టైటిల్ ఓకె, ట్యాగ్ లైనే..! | title problems for okka ammayi thappa | Sakshi
Sakshi News home page

టైటిల్ ఓకె, ట్యాగ్ లైనే..!

Published Tue, Jun 7 2016 12:01 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

టైటిల్ ఓకె, ట్యాగ్ లైనే..! - Sakshi

టైటిల్ ఓకె, ట్యాగ్ లైనే..!

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఒక్క అమ్మాయి తప్ప. నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రోడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టైటిల్ వివాదానికి  కారణమైంది.

ఒక్క అమ్మాయి తప్ప అనే టైటిల్తో తెరకెక్కిన ఈ సినిమాకు ముందుగా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ట్యాగ్ లైన్ను యాడ్ చేశారు. ఈ ట్యాగ్ లైన్పై వివాదం మొదలవ్వటంతో వెంటనే మేల్కొన్న చిత్ర యూనిట్ తాజా పోస్టర్స్, ట్రైలర్స్లో ఆ ట్యాగ్ లైన్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో ఒక్క అమ్మాయి తప్ప సినిమా.., టైటిల్ వివాదం నుంచి బయట పడినట్టే భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement