పవన్ పేరిట గొడవ చేయొద్దు: అల్లు అర్జున్
హైదరాబాద్: చిరంజీవి తర్వాత తనకు పవన్ కల్యాణ్ అంటే ఇష్టం అని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు. నాగేంద్రబాబు కుమార్తె నిహారిక నటించిన 'ఒక మనసు' చిత్రం ఆడియో ఫంక్షన్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడారు.
ఫంక్షన్స్ లో అభిమానులు గొడవ చేయడం వల్ల తాము ఇబ్బందిపడుతున్నాం అని అల్లు అర్జున్ చెప్పారు. ఫంక్షన్స్ లో అభిమానులు పవన్ కల్యాణ్ పేరు మీద గొడవ చేయొద్దని.. పవన్ కల్యాణ్, తాము ఒకటే కుటుంబం అని అన్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ తనను చాలా బాధపెట్టాయని అల్లు అర్జున్ చెప్పారు.