నాన్న, మావయ్యకు హీరో ఫాదర్స్ డే విషెస్ | HAPPY FATHERS DAY Dad,Pedananna and Chota Mama, tweets sandeep kishan | Sakshi
Sakshi News home page

నాన్న, మావయ్యకు హీరో ఫాదర్స్ డే విషెస్

Published Sun, Jun 19 2016 8:17 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

నాన్న, మావయ్యకు హీరో ఫాదర్స్ డే విషెస్ - Sakshi

నాన్న, మావయ్యకు హీరో ఫాదర్స్ డే విషెస్

'ఫాదర్స్ డే' ను పురస్కరించుకుని టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ తన ఆనందాన్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు. నాన్న, పెదనాన్న, చోటా మామకు హ్యాపీ ఫాదర్స్ డే అంటూ ఫాదర్స్ డే విషేస్ ట్వీట్ చేశాడు. నాన్న, చోటా మామతో కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేసి చిన్ననాటి నుంచి వారితో అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన జీవితంలో ఆ ముగ్గురు ఎంతో ముఖ్యమని, వారి ప్రేమ తనలో ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చిందని వారు లేకపోతే తాను లేనట్లేనని రాసుకొచ్చాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా ఒక్క అమ్మాయి తప్ప. ఈ మూవీపై సందీప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. హీరోయిన్ నిత్యా మీనన్ సందీప్ కిషన్కు జోడీగా నటించింది. ఈ సినిమాతో రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement