‘‘తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌గా దొరకరు. నాగబాబు ధైర్యం చేసి నీహారికను హీరోయిన్‌ని చేశారు. హీరోయిన్ అవు తుందని, కాదని ఇలా ఇంట్లో తర్జనభర్జన జరుగుతున్నప్పుడు నాగశౌర్యతో సినిమా చేస్తోందని మీడియా ద్వారా తెలిసింది. అరె.. బన్నీ సరసన హీరోయిన్‌గా చేస్తే బాగుంటుందనిపిం చింది. సరిగ్గా అప్పుడే ‘సరైనోడు’ స్టార్ట్ అయింది. ఇది మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడే అందరికీ చెబుతున్నా’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు.
మెగా ఫ్యామిలీ వారసు రాలిగా నాగబాబు కుమార్తె నీహారిక వెండితెరపై తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘ఒక మనసు’. నాగశౌర్య, నీహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో రామ్‌చరణ్ ఈ చిత్రం బిగ్ సీడీని ఆవిష్కరించారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ- ‘‘చిరంజీవిగారు వేసిన బాటలో మేం కష్టపడు తున్నాం. నీహా మా కన్నా ఎక్కువ కష్టపడుతోంది. తెలుగు పరిశ్రమకు ఆహ్వానం పలుకుతున్నా. నీహాకు ఎలాంటి కోస్టార్ దొరుకుతాడో అని ఎదురుచూశా. నాగశౌర్య స్వచ్ఛమైన తెలుగబ్బాయిలా ఉంటాడు.
నీహాను చూశాక తమ ఇంటి అమ్మాయిలా అందరూ అనుకుంటారు’’ అన్నారు. ‘‘నేను ‘కంచె’ సినిమా చేస్తున్నప్పుడు ‘మల్లెల తీరంలో..’ చూశాను. మా చెల్లి మంచి దర్శకుని చేతిలో పడిందని హ్యాపీగా ఉంది. ఈ రోజు ఉన్న హీరోల్లో నాగశౌర్య మంచి నటుడు. నీహారికను చిన్నప్పుడు ‘ఏమవుతావు’ అని అడిగితే ఐఏఎస్, డాక్టర్ అవుతాననేది. ఇప్పుడు మాతో పాటే సినిమాల్లోకి వచ్చేసింది. కొత్తలో తన మీద నమ్మకం ఉండేది కాదు. నెమ్మదిగా నాకు కూడా నమ్మకం కుదిరింది’’ అని వరుణ్‌తేజ్ చెప్పారు. నాగ బాబు మాట్లాడుతూ- ‘‘నీహారికకు మంచి కథ ఇచ్చారు.
ఇంతమంది హీరోలున్న ఫ్యామిలీ నుంచి నీహారిక హీరోయిన్‌గా వెళుతుందని చెప్పగానే అందరూ ప్రోత్సహించారు. నీహారిక మాస్ కమ్యూనికేషన్ చేశాక సినిమాల్లోకి ఎంటరవుతానంటూ, ‘హీరోలు వస్తున్నప్పుడు ఏమీ మాట్లాడరేం? ఆడపిల్లలు వస్తున్నప్పుడే మాట్లాడతారేం?’అని ప్రశ్నించింది. నన్ను మారు మాటాడకుండా చేసింది. అందుకే నీహారికను తనకు ఇష్టమైన రంగంలోకి పంపించాను. ప్రతి పేరెంట్ కూడా తమ కూతుళ్లు కన్న కలలను సాకారం చేసుకోవడానికి ప్రోత్స హించాలని కోరుతున్నా. ఆడపిల్లలను అబ్బాయిల కన్నా ఎక్కువగా లేక సమానంగా ప్రోత్సహించండి’’ అని నాగబాబు చెప్పారు.
నీహారిక మాట్లాడుతూ- ‘‘రామరాజు గారు స్క్రిప్ట్ నెరేట్ చేస్తుంటే అలా వినాలనిపించింది. నేను ఈ సినిమాలో కొన్ని సీన్స్‌లో బాగా యాక్ట్ చేశానంటే నాగశౌర్య కారణం. అమ్మ ప్రేమను వర్ణించడం ఎవరి తరం కాదు. కానీ, ఈ సినిమా మాత్రం అమ్మ ప్రేమంత స్వచ్ఛంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘రామరాజుగారి వల్లే మేమింత బాగా యాక్ట్ చేయగలిగాం’’ అని నాగశౌర్య అన్నారు. ఈ వేడుకలో నీహారిక తల్లి పద్మజ, చిరంజీవి కుమార్తె సుస్మిత పాల్గొన్నారు.
ఆ ప్రశ్నతో నన్ను మాట్లాడనివ్వకుండా చేసింది : నాగబాబు
Published Thu, May 19 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement
Advertisement