Right Right
-
'రైట్ రైట్' అన్నా స్పీడందుకునేలా లేదు..
స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్. మంచి సినిమాలతో మెప్పిస్తున్నా హీరోగా స్టార్ ఇమేజ్ మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాడు. అయినా తన ప్రయత్నాల్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. లవర్స్, కేరింత లాంటి సినిమాలతో యూత్‌కు దగ్గరైన సుమంత్, ఈ సారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ చేసిన సినిమా 'రైట్ రైట్'. పూర్తి పల్లె వాతావరణంలో తెరకెక్కిన రైట్ రైట్ సుమంత్ అశ్విన్ కెరీర్‌కు స్పీడు పెంచిందో లేదో చూద్దాం. తండ్రి మరణంతో పోలీస్ ఆఫీసర్ కావాలన్న తన కలను పక్కన పెట్టి కండక్టర్ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు ఇ.రవి (సుమంత్ అశ్విన్). కొత్తగా జాయిన్ అయిన వాళ్లకు రోజుకు ఒక్క ట్రిప్ మాత్రమే ఉండే గవిటి రూట్ అయితే బెటర్ అని రవికి అదే రూట్ డ్యూటీ వేస్తారు. వెళ్లే సమయమే కాని తిగిరి ఎప్పుడొస్తుందో చెప్పలేని గవిటి రూట్ బస్ డ్రైవర్ శేషు( కాలకేయ ప్రభాకర్). ఆ ఊరికి వెళ్లేది ఒక్క బస్సే కావటంతో బస్ డ్రైవర్, కండక్టర్లు ఊరి జనాలకు దగ్గరవుతారు. అదే బస్‌లో రెగ్యులర్‌గా వచ్చే కళ్యాణి(పూజ జవేరి)తో రవి ప్రేమలో పడతాడు. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో అనుకోకుండా రవి, శేషుల బస్ కింద పడి ఓ వ్యక్తి గాయపడతాడు. కేసు అవుతుందన్న భయంతో ఆ వ్యక్తిని ఆ రూట్లో వస్తున్న జీపు డ్రైవర్‌కి అప్పగించి హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తరువాత ఆ బస్ కింద పడిపోయిన వ్యక్తి గవిటి సర్పంచ్ విశ్వానాథ్ గారి అబ్బాయి దేవా అని తెలుస్తుంది. రవి జీపులో ఎక్కించి పంపించిన దేవా ఊరి బయట లోయలో శవమై కనిపిస్తాడు. ఆ నేరం రవి మీద పడుతుంది. అసలు దేవా ఎలా చనిపోయాడు..? ఆ కేసు నుంచి రవి ఎలా బయటపడ్డాడు..? అన్నదే మిగతా కథ. ఇప్పటి వరకు అల్లరి పాత్రల్లో కనిపించిన సుమంత్ అశ్విన్ తొలిసారిగా ఓ బరువైన పాత్రను ఎంచుకొని విజయం సాధించాడు. డ్రైవర్ శేషుగా ప్రభాకర్ బాగా సెట్ అయ్యాడు. క్యారెక్టర్ పరంగా పెద్దగా స్కోప్ లేకపోయినా హీరోయిన్ పాత్రలో పూజ ఆకట్టుకుంది. పల్లె వాతావరణంలో సాగే లవ్ స్టోరికి చిన్న క్రైం ఎలిమెంట్ యాడ్ చేసి దర్శకుడు మను చేసిన ప్రయత్నం బాగానే ఉన్నా.. కథనం లో మరింత వేగం చూపించాల్సింది. క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్ కలిగించే పాయింట్లు పెద్దగా లేకపోవటం పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరితో కథ నడిపిన దర్శకుడు స్లో నారేషన్తో ఇబ్బంది పెట్టాడు. ఇక సెకండ్ హాఫ్‌లో క్రైం థ్రిల్లర్‌గా టర్న్ అయినా కథలో వేగం మాత్రం కనిపించలేదు. శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా తెర మీద ఆవిష్కరించాడు. జెబి సంగీతం పర్వాలేదు. ఓవరాల్‌గా ప్రభాకర్‌తో కలిసి సుమంత్ అశ్విన్ రైట్ రైట్ అన్నా కెరీర్ మాత్రం స్పీడందుకునేలా లేదు. -
ఆ పాత్ర గురించి చెప్పగానే రజనీకాంత్ గుర్తొచ్చారు!
‘‘మంచి హీరో అనిపించుకునేకన్నా మంచి నటుడు అనిపించుకుంటే నాకు సంతృప్తిగా ఉంటుంది. ఎటువంటి పాత్రను అయినా చేయగలడనే గుర్తింపు ఉంటే చాలు. నా సినిమాలు చూసి, ప్రేక్షకులు ఆనందించాలనీ, తీసే నిర్మాతలు లాభపడాలని కోరుకుంటా’’ అని సుమంత్ అశ్విన్ అన్నారు. మను దర్శకత్వంలో ఆయన నటించిన ‘రైట్ రైట్’ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ చెప్పిన విశేషాలు... ♦ గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం ‘రైట్ రైట్’. ఫస్టాఫ్ సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో ఊహకందని అంశాలుంటాయి. ఇందులో పోలీస్ అవుదామని శాయశక్తులా ప్రయత్నించి, చివరకు బస్ కండక్టర్ అవుతాను. కండక్టర్ పాత్ర అని దర్శకుడు చెప్పగానే రజనీకాంత్ గారు గుర్తొచ్చారు. కండక్టర్‌గా ఆయన జీవితం మొదలై, సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. రజనీగారి సినిమాలు చాలా చూశాను. ♦ వాస్తవానికి సెకండాఫ్ కథ విన్నప్పుడు నాకు భయమేసింది. ఆ సీన్స్‌లో నటించేందుకు నేను, ప్రభాకర్ షాట్ షాట్‌కి మధ్య పది నిముషాలు టైమ్ తీసుకుని, డిస్కస్ చేసుకుని నటించాం. కన్నీళ్ల కోసం గ్లిజరిన్ వాడకుండా న్యాచురల్‌గా నటించాం. ఓ సీన్లో ప్రభాకర్‌గారి ఎమోషనల్ డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ చూసి యూనిట్ మొత్తానికి కన్నీళ్లొచ్చాయి. ఇప్పటివరకూ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రభాకర్ మెప్పించారు. ఈ సినిమా చూసినవాళ్లు ఆయన ఎలాంటి పాత్రైనా చేయగలరని అంటారు. డెరైక్టర్ మను వెరీ టాలెంటెడ్. ఈ చిత్రకథను అద్భుతంగా తెరకెక్కిం చారు. వంశీకృష్ణగారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ♦ ‘శ్రీమంతుడు’ని చూసి, అందులో మహేశ్‌బాబుగారు చెప్పిన ‘రైట్ రైట్’ డైలాగ్ నచ్చి, ఈ చిత్రానికి టైటిల్ పెట్టామన్నది కొంతమంది ఊహ. అయితే, స్క్రిప్ట్ చదివినప్పుడే నాన్నగారు టైటిల్ చెప్పేశారు. మేము రిజస్టర్ చేయించిన ఏడాది తర్వాత ‘శ్రీమంతుడు’ వచ్చింది. ♦ కథల ఎంపిక విషయంలో మా నాన్న (ఎమ్మెస్ రాజు)గారి జోక్యం ఉంటుందని, ముందు ఆయనే వింటారని కొంతమంది అనుకుంటున్నారు. కానీ, ఏ కథ అయినా మొదట నేనే వింటా. నాకు నచ్చితే నాన్నగారితో డిస్కస్ చేస్తా. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్, జడ్జ్మెంట్ నాకు హెల్ప్ అవుతాయి. ఆ తరువాత ఏమైనా మార్పులు, చేర్పులు అవసరమైతే ఆయన చెబుతుంటారు. ♦ ప్రస్తుతం నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథలు ఎంచుకుంటున్నా. ఇప్పుడు కాలేజీ కుర్రాడిగా చేయగలను కానీ పదేళ్ల తర్వాత చేయలేను కదా? ఇప్పుడే యాక్షన్ అంటూ నేను ఓ వందమందిని కొడితే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరు. మొదట్లో ఆమిర్‌ఖాన్, సూర్య వంటి వారు మామూలు చిత్రాలు చేసి, ఆ తరువాత మాస్ హీరోలుగా ఎదిగారు. ఇప్పుడు వారు ఏ చిత్రం చేసినా అవి చూసి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు. నేనూ ఆ స్థాయికి చేరుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. ♦ ఇటీవల ‘ద్రోణ’ చిత్ర దర్శకుడు జె.కరుణ్ కుమార్ చెప్పిన కథ నచ్చింది. నా తదుపరి చిత్రం ఆయన దర్శకత్వంలోనే ఉంటుంది. -
మా కెమిస్ట్రీ కుదిరింది!
‘‘పోలీస్ కావాలని హైదరాబాద్‌కొచ్చా. ఉద్యోగం ఇప్పిస్తామంటూ చాలామంది నన్ను మోసం చేశారు. కానీ, దేవుడు మాత్రం మోసం చేయకుండా నటుడిగా ఈ స్థాయికి చేరుకునేలా చేశాడు. రాజమౌళిగారు ‘మర్యాద రామన్న’, ‘బాహుబలి’లో నాకు మంచి గుర్తింపు తెచ్చే పాత్రలు ఇచ్చారు’’ అని ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ నిర్మించిన ‘రైట్ రైట్’ ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన ప్రభాకర్ మాట్లాడుతూ - ‘‘ ‘బాహుబలి’ తర్వాత నేను చేసిన ఫుల్‌లెంగ్త్ మూవీ ఇదే. సాధారణంగా హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుంది అంటారు. కానీ, ఈ చిత్రంలో నాకు, సుమంత్ అశ్విన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. సుమంత్ డ్రైవర్.. నేను కండక్టర్. ఇందులో డ్యాన్స్ చేశా. డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్‌లు తప్పక చూడాల్సిన సినిమా ఇది. నిర్మాత ఎమ్మెస్ రాజుగారు, దర్శకుడు మను నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇటీవల గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్’కి వెళ్లినప్పుడు విదేశీయులు కూడా నా నటన మెచ్చుకుంటుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ప్రస్తుతం గోపీచంద్ ‘ఆక్సిజన్’లో విలన్‌గా, మలయాళంలో మోహన్‌లాల్ చిత్రంలో ప్రధానపాత్ర చేస్తున్నా. ఇంకా ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘కాలకేయ వర్సెస్ కాట్రవల్లి’, కన్నడంలో మూడు సినిమాలు చేస్తున్నా’’ అని చెప్పారు. -
మరో కథకు రైట్ రైట్ !
‘రైట్ రైట్’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సుమంత్ అశ్విన్ మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నితిన్ నటించిన ‘ద్రోణ’ చిత్రాన్ని తెరకెక్కించిన కరుణకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘సూర్య వెర్సస్ సూర్య’, ‘శౌర్య’ చిత్రాలను నిర్మించిన మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘సుమంత్ అశ్విన్‌తో సరికొత్త కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాం. సుమంత్ కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుంది. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. -
ఆ హీరో బర్త్‌డేకి మూడు సినిమాలు రిలీజ్
సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ సీజన్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. జూన్ నెలలో ఓ స్టార్ హీరో పుట్టినరోజున పెద్దసంఖ్యలో సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లేవి లేకపోయినా ఆసక్తి కలిగిస్తున్న మూడు చిన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జూన్ 10న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఈ ఏడాది బాలయ్య పుట్టిన రోజున టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం కనిపించనుంది. సమ్మర్ సీజన్ ముగిసిపోనుండటంతో ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఒక మనసు, సందీప్ కిషన్, నిత్యామీనన్‌లు జంటగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప, సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన రైట్ రైట్ సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కొద్ది రోజులుగా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు బిజీగా ఉండటం, జూన్ 2న వస్తున్న అ..ఆ.. పై కూడా భారీ అంచనాలు ఉండటంతో జూన్ 10న చిన్న సినిమాల రిలీజ్‌కు సరైన సమయంగా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అందుకే ఒకేసారి ముగ్గురు హీరోలు బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. బాలయ్య పుట్టిన రోజు ఎవరికి కలిసొస్తుందో చూడాలి. -
బాలయ్య పుట్టినరోజున భారీ పోటి
సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ సీజన్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. జూన్ నెలలో ఓ స్టార్ హీరో పుట్టినరోజున పెద్దసంఖ్యలో సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లేవి లేకపోయినా ఆసక్తి కలిగిస్తున్న మూడు చిన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జూన్ 10న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఈ ఏడాది బాలయ్య పుట్టిన రోజున టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం కనిపించనుంది. సమ్మర్ సీజన్ ముగిసిపోనుండటంతో ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఒక మనసు, సందీప్ కిషన్, నిత్యామీనన్‌లు జంటగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప, సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన రైట్ రైట్ సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కొద్ది రోజులుగా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు బిజీగా ఉండటం, జూన్ 2న వస్తున్న అ..ఆ.. పై కూడా భారీ అంచనాలు ఉండటంతో జూన్ 10న చిన్న సినిమాల రిలీజ్‌కు సరైన సమయంగా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అందుకే ఒకేసారి ముగ్గురు హీరోలు బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. బాలయ్య పుట్టిన రోజు ఎవరికి కలిసొస్తుందో చూడాలి. -
బస్సులో మిస్సుతో...!
ఓ లక్ష్యాన్ని సాధించడానికి తపన పడే ఒక యువకుడు అనుకోకుండా బస్ కండక్టర్ అవుతాడు. ఆ బస్‌లో అతనికో మిస్సు పరిచయమవుతుంది. ఆమెతో ఈ కండక్టర్‌కు ఎలాంటి అనుబంధం ఏర్పడింది? చివరకు ఏమైంది? తెలియాలంటే మా ‘రైట్ రైట్’ చిత్రం చూడాల్సిందే అంటున్నారు హీరో సుమంత్ అశ్విన్. మను దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీసత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ‘బాహుబలి’ ప్రభాకర్ ఇందులో ప్రధాన పాత్ర చేశారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నేనిప్పటివరకూ చేసిన పాత్రల్లో ఇందులో చాలా భిన్నమైన పాత్ర చేశా. నా క్యారెక్టర్ చాలా సహజంగా ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఎంజాయ్ చేస్తూ చేశా. మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం మిస్టరీగా ఉంటుంది’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఆర్టీసీ బస్ది ఈ చిత్రంలో కీలక పాత్ర. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. సుమంత్ అశ్విన్ కెరీర్లో చెప్పకోదగ్గ చిత్రం అవుతుంది. ప్రభాకర్ పాత్ర ఇందులో హైలెట్‌గా నిలుస్తుంది. జె.బి. స్వర పరచిన పాటలకు అనూహ్య స్పందన వస్తోంది. అన్నివర్గాల వారు చూసేలా తీర్చిదిద్దిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. నాజర్, ధన్‌రాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: శేఖర్ వి.జోసఫ్, సహ నిర్మాత జె.శ్రీనివాస రాజు, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు. -
‘రైట్ రైట్’ ఆడియో విడుదల
-
ఆర్టీసీ బస్సులో ఏం జరిగిందంటే...
‘‘నాతోపాటు 22మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మంచి మనసున్న నిర్మాత డా. రామానాయుడుగారు. ఆయనలాగే ఎమ్మెస్ రాజుగారు ఒక్కో సినిమాకు ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేయడం అభినందనీయం. ఈ సినిమా విజయవంతమై మంచి పేరు, డబ్బులు తీసుకురావాలి. టైటిల్ పాజిటివ్‌గా ఉంది’’ అని ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రైట్ రైట్’. వత్సవాయి వెంకటేశ్వర్లు సమర్పణలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మను దర్శకత్వంలో జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకులు బి.గోపాల్, మారుతి, వంశీ పైడిపల్లి కలిసి ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ‘‘డ్రైవర్, కండక్టర్‌కు మధ్య జరిగే కథే ఈ చిత్రం. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ఆర్డినరీ’ సినిమా స్ఫూర్తితో ఈ చిత్రం నిర్మించాం. తొలి భాగం వినోదాత్మకంగా ఉంటే, మలి భాగంలో మిస్టరీ ఉంటుంది. ఎస్. కోట నుంచి గవిటికి వెళ్లే ఆర్టీసీ బస్సు ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మే చివరి వారం లేదా జూన్ మొదటివారంలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘కథ కొత్తగా ఉంది. మంచి టీమ్‌తో చేసిన ఈ కొత్త ప్రయత్నం అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయనీ, త్వరలో పాటలను విడుదల చేస్తామనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: శేఖర్ వి.జోసెఫ్, సంగీతం: జె.బి, సహ నిర్మాత: ఎమ్.వి. నరసింహులు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె. శ్రీనివాస రాజు. -
‘రైట్ రైట్’ మూవీ స్టిల్స్
-
రైట్ రైట్ అంటూ విజిలేసిన సునీల్!
‘‘ఎమ్మెస్ రాజుగారు నిర్మించిన ‘మనసంతా నువ్వే’ సినిమాతో నా కెరీర్‌కు బలమైన పునాది పడింది. ఆ సినిమా అప్పట్నుంచీ సుమంత్ అశ్విన్ నాకు బాగా క్లోజ్. ఎమ్మెస్ రాజుగారు జస్ట్ స్టార్స్‌ని సూపర్ స్టార్స్‌ని చేశారు. సుమంత్ అశ్విన్ కూడా స్టార్ హీరో కావాలని కోరకుంటున్నా’’ అని హాస్యనటుడు, హీరో సునీల్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను సునీల్ రైట్ రైట్ అంటూ విజిల్ ఊది, ఆవిష్కరించారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నా చిన్నతనంలో షూటింగ్స్‌కు వె ళ్లినప్పుడు సునీల్‌ని బాగా గమనించేవాణ్ణి. ఈ చిత్రంలో ప్రభాకర్, నా కాంబినేషన్లో వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయి’’ అని తెలిపారు. ‘మర్యాద రామన్న’ సినిమా సమయంలో సునీల్ సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘రైట్ రైట్’ నాకు బ్రేక్‌నిస్తుంది’’ అని ‘కాలకేయ’ ప్రభాకర్ అన్నారు. మార్చి 9 వరకు జరిపే షెడ్యూల్‌తో ఓ పాట మినహా సినిమా పూర్తవుతుందనీ, ఏప్రిల్‌లో పాటలనూ, మేలో చిత్రాన్నీ విడుదల చేస్తామని జె. వంశీకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె .శ్రీనివాసరాజు, కో-ప్రొడ్యూసర్: ఎం.వి. నరసింహులు. -
అక్రమార్కుల కనుసన్నల్లో లేట‘రైట్ రైట్’
యథేచ్ఛగా తవ్వకాలు అధికారుల వత్తాసు? పాడేరు : ఏజెన్సీలోని అపారమైన ఖనిజ నిల్వలను దోచుకునేందుకు బడాబాబులు భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని బినామీ పేర్లతో రూ.కోట్లు విలువైన లేటరైట్, రంగురాళ్ళను తవ్వుకునేందుకు భారీ వ్యూహరచన చేస్తున్నారు. గిరిజన హక్కులు, చట్టాలను తుంగలోకి తొక్కి దొడ్డిదారిన అనుమతులు పొందేందుకు కూడా మైదాన ప్రాంతంలోని కొంతమంది గిరిజనేతరులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చింతపల్లి మండలంలోని రాజుపాకలు సమీపంలో విలువైన లేటరైట్‌ను బినామీ పేర్లతో గిరిజనేతరులు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. 2002లో ఒక గిరిజనుడికి లేటరైట్ తవ్వకాలపై అనుమతులు ఇచ్చినప్పటికి తర్వాత రోజుల్లో ఏజెన్సీలోని ఖనిజ సంపద పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 2012లో అప్పటి ఆర్డీవో ఎం.గణపతిరావు లేటరైట్‌తోపాటు ఏ ఖనిజం తవ్వకాలకు అనుమతులు లేవంటూ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు కూడా ఈ నివేదిక వెళ్లింది. డుంబ్రిగుడ మండలంలోని లేటరైట్ తవ్వకాల కోసం స్థానిక గిరిజనులే దరఖాస్తులు చేసుకున్నా జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ పాత అనుమతులతో రాజుపాకలు సమీపంలో లేటరైట్ తవ్వకాలు ప్రస్తుతం దర్జాగా సాగిపోతున్నాయి. దీనిని గిరిజనులంతా వ్యతిరేకిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. గనుల శాఖ అధికారులైతే తవ్వకందారులనే ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం లేటరైట్ ఖనిజం డుంబ్రిగుడ, జీకేవీధి, నాతవరం తదితర ప్రాంతాల్లో భారీగా ఉంది. దాని తవ్వకాలకు బడా వ్యాపారులంతా దొడ్డిదారిన అనుమతులు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఏజెన్సీలోని పలు చోట్ల విలువైన రంగురాళ్ల నిక్షేపాలు కూడా ఉన్నాయి. వీటి తవ్వకాలపై కూడా నిషేధం ఉంది. అయినప్పటికి అధికారులను మచ్చిక చేసుకొని రంగురాళ్ల తవ్వకాలకు కూడా పేరొందిన రంగురాళ్ల వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ లేటరైట్, రంగురాళ్ల క్వారీల అన్వేషణలో బడాబాబులు ఉన్నారు. స్థానిక గిరిజనులను మచ్చిక చేసుకొని విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకు బడావ్యాపారులంతా మన్యంలో మకాం వేశారు. ప్రస్తుతం లేటరైట్, రంగురాళ్ల తవ్వకాలను గిరిజనులు ప్రోత్సహిస్తే మున్ముందు బడా వ్యాపారులంతా బాక్సైట్‌ను కూడా తవ్వుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా గిరిజన మేధావులు, యువత, స్వచ్ఛంద సంస్థలంతా గిరిజన ఖనిజ సంపదను పరిరక్షించేందుకు ఉద్యమించాల్సి ఉంది.