సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ సీజన్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. జూన్ నెలలో ఓ స్టార్ హీరో పుట్టినరోజున పెద్దసంఖ్యలో సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లేవి లేకపోయినా ఆసక్తి కలిగిస్తున్న మూడు చిన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్కు రెడీ అవుతున్నాయి.
జూన్ 10న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఈ ఏడాది బాలయ్య పుట్టిన రోజున టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం కనిపించనుంది. సమ్మర్ సీజన్ ముగిసిపోనుండటంతో ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఒక మనసు, సందీప్ కిషన్, నిత్యామీనన్లు జంటగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప, సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన రైట్ రైట్ సినిమాలు ఒకే రోజు రిలీజ్కు రెడీ అవుతున్నాయి.
కొద్ది రోజులుగా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు బిజీగా ఉండటం, జూన్ 2న వస్తున్న అ..ఆ.. పై కూడా భారీ అంచనాలు ఉండటంతో జూన్ 10న చిన్న సినిమాల రిలీజ్కు సరైన సమయంగా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అందుకే ఒకేసారి ముగ్గురు హీరోలు బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. బాలయ్య పుట్టిన రోజు ఎవరికి కలిసొస్తుందో చూడాలి.
ఆ హీరో బర్త్డేకి మూడు సినిమాలు రిలీజ్
Published Wed, May 25 2016 10:52 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM
Advertisement
Advertisement