కథ విభిన్నం.. అందుకే నటించా.. | sundeep kishan visits kurnool city | Sakshi
Sakshi News home page

కథ విభిన్నం.. అందుకే నటించా..

Published Thu, Jun 9 2016 9:50 AM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

కథ విభిన్నం.. అందుకే నటించా.. - Sakshi

కథ విభిన్నం.. అందుకే నటించా..

‘ఒక్క అమ్మాయి తప్ప’ సినీ హీరో సందీప్ కిషన్

కర్నూలు(టౌన్): ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రం కథ విభిన్నంగా ఉందని, అందుకే అందులో నటించానని సినీ హీరో సందీప్ కిషన్ పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన  సినిమా విడుదల అవుతున్న సందర్భంగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో సందీప్ కర్నూలు నగరానికి విచ్చేశారు. స్థానిక మౌర్య ఇన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఒక్క అమ్మాయి తప్పా’ చిత్రం తన కెరీయర్ లో గొప్ప చిత్రంగా నిలుస్తుందన్నారు.

కథతో పాటు చిత్రీకరణలోను సాంకేతిక విలువలు ఉండటంతో ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఈ సినిమాలో హైదరాబాద్ హైటెక్ సిటి బ్రిడ్జిపై పెద్ద ఎత్తున్న ట్రాఫిక్ జామ్ కావడం, అక్కడ టైమ్ బాంబ్ అమర్చినట్లు గుర్తించడంతో ప్రజలు భయాందోళనలకు గురవ్వడం, ఇక్క డే ఓ యువకుడు, యువతి ప్రేమలో పడటం.. వారి ప్రేమ ఏమైంది.. అనే కథంశంతో ఈ చిత్రాన్ని నిర్మించారని పేర్కొన్నారు.

హీరోయిన్ నిత్యామీనన్ నటన, మిక్కి మేయర్ సంగీతం, చోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ ఈ చిత్ర విజయానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అందరిని అలరించేలా తీసిన ఈ సినిమాను కర్నూలు ప్రజలు ఆదరించాలని కోరారు. సమావేశంలో భరత్, వెంకటేష్ థియేటర్ల లీజ్ ప్రొప్రైటర్ లక్ష్మీ నారాయణ, సురేష్, రామానాయుడు, ఫిలిమ్ రెప్రజెంటేటీవ్ ఎస్‌ఎం బాషా పాల్గొన్నారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement