తెలివైన కాలేజీ కుర్రాడి కథ! | Okka Ammayi Thappa wraps up talkie part | Sakshi
Sakshi News home page

తెలివైన కాలే జీ కుర్రాడి కథ!

Published Tue, Feb 16 2016 10:28 PM | Last Updated on Thu, Mar 21 2019 9:05 PM

తెలివైన కాలేజీ కుర్రాడి కథ! - Sakshi

తెలివైన కాలేజీ కుర్రాడి కథ!

విలక్షణమైన చిత్రాలు, నటనతో యువతరంలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. గతంలో ‘సినిమా చూపిస్త మావ’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన బోగాది అంజిరెడ్డి ఈ చిత్రం ద్వారా రాజసింహ తాడినాడను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. సందీప్‌కు జోడీగా నిత్యామీనన్ నటించిన ఈ చిత్రం టాకీ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కొత్త నేపథ్యంలో నడిచే కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది.

సందీప్ కొత్తగా కనిపిస్తాడు. ప్రముఖ భోజ్‌పురీ నటుడు రవి కిషన్ విలన్‌గా చేశారు. ఇందులో గంటా ముప్ఫై నిమిషాలు అధునాతన గ్రాఫిక్స్ ఉంటాయి’’ అని తెలిపారు. ‘‘మూడు పాటలు తీయాల్సి ఉంది. ఒకటి ఇండియాలో, రెండు విదేశాల్లో చిత్రీకరిస్తాం. ‘ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్’ అన్నది ఈ చిత్ర క్యాప్షన్. ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత పేర్కొన్నారు.

‘‘ఇందులో తెలివైన కాలేజీ కుర్రాడి పాత్రలో కనిపిస్తా. నేను, నిత్యామీనన్ తొలిసారి కలిసి నటిస్తు న్నాం. ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం నిలుస్తుంది’’ అని సందీప్ కిషన్ చెప్పారు. ఈ చిత్రానికి కెమేరామ్యాన్: ఛోటా కె.నాయుడు, సంగీతం: మిక్కీ జె.మేయర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఆళ్ల రాంబాబు, సహ నిర్మాత: మాధవి వాసిపల్లి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement