Okka Ammayi Thappa
-
నాన్న, మావయ్యకు హీరో ఫాదర్స్ డే విషెస్
'ఫాదర్స్ డే' ను పురస్కరించుకుని టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన ఆనందాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. నాన్న, పెదనాన్న, చోటా మామకు హ్యాపీ ఫాదర్స్ డే అంటూ ఫాదర్స్ డే విషేస్ ట్వీట్ చేశాడు. నాన్న, చోటా మామతో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి చిన్ననాటి నుంచి వారితో అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన జీవితంలో ఆ ముగ్గురు ఎంతో ముఖ్యమని, వారి ప్రేమ తనలో ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చిందని వారు లేకపోతే తాను లేనట్లేనని రాసుకొచ్చాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ఒక్క అమ్మాయి తప్ప. ఈ మూవీపై సందీప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. హీరోయిన్ నిత్యా మీనన్ సందీప్ కిషన్‌కు జోడీగా నటించింది. ఈ సినిమాతో రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. HAPPY FATHERS DAY Dad,Pedananna & Chota Mama..I m nothing without ur love and confidence in me :) love you pic.twitter.com/heo6JmVVLw — Sundeep Kishan (@sundeepkishan) 19 June 2016 -
కథ విభిన్నం.. అందుకే నటించా..
‘ఒక్క అమ్మాయి తప్ప’ సినీ హీరో సందీప్ కిషన్ కర్నూలు(టౌన్): ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రం కథ విభిన్నంగా ఉందని, అందుకే అందులో నటించానని సినీ హీరో సందీప్ కిషన్ పేర్కొన్నారు. ఈనెల 10వ తేదీన సినిమా విడుదల అవుతున్న సందర్భంగా సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో సందీప్ కర్నూలు నగరానికి విచ్చేశారు. స్థానిక మౌర్య ఇన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘ఒక్క అమ్మాయి తప్పా’ చిత్రం తన కెరీయర్ లో గొప్ప చిత్రంగా నిలుస్తుందన్నారు. కథతో పాటు చిత్రీకరణలోను సాంకేతిక విలువలు ఉండటంతో ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఈ సినిమాలో హైదరాబాద్ హైటెక్ సిటి బ్రిడ్జిపై పెద్ద ఎత్తున్న ట్రాఫిక్ జామ్ కావడం, అక్కడ టైమ్ బాంబ్ అమర్చినట్లు గుర్తించడంతో ప్రజలు భయాందోళనలకు గురవ్వడం, ఇక్క డే ఓ యువకుడు, యువతి ప్రేమలో పడటం.. వారి ప్రేమ ఏమైంది.. అనే కథంశంతో ఈ చిత్రాన్ని నిర్మించారని పేర్కొన్నారు. హీరోయిన్ నిత్యామీనన్ నటన, మిక్కి మేయర్ సంగీతం, చోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ ఈ చిత్ర విజయానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అందరిని అలరించేలా తీసిన ఈ సినిమాను కర్నూలు ప్రజలు ఆదరించాలని కోరారు. సమావేశంలో భరత్, వెంకటేష్ థియేటర్ల లీజ్ ప్రొప్రైటర్ లక్ష్మీ నారాయణ, సురేష్, రామానాయుడు, ఫిలిమ్ రెప్రజెంటేటీవ్ ఎస్ఎం బాషా పాల్గొన్నారు. -
టైటిల్ ఓకె, ట్యాగ్ లైనే..!
యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఒక్క అమ్మాయి తప్ప. నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రోడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్ వివాదానికి కారణమైంది. ఒక్క అమ్మాయి తప్ప అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ట్యాగ్ లైన్‌ను యాడ్ చేశారు. ఈ ట్యాగ్ లైన్‌పై వివాదం మొదలవ్వటంతో వెంటనే మేల్కొన్న చిత్ర యూనిట్ తాజా పోస్టర్స్, ట్రైలర్స్‌లో ఆ ట్యాగ్ లైన్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఒక్క అమ్మాయి తప్ప సినిమా.., టైటిల్ వివాదం నుంచి బయట పడినట్టే భావిస్తున్నారు. -
బాలయ్య పుట్టినరోజున.. యువహీరో సినిమా
నిత్యామీనన్‌తో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ హీరో సందీప్ కిషన్ రొమాన్స్ చేసిన సినిమా ఒక్క అమ్మాయి తప్ప. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమా విడుదల అవుతోందట. అయితే ఈ విషయాన్ని సినిమా వర్గాలు ఇంకా అఫీషియల్‌గా చెప్పాల్సి ఉంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. తాడినాడ రాజసింహ అనే కొత్త దర్శకుడి చేతిలో రూపొందిన ఈ సినిమాకు బోగాది అంజిరెడ్డి నిర్మాత. ఈ నెలాఖరులోనే సినిమా విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లింది. కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాలో బాలయ్య అభిమానిగా అలరించిన నాని.. తన తదుపరి సినిమా 'జెంటిల్మన్'ను అదే రోజు విడుదల చేస్తాడని తొలుత వినిపించినా.. అది మరో వారం రోజులకు వాయిదా పడింది. దాంతో ఆ అవకాశాన్ని సందీప్ కిషన్ అందుకున్నట్లయింది. ఈ సినిమాలో ఇంకా తనికెళ్ల భరణి, సప్తగిరి, తాగుబోతు రమేష్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, అలీ, అజయ్, బ్రహ్మాజీ లాంటి పలువురు నటిస్తున్నారు. -
ఆ హీరో బర్త్‌డేకి మూడు సినిమాలు రిలీజ్
సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ సీజన్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. జూన్ నెలలో ఓ స్టార్ హీరో పుట్టినరోజున పెద్దసంఖ్యలో సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లేవి లేకపోయినా ఆసక్తి కలిగిస్తున్న మూడు చిన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జూన్ 10న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఈ ఏడాది బాలయ్య పుట్టిన రోజున టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం కనిపించనుంది. సమ్మర్ సీజన్ ముగిసిపోనుండటంతో ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఒక మనసు, సందీప్ కిషన్, నిత్యామీనన్‌లు జంటగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప, సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన రైట్ రైట్ సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కొద్ది రోజులుగా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు బిజీగా ఉండటం, జూన్ 2న వస్తున్న అ..ఆ.. పై కూడా భారీ అంచనాలు ఉండటంతో జూన్ 10న చిన్న సినిమాల రిలీజ్‌కు సరైన సమయంగా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అందుకే ఒకేసారి ముగ్గురు హీరోలు బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. బాలయ్య పుట్టిన రోజు ఎవరికి కలిసొస్తుందో చూడాలి. -
బాలయ్య పుట్టినరోజున భారీ పోటి
సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ సీజన్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. జూన్ నెలలో ఓ స్టార్ హీరో పుట్టినరోజున పెద్దసంఖ్యలో సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లేవి లేకపోయినా ఆసక్తి కలిగిస్తున్న మూడు చిన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జూన్ 10న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఈ ఏడాది బాలయ్య పుట్టిన రోజున టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం కనిపించనుంది. సమ్మర్ సీజన్ ముగిసిపోనుండటంతో ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఒక మనసు, సందీప్ కిషన్, నిత్యామీనన్‌లు జంటగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప, సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన రైట్ రైట్ సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కొద్ది రోజులుగా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు బిజీగా ఉండటం, జూన్ 2న వస్తున్న అ..ఆ.. పై కూడా భారీ అంచనాలు ఉండటంతో జూన్ 10న చిన్న సినిమాల రిలీజ్‌కు సరైన సమయంగా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అందుకే ఒకేసారి ముగ్గురు హీరోలు బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. బాలయ్య పుట్టిన రోజు ఎవరికి కలిసొస్తుందో చూడాలి. -
గొప్ప సినిమా తీయడానికి ప్రయత్నించాం
- సందీప్ కిషన్ ‘‘ ‘ప్రస్థానం’తో సందీప్ కిషన్ కెరీర్‌ను డిఫరెంట్‌గా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. తాజా చిత్రంపై ఎన్నో అంచనాలున్నాయి. క్లిష్టమైన పాయింట్‌తో సరికొత్త రీతిలో తెరకెక్కించిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై రాజసింహ తాడినాడ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి నిర్మించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. మిక్కీ జె మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని హీరో సాయిధరమ్‌తేజ్ ఆవిష్కరించి, దర్శకుడు బోయపాటి శ్రీనుకు అందజేశారు. ఈ సందర్భంగా సందీప్‌కిషన్ మాట్లాడుతూ- ‘‘ఒక మంచి సినిమా లేదా ఓ హిట్ సినిమా తీయడానికి చేసిన ప్రయత్నం కాదు. ఓ గొప్ప సినిమా చేయడానికి చేసిన ప్రయత్నమిది’’ అన్నారు. వినాయక్ మాట్లాడుతూ- ‘‘రాజసింహ ఏడేళ్ల క్రితమే ఈ కథ చెప్పాడు. ఈ కథ ఎవరికైనా ఇవ్వాలని ప్రయత్నించాడు. తనే ఈ కథతో దర్శకునిగా మారడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ఎక్కడా బోర్ కొట్టకుండా ఈ చిత్రాన్ని తీయడంలో రాజసింహ సక్సెస్ అయ్యారు. గ్రిప్పింగ్‌గా కథ రాసుకున్నారు’’ అని నిత్యామీనన్ చెప్పారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, రాశీఖన్నా, రెజీనా పాల్గొన్నారు. -
ఆ కల ఇప్పటికి నెరవేరింది
కథాబలం ఉన్న చిత్రాల్లో నటిస్తూ, హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ కిషన్. ప్రస్తుతం రాజసింహ దర్శకత్వంలో ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రంలో నటించారాయన. నేడు సందీప్ కిషన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు. * హైటెక్‌సిటీ ఫ్లై ఓవర్ ట్రాఫిక్‌లో జరిగే ప్రేమకథ ఇది. ఇద్దరు ప్రేమికులు ఆ ట్రాఫిక్‌ను దాటుకుని సమస్య నుంచి ఎలా బయటపడ్డారన్నదే కథ. రియలిస్టిక్ ఎమోషన్స్ బేస్ చేసుకుని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం తెరకెక్కించాం. స్క్రీన్‌ప్లే సినిమాను పరిగెత్తిస్తుంది. * కళాశాల అంటే ఇష్టం లేక మధ్యలోనే చదువు ఆపేసే పాత్రలో నటించా. ఎదుటివారి మనసు చదివేంత తెలివితేటలున్న అబ్బాయి పాత్ర ఇది. కమర్షియల్ డెరైక్టర్స్‌లో రాజసింహ బెస్ట్ డెరైక్టర్. నేను ఎంచుకున్న మంచి కథల్లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘ఒక్క అమ్మాయి తప్ప’ కూడా ఉంటాయి. నిత్యామీనన్ ఈ చిత్రం ఒప్పుకోవడానికి కారణం కథే. నాకు, నిత్యామీనన్‌కు హైట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సెట్లో ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకునేవాళ్లం. మంచి కథ అయితే నెగటివ్ పాత్రల్లో నటిస్తా. హిట్టు, ఫ్లాప్ గురించి పట్టించుకోకుండా ముందుకెళుతుంటా. * నేను ఇండస్ట్రీకొచ్చిన కొత్తలో కృష్ణవంశీగారితో పనిచేయాలనుకునేవాణ్ణి. ‘నక్షత్రం’ చిత్రంతో ఆ కల నెరవేరింది. నేను, లావణ్యా త్రిపాఠి కలిసి తమిళంలో ‘మాయవన్’ అనే చిత్రం చేస్తున్నాం. అలాగే మరో తమిళ సినిమాలో నటిస్తున్నాను. -
తెలివైన కాలేజీ కుర్రాడి కథ!
విలక్షణమైన చిత్రాలు, నటనతో యువతరంలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. గతంలో ‘సినిమా చూపిస్త మావ’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన బోగాది అంజిరెడ్డి ఈ చిత్రం ద్వారా రాజసింహ తాడినాడను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. సందీప్‌కు జోడీగా నిత్యామీనన్ నటించిన ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కొత్త నేపథ్యంలో నడిచే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. సందీప్ కొత్తగా కనిపిస్తాడు. ప్రముఖ భోజ్‌పురీ నటుడు రవి కిషన్ విలన్‌గా చేశారు. ఇందులో గంటా ముప్ఫై నిమిషాలు అధునాతన గ్రాఫిక్స్ ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘మూడు పాటలు తీయాల్సి ఉంది. ఒకటి ఇండియాలో, రెండు విదేశాల్లో చిత్రీకరిస్తాం. ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్’ అన్నది ఈ చిత్ర క్యాప్షన్. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘‘ఇందులో తెలివైన కాలేజీ కుర్రాడి పాత్రలో కనిపిస్తా. నేను, నిత్యామీనన్ తొలిసారి కలిసి నటిస్తు న్నాం. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అని సందీప్ కిషన్ చెప్పారు. ఈ చిత్రానికి కెమేరామ్యాన్: ఛోటా కె.నాయుడు, సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆళ్ల రాంబాబు, సహ నిర్మాత: మాధవి వాసిపల్లి.