ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్ : భీమవరం బుల్లోడు బుధవారం నగరంలో సందడి చేశాడు. హీరో సునీల్‌తో పాటు హీరోయిన్ ఎస్తేర్‌లను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో స్థానిక గోరంట్ల కాంప్లెక్స్ వద్దకు వచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన భీమవరం బుల్లోడు చిత్ర యూనిట్ తన విజయయాత్రలో భాగంగా ఒంగోలుకు చేరుకుంది. అభిమానులు పెద్దసంఖ్యలో యూనిట్ సభ్యులకు స్వాగతం పలికారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు సునీల్, ఎస్తేర్‌లు కృతజ్ఞతలు తెలిపారు. గోరంట్ల కాంప్లెక్స్ నిర్వాహకులు గోరంట్ల వీరనారాయణతో పాటు పూరిమిట్ల శ్రీనివాసరావు, ఆలపాటి రామారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సునీల్, ఎస్తేర్ హర్షం
తను నటించిన అందాలరాముడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు సినిమాలు గోరంట్ల కాంప్లెక్స్‌లోనే విడుదలై తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించడంపై కథానాయకుడు సునీల్ హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీల్ మాట్లాడారు. భీమవరం బుల్లోడు విజయవంతం కావడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. తనను ఆదరిస్తున్న ప్రేక్షకలోకానికి సునీల్ కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ ఎస్తేర్ మాట్లాడుతూ తాను నటించిన భీమవరం బుల్లోడు విజయవంతం కావడం తన కెరియర్‌ను మలుపు తిప్పిందన్నారు.
ఒంగోలులో భీమవరం బుల్లోడు
Published Thu, Mar 6 2014 3:12 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM
Advertisement
Advertisement