏప్రిల్ కంటే ముందు కర్నూలు ప్రజలు దాహార్తిని ఎదుర్కోవాల్సి రానుంది. ఈ దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఇలా చేసి ఉండాల్సింది! వాస్తవానికి కర్నూలు కార్పొరేషన్ నీటి అవసరాలు సుంకేసుల నుంచి తీర్చలేమని ముందుగానే ప్రభుత్వానికి తెలుసు. ఈ నేపథ్యంలో హంద్రీనీవా నుంచి పందికోనకు నీరు ఇచ్చి.. అక్కడి నుంచి గాజులదిన్నెకు తరలించి నిల్వ చేసుకుని ఉండాల్సింది. తద్వారా గాజులదిన్నె నుంచి కర్నూలు కార్పొరేషన్‌కు నీటిని తరలించినా.. ఆక్కడి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు ఉండేవి కావు. ప్రభుత్వం మాత్రం ఈ పనిచేయలేదు. అంతేకాకుండా హంద్రీనీవా ద్వారా కర్నూలు జిల్లాకు నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలించారు. గత రెండునెలల కాలంలో కర్నూలు జిల్లాకు కేవలం 3 టీఎంసీల నీటిని మాత్రమే ఇవ్వగా.. మిగిలిన ప్రాంతాలకు ఏకంగా 43 టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తరలించారు. మరోవైపు గాజలదిన్నె ఆయకట్టు రైతాంగానికి ఇప్పటి వరకు రెండు తడులు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం ఆయకట్టు రైతాంగం ఆందోళనతో మూడో తడి నీరు ఇస్తున్నారు. నాలుగోతడి నీరు ఇస్తేనే 7వేల ఎకరాల ఆయకట్టు నిలబడుతుంది. అయితే, ప్రభుత్వం మాత్రం నాలుగోతడి ఇవ్వలేమని ఆయా గ్రామాల్లో చాటింపు వేసి మరీ చెబుతోంది. అంటే గాజలదిన్నె ఆయకట్టు రైతాంగం నోట్లో మట్టి కొట్టి.. ఆ నీటిని కర్నూలుకు తరలించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ముందుచూపు లేని తన చేతగాని తనానికి రైతాంగాన్ని బలిపశువు చేయాలని చూస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
కథ విభిన్నం.. అందుకే నటించా..
‘ఒక్క అమ్మాయి తప్ప’ సినీ హీరో సందీప్ కిషన్ కర్నూలు(టౌన్): ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రం కథ విభిన్నంగా ఉందని, అందుకే అందులో నటించానని సినీ హీరో సందీప్ కిషన్ పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన సినిమా విడుదల అవుతున్న సందర్భంగా సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో సందీప్ కర్నూలు నగరానికి విచ్చేశారు. స్థానిక మౌర్య ఇన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఒక్క అమ్మాయి తప్పా’ చిత్రం తన కెరీయర్ లో గొప్ప చిత్రంగా నిలుస్తుందన్నారు. కథతో పాటు చిత్రీకరణలోను సాంకేతిక విలువలు ఉండటంతో ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఈ సినిమాలో హైదరాబాద్ హైటెక్ సిటి బ్రిడ్జిపై పెద్ద ఎత్తున్న ట్రాఫిక్ జామ్ కావడం, అక్కడ టైమ్ బాంబ్ అమర్చినట్లు గుర్తించడంతో ప్రజలు భయాందోళనలకు గురవ్వడం, ఇక్క డే ఓ యువకుడు, యువతి ప్రేమలో పడటం.. వారి ప్రేమ ఏమైంది.. అనే కథంశంతో ఈ చిత్రాన్ని నిర్మించారని పేర్కొన్నారు. హీరోయిన్ నిత్యామీనన్ నటన, మిక్కి మేయర్ సంగీతం, చోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ ఈ చిత్ర విజయానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అందరిని అలరించేలా తీసిన ఈ సినిమాను కర్నూలు ప్రజలు ఆదరించాలని కోరారు. సమావేశంలో భరత్, వెంకటేష్ థియేటర్ల లీజ్ ప్రొప్రైటర్ లక్ష్మీ నారాయణ, సురేష్, రామానాయుడు, ఫిలిమ్ రెప్రజెంటేటీవ్ ఎస్ఎం బాషా పాల్గొన్నారు. -
ముగ్గురు అరెస్ట్ : భారీగా నకిలీ కరెన్సీ స్వాధీనం
కర్నూలు : దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను గురువారం కర్నూలు నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.60 లక్షల విలువ చేసే నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు వారిని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. -
అయ్యప్ప మాలతో వచ్చాడని చితక్కొట్టేసింది
కర్నూలు: కర్నూలు నగరంలోని జేఎంజే స్కూల్లో శనివారం దారుణం చోటు చేసుకుంది. అయ్యప్ప మాలతో స్కూల్‌కి వచ్చిన ఓ విద్యార్థినిపై టీచర్ తన ఆగ్రహన్ని ప్రదర్శించింది. ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని రావాలంటూ హుకుం జారీ చేశారు. అందుకు విద్యార్థి ససేమిరా అనటంతో టీచర్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో బెత్తం తీసుకుని విద్యార్థిని చితక బాదింది. విద్యార్థి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో తల్లిదండ్రులు, వీహెచ్‌పీ నేతలతోపాటు కార్యకర్తలు స్కూల్ కు చేరుకుని... క్షమాపణలు చెప్పాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. అందుకు వారు అంగీకరించకపోవడంతో తరగతి గదులలోకి ప్రవేశించి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అనంతరం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో జేఎంజే స్కూల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల బంగారం పట్టివేత
కర్నూలు: కర్నూలు నగరంలో అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నోవా కారును సీజ్ చేశారు. ముంగళవారం కర్నూలులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఇన్నోవా కారులో భారీగా బంగారం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. బంగారం గురించి వాహనదారులను ప్రశ్నించగా... వారు పొంతనలేని సమాధానాలు తెలిపారు. దీంతో పోలీసులు బంగారాన్ని సీజ్ చేసి ... వారిని స్టేషన్‌కు తరలించారు. బంగారంపై పోలీసులు వారిని విచారిస్తున్నారు. బెంగళూరు నుంచి వారంత కర్నూలు వస్తున్నారని పోలీసులు తెలిపారు. -
కర్నూలులో కొనసాగుతున్న బంద్
కర్నూలు: విజయవాడ - గుంటూరు నగరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై రాయలసీమ రాజధాని సాధన సమితి నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా బుధవారం కర్నూలు నగరంలో బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. దాంతో నగరంలోని విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో కర్నూలు నగరంలో జనజీవనం స్తంభించింది. తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ రాజధాని సాధన సమితి డిమాండ్ చేస్తుంది. గతంలో ఆంధ్రరాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేదని ఈ సందర్భంగా ఆ సమితి గుర్తు చేసింది. ఆ తర్వాత రాజధాని హైదరాబాద్‌కు తరలిపోయిందని.... రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని మళ్లీ కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ రాజధాని సాధన సమితి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కానీ ఆ ప్రభుత్వం మాత్రం విజయవాడ - గుంటూరుల మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమ రాజధాని సాధన సమితి బంద్‌కు పిలుపు నిచ్చింది. -
రాజకీయం వ్యాపారంగా మారింది
కర్నూలు: దేశంలో రాజకీయం వ్యాపారంగా మారిందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజిలో న్యాయ సేవా అధికార సంస్థ, పయనం మార్పు కోసం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెరుగైన సమాజం-యువత పాత్ర’ న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగ హక్కుల గురించి తెలుసుకోవాలని, యువత దేశ మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మెరుగైన సమాజం నిర్మించేందుకు నడుం బిగించాలన్నారు. ఒక కూల్‌డ్రింక్ తయారు చేసేందుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే కంపెనీకి ఖర్చవుతుందని.. అయితే మన దేశంలో విదేశీ కంపెనీల శీతల పానీయాలు తాగడం వల్ల వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలిపోతున్నాయన్నారు. అన్నదాతలను నాసిరకం విత్తనాలు, నకిలీ పురుగు మందులతో ముంచుతున్నారన్నారు.ప్రతి ఒక్కరు పరిపూర్ణ వ్యక్తిగా మారేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని, హక్కుల గురించి తెలుసుకుని జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలన్నారు. నేటి సమాజంలో మంచికి, మంచి వ్యక్తులకు, సిద్ధాంతాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలో మార్పుకోసం యువత ఉద్యమించాలన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలంటే మంచి పోలీసు వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి, జిల్లా జడ్జి బసవయ్య, న్యాయమూర్తులు ఆదినారాయణ, వెంకటజ్యోతిర్మయి, పయనం సంస్థ కన్వీనర్ చెన్నయ్య, కార్యదర్శి మాగంటి ఈశ్వరప్ప, వ్యక్తిత్వ వికాస నిపుణులు కృష్ణ, సెయింట్ జోసెఫ్ కాలేజి సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
'బాబుది కండువాలు మార్చే సంస్కృతి'
ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు నగరానికి విచ్చేసిన నారాయణ విలేకర్లతో మాట్లాడారు. రూ. 87 వేల కోట్ల రుణమాఫీ చేసి చంద్రబాబు తన మాటను నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. కండువాలు మార్చే సంస్కృతి చంద్రబాబు నాయుడిదే అంటూ విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. అలాగే టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యవహార శైలిపై నారాయణ తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిని నారాయణ ఖండించారు. ఉద్యోగుల విషయంలో తన వైఖరి మార్చుకోవాలని ఈ సందర్బంగా కేసీఆర్‌కు హితవు పలికారు. కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం చేసి ప్రాజెక్టులకు నీరందించాలని నారాయణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు నరుక్కున్నట్లే: టీజీ
కర్నూలు: ‘నన్ను ఎన్నుకోకపోతే మీ తలలు నరుక్కున్నట్లే’ అని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేష్ అన్నారు. ఆదివారం ఆయన కర్నూలు నగరంలో రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోవాలని.. తాను నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని.. అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఓట్ల కోసం వచ్చే వారు ఏ సేవ చేశారో తెలుసుకోవాలన్నారు. కళ్లు లేని వాళ్లకు తాను చేసిన అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. రాజకీయాలను మార్చే శక్తి మీడియాకు లేదన్నారు. ఆ శక్తి ఉంటే తాను ఏనాడో పేపర్, టీవీ చానల్ పెట్టేవాడినని మంత్రి చెప్పారు.