కర్నూలు : దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను గురువారం కర్నూలు నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1.60 లక్షల విలువ చేసే నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు వారిని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు.