రైట్ రైట్ అంటూ విజిలేసిన సునీల్! | 'Right Right' motion poster released | Sakshi
Sakshi News home page

రైట్ రైట్ అంటూ విజిలేసిన సునీల్!

Feb 21 2016 10:52 PM | Updated on Sep 3 2017 6:07 PM

రైట్ రైట్ అంటూ విజిలేసిన సునీల్!

రైట్ రైట్ అంటూ విజిలేసిన సునీల్!

ఎమ్మెస్ రాజుగారు నిర్మించిన ‘మనసంతా నువ్వే’ సినిమాతో నా కెరీర్‌కు బలమైన పునాది పడింది.

‘‘ఎమ్మెస్ రాజుగారు నిర్మించిన ‘మనసంతా నువ్వే’ సినిమాతో నా కెరీర్‌కు బలమైన పునాది పడింది. ఆ సినిమా అప్పట్నుంచీ సుమంత్ అశ్విన్ నాకు బాగా క్లోజ్. ఎమ్మెస్ రాజుగారు జస్ట్ స్టార్స్‌ని సూపర్ స్టార్స్‌ని చేశారు. సుమంత్ అశ్విన్ కూడా స్టార్ హీరో కావాలని కోరకుంటున్నా’’ అని హాస్యనటుడు, హీరో సునీల్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై జె. వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను సునీల్ రైట్ రైట్ అంటూ విజిల్ ఊది, ఆవిష్కరించారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నా చిన్నతనంలో షూటింగ్స్‌కు వె ళ్లినప్పుడు సునీల్‌ని బాగా గమనించేవాణ్ణి. ఈ చిత్రంలో ప్రభాకర్, నా  కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయి’’ అని తెలిపారు. ‘మర్యాద రామన్న’ సినిమా సమయంలో సునీల్ సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘రైట్ రైట్’ నాకు బ్రేక్‌నిస్తుంది’’ అని ‘కాలకేయ’ ప్రభాకర్ అన్నారు.

మార్చి 9 వరకు జరిపే షెడ్యూల్‌తో ఓ పాట మినహా సినిమా పూర్తవుతుందనీ, ఏప్రిల్‌లో పాటలనూ, మేలో చిత్రాన్నీ విడుదల చేస్తామని జె. వంశీకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె .శ్రీనివాసరాజు, కో-ప్రొడ్యూసర్: ఎం.వి. నరసింహులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement