oka manasu
-
నిహారిక రెండో సినిమా మొదలైంది..!
'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన మెగా వారసురాలు నిహారిక కొణిదల. నిహారిక తెరంగేట్రంపై అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. అయితే అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చినా మెగా హీరోలు మాత్రం నిహారికకు అండగా నిలిచారు. కానీ నిహారిక తొలి ప్రయత్నం విఫలమైంది. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ మెగా బ్యూటీ తన రెండో సినిమాను స్టార్ట్ చేసింది. ఇన్నాళ్లు మంచి కథ కోసం వెయిట్ చేసిన నిహారిక, రవి దుర్గా ప్రసాద్ చెప్పిన కథ నచ్చడంతో సినిమాను స్టార్ట్ చేసింది. ఈ సినిమాతో దుర్గా ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ రోజు(శుక్రవారం) ఉదయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టడంతో షూటింగ్ మొదలైంది. రాఘవయ్య, బాబీ ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒక మనసు తరువాత చీకటి ప్రేమకథ..?
ఇప్పటి వరకు మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథలను అందించిన దర్శకుడు రామరాజు ఇప్పుడు రూటు మారుస్తున్నాడు. ఇటీవల మెగా వారసురాలు నిహారికను హీరోయిన్గా పరిచయం చేస్తూ ఒక మనసు సినిమా తెరకెక్కించిన రామరాజు, తన నెక్ట్స్ సినిమాను మాత్రం ఓ మాస్ మాసాలా ఎంటర్టైనర్గా మలిచే ఆలోచనలో ఉన్నాడట. వరుసగా మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు, ఒక మనసు లాంటి ఆర్టిస్టిక్ సినిమాలను అందించిన రామరాజు తన నెక్ట్స్ సినిమా కోసం మాస్ ప్రేమ కథను రెడీ చేశాడు. ఒక మనసు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన మధుర శ్రీధర్ రెడ్డి ఈ సినిమాను కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమాకు చీకటి ప్రేమకథ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. -
తగ్గించాక బాగుందంటున్నారు
‘‘మనకు తెలిసిన సూపర్ హిట్ సినిమాల్లో కూడా తప్పులు, లోపాలు ఉంటాయి. ఒక సినిమాను వంద శాతం అందరికీ నచ్చేలా రూపొందించడం సాధ్యం కాదు. ‘ఒక మనసు’ కొందరికి బాగా నచ్చింది. మరికొందరు ఫర్వాలేదంటున్నారు’’ అని నిర్మాత ‘మధుర’ శ్రీధర్ అన్నారు. నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘ఒక మనసు’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం సంతృప్తినిచ్చిందని సోమవారం విలేకరుల సమావేశంలో ‘మధుర’ శ్రీధర్ అన్నారు. మరిన్ని విశేషాలను ఆయన ఈ విధంగా చెప్పారు. ‘ఒక మనసు’కి తొలుత మిశ్రమ స్పందన వచ్చినా... ఇప్పుడు కలెక్షన్లు బాగున్నాయి. సినిమా మొదటి అర్ధ భాగంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువయ్యాయని అనిపించింది. వాటిలో 14 నిమిషాల నిడివి కత్తిరించాక సినిమా బాగుందంటున్నారు. మల్టీప్లెక్స్‌లో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. నీహారిక, నాగశౌర్యల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నీహారికతో మంచి సినిమా చేశారనే ప్రశంసలు మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నాయి. దర్శకుడిగా రామరాజు శక్తివంచన లేకుండా ఈ సినిమా రూపొందించారు. నా తదుపరి చిత్రం కూడా ఆయన దర్శకత్వంలోనే ఉంటుంది. విషాదాంత కథలు మన ప్రేక్షకులకు నచ్చవనే అభిప్రాయం ఉంది. వేరే నిర్మాతలైతే ధైర్యం చేసేవారు కాదేమో. కథే మాకు ఈ సినిమా తీసేందుకు స్ఫూర్తినిచ్చింది. విడుదలకు ముందు ‘ఒక మనసు’ను ‘మరో చరిత్ర’, ‘గీతాంజలి’ లాంటి సినిమాలతో పోల్చడం నాకు తప్పేమీ అనిపించలేదు. ఎందుకంటే మేము ఆ సినిమాలను ఆదర్శంగా తీసుకున్నాం. మిగతా భాషల్లో భిన్నమైన సినిమాలను ఆదరిస్తున్నప్పుడు మనమెందుకు అలాంటివి చేయకూడదని అనిపించింది. నచ్చిన కథలు దొరక్కే దర్శకత్వానికి దూరంగా ఉంటున్నా. నా దర్శకత్వంలో ఈ ఏడాది చివర్లో ఒక సినిమా ప్రారంభిస్తా. -
ధనుష్ హీరోగా ఒక మనసు రీమేక్..?
మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా తెరంగేట్రం చేసిన సినిమా ఒక మనసు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లనే సాధిస్తోంది. దీంతో పరభాష నటులు ఇప్పుడు ఈ సినిమా రీమేక్ మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఈ తరహా చిత్రాలను ఇష్టపడే తమిళ ప్రేక్షకుల కోసం ఒక మనసు సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు ఓ స్టార్ హీరో. ఇటీవల ఒక మనసు సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన తమిళ హీరో ధనుష్, ఆ సినిమాను తమిళ్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ మేరకు ఒక మనసు సినిమా దర్శక నిర్మాతలతో సంప్రదింపులు జరుపుతున్నాడు. ముఖ్యంగా నాగశౌర్య పాత్ర, నేపథ్యం.. నచ్చిన ధనుష్ తానే స్వయంగా ఆ పాత్రలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. తన సొంతం నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
'ఒక మనసు' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక మనసు జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : నాగశౌర్య, నిహారిక, రావూ రమేష్, ప్రగతి సంగీతం : సునీల్ కశ్యప్ దర్శకత్వం : రామరాజు నిర్మాత : మధుర శ్రీధర్ రెడ్డి ఇటీవల కాలంలో సార్ట్ వారసుల హవా బాగా కనిపిస్తుండటంతో అదే బాటలో మెగాఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చింది కొణిదల నీహారిక. నాగబాబు కూతురిగా, పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న నీహారిక, తొలిసారిగా ఒక మనసు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. మరి వెండితెర మీద మెరసిన తొలి మెగా వారసురాలు ఆకట్టుకుందా..? హీరోయిన్ గా సక్సెస్ కొట్టాలన్న నీహారిక కల నెరవేరిందా..? కథ : సూర్య (నాగశౌర్య) రాజకీయ నాయకుడు కావాలన్న ఆశతో విజయనగరంలో సెటిల్మెంట్స్ చేస్తూ తిరిగే అబ్బాయి. సూర్య మామయ్య ఎమ్మెల్యే కావటంతో ఏ రోజుకైనా సూర్యను కూడా ఎమ్మెల్యేగా గెలిపించాలని కలకంటుంటాడు సూర్య తండ్రి (రావు రమేష్). విజయనగరం ప్రభుత్వాస్పత్రిలో హౌస్ సర్జన్‌గా చేస్తున్న సంధ్య (నీహారిక), సూర్యని తొలి చూపులోనే ఇష్టపడుతుంది. తరువాత ఆ ఇద్దరి పరిచయం ప్రేమగా మారుతుంది. అదే సమయంలో తన రాజకీయ అవసరాల కోసం ఓ పెద్ద సెటిల్మెంట్ ఒప్పుకున్న నాగశౌర్య చిక్కుల్లో పడతాడు. నమ్మకద్రోహం కారణంగా కోర్టు కేసులో ఇరుక్కుని మూడేళ్లపాటు జైలులో ఉంటాడు. ఆ తరువాత బెయిల్ వచ్చినా కేసు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి సంధ్యకు దగ్గరవుతాడు సూర్య. కానీ తన తండ్రి కలను నెరవేర్చటం కోసం ఈ సారి సంధ్యకు శాశ్వతంగా దూరం కావలసిన పరిస్థితి వస్తుంది. మరి సూర్య నిజంగానే సంధ్యను దూరం చేసుకున్నాడా.? సూర్య వదిలి వెళ్లిపోవటానికి సంధ్య అంగీకరించిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటి వరకు లవర్ బాయ్ పాత్రల్లో కనిపించిన నాగశౌర్య ఈ సినిమాలో కాస్త పర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో తండ్రి కల, అమ్మాయి ప్రేమకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. తొలిసారిగా వెండితెర మీద మెరిసిన నిహారిక పరవాలేదనిపించింది. లుక్స్ పరంగా హుందాగా కనిపించిన నిహారిక, నటన పరంగా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. తండ్రి పాత్రలో రావూ రమేష్ మరోసారి ఆకట్టుకున్నాడు. కొడుకు భవిష్యత్తు కోసం తపన పడే తండ్రిగా రావూ రమేష్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ఫ్రెండ్ పాత్రలో అవసరాల శ్రీనివాస్, చిన్న కామెడీ పాత్రలో వెన్నెల కిశోర్ తమ పరిధి మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : నీహారికను హీరోయిన్గా ఎంచుకొని సినిమాకు భారీ హైప్ క్రియేట్ చేసిన దర్శకుడు రామరాజు, మరోసారి తన మార్క్ పోయటిక్ టేకింగ్ తో ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ స్లో నారేషన్ కాస్త ఇబ్బంది పెట్టినా.. రిచ్ విజువల్స్, మ్యూజిక్ ఆకట్టుకుంటాయి, సినిమా చాలా వరకు హీరో హీరోయిన్ల మధ్య మాటలతోనే నడిపించిన దర్శకుడు, డైలాగ్స్ పై మరింతగా దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. సునీల్ కశ్యప్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం, రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం ఆకట్టుకుంటాయి. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. వైజాగ్ బీచ్ అందాలను, అరకు పచ్చదనాన్ని మరింత అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫీ మెయిన్ స్టోరీ ప్రీ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : స్లో నారేషన్ డైలాగ్స్ - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
గ్లామర్ పాత్రలు చేయను
‘‘నేటి తరం హీరోయిన్లు గ్లామర్, యాక్టింగ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. పాత్ర డిమాండ్‌ను బట్టి వారు నటిస్తారు. నా వరకు నేను గ్లామర్ పాత్రల్లో నటించేందుకు ఇష్టపడటం లేదు. నేను కథ ఎంపిక చేసుకునేటప్పుడు నాన్నగారిని (నటుడు నాగబాబు), మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకుంటాను. వాళ్లు చూడటానికి ఇబ్బంది పడే పాత్రల్లో నటించను’’ అని కథానాయిక నీహారిక స్పష్టం చేశారు. నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో‘మధుర’ శ్రీధర్‌రెడ్డి నిర్మించిన ‘ఒక మనసు’ ఈ నెల 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నీహారిక పలు విశేషాలు చెప్పారు. స్వచ్చమైన ప్రేమకథతో తీసిన సినిమా ‘ఒక మనసు’. ప్రేమకథా చిత్రాలంటే ‘మరోచరిత్ర’, ‘గీతాంజలి’ వంటి వాటిని చెబుతారందరూ. ఆ రెండు చిత్రాల తర్వాత ఇకపై ‘ఒక మనసు’ను గుర్తు పెట్టుకుంటారు. ప్రేమకథ అంటే పిల్లలతో కలిసి చూడ్డానికి తల్లిదండ్రులు, పెద్దలతో కలిసి చూడ్డానికి పిల్లలూ ఇబ్బంది పడతారు. ఇందులో అటువంటి సన్నివేశాలు ఉండవు హీరోయిన్గా రావాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నా. ఏదీ నచ్చలేదు. ‘ఒక మనసు’ చిత్రంలోని సంధ్య పాత్ర వినగానే మనసుకు నచ్చి ఓకే చెప్పేశా. నా కుటుంబ సభ్యులు, మెగా అభిమానులందరికీ నా పాత్ర నచ్చుతుంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా హీరోయిన్స్‌గా నాకంటే ముందు వేరే కుటుంబాల నుంచి వచ్చిన వారు కొనసాగలేకపోయారు. తొలుత ప్రొడక్షన్ వ్యవహారాలు చూసిన నాకు యాక్టింగ్ ఎందుకు చేయకూడదు? అనిపించి, నాన్నగారికి చెబితే ఆయన ఆలోచించి సరే అన్నారు. ఆ తర్వాత పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్‌కల్యాణ్, అన్నయ్యలు అందరితో మాట్లాడాను. ఇండస్ట్రీలోని ప్లస్‌లు, మైనస్‌లు వారు చెప్పారు. ఫైనల్‌గా ‘ఇది నీ లైఫ్.. నీకు కరెక్ట్ అనిపించింది చెయ్’ అని ప్రోత్సహించారు పెదనాన్న చిరంజీవిగారి ఇమేజ్ వల్ల నా ఫస్ట్ చిత్రానికి ఇంత అటెన్షన్ ఉందే కానీ, రెండో చిత్రానికి ఉండదు. ఫస్ట్ సినిమాలో ఎలా నటించానా? అని చూసేందుకు అభిమానులు వస్తారు. సరిగ్గా నటించకపోతే రెండో చిత్రానికి రారు. సినిమా బాగాలేకపోతే నా సొంత అన్నయ్య చిత్రమే నేను రెండోసారి చూడను. టాలెంట్‌ను నిరూపించుకుని ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలి ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండాలని ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయను. ఎన్ని సినిమాలు చేశాం అని కాదు.. ఎన్ని మంచి చిత్రాలు చేశామన్నదే నాకు ముఖ్యం. మంచి పాత్రలు వస్తే తమిళ, కన్నడం, మలయాళ భాషల్లో నటిస్తాను. నటన పరంగా నాకు రోల్‌మోడల్ పెదనాన్నగారే. కమల్‌హాసన్‌గారు, కాజోల్ అంటే ఇష్టం నాగశౌర్య మంచి కోస్టార్. మొదట్లో కామ్‌గా ఉండేవాడు. ఆ తర్వాత మంచి ఫ్రెండ్ అయ్యాడు. కొన్ని సన్నివేశాల్లో నటించేందుకు ఇబ్బంది పడుతుంటే తను బాగా సపోర్ట్ చేశాడు. రామరాజుగారి దర్శకత్వంలో నటించడం చాలా కంఫర్టబుల్ అనిపించింది. -
వాళ్లతో డేటింగా?.. భలేవారే!
‘హండ్రెడ్ పర్సంట్ ప్రేమ ఉన్న చిత్రాలంటే ‘గీతాంజలి’, ‘మరోచరిత్ర’, ‘ఏమాయ చేశావే’ వంటివాటిని చెప్పొచ్చు. వాటి తర్వాత వంద శాతం స్వచ్ఛమైన ప్రేమకథ ఉన్న చిత్రం ‘ఒక మనసు’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, నిహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. * ఈ చిత్రంలో అప్‌కమింగ్ పొలిటీషియన్ సూర్య పాత్ర చేశా. ప్రేమించు కున్నప్పుడు ఒకలా.. పెళ్లప్పుడు మరోలా ఉంటుంది మనసు. పెళ్లి తర్వాత ఒకే మనసు ఉంటుందనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఈ చిత్రంలో చివరి నలభైఐదు నిమిషాలు కీలకం. సినిమా చూసి హాలు నుంచి బయటికొచ్చాక కనీసం ఓ ఇరవై నిమిషాలు ‘ఒక మనసు’ గురించే ఆలోచిస్తారు. అంత మనసును హత్తుకునేలా ఉంటుంది. * నాతో నటించిన కథానాయికల్లో నీహారిక, మాళవికా నాయర్ అంటే ఇష్టం. వాళ్లు తెలుగులో డైలాగులు చెప్పగలరు. సహ నటుడిగా నాకు అది చాలా కంఫర్టబుల్ అనిపించింది. నిహారిక పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తోంది కదా, నటించడం ఇబ్బందేమో అనుకున్నా. కానీ, తను చాలా బాగా కలిసిపోయింది. రామరాజుగారు మంచి దర్శకుడు. ఆయన ఒక్కసారి సీన్ ఎక్స్ప్లైన్ చేస్తే అర్థమయ్యేది. సునీల్ కశ్యప్ మంచి పాటలిచ్చారు. నా సినిమాల్లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇంటే ఇదే. * హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ వచ్చే రూమర్స్‌ని పట్టించుకోవడం లేదు. మొదట రాశీఖన్నా, ఆ తర్వాత సోనారికా, రెజీనాతో లింక్ కలిపారు. రెజీనాతో సినిమా మొదలు కాకముందే తనతో డేటింగ్ అన్నారు. ఇప్పుడు నీహారిక... నేనే హీరోయిన్‌తో సినిమా చేస్తే ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లా? నాకు అనుష్క అంటే ఇష్టం అని చాలాసార్లు చెప్పా. కానీ, ఆ విషయం రాయలేదేం? అంటే మనం ఎవరి గురించి మాట్లాడతామో అది రాయరు. మాట్లాడని వారి గురించి రాస్తారని నాకు అర్థమైంది. * ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ‘జ్యో అచ్యుతానంద’ చేస్తున్నా. సాయి చైతన్యతో ఓ సినిమా చేయాల్సి ఉంది. స్క్రిప్ట్ పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి ఆగింది. ‘జ్యో అచ్యుతానంద’ తర్వాత సుకుమార్ ప్రొడక్షన్లో హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నా. -
ఈ సినిమా చూశాక కచ్చితంగా మార్పు వస్తుంది!
బుల్లితెర వ్యాఖ్యాతగా నటుడు నాగబాబు కూతురు నీహారిక ఇప్పటికే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆమె కథానాయికగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘ఒక మనసు’. రామరాజు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నీహారిక ప్రత్యేకంగా మాహిళాభిమానులు కలిశారు. ‘‘నా మొదటి సినిమాకే మంచి సబ్జెక్ట్ దొరకడం నా లక్. ఈ చిత్రం తర్వాత ఆడపిల్లల ప్రేమల్లో కచ్చితంగా మార్పు వస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉంటుంది. నేనే సినిమా చేసినా అభిమానులు ఇబ్బందిపడే విధంగా ఉండదు’’ అని చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
ఆ హీరో బర్త్‌డేకి మూడు సినిమాలు రిలీజ్
సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ సీజన్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. జూన్ నెలలో ఓ స్టార్ హీరో పుట్టినరోజున పెద్దసంఖ్యలో సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లేవి లేకపోయినా ఆసక్తి కలిగిస్తున్న మూడు చిన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జూన్ 10న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఈ ఏడాది బాలయ్య పుట్టిన రోజున టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం కనిపించనుంది. సమ్మర్ సీజన్ ముగిసిపోనుండటంతో ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఒక మనసు, సందీప్ కిషన్, నిత్యామీనన్‌లు జంటగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప, సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన రైట్ రైట్ సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కొద్ది రోజులుగా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు బిజీగా ఉండటం, జూన్ 2న వస్తున్న అ..ఆ.. పై కూడా భారీ అంచనాలు ఉండటంతో జూన్ 10న చిన్న సినిమాల రిలీజ్‌కు సరైన సమయంగా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అందుకే ఒకేసారి ముగ్గురు హీరోలు బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. బాలయ్య పుట్టిన రోజు ఎవరికి కలిసొస్తుందో చూడాలి. -
బాలయ్య పుట్టినరోజున భారీ పోటి
సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ సీజన్లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. జూన్ నెలలో ఓ స్టార్ హీరో పుట్టినరోజున పెద్దసంఖ్యలో సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లేవి లేకపోయినా ఆసక్తి కలిగిస్తున్న మూడు చిన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. జూన్ 10న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. అయితే ఈ ఏడాది బాలయ్య పుట్టిన రోజున టాలీవుడ్ ఇండస్ట్రీలో పండుగ వాతావరణం కనిపించనుంది. సమ్మర్ సీజన్ ముగిసిపోనుండటంతో ఒకేరోజు మూడు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మెగా వారసురాలు నిహారిక హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ఒక మనసు, సందీప్ కిషన్, నిత్యామీనన్‌లు జంటగా తెరకెక్కిన ఒక అమ్మాయి తప్ప, సుమంత్ అశ్విన్ హీరోగా రూపొందిన రైట్ రైట్ సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కొద్ది రోజులుగా స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు బిజీగా ఉండటం, జూన్ 2న వస్తున్న అ..ఆ.. పై కూడా భారీ అంచనాలు ఉండటంతో జూన్ 10న చిన్న సినిమాల రిలీజ్‌కు సరైన సమయంగా ఫీల్ అవుతున్నారు నిర్మాతలు. అందుకే ఒకేసారి ముగ్గురు హీరోలు బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. బాలయ్య పుట్టిన రోజు ఎవరికి కలిసొస్తుందో చూడాలి. -
ఆ ప్రశ్నతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసింది : నాగబాబు
‘‘తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా దొరకరు. నాగబాబు ధైర్యం చేసి నీహారికను హీరోయిన్ని చేశారు. హీరోయిన్ అవు తుందని, కాదని ఇలా ఇంట్లో తర్జనభర్జన జరుగుతున్నప్పుడు నాగశౌర్యతో సినిమా చేస్తోందని మీడియా ద్వారా తెలిసింది. అరె.. బన్నీ సరసన హీరోయిన్గా చేస్తే బాగుంటుందనిపిం చింది. సరిగ్గా అప్పుడే ‘సరైనోడు’ స్టార్ట్ అయింది. ఇది మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడే అందరికీ చెబుతున్నా’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. మెగా ఫ్యామిలీ వారసు రాలిగా నాగబాబు కుమార్తె నీహారిక వెండితెరపై తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఒక మనసు’. నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో రామ్‌చరణ్ ఈ చిత్రం బిగ్ సీడీని ఆవిష్కరించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ- ‘‘చిరంజీవిగారు వేసిన బాటలో మేం కష్టపడు తున్నాం. నీహా మా కన్నా ఎక్కువ కష్టపడుతోంది. తెలుగు పరిశ్రమకు ఆహ్వానం పలుకుతున్నా. నీహాకు ఎలాంటి కోస్టార్ దొరుకుతాడో అని ఎదురుచూశా. నాగశౌర్య స్వచ్ఛమైన తెలుగబ్బాయిలా ఉంటాడు. నీహాను చూశాక తమ ఇంటి అమ్మాయిలా అందరూ అనుకుంటారు’’ అన్నారు. ‘‘నేను ‘కంచె’ సినిమా చేస్తున్నప్పుడు ‘మల్లెల తీరంలో..’ చూశాను. మా చెల్లి మంచి దర్శకుని చేతిలో పడిందని హ్యాపీగా ఉంది. ఈ రోజు ఉన్న హీరోల్లో నాగశౌర్య మంచి నటుడు. నీహారికను చిన్నప్పుడు ‘ఏమవుతావు’ అని అడిగితే ఐఏఎస్, డాక్టర్ అవుతాననేది. ఇప్పుడు మాతో పాటే సినిమాల్లోకి వచ్చేసింది. కొత్తలో తన మీద నమ్మకం ఉండేది కాదు. నెమ్మదిగా నాకు కూడా నమ్మకం కుదిరింది’’ అని వరుణ్‌తేజ్ చెప్పారు. నాగ బాబు మాట్లాడుతూ- ‘‘నీహారికకు మంచి కథ ఇచ్చారు. ఇంతమంది హీరోలున్న ఫ్యామిలీ నుంచి నీహారిక హీరోయిన్గా వెళుతుందని చెప్పగానే అందరూ ప్రోత్సహించారు. నీహారిక మాస్ కమ్యూనికేషన్ చేశాక సినిమాల్లోకి ఎంటరవుతానంటూ, ‘హీరోలు వస్తున్నప్పుడు ఏమీ మాట్లాడరేం? ఆడపిల్లలు వస్తున్నప్పుడే మాట్లాడతారేం?’అని ప్రశ్నించింది. నన్ను మారు మాటాడకుండా చేసింది. అందుకే నీహారికను తనకు ఇష్టమైన రంగంలోకి పంపించాను. ప్రతి పేరెంట్ కూడా తమ కూతుళ్లు కన్న కలలను సాకారం చేసుకోవడానికి ప్రోత్స హించాలని కోరుతున్నా. ఆడపిల్లలను అబ్బాయిల కన్నా ఎక్కువగా లేక సమానంగా ప్రోత్సహించండి’’ అని నాగబాబు చెప్పారు. నీహారిక మాట్లాడుతూ- ‘‘రామరాజు గారు స్క్రిప్ట్ నెరేట్ చేస్తుంటే అలా వినాలనిపించింది. నేను ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో బాగా యాక్ట్ చేశానంటే నాగశౌర్య కారణం. అమ్మ ప్రేమను వర్ణించడం ఎవరి తరం కాదు. కానీ, ఈ సినిమా మాత్రం అమ్మ ప్రేమంత స్వచ్ఛంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘రామరాజుగారి వల్లే మేమింత బాగా యాక్ట్ చేయగలిగాం’’ అని నాగశౌర్య అన్నారు. ఈ వేడుకలో నీహారిక తల్లి పద్మజ, చిరంజీవి కుమార్తె సుస్మిత పాల్గొన్నారు. -
‘మా వాళ్ల ఫంక్షన్లో మీ వాళ్ల గోలేంటి?’ అని నన్నడిగారు! : బన్నీ
‘‘నీహా నువ్వు ఏ పని చేపట్టినా,ఆనందం లభిస్తుందని ఆశిస్తున్నా’’ అని నీహారికకు ముందుగా శుభాకాంక్షలు చెప్పారు అల్లు అర్జున్. పనిలో పనిగా ఇటీవల వచ్చిన వివాదం గురించి తన వివరణ కూడా ఇచ్చారు. ఆ మధ్య విజయవాడలో ‘సరైనోడు’ థ్యాంక్స్ మీట్లో ఫ్యాన్స్ ‘పవర్ స్టార్.. పవర్ స్టార్’ అని అరవడం, ‘నేను చెప్పను బ్రదర్’ అని బన్నీ అనడం తెలిసిందే. ఈ మధ్య ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, ఈ విషయం గురించి ప్రస్తావిస్తే, ‘ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం’ అన్నారు బన్నీ. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన బన్నీ ఈ విషయం గురించి ఆడియో వేడుకలో వివరణ ఇస్తూ, ‘‘మీరు ప్రతీసారి పవర్‌స్టార్ అని అరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోవడానికి కారణం పవర్‌స్టార్ కాదు. మీరే. కొంత మంది అభిమానులు పబ్లిక్ ఫంక్షన్ పెట్టినప్పుడు పవర్‌స్టార్ అని అరుస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నారు’’ అని బన్నీ అన్నారు. ‘‘ఇలాంటి ఫంక్షన్‌కు వచ్చినప్పుడు సినిమాకు సంబంధించినవాళ్ళు పర్సనల్‌గా ఏదో చెప్పుకోవాలనుకుంటారు. కానీ మీరు ‘పవర్‌స్టార్’, ‘పవర్‌స్టార్’ అని అరిచి వాళ్లను డిస్టర్బ్ చేయడంతో వాళ్లు యాంత్రికంగా మాట్లాడి వెళ్ళిపోతారు. అంతవరకూ ఎందుకు? ఓ పెద్ద డెరైక్టర్ సినిమా తీసి మాట్లాడుతుంటే, అక్కడ పవన్‌కల్యాణ్ అని అరిచారు. అయినా వేరే హీరో ఫంక్షన్స్‌లో మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఎందుకని నా ఫీలింగ్. ఇదే విషయాన్ని నాకు బాగా తెలిసిన వ్యక్తి ‘మా వాళ్ల ఫంక్షన్లో మీ వాళ్ల గోలేంటి’ అని అడిగారు. చాలా బాధ అనిపించింది. మన పాటల వేడుకల్లో అల్లరి చేయండి.. తప్పు లేదు. కానీ, వేరే హీరోల వేడుకల్లో కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. తానింత స్థాయికి రావడానికి కారణం చిరంజీవిగారే అని పవన్‌కల్యాణ్‌గారే చాలాసార్లు చెప్పారు. కానీ, చిరంజీవిగారు మాట్లాడుతున్నప్పుడు ‘పవర్‌స్టార్’ అని అరిస్తే ఆయనకెంత ఇబ్బందిగా ఉంటుందో? అప్పటినుంచి నేను పవన్‌కల్యాణ్‌గారి గురించి మీరెంత అడిగినా మాట్లాడకూడదని డిసైడయ్యాను. మీరు నా వల్ల బాధపడుంటారని తెలుసు. కానీ, మీ వల్ల మా ఫ్యామిలీ చాలాసార్లు హర్ట్ అయింది. నేను ఒక వివాదాన్ని తప్పించుకోవడానికి మీడియా ముందు మాట్లాడ లేదు. కానీ అదే పెద్ద వివాదమైంది. నాకు పవన్‌కల్యాణ్ అంటే ఇష్టమే. చిరంజీవిగారి తర్వాత నన్ను ప్రోత్సహించింది ఆయనే. చాలా రోజులుగా సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోయి మాటల యుద్ధంలోకి దిగారు. ప్లీజ్.. దీన్ని ఆపండి. మీరందరూ సోషల్ మీడియాలో గ్రూప్‌లు కావచ్చు. కానీ మేమందరం ఓ ఫ్యామిలీ. దయచేసి ఇక నుంచి ఇలాంటివి చేయద్దు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు బన్నీ. -
పవన్ పేరిట గొడవ చేయొద్దు: అల్లు అర్జున్
హైదరాబాద్: చిరంజీవి తర్వాత తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టం అని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. నాగేంద్రబాబు కుమార్తె నిహారిక నటించిన 'ఒక మనసు' చిత్రం ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడారు. ఫంక్షన్స్ లో అభిమానులు గొడవ చేయడం వల్ల తాము ఇబ్బందిపడుతున్నాం అని అల్లు అర్జున్ చెప్పారు. ఫంక్షన్స్ లో అభిమానులు పవన్ కల్యాణ్ పేరు మీద గొడవ చేయొద్దని.. పవన్ కల్యాణ్, తాము ఒకటే కుటుంబం అని అన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ తనను చాలా బాధపెట్టాయని అల్లు అర్జున్ చెప్పారు. -
'ఒక మనసు' మూవీ స్టిల్స్