బాలయ్య పుట్టినరోజున.. యువహీరో సినిమా | sandeep kishan starred movie to be released on baliah's birthday | Sakshi
Sakshi News home page

బాలయ్య పుట్టినరోజున.. యువహీరో సినిమా

Published Fri, May 27 2016 4:27 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

బాలయ్య పుట్టినరోజున.. యువహీరో సినిమా - Sakshi

బాలయ్య పుట్టినరోజున.. యువహీరో సినిమా

నిత్యామీనన్‌తో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ హీరో సందీప్ కిషన్ రొమాన్స్ చేసిన సినిమా ఒక్క అమ్మాయి తప్ప. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమా విడుదల అవుతోందట. అయితే ఈ విషయాన్ని సినిమా వర్గాలు ఇంకా అఫీషియల్‌గా చెప్పాల్సి ఉంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది. తాడినాడ రాజసింహ అనే కొత్త దర్శకుడి చేతిలో రూపొందిన ఈ సినిమాకు బోగాది అంజిరెడ్డి నిర్మాత. ఈ నెలాఖరులోనే సినిమా విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల వెనక్కి వెళ్లింది.

కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాలో బాలయ్య అభిమానిగా అలరించిన నాని.. తన తదుపరి సినిమా 'జెంటిల్‌మన్'ను అదే రోజు విడుదల చేస్తాడని తొలుత వినిపించినా.. అది మరో వారం రోజులకు వాయిదా పడింది. దాంతో ఆ అవకాశాన్ని సందీప్ కిషన్ అందుకున్నట్లయింది. ఈ సినిమాలో ఇంకా తనికెళ్ల భరణి, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, అలీ, అజయ్, బ్రహ్మాజీ లాంటి పలువురు నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement