ఏడు కోట్ల రూపాయల ఫేక్‌ కరెన్సీ పట్టివేత | Fake currency worth 7 cr seized from Belagavi, Ahead of Karnataka polls | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

Published Wed, Apr 18 2018 12:12 PM | Last Updated on Wed, Apr 18 2018 2:35 PM

Fake currency worth 7 cr seized from Belagavi, Ahead of Karnataka polls - Sakshi

సాక్షి,  బెంగళూరు: కర్ణాటకలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నకిలీ కరెన్సీ రాష్ట్రంలో ప్రకంపనలు  పుట్టిస్తోంది. తాజాగా బుధవారం బెలగవిలో పోలీసుల తనిఖీల్లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. ఈ సందర్భంగా  ఏడు కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీని అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేశారు. కాగా వచ్చేనెల 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయా పార్టీలు  రంగంలోకి దిగినట్టు కనిపిస్తోంది. ఈ అంచనాలకు ఊతమిస్తూ మంగళవారం  అక్రమంగా భారీగా నగదును తరలిస్తూ పలువురు పట్టుబడిన సంగతి తెలిసిందే.  ఒక ప్రైవేటు బస్సులో వంద కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement