Hero sunil
-
హీరో సునిల్‌తో చిట్ చాట్
-
శ్రీకాకుళంలో సందడి చేసిన హీరో సునీల్
-
హెటిరో ఆధ్వర్యంలో వాక్ ఏ థాన్
-
రేడియో ‘స్టార్స్’
బంజారాహిల్స్: ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమా హీరో సునీల్, హీరోయిన్లు సుష్మారాజ్, రీచాపనయ్ గురువారం రేడియో సిటీలో సందడి చేశారు. వీరు శ్రోతలతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఫుల్ కామెడీతో వస్తున్న సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని వారు తెలిపారు. -
విలన్ అవుదామనుకున్నా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) :తానొకటి తలచితే.. దైవమొకటి తలచిందన్నట్టుగా తన జీవితం చక్కగా సాగుతోందని అన్నారు ప్రముఖ హీరో, కమెడీయన్ సునీల్. హీరో గా చిత్ర పరిశ్రమలో స్థిరపడతానని కలలోనైనా అనుకోలేదని తన మనస్సులోని భావాలను వెల్లడించారు. ఆయన హీరోగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాలోని మూడో పాట విడుదల సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. చిన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాడిని. వాటిలో చిరంజీవి సినిమాలు ఎక్కువగా ఉండేవి. వాటిని చూసి ఆయన చేసిన డ్యాన్స్ చూసి ఆ కోరిక ఏర్పడింది. రాగానే ఎవరూ ఎర్ర తీవాచీ పరచరుకదా! చాలా కష్టాలు పడ్డాను. అన్నం తినని రోజులున్నాయి. అదే సమయంలో సలీం మాస్టర్ డ్యాన్స్ స్కూలు పెడుతున్నారని విని వెళితే ఆయన నా అభినయం చూసి అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. జగపతిబాబు హీరోగా నటించిన శ్రీకారం సినిమాకు పనిచేస్తుండగా అందులో ఒక పాటకు డ్యాన్సర్స్ తక్కువయ్యారు. దాంతో ఆ పాటకు నేను వెనుక ఎక్కడో నటించాను. తర్వాత అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశా. ‘నా ఫేస్ విలన్‌కు సరిపోతుంది కాబట్టి ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని ప్రయత్నించా.. అయితే అనుకోకుండా కమెడియన్‌గా, ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నా. ఊరి రుణం తీర్చుకోలేనిది.. నా ఊరు నన్ను మోసింది. ఆ గడ్డ రుణం ఎన్ని జన్మలైనా తీర్చుకోలేనిది. అక్కడ పరిసరాలు, వాతావరణం, తిరిగి ప్రదేశాలు ఎప్పటికీ మర్చిపోను. అవి తీపిజ్ఞాపకాలు. తండ్రి నా చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుంచి అమ్మే నన్ను కంటికిరెప్పలా పెంచింది. నేను ఏం చెప్పినా కాదనేదికాదు. సినిమాల్లో నటిస్తానంటే ఆమె నాకు డబ్బులిచ్చి పంపింది. నా తల్లి లేకపోతే నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదు. హీరోగా తొమ్మిది సినిమాలు.. మొత్తం 197 సినిమాలు చేస్తే.. హీరోగా చేసిన సినిమాలు తొమ్మిది. నా జీవితంలో మర్చిపోలేని సినిమా మర్యాద రామన్న. -
సునీల్‌తో సరదాగా కాసేపు
-
రైట్ రైట్ అంటూ విజిలేసిన సునీల్!
‘‘ఎమ్మెస్ రాజుగారు నిర్మించిన ‘మనసంతా నువ్వే’ సినిమాతో నా కెరీర్‌కు బలమైన పునాది పడింది. ఆ సినిమా అప్పట్నుంచీ సుమంత్ అశ్విన్ నాకు బాగా క్లోజ్. ఎమ్మెస్ రాజుగారు జస్ట్ స్టార్స్‌ని సూపర్ స్టార్స్‌ని చేశారు. సుమంత్ అశ్విన్ కూడా స్టార్ హీరో కావాలని కోరకుంటున్నా’’ అని హాస్యనటుడు, హీరో సునీల్ అన్నారు. సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా మను దర్శకత్వంలో శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె. వంశీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘రైట్ రైట్’. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను సునీల్ రైట్ రైట్ అంటూ విజిల్ ఊది, ఆవిష్కరించారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నా చిన్నతనంలో షూటింగ్స్‌కు వె ళ్లినప్పుడు సునీల్‌ని బాగా గమనించేవాణ్ణి. ఈ చిత్రంలో ప్రభాకర్, నా కాంబినేషన్లో వచ్చే సీన్స్ కొత్తగా ఉంటాయి’’ అని తెలిపారు. ‘మర్యాద రామన్న’ సినిమా సమయంలో సునీల్ సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ‘రైట్ రైట్’ నాకు బ్రేక్‌నిస్తుంది’’ అని ‘కాలకేయ’ ప్రభాకర్ అన్నారు. మార్చి 9 వరకు జరిపే షెడ్యూల్‌తో ఓ పాట మినహా సినిమా పూర్తవుతుందనీ, ఏప్రిల్‌లో పాటలనూ, మేలో చిత్రాన్నీ విడుదల చేస్తామని జె. వంశీకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జె.బి, పాటలు: శ్రీమణి, కెమెరా: శేఖర్ వి.జోసఫ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జె .శ్రీనివాసరాజు, కో-ప్రొడ్యూసర్: ఎం.వి. నరసింహులు. -
ఒంగోలులో భీమవరం బుల్లోడు
ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్ : భీమవరం బుల్లోడు బుధవారం నగరంలో సందడి చేశాడు. హీరో సునీల్‌తో పాటు హీరోయిన్ ఎస్తేర్లను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో స్థానిక గోరంట్ల కాంప్లెక్స్ వద్దకు వచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భీమవరం బుల్లోడు చిత్ర యూనిట్ తన విజయయాత్రలో భాగంగా ఒంగోలుకు చేరుకుంది. అభిమానులు పెద్దసంఖ్యలో యూనిట్ సభ్యులకు స్వాగతం పలికారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు సునీల్, ఎస్తేర్లు కృతజ్ఞతలు తెలిపారు. గోరంట్ల కాంప్లెక్స్ నిర్వాహకులు గోరంట్ల వీరనారాయణతో పాటు పూరిమిట్ల శ్రీనివాసరావు, ఆలపాటి రామారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సునీల్, ఎస్తేర్ హర్షం తను నటించిన అందాలరాముడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు సినిమాలు గోరంట్ల కాంప్లెక్స్‌లోనే విడుదలై తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించడంపై కథానాయకుడు సునీల్ హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీల్ మాట్లాడారు. భీమవరం బుల్లోడు విజయవంతం కావడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తనను ఆదరిస్తున్న ప్రేక్షకలోకానికి సునీల్ కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ తాను నటించిన భీమవరం బుల్లోడు విజయవంతం కావడం తన కెరియర్ను మలుపు తిప్పిందన్నారు. -
భీమవరం బుల్లోడు ఆడియో వేడుకలో అభిమాని మృతి